రాత్రి 6.45 గంటల సమయంలో వైకుంఠ ద్వారాన్ని కూల్చి వేస్తున్న దృశ్యం
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల చరిత్ర కలిగిన మరో కట్టడాన్ని తొలగించారు. యాదగిరికొండపైకి మెట్ల మార్గం మొదలయ్యే ప్రాంతంలో ఉన్న వైకుంఠ ద్వారాన్ని శుక్రవారం రాత్రి కూల్చివేశారు. 1947లో రామ్‌దయాళ్ సీతారామయ్య శాస్త్రి, నరసింహారెడ్డి, కొండల్‌రెడ్డి, గాదె కిష్టయ్య తదితరులు ఆస్థాన కమిటీగా ఏర్పడి ఈ వైకుంఠ ద్వారాన్ని నిర్మించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో యాదవనగర్ వరకు రోడ్డు విస్తరణ చేస్తుండడంతో ప్రస్తుతం వైకుంఠ ద్వారాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో చరిత్ర కలిగిన ఈ వైకుంఠ ద్వారానికి సంబంధించి ఇక జ్ఞాపకాలే మిగిలిపోనున్నాయి.
తుది దశకు చేరుకున్న నూతన వైకుంఠ ద్వారం
నిర్మాణంలో నూతన వైకుంఠ ద్వారం
ప్రస్తుతం ఉన్న వైకుంఠ ద్వారాన్ని కూల్చివేసే ప్రణాళికను ముందస్తుగా నిర్ణయించడంతో దాని వెనుక భాగంలో ఇప్పటికే కొత్తగా మరో వైకుంఠ ద్వారాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నూతన వైకుంఠ ద్వారం పనులు సైతం తుది దశకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment