వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి | YS Jagan Mohan Reddy has laid the foundation for a number of development projects in YSR Dist Rayachoti - Sakshi
Sakshi News home page

రాయచోటిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Published Tue, Dec 24 2019 2:51 PM | Last Updated on Tue, Dec 24 2019 3:44 PM

CM Jagan Lays Foundation Stone for Development Works in Rayachoti - Sakshi

సాక్షి, రాయచోటి: వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.1272 కోట్లతో జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ నుంచి కాలేటివాగు రిజర్వాయర్‌, అక్కడి నుంచి చక్రాయపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల చెరువులకు నీరందించి తద్వారా ఆయకట్టును స్థిరీకరించేందుకు ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. రూ. 340.60 కోట్లతో రాయచోటిలో చేపట్టే అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, పట్టణాభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.



రూ. 23 కోట్లతో రాయచోటి ఆస్పత్రిని 50 నుంచి 100 పడకలకు విస్తరించే పనులకు, రూ.11.55 కోట్లతో రాయచోటి నియోజకవర్గంలో నిర్మించనున్న గ్రామ సచివాలయ భవనాలకు, రూ. 15.52 కోట్లతో నియోజకవర్గంలో చేపట్టనున్న సీసీ రోడ్లు నిర్మాణానికి, రూ.31.7 కోట్లతో సీసీ డ్రెయిన్స్‌ , రూ.కోట్లతో రాయచోటి మండలంలో చేపట్టనున్న తాగునీటి పథకాలకు, రూ.18 కోట్లతో చేపట్టనునన మైనార్టీ రెసిడెన్సియల్‌ స్కూలు కాంప్లెక్స్‌, రూ. 20.95 కోట్లతో నిర్మించనున్న కడప డిస్ట్రిక్ట్‌ పోలీసు కార్యాలయ భవనాలకు శంకుస్థాపన శిలాఫలకాలను ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, మంత్రులు ఆదిమూలపు సురేశ్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, చీఫ్‌ విప్‌ రాయచోటి శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement