renovation
-
మల్కాజిగిరి రైల్వే స్టేషన్ న్యూ లుక్ అదిరింది
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి రైల్వేస్టేషన్ (Malkajgiri railway station) పునరభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నగరానికి తూర్పు వైపున చర్లపల్లి తర్వాత సకల సదుపాయాలతో మల్కాజిగిరి వినియోగంలోకి రానుంది. ప్రధాన ముఖద్వారంతో పాటు స్టేషన్ విస్తరణ, ప్రత్యేక విశ్రాంతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అమృత్ భారత్ పథకం (amrut bharat scheme) కింద సుమారు రూ.27.61 కోట్లతో మల్కాజిగిరి అభివృద్ధి పనులను చేపట్టారు. ఇప్పటి వరకు 60 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మిగతా పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.సబర్బన్ రైళ్లతో పాటు పలు దూర ప్రాంత రైళ్లకు మల్కాజిగిరిలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ప్రయాణికుల రాకపోకలకు ప్రధాన కేంద్రంగా ఉన్న మల్కాజిగిరి స్టేషన్లో పునరభివృద్ధి వల్ల విశాలమైన కాన్కోర్స్, విశ్రాంతి గదులు, ఫుడ్‌స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. అలాగే.. దివ్యాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, ర్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. సబర్బన్ గ్రేడ్–3 కేటగిరీకి చెందిన మల్కాజిగిరి స్టేషన్ నుంచి ప్రతి రోజు 2500 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ఏటా రూ.5.48 కోట్ల ఆదాయం లభిస్తుంది. ప్రతి రోజు 27 జతల రైళ్లు మల్కాజిగిరిలో ఆగుతాయి.పునరభివృద్ధి పనులు ఇలా.. మల్కాజిగిరి రైల్వేస్టేషన్ భవనం ముఖద్వారం అభివృద్ధి ప్రయాణికుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి)తో పాటు 3 లిఫ్టులు మరో 3 ఎస్కలేటర్లు. పెరగనున్న ప్లాట్‌ఫామ్ ఉపరితలం ఎత్తు. ప్లాట్‌ఫామ్‌పై అదనపు పై కప్పు ఏర్పాటు. ఇప్పటి వరకు టాయిలెట్ బ్లాకుల నిర్మాణం పూర్తయింది. వెయిటింగ్ హాల్ అభివృద్ధి చేశారు. వాహనాల పార్కింగ్తో పాటు పచ్చదనం విస్తరణపై ప్రత్యేక దృష్టి. ప్రయాణికులను ఆకట్టుకొనేలా కళలు, సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో 40 స్టేషన్లు. చదవండి: పూర్తి ఫీజు చెల్లిస్తేనే ఎల్ఆర్ఎస్ రాయితీ -
రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులు
అమెరికా అధ్యక్షుడి పీఠాన్ని రెండోసారి అధిరోహించనున్న డొనాల్డ్ట్రంప్ కూతురు ఇవాంకాట్రంప్ ఇటీవల తన పాత మాన్షన్‌ను పునరుద్దరించినట్లు తెలిపారు. ఇందుకోసం 24 మిలియన్ డాలర్లు(సుమారు రూ.199 కోట్లు) ఖర్చు చేసినట్లు ‘బెంజింగా’ అనే రియల్ ఎస్టేట్ రిసెర్చ్ సంస్థ నివేదించింది. కొత్తగా పునరుద్ధరించిన ఇవాంకా మాన్షన్ ‘బిలియనీర్ బంకర్’లో ఉంది. మియామిలో అత్యంత గుర్తించదగిన ఆధునిక భవనాల జాబితాలో తన మాన్షన్ ఒకటిగా నిలిచినట్లు బెంజింగా తెలిపింది.ఇవాంకా మాన్షన్ ఫ్లోరిడాలోని మియామి డెడ్ కౌంటీలో ఉన్న ఇండియన్ క్రీక్ ఐల్యాండ్‌లో ఉంది.ఈ ఇండియన్ క్రీక్ ఐల్యాండ్‌ను బిలియనీర్ బంకర్ అని పిలుస్తారు.ఈ ఐల్యాండ్ ఒక ప్రైవేట్, గేటెడ్ కమ్యూనిటీ. దీనికి అత్యంత భద్రత ఉంటుంది.ఫ్లోరిడా స్టేట్ పోలీసు ఫోర్స్, 24/7 ఆర్మ్డ్ మిలిటరీ దీనికి గస్తీ కాస్తోంది.ఈ ద్వీపంలో కేవలం 41 నివాస గృహాలు మాత్రమే ఉన్నాయి.ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని అత్యంత ప్రత్యేకమైన, సంపన్న వర్గాలకు చెందిందిగా ప్రసిద్ధి.ఇండియన్ క్రీక్‌లో లగ్జరీ సౌకర్యాలున్నాయి.ప్రముఖ సింగర్ జూలియో ఇగ్లేసియాస్, ఎన్ఎఫ్ఎల్ లెజెండ్ టామ్ బ్రాడీ, గిసెల్ బాండ్చెన్, ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్, కార్ల్ ఇకాన్లతో సహా మరికొందరు ప్రముఖులు ఇక్కడ నివాసముంటున్నారు.ఇదీ చదవండి: 10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు -
చారిత్రక వైభవానికి ఇబ్బంది రావద్దు
సాక్షి, హైదరాబాద్: అసఫ్‌జాహీల నిర్మాణ కౌశలం కొనసా గాలని, పాత అసెంబ్లీ భవన చారిత్రక వైభవానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పునరుద్ధరించాలని రాష్ట్ర ఆర్ అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగాఖాన్ నిర్మాణ సంస్థ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. పాత అసెంబ్లీ భవన పునరుద్ధరణ పనులపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మంగళవారం అసెంబ్లీ స్పీకర్ చాంబర్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఆర్అండ్బీ అధికారులు, ఆగాఖాన్ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, చారిత్రక వైభవానికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆగాఖాన్ ట్రస్ట్ కు రూ.2 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్న విషయం తెలియడంతో వెంటనే స్పందించిన మంత్రి.. సమావేశం నుంచే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడి నిధులు విడుదల చేయించారు.బిల్లుల కోసం ప్రజోపయోగ పనులను ఆపవద్దని అధికారులకు సూచించారు. ఏవైనా బిల్లులు పెండింగ్‌లో ఉన్నా, ఇతర సమస్యలేమి ఉన్నా తనకు లేదా మంత్రి శ్రీధర్‌బాబుకు చెప్పాలని కోరారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే కౌన్సిల్‌హాల్‌ను అసెంబ్లీ భవనంలోకి మార్చవచ్చన్నారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పాత అసెంబ్లీ భవన పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ కోసం ఎస్ఈ స్థాయి అధికారిని నియమించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు.అదో పెద్ద జోక్: మంత్రి కోమటిరెడ్డిఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ చార్జీల అంశంపై కేటీఆర్ ఈఆర్సీ దగ్గరకు వెళ్లడం పెద్ద జోక్ అని అన్నారు. ఆయనో జోకర్ అని, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా ప్రజలు ఓడించినా వారికి బుద్ధి రాలేదన్నారు. 200 యూనిట్ల వరకు పేదలకు తమ ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘నిజాం షుగర్స్’పై ముందుకా వెనక్కా?
సాక్షి, హైదరాబాద్: నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) పునరుద్ధరణలో మళ్లీ కదలిక వచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ త్వరలో మంత్రివర్గానికి నివేదిక సమర్పించనుంది. దీనిపై కేబినెట్ తీసుకునే నిర్ణయం ఆధారంగా ముందుకెళ్లాలని ప్రభుత్వ చక్కెర పరిశ్రమల విభాగం భావిస్తోంది. పునరుద్ధరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపే పక్షంలో యూనిట్లు తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణ కూడా రూపొందిస్తోంది. నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన వెంటనే ఈ ఏడాది జనవరి 12న కమిటీ ఏర్పాటు చేసింది.పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు చైర్మన్‌గా, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైస్‌చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీలో మరో ఎనిమిది మందిని సభ్యులుగా నియమించారు. పునరుద్ధరణకు సంబంధించిన విధివిధానాలు సూచిస్తూ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించింది. బోధన్ చక్కెర కర్మాగారాన్ని సందర్శించిన ఈ కమిటీ చెరకు రైతులు, రైతుసంఘాల నేతలు, సంబంధిత వర్గాల నుంచి సమాచారం సేకరించి నివేదిక రూపొందించినట్టు తెలిసింది.అయితే ఎన్డీఎస్ఎల్లో 51 శాతం వాటా కలిగిన ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ ఫ్యాక్టరీ తిరిగి తెరిచినా, తాము యూనిట్లు నడపలేమని చేతులు ఎత్తేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో యూనిట్లు తిరిగి తెరుచుకునే పక్షంలో ఏ తరహాలో నడపాలనే కోణంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రైతులను భాగస్వాములను చేస్తూ సహకార పద్ధతిలో నడపడమా మరో సంస్థకు అప్పగించడమా అనే కోణంలోనూ నివేదికలో పొందుపరిచనట్టు సమాచారం. రుణ విముక్తికి రూ. 190 కోట్లు గతంలో ఎన్డీఎస్ఎల్ను దివాలా కంపెనీగా ప్రకటిస్తూ లిక్విడేట్ చేయాలని నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అప్పిల్లేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఎన్సీఎల్టీ ఆదేశాలను పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో బ్యాంకర్ల వద్ద తీసుకున్న రుణాలను వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లించడం ద్వారా లిక్విడేషన్ గండం నుంచి బయటపడే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఓటీఎస్ కింద బ్యాంకులకు రూ.190 కోట్లకుగాను ఇప్పటివరకు మూడు విడతల్లో రూ.160 కోట్ల మేర చెల్లించారు. ఈ సెపె్టంబర్‌లోగా మరో రూ.30 కోట్లు చెల్లిస్తే ఎన్డీఎస్ఎల్కు బ్యాంకర్ల నుంచి రుణ విముక్తి లభిస్తుంది. కన్సల్టెన్సీ ఎంపికకు కసరత్తు ఎన్డీఎస్ఎల్ పరిధిలో బోధన్, మంభోజిపల్లి, మెట్పల్లి యూనిట్లు ఉండగా, 2015 నుంచి వీటిలో ఉత్పత్తి నిలిచిపోయింది. వీటిని తిరిగి తెరిచేందుకు అవసరమైన సలహాలు, సూచనలకు అనుభవం కలిగిన ‘కన్సల్టెంట్’సేవలను వినియోగించుకోవాలని చక్కెర విభాగం నిర్ణయించింది. పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ పచ్చజెండా ఊపితే కన్సల్టెంట్‌ను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. రోజుకు బోధన్ యూనిట్లో 3500 టన్నులు, మెట్పల్లి, మంభోజిపల్లిలో 2500 టన్నుల చెరకు క్రషింగ్ సామర్థ్యం కలిగి ఉన్నాయి.వీటిని తిరిగి తెరిచే పక్షంలో క్రషింగ్‌కు అవసరమైన చెరకు లభ్యత ఎంత ఉందనే కోణంలో చక్కెర విభాగం అధికారులు లెక్కలు సేకరిస్తున్నారు. 2015లో యూనిట్లు మూతపడిన వాటిలో యంత్రాల స్థితిగతులపైనా అధ్యయనం జరుగుతోంది. మరోవైపు మూడు యూనిట్లు ఒకేమారు కాకుండా తొలుత మెట్పల్లి యూనిట్‌ను ప్రారంభించి, అక్కడ ఎదురయ్యే పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత మిగతా రెండు యూనిట్లు ప్రారంభించాలనే ప్రతిపాదన కూడా కమిటీ నివేదికలో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో చక్కెర ఉత్పత్తి కంటే ఇథనాల్ బ్లెండింగ్‌కు ఎన్డీఎస్ఎల్ యూనిట్లను ఉపయోగించుకుంటే బాగుంటుందనే కోణంలోనూ కమిటీ సూచినట్టు తెలిసింది. -
ఇంటికి మరమ్మతు చేస్తుండగా.. బాత్ టబ్ కింద ‘మరో ప్రపంచం’
ఇంటిలోని స్టోర్‌రూమ్‌ను శుభ్రం చేస్తున్నప్పుడో లేదా ఇంటికి మరమ్మతులు చేస్తున్నప్పుడో మనకు అనుకోని రీతిలో పాతబడిన వస్తువులు కనిపించి ఆశ్చర్యం కలిగిస్తాయి. అటువంటి సందర్భాల్లో ఆ వస్తువులతో మనకు ఆనాడు ఉన్న అనుబంధం గుర్తుకు వస్తుంది. ఇటువంటి ఘటనే ఒక జంటకు ఎదురయ్యింది. వివరాల్లోకి వెళితే అమెరికాలోని మిచిగాన్ స్టేట్‌కు చెందిన హేలీ గిల్మార్టిన్, ఆమె భర్త ట్రెవర్లు లేక్ హురాన్ సమీపంలో ఉంటున్నారు. వారు తమ ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో వారు ఇంటిలోని ఒక బాత్ టబ్‌ను తొలగించాలని భావించారు. పనివారి చేత వారు ఆ బాత్ టబ్‌ను తొలగించగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి వారు షాక్ అయ్యారు.ఆ బాత్‌టబ్ కింద కొంతవరకూ నీటితో నిండిన ఒక గది కనిపించింది. ఇది వారికి ఎంతో వింతగా అనిపించింది. ఆ భార్యాభర్తలు సాహసం చేసి, ఆ గదిలోనికి ఎలాగోలా వెళ్లారు. నీటితో నిండిన ఆ గదిలో ఒకవైపు నుంచి మరోవైపునకు వెళ్లారు. అది ఒక సరస్సుకు దారి తీసున్నదని తెలిసి వారు అవాక్కయ్యారు. దీనిని పూర్వకాలంలో స్మగ్లింగ్‌కు వినియోగించేవారేమోనని వారు భావిస్తున్నారు. అయితే ఆ చుట్టుపక్కల ఇళ్లలోనూ ఇలాంటి సొరంగాలు ఉన్నట్లు వారు గుర్తించారు. కాగా ఆ జంట ఆ బాత్ టబ్‌ను తొలగించి, ఆ ప్లేస్‌ను గేమ్ రూమ్‌గా మార్చాలనుకున్నారట. -
శాసనసభ పాత భవనం పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్ ఒకే భవన సముదాయంలో ఉండేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం జూబ్లీ హాలులో ఉన్న శాసనమండలిని, పాత భవనంలోకి మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. జూబ్లీహాలును మళ్లీ పునరుద్ధరించి, శాసనసభ, శాసన మండలి, సెంట్రల్ హాలును పాత పద్ధతిలో ఏర్పాటు చేయటంతో పాటు, ఆ ప్రాంగణాన్ని సుందరీకరించటం ద్వారా నగరంలో ఒక ప్రధాన పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్అండ్ బీ అధికారులతో కలిసి శాసనసభ ప్రాంగణాన్ని పరిశీలించి మార్పుచేర్పులపై చర్చించనున్నారు. సీఎంతో భేటీ అనంతరం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాలుగు రోజుల్లోనే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవటం విశేషం. సెంట్రల్ హాల్‌గా ఏపీ అసెంబ్లీ భవనం గతంలో శాసనసభ, శాసనమండలి ఒకే భవనంలో కొనసాగేవి. ఆ భవనం పాతబడటంతో ప్రస్తుత శాసనసభ కొనసాగుతున్న భవనాన్ని నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే భవనం కొనసాగింది. పాత భవనంలో శాసనమండలిని నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత పాత భవనంలోని హాలును ఏపీకి కేటాయించారు. అక్కడ శాసనసభ, శాసనమండలి నిర్వహించాల్సి రావటంతో, తెలంగాణ శాసనమండలిని జూబ్లీహాలులోకి మార్చారు. ఇప్పుడు పాత భవనాన్ని పూర్తిగా పునరుద్ధరించనుండటంతో, జూబ్లీ హాలులోని శాసనమండలిని తిరిగి పాత మండలి భవనంలోకే మారుస్తారు. ఏపీకి కేటాయించిన శాసనసభ భవనాన్ని స్వా«దీనం చేసుకుని దాన్ని సెంట్రల్ హాల్‌గా మారుస్తారు. ఇక కొత్త భవనం వెలుపల ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల శాసనసభా పక్ష కార్యాలయాలు, మీడియా సెంటర్ ఉన్న భవనాన్ని తొలగించాలని నిర్ణయించారు. ఆయా కార్యాలయాలను పాత భవనంలో ఏర్పాటు చేస్తారు. భవనం కూల్చిన ప్రాంతంలో పచ్చిక బయళ్లు ఏర్పాటు చేసి పబ్లిక్ గార్డెన్తో అనుసంధానించాలని యోచిస్తున్నారు. గతంలో పబ్లిక్ గార్డెన్‌కు ఎంతో ప్రజాదరణ ఉండేది. సాయంత్రం వేళ ఎంతోమంది సందర్శించి సేద తీరేవారు. తాజాగా మళ్లీ దానికి పర్యాటక కళ తేవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. మహాత్ముడి విగ్రహం ప్రాంతంలో.. శాసనసభ ముందుభాగంలో గతంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహం రోడ్డుపైకి అంతగా కనిపించటం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రోడ్డుమీద కంచెను ఏర్పాటు చేయటం కూడా దీనికి కారణమైంది. ఇప్పుడు ఆ కంచెను తొలగించి, వీలైతే గాంధీ విగ్రహాన్ని కాస్త ఎత్తు మీదకు మార్చి, ఆ ప్రదేశాన్ని మరింతగా సుందరీకరించి రోడ్డు మీదుగా వెళ్లేవారిని ఆకట్టుకునేలా చేయాలని నిర్ణయించారు. గతంలో జూబ్లీ హాలు ప్రాంగణం సభలు, సందడిగా ఉండేది. శాసనమండలిగా మారిన తర్వాత కళ తప్పింది. ఇప్పుడు దాన్ని మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించారు. కొత్త భవనం నిర్మించే యోచన లేనట్టే..? కొత్త సచివాలయం తరహాలో శాసనసభకు కూడా కొత్త భవనాన్ని నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సచివాలయ భవనానికి పునాది వేసిన రోజునే, ఎర్రమంజిల్ ప్యాలెస్ ప్రాంగణంలో శాసనసభ సముదాయానికి కూడా పునాది వే శారు. కానీ వారసత్వ కట్టడంగా నిలిచిన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చాలన్న నిర్ణయంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ అంశం కోర్టు పరిధిలోకి కూడా వెళ్లింది. దీంతో నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పాత భవనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించటంతో, ఇక వేరే ప్రాంతంలో నిర్మాణానికి తెరపడినట్టేనని అంటున్నారు. -
జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణకు మరో 100 కోట్లు
ముంబై: జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను పునరుద్ధరించే దిశగా జలాన్ కల్రాక్ కన్సార్షియం (జేకేసీ) మరో రూ. 100 కోట్లు సమకూర్చింది. దీనితో, కోర్టు ఆమోదిత పరిష్కార ప్రణాళిక ప్రకారం మొత్తం రూ. 350 కోట్లు సమకూర్చినట్లయిందని జేకేసీ తెలిపింది. కంపెనీపై పూర్తి అధికారాలు దక్కించుకునేందుకు అవసరమైన నిబంధనలన్నింటినీ పాటించినట్లయిందని పేర్కొంది. ఎయిర్‌లైన్ కార్యకలాపాల పునరుద్ధరణ ప్రణాళికలో ఎటువంటి మార్పులు ఉండవని, వచ్చే ఏడాది (2024) నుంచి ప్రారంభించేందుకు కొత్త ప్రమోటర్లు దృఢనిశ్చయంతో ఉన్నట్లు జేకేసీ వివరించింది. లాంచ్ తేదీని రాబోయే వారాల్లో ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు 2019 ఏప్రిల్ 17 నుంచి నిల్చిపోయిన సంగతి తెలిసిందే. -
సీఎం ఇంటి రిపేర్ల కోసం రూ.45 కోట్లు! మరి మోదీ రూ.8,400 కోట్ల విమానం సంగతేంటి..?
న్యూఢిల్లీ: డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని రూ.45కోట్లు వెచ్చించి రినోవేట్ చేయించారని బీజేపీ ఆరోపించింది. ఆయన 'విలాసవంతమైన రాజు' అని విమర్శలు గుప్పించింది. ప్రజా ధనాన్ని కేజ్రీవాల్ తన లగ్జరీ లైఫ్ కోసం వెచ్చిస్తున్నారని మండిపడింది. ఇదే విషయంపై ఆయన నివాసం ముందు బీజేపీ కార్యకర్తలు బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే బీజేపీ ఆరోపణలకు ఆప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సీఎం ఉంటున్న ఇళ్లు 80 ఏళ్ల నాటిదని, ఇప్పుటికే పైకప్పు మూడు సార్లు కూలిపోయిందని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్లో షేర్ చేసింది. ఇలాంటి ఇంట్లో సీఎం ఉంటారా? మరమ్మతులు చేయించవద్దా? అని ప్రశ్నించింది. ये दिल्ली के CM का सरकारी घर है। 3 बार छत टूट कर गिरा। तब जा कर उसे PWD ने बनाया। कौन CM ऐसे टूटे घर में रहता होगा? टूटने से पहले बनवा लिया होता। जोगी जी के बंगले की कीमत 300 करोड़ से ज्यादा है। आवाज तक किसी की आवाज नहीं निकली। बाकी चिल्लाने वाले मानसिक कोढ़ है। उनकी राजनीति, pic.twitter.com/oKEtNVk2qn — Naresh Balyan (@AAPNareshBalyan) April 26, 2023 అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ సమయంలో రూ.8,400 కోట్లు పెట్టి ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని ఆప్ గుర్తు చేసింది. ఆయన ఇంటి మరమ్మతుల కోసం రూ.500 కోట్లు వెచ్చించిన విషయాన్ని ప్రస్తావించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి రిపేర్ల కోసం రూ.15కోట్లు వెచ్చించారని, గుజరాత్ సీఎం విమానం ఖరీదు రూ.191 కోట్లు అని ఎదురుదాడికి దిగింది. ఆప్ నేత సంజయ్ సింగ్ ఈమేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కమలం పార్టీపై తీవ్రస్థాయిలో విరచుకుపడ్డారు. ఆ పార్టీ ఎప్పుడూ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. చదవండి: తమిళనాట డీఎంకే ఫైల్స్ కలకలం.. ఆడియో క్లిప్ రిలీజ్ చేసిన అన్నామలై -
వన్డే వరల్డ్ కప్ కోసం ఉప్పల్ స్టేడియానికి 117 కోట్లు
-
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. కొత్త తేదీ ఇదే..
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల (ఫిబ్రవరి) 13న రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమా లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు పరే డ్గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాల యం (పీఎంవో) నుంచి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి కార్యాలయానికి సమాచారం అందినట్టు తెలిసింది. 19నాటి పర్యటన వాయిదాతో.. వాస్తవానికి ప్రధాని మోదీ ఈ నెల 19నే రాష్ట్రంలో పర్యటించి.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను, సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆ పర్యటన వాయిదా పడింది. దీంతో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 15న ఢిల్లీ నుంచి వర్చువల్‌గా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో తిరిగి రాష్ట్ర పర్యటనను పీఎం కార్యాలయం ఖరారు చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇంకా దక్షిణ మధ్య రైల్వేకు అధికారికంగా సమాచారం అందలేదని తెలిసింది. సభ ప్రయత్నాల్లో బీజేపీ! పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ సభపై సమాచారం అందిన రాష్ట్ర బీజేపీ నేతలు ఏర్పాట్లలో పడినట్టు తెలిసింది. హైదరాబాద్, పొరుగున ఉన్న జిల్లాలతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి జన సమీకరణతో మోదీ సభను విజయవంతం చేయాలని వారు భావిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వివిధ రూపాల్లో కేటాయింపులు పెంచుతారని.. వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం ఇస్తున్న నిధులను మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కేంద్రం సరిగా నిధులు ఇవ్వడం లేదంటూ సీఎం కేసీఆర్, మిగతా 8వ పేజీలో u మంత్రులు, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే అవకాశం ఉందని అంటున్నారు. మోదీ పాల్గొనే కార్యక్రమాలివీ! ఇంతకుముందే ఖరారైన పర్యటన ప్రకారం ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. అందులో వందేభారత్ రైలును ఇప్పటికే ప్రారంభించినందున.. మిగతా కార్యక్రమాల షెడ్యూల్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మొత్తంగా రూ.7,076 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపనున్నట్టు సమాచారం. – రూ.1,410 కోట్లతో సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ మధ్య నిర్మించిన డబుల్ లైన్ జాతికి అంకితం – ఐఐటీ హైదరాబాద్‌లో రూ. 2,597 కోట్లతో చేపట్టిన వివిధ నిర్మాణాలను (అడ్మిన్‌బ్లాక్, అకడమిక్ బిల్డింగ్స్, హాస్టళ్లు, క్వార్టర్స్, టెక్నాలజీ రిసెర్చ్ పార్కు, టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్కు, రిసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్, కన్వెన్షన్ సెంటర్, నాలెడ్జ్ సెంటర్, గెస్ట్‌హౌస్, లెక్చర్ హాల్ కాంప్లెక్స్, క్యాంపస్ స్కూల్, లేబోరేటరీ, హెల్త్‌కేర్ ఫెసిలిటీ) జాతికి అంకితం. – రూ.699 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (ఆధునీకరణ) అభివృద్ధి పనులకు భూమిపూజ. – రూ.521 కోట్ల వ్యయంతో కాజీపేటలో నిర్మించనున్న రైల్వే పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌కు శంకుస్థాపన – రూ.1,336 కోట్లతో చేపట్టిన మహబూబ్‌నగర్–చించోలి 2/4 లేన్ల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన – రూ.513 కోట్ల వ్యయంతో నిజాంపేట–నారాయణఖేడ్–బీదర్ సెక్షన్ జాతీయ రహదారి విస్తరణ పనులకు భూమిపూజ – తెలంగాణకు మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు, శంషాబాద్ (ఉందానగర్) వరకు ఎంఎంటీఎస్ సేవలు, మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ సేవల పొడిగింపు, రైళ్ల సంఖ్య పెంపు, కాచిగూడ నుంచి విశాఖపట్నం ట్రైన్ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు వంటి ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. చదవండి: లభించని ఆ ముగ్గురి ఆచూకీ.. డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ -
భారీ వరదకూ చెక్కుచెదరకుండా పింఛా ప్రాజెక్టు పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: భారీ వరద వచ్చినా చెక్కు చెదరకుండా ఉండేలా పింఛా ప్రాజెక్టును ప్రభుత్వం పునరుద్ధరించనుంది. గతేడాది నవంబర్‌లో వచ్చిన ఆకస్మిక వరదలకు దెబ్బతిన్న ఈ ప్రాజెక్టును రూ.68.32 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్ధరించనుంది. ఇందుకోసం లంప్సమ్ – ఓపెన్ విధానంలో రెండేళ్లలో పూర్తి చేయాలనే షరతుతో ఈ నెల 5న జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 26న ఆర్థిక బిడ్‌ను తెరిచి, రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనున్నారు. అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం ముడుంపాడు వద్ద పింఛా నదిపై 1954లో ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. కుడి కాలువ కింద 2211.31 ఎకరాలు, ఎడమ కాలువ కింద 1562.10 ఎకరాలు మొత్తం 3,773.41 ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీ (పిల్ల కాలువలు)లను అభివృద్ధి చేసింది. అప్పట్లో పింఛాకు గరిష్టంగా 58 వేల క్యూసెక్కుల వరద వస్తుందనే అంచనాతో ప్రాజెక్టు నిర్మించారు. గతేడాది నవంబర్ 14 నుంచి నల్లమల అడవుల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో పింఛా నది ఉప్పొంగింది. దాంతో గతేడాది నవంబర్ 18న లక్ష క్యూసెక్కులకుపైగా వరద వచ్చింది. వరద ధాటికి పింఛా ప్రాజెక్టు రింగ్ బండ్, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పింఛాకు ఎంత వరద వచ్చినా చెక్కుచెదరకుండా ఉండేలా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పింఛాకు గరిష్టంగా వచ్చే వరదపై మళ్లీ అధ్యయనం చేసిన అధికారులు.. రూ.84.33 కోట్లతో పనులు చేపట్టడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని ప్రభుత్వం ఆమోదించింది. దాంతో పనరుద్ధరణ పనులకు 68.32 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు టెండర్లు పిలిచారు. -
సీఎం జగన్ ఆదేశాలు.. ‘అన్నమయ్య’ పునరుద్ధరణకు శ్రీకారం
సాక్షి, అమరావతి: అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చెయ్యేరుకు ఎంత వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. రూ.635.21 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్–ఓపెన్ విధానంలో రెండేళ్లలో పూర్తి చేయాలనే షరతుతో రూపొందించిన టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను జలవనరుల శాఖ ఎస్ఈ కె.శ్రీనివాసులు బుధవారం జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపారు. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ధరకు ముందుకొచ్చిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనున్నారు. ఎన్నడూ లేని రీతిలో.. చెయ్యేరుకు వందేళ్లకు ఒకసారి గరిష్టంగా 2.40 లక్షల క్యూసెక్కులు, రెండు వందల ఏళ్లకు ఒకసారి గరిష్టంగా 2.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేయగా 140 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గతేడాది నవంబర్ 19న చెయ్యేరు నుంచి అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం పోటెత్తింది. ఆ స్థాయిలో వరదను దిగువకు విడుదల చేసే సామర్థ్యం స్పిల్ వేకు లేకపోవడంతో మట్టికట్ట తెగిపోయింది. ఈ నేపథ్యంలో చెయ్యేరుకు నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ పనులు చేపట్టడానికి రూ.787.77 కోట్లతో జలవనరుల శాఖ నవంబర్ 2న పరిపాలన అనుమతి ఇచ్చింది. నిపుణుల నివేదికపై టీడీపీ సర్కారు పెడచెవి ♦అన్నమయ్య జిల్లాలో రాజంపేట మండలం బాదనగడ్డ వద్ద చెయ్యేరుపై 2.24 టీఎంసీల సామర్థ్యంతో అన్నమయ్య ప్రాజెక్టును 1981లో ప్రారంభించి 2001కి పూర్తి చేశారు. ప్రాజెక్టు కింద 22,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ♦వరదను దిగువకు విడుదల చేసేలా 206.65 మీటర్ల ఎత్తుతో 94 మీటర్ల పొడవున స్పిల్ వే, అనుబంధంగా 336 మీటర్ల పొడవున మట్టికట్టను నిర్మించారు. స్పిల్ వేకు 13.75 మీటర్ల ఎత్తు, 14 మీటర్ల వెడల్పుతో ఐదు గేట్లు అమర్చారు. ♦ 2012లో జల వనరుల శాఖ నిర్వహించిన 3–డీ అధ్యయనంలో అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి గరిష్టంగా 2.17 లక్షల క్యూసెక్కులే దిగువకు విడుదల చేయవచ్చని తేలింది. 2017లో ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యామ్ సేఫ్టీ కమిటీ 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్ వే నిర్మించాలని అందచేసిన నివేదికను టీడీపీ సర్కారు బుట్టదాఖలు చేసింది. ♦గతేడాది నవంబర్ 16, 17, 18, 19 తేదీల్లో శేషాచలం– నల్లమల అడవులు, చెయ్యేరు, బహుదా, మాండవ్య పరీవాహక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. 17న అన్నమయ్య ప్రాజెక్టులో సగటున 1.75 టీఎంసీలను నిల్వ చేస్తూ వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేశారు. 18న రాత్రి 8 గంటలకు వరద 77,125 క్యూసెక్కులకు చేరడంతో దిగువకు 1,09,124 క్యూసెక్కులను వదులుతూ వచ్చారు. అదే రోజు రాత్రి పది గంటలకు ప్రాజెక్టు గేట్లను పూర్తిగా ఎత్తివేసి 1,46,056 క్యూసెక్కులు దిగువకు వదిలేశారు. 19న తెల్లవారుజామున 3 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కుల వరద రావటంతో మట్టం గరిష్ట స్థాయికి చేరింది. సామర్థ్యం చాలక మట్టికట్ట పైనుంచి దిగువకు వరద పారింది. దీంతో 19న ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. చదవండి: బాలయ్యా.. ఇటు రావేమయ్యా.. కిష్టప్ప.. ఎక్కడున్నావప్పా.. టెండర్ నిబంధనలు ఇవీ.. ♦కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ప్రమాణాల ప్రకారం చెయ్యేరుకు గరిష్టంగా వచ్చే వరదపై అధ్యయనం చేసి అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో వరదను దిగువకు విడుదల చేసేలా స్పిల్ వే నిర్మించాలి. ♦సీపీడబ్ల్యూఆర్‌ఎస్ (సెంట్రల్ పవర్ వాటర్ రీసెర్చ్ స్టేషన్), ఏపీఈఆర్‌ఎల్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్), సీడబ్ల్యూసీ లాంటి అధీకృత సంస్థలతో అధ్యయనం చేపట్టి జలవనరుల శాఖ సూచనల ప్రకారం ప్రాజెక్టును పునరుద్ధరించాలి. ♦ప్రాజెక్టు వద్ద భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం నిర్వహించి డయాఫ్రమ్ వాల్ / ఇతర పద్ధతుల్లో పునాది నిర్మాణంపై నిర్ణయించాలి. -
Hyderabad: చారిత్రక సంపదకు నయా నగిషీలు
సాక్షి, హైదరాబాద్: చారిత్రక, సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. నిజాం హయాంలో నిర్మించిన ఆనేక కట్టడాలకు నగిషీలు చెక్కడం ద్వారా భావితరాలకు చారిత్రక వైభవాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా కట్టడాలను పునరుద్ధరిస్తోంది. ఇప్పటికే మొజంజాహీ మార్కెట్, క్లాక్‌టవర్లు, బన్సీలాల్‌పేట బావిని పునరుద్ధరించిన పురపాలక శాఖ.. తాజాగా ముర్గీ చౌక్, మీరాలం మండి, సర్దార్ మహల్‌లకు నయా సొబగులను అద్దాలని నిర్ణయించింది. అంతర్జాతీయ పర్యాటక స్థలాల్లో ఒక్కటిగా చెప్పుకునే చార్మినార్, దాని పరిసరాలను అందంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ మూడింటిని పునరుద్ధరించే పనులను చకచకా చేస్తోంది. కులీ కుతుబ్‌షా పట్టణాభివృద్ధి సంస్థ వీటిని పర్యవేక్షిస్తోంది. వడివడిగా మీరాలంమండి పనులు నగర ప్రజల కూరగాయ అవసరాలను తీర్చడానికి 1805లో అప్పటి ప్రధాని నవాబ్ మీర్ అలం యార్జంగ్ మీరాలం మండిని ప్రారంభించారు. హైదరాబాద్ తొలి మార్కెట్‌గా చెప్పుకొనే ఈ మండి.. ప్రస్తుతం కూడా కొనసాగుతున్నప్పటికీ దయనీయ పరిస్థితిలో ఉంది. కనీస సౌకర్యాల్లేక.. సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.16.45 కోట్లను కేటాయించారు. మార్కెట్‌ను మూడు విభాగాలు విభజించి.. దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. సర్దార్ మహల్ పునరుద్ధరణ.. 1900లో యూరోపియన్ నిర్మాణ శైలిలో నిర్మించిన సర్దార్ మహల్ చారిత్రక కట్టడం. నిర్వహణ లేక భవనం పూర్తిగా దెబ్బతిన్నది. పూర్వ వైభవం తేవడానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక నిధులను కేటాయించి పనులను ‘కుడా’ ఆధ్వర్యంలో ప్రారంభించనుంది. భవనం శైలి దెబ్బ తినకుండా ఆధునికీకరించనున్నారు. ఈ భవనంలో సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పురపాలకశాఖ.. అభివృద్ధి పనులకు రూ.30 కోట్లు కేటాయించింది. చదవండి: ప్రసవం మధ్యలో వెళ్లిపోయిన వైద్యురాలు.. పసికందు మృతి శిథిలావస్థలో ముర్గీచౌక్.. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కోళ్ల మండి (ముర్గీ చౌక్)ని ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ హయాంలో ఏర్పడింది. చికెన్‌తో పాటు మాంసాన్ని సైతం ఇక్కడ విక్రయించేలా మార్కెట్‌ను అభివృద్ధి చేశారు. కాల గమనంలో ఈ మండి శిథిలావస్థకు చేరింది. పురాతన కట్టడాలు పెచ్చులు ఊడిపోయి, రేకుల షెడ్డు ఎగిరిపోవడంతో ముర్గీచౌక్ అధ్వానంగా తయారైంది. ఈ మార్కెట్‌ను ఆధునికీకరించాలని ‘కుడా’ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు రూ.36 కోట్ల నిధులను విడుదల చేసింది. గ్రౌండ్ ప్లస్ భవనాన్ని నిర్మించాలని, దిగువన మార్కెట్.. పై అంతస్తులో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మార్కెట్‌ను అక్కడి నుంచి సమీపంలోని మైదానంలోకి షిఫ్ట్ చేసింది. దీన్ని ఏడాదిన్నరలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్వ వైభవం తెస్తాం.. నిజాం పాలన హయాంలో నిర్మించిన కట్టడాలకు పూర్వ వైభవం తేవడానికి ప్రణాళిక రూపొంచింది. చారిత్రక కట్టడాల వారసత్వ సంపద పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నిపుణుల సలహాలు, సూచనలతో ఆధునికీకరణ పనులు చేపడుతున్నాం. తొలుత ముర్గీచౌక్ నిర్మాణ పనులు ప్రారంభించాం. మీరాలంమండి, సర్దార్ మహల్ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. – బాదావత్ సంతోష్, కుడా అడ్మినిస్ట్రేటర్ గడువులోగా పనులు పూర్తి చేస్తాం.. ముర్గీచౌక్ మార్కెట్ పనులు ప్రాంభమయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్లోని వ్యాపారులను సమీప మైదానంలోకి తరలించాం. టెండర్ ప్రక్రియ ద్వారా పనులను కేటాయించాం. ఉన్నత అధికారుల ఆదేశాలు.. ప్లాన్ ప్రకారం పనులు అయ్యే విధంగా ప్రణాళికాబద్ధంగా పనులు చేయిస్తున్నాం. నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. – జి.గురువీర, కుడా సెక్రటరీ, చీఫ్ ఇంజినీర్ చదవండి: తెలంగాణ ఆర్టీసీ బస్సులు డొక్కుడొక్కు.. అద్దె బస్సులపై కన్ను? -
మోర్బీ ఆసుపత్రికి ప్రధాని.. అర్థరాత్రి హంగామా.. ఆగమేఘాల మీద మరమ్మతులు
మోర్బీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) మోర్బీకి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. తీగల వంతెన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడి మోర్బీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలవనున్నారు. అయితే మోదీ సందర్శన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాల మీద ఆసుపత్రిలో మరమ్మతులు చేపట్టారు. సోమవారం అర్థరాత్రి హడావిడీ సృష్టించి ఆసుపత్రికి మెరుగులు దిద్దారు. ఆసుపత్రి గోడలు, పైకప్పు భాగాలకు పెయింట్ వేశారు. టైల్స్ మార్చారు. కొత్త కూలర్లను తీసుకువచ్చారు. వంతెన దుర్ఘటనలో గాయపడిన 13 మందిని చేర్చుకున్న రెండు వార్డులలో బెడ్షీట్లు ఉన్నపళంగా మార్చేశారు. సిబ్బంది అంతా అర్థరాత్రి ప్రాంగణాన్ని ఊడ్చి క్లీన్‌గా చేశారు. మొత్తంగా ఆసుపత్రిని తళతళ మెరిసేలా చేశారు. కాగా ఆసుపత్రికి మెరుగులు దిద్దుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాడైన గోడలు, పెచ్చులూడిన పైకప్పుకు పెయింటింగ్ వేయడం వంటి ఫోటోలు చూస్తుంటే ఆసుపత్రిలో అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పేందుకు అద్దం పడుతుంది. చదవండి: మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన.. స్పందించిన జో బైడెన్, కమలా హారిస్ મોરબીમાં કાલે કમા ની મુલાકાત હોવાથી અત્યારે રાત્રે સિવિલ હોસ્પિટલ માં કલર કામ કરી રંગ રોગાન કરવામાં આવી રહ્યું છે. #Morbi #મોરબી #morbihospital pic.twitter.com/OS6EFlHyxf — Baraiya Nikunj (@NIKKUGAMING11) October 31, 2022 అయితే కేవలం మోదీ సందర్శన ముందు ఆసుపత్రి పునర్నిర్మాణ పనులు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రి దృశ్యాలను షేర్ చేస్తూ.. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కాషాయ పార్టీపై విరుచుకుపడ్డాయి. ప్రధానమంత్రికి ఫోటోషూట్ కోసం బీజేపీ ఈవెంట్ మేనేజ్మెంట్లో బిజీగా ఉందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్ వేదికగా వ్యంగ్యసత్రాలు ఎక్కుపెట్టాయి. त्रासदी का इवेंट कल PM मोदी मोरबी के सिविल अस्पताल जाएंगे। उससे पहले वहां रंगाई-पुताई का काम चल रहा है। चमचमाती टाइल्स लगाई जा रही हैं। PM मोदी की तस्वीर में कोई कमी न रहे, इसका सारा प्रबंध हो रहा है। इन्हें शर्म नहीं आती! इतने लोग मर गए और ये इवेंटबाजी में लगे हैं। pic.twitter.com/MHYAUsfaoC — Congress (@INCIndia) October 31, 2022 ఓ పక్క బ్రిడ్జి కూలిన విషాద ఘటనలో వందలాది మంది చనిపోతే మరో పక్క మోదీ ఫోటోషూట్‌లో ఎలాంటి లోపం లేదని నిర్ధారించడానికి మరమ్మతు పనులు జరుగుతున్నాయని మండిపడ్డాయి. మోదీ కోసం పెయింటింగ్ వేస్తూ, టైల్స్‌ను మెరిపిస్తూ బిజీగా ఉన్న వారికి సిగ్గు లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత 27 ఏళ్లగా బీజేపీ సరిగా పని చేసి ఉంటే, అర్ధరాత్రి ఆసుపత్రిని అలంకరించాల్సిన అవసరం లేదని సెటైర్లు వేశాయి. Morbi Civil Hospital का दृश्य... कल प्रधानमंत्री के Photoshoot में कोई कमी ना रह जाए इसलिए अस्पताल की मरम्मत की जा रही है। अगर भाजपा ने 27 वर्षों में काम किया होता तो आधी रात को अस्पताल को चमकाने की जरूरत न पड़ती।#BJPCheatsGujarat pic.twitter.com/h83iUmPzKA — AAP (@AamAadmiParty) October 31, 2022 గుజరాత్లో మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన పెను విషాద ఘటన దేశ ప్రజలను విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 140 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉండటం మరింత బాధకర విషయం.మరో 100 మంది గాయాలపాలయ్యారు. నదిలో గల్లంతైన వారికోసం సంఘటనా ప్రాంతంలో ఇంకా గాలింపు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ఇప్పటి వరకు దీనితో సంబంధం ఉన్న 9 మందిని అరెస్ట్ చేశారు. బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టు పొందిన ఒరివా కంపెనీపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. -
Vizianagaram: గంటస్తంభానికి కొత్త సొబగులు
విజయనగరం: చారిత్రక నేపథ్యం కలిగిన విజయనగరం గంటస్తంభం కొత్త సొబగులు అద్దుకుంటోంది. సుమారు రెండు శతాబ్దాల కిందట నగరం నడిబొడ్డున నిర్మించిన గంటస్తంభం... ఆధునీకరణ పనులతో మరింత ఆకర్షణీయంగా దర్శనమివ్వనుంది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో జరుగుతున్న ఆధునీకరణ పనులు తుదిదశకు చేరుకోగా... వచ్చే నెల 5న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. పనుల ప్రగతిని డిప్యూటీ స్పీకర్ క్షేత్రస్థాయిలో శుక్రవారం పరిశీలించారు. గంట స్తంభం చరిత ఇది... 25 అడుగుల కైవారం, రూ.4,680 వ్యయంతో 8 కుంభుజాలతో 18వ శతాబ్దంలో గంటస్తంభాన్ని నిర్మించారు. గంటస్తంభానికి నలువైపులా నాలుగు పెద్ద గడియారాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12, రాత్రి 8 గంటలకు పెద్ద శబ్దంతో అలారం మోగేది. కాలక్రమేణా గంటస్తంభం చెక్కు చెదరనప్పటికీ దానికి అమర్చిన గడియారాలు పాడైనప్పుడు సాంకేతిక నిపుణులను రప్పించి మరమ్మతు చేయించేవారు. ప్రస్తుతం వాటి స్థానంలో అధునాతన గడియారాలు ఏర్పాటు చేయడంతో పాటు కట్టడంలో ఉన్న కిటికీలను మార్పు చేశారు. అలనాటి వైభవం దెబ్బతినకుండా కట్టడానికి పుట్టీపెట్టించి నూతనంగా రంగులతో కొత్త సొబగులు అద్దారు. గంటస్తంభం చుట్టూరా విద్యుత్ దీపాలంకరణతో వాటర్ ఫౌంటౌన్ నిర్మించారు. ఈ పనులతో రాత్రి వేళ చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించనుంది. మొత్తం ఆధునీకరణ పనులను దాతల సహకారంతో చేపట్టగా.. రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్టు అంచనా. పనులను పరిశీలించిన కోలగట్ల... గంటస్తంభం ఆధునికీకరణ పనులను అధికారులతో కలిసి కోలగ్ల వీరభద్రస్వామి పరిశీలించారు. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గంటస్తంభం చుట్టూ కలియతిరిగి ఆక్రమణల తొలగింపుపై టౌన్ ప్లానింగ్ అధికారులకు తగుసూచనలిచ్చారు. విజయనగర వైశిష్ట్యం ప్రతిబింబించేలా అలరారుతున్న గంటస్తంభాన్ని ఆధునీకరించి మరింత ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే పూర్తయిన పనులతో మరింత శోభాయమానంగా అలరారబోతోందని చెప్పారు. నగరాన్ని కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ప్రధాన కూడళ్లను ఇప్పటికే అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కేదారశెట్టి సీతారామమూర్తి, 4వ డివిజన్ కార్పొరేటర్ మరోజు శ్రీనివాసరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కాళ్ల సూరిబాబు, ఏసీపీ మధుసూదన్‌రావు, డీఈ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
అనుమతుల్లేకపోతే వాటి కూల్చివేతకు ఆదేశాలిస్తాం: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రుషికొండ రిసార్ట్ పునరుద్ధరణలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలకు అనుమతులు లేవని తేలితే వాటి కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా యండాడ గ్రామం సర్వే నంబర్ 19 కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అనుమతులివ్వడం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ గతంలో ఇచ్చిన అనుమతులకు, విశాఖపట్నం పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యాలను సీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. మూర్తి యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ, అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని, అందువల్ల ఈ వ్యాజ్యాలపై త్వరగా విచారణ చేపట్టాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. గతంలో తామిచ్చిన ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించినా ఆ నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. చదవండి: (‘నవయుగ’ అప్పీల్లో కీలక పరిణామం) -
Nellimarla: రామకోనేరుకు మహర్దశ
నెల్లిమర్ల రూరల్ (విజయనగరం జిల్లా): పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి ఆలయం పక్కనున్న రామకోనేరుకు మహర్దశ కలగనుంది. కోనేరు అభివృద్ధి పనులకు దేవదాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అమృత సరోవర్ కార్యక్రమంలో భాగంగా కోనేరును బాగుచేసేందుకు రూ.1.50 కోట్ల వ్యయంతో దేవదాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు ఉపాధిహామీ సిబ్బంది రామకోనేరుకు జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. జలవనరుల శాఖ అధికారులు కోనేరుకు కొలతలు వేసి అభివృద్ధి పనులపై అంచనాలు రూపొందించే పనిలో నిమఘ్నమయ్యారు. 12 ఎకరాల్లో రామకోనేరు రామకోనేరు 12 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. రామక్షేత్రానికి విచ్చేసే భక్తులు ముందుగా కోనేరులో పుణ్య స్నానమాచరించిన తరువాత సీతారామస్వామిని, ఉమా సదాశివుడిని దర్శించుకుంటారు. ప్రస్తుతం రామకోనేరులో రెండు పుష్కర ఘాట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాల కోనేరుల అభివృద్ధిలో భాగంగా ఆ శాఖ అధికారులు తాజాగా అమృత సరోవర్ పథకం కింద రామతీర్థం కోనేరును ఎంపిక చేశారు. పనులు పూర్తయితే రామక్షేత్రానికి మరింతి శోభ సాక్షాత్కరించనుంది. కోనేరు అభివృద్ధి ఇలా... రామకోనేరులోకి నీరు వచ్చి పోయేందుకు ఇన్లెట్, ఔట్లెట్ నిర్మాణాలు పూర్తి చేస్తారు. కోనేరు చుట్టూ ఉన్న గట్టును మరింత పటిష్టం చేయనున్నారు. కోనేరులో పూడికతీత పనులు, చుట్టూ రాతి కట్ట నిర్మాణాలు, పడమర వైపు సువిశాలంగా పుష్కర ఘాట్ నిర్మాణం, భక్తుల సౌకర్యార్థం పుష్కరఘాట్ల వద్ద అదనపు షెడ్ల నిర్మాణం, మూడు అడుగుల ఎత్తులో గట్టు, రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు పూర్తిచేస్తారు. వీటితో పాటూ 100 మీటర్ల పోడవు, 5 మీటర్ల వెడల్పుతో కూడిన సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కోనేరు అభివృద్ధి పనులకు సుమారు రూ.3 కోట్లు అవసరమవుతాయని దేవస్థాన ఈఓ ప్రసాదరావు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి పనులకు కొలతలు రామతీర్థం దేవస్థానాన్ని ఇరిగేషన్ జేఈ శ్రీనివాసరావు గురువారం సందర్శించారు. అభివృద్ధి పనులకు ఈఓ ప్రసాదరావుతో కలిసి కోనేరు చుట్టూ కొలతలు వేశారు. పుష్కరిణి గట్టుతో పాటు ఇన్లెట్, ఔట్లెట్ చానళ్లను పరిశీలించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పనులకు సంబంధించి పూర్తి నివేదికను అందజేస్తామని ఆయన తెలిపారు. (క్లిక్: రాజాం టు అమెరికా.. కష్టాలను ఈది సూపర్ సీఈవోగా) -
ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణ ఆఫర్
హైదరాబాద్: వివిధ కారణాలతో రద్దయిన (ల్యాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని ఎల్ఐసీ మరో విడత కల్పించింది. కరోనాతో జీవిత బీమా కవరేజీకి ప్రాధాన్యం పెరిగిన క్రమంలో పాలసీదారుల ప్రయోజనాల కోణంలో ఎల్ఐసీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ నెల 7 నుంచి మార్చి 25 వరకు పాలసీ పునరుద్ధరణ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది. లేట్ఫీజులో తగ్గింపును ఇస్తున్నట్టు తెలిపింది. వైద్య పరీక్షలకు సంబంధించి ఎటువంటి రాయితీలు ఉండవు. హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపైనా లేట్ ఫీజులో రాయితీ ఇస్తోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పాలసీదారులు చివరిగా ప్రీమియం కట్టిన తేదీ నుంచి ఐదేళ్లకు మించకుండా ఉంటే పునరుద్ధరించుకునేందుకు అర్హత ఉంటుంది. రూ.లక్ష వరకు బీమాతో కూడిన ప్లాన్ల పునరుద్ధరణపై ఆలస్యపు రుసుంలో 20 శాతం (గరిష్టంగా రూ.2,000) తగ్గింపు పొందొచ్చు. రూ.1– 3 లక్షల మధ్య పాలసీలకు ఆలస్యపు రుసుంలో 25 శాతం (గరిష్టంగా రూ.2,500), రూ.3లక్షలకు పైన రిస్క్ కవర్‌తో కూడిన పాలసీలకు ఆలస్యపు రుసుంలో 30 శాతం (గరిష్టంగా రూ.3,000) తగ్గింపునిస్తోంది. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలకు అయితే ఆలస్యపు రుసుంలో పూర్తి రాయితీ ఇస్తోంది. అధిక రిస్క్ కవర్‌తో ఉంటే టర్మ్ ప్లాన ఆలస్యపు రుసుంలో తగ్గింపు ఉండదు. -
70 ఏళ్ల నాటి పెంకుటిల్లు.. అయితేనేం.. నవ్విన వారే బాగుందని కితాబు
సాక్షి,సిద్దిపేట: కోట్లు వెచ్చించిన నిర్మించిన ఇల్లును కూడా చిన్న చిన్న కారణాలతో కూల్చివేస్తున్న ఈ రోజుల్లో వారసత్వంగ వచ్చిన మట్టిగోడల పెంకుటిల్లుపై మమకారం పెంచుకున్నాడు. ఆస్తుల పంపకాల్లో తన వాటాకు తాత, తండ్రుల నుంచి వచ్చిన ఇల్లు రావడంతో కూల్చడానికి మనసు రాలేదు. లక్షలు వెచ్చించి అత్యాధునిక హంగులతో నచ్చిన విధంగా మార్చుకున్నాడు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన కోటగిరి యాదగిరిగౌడ్ అందంగా తీర్చిదిద్దిన ఆ అందమైన పొదరిల్లును చూడడానికి సందర్శకులు నిత్యం వస్తూ వావ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలకు నిలువెత్తు నిదర్శనం మండువా ఇళ్లు. అటువంటి ఇల్లు కలిగిన యజమానికి సంఘంలోనూ గౌరవం ఉండేది. రానురాను ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం కావడంతో మండువాలోగిళ్ల అవసరం లేపోయింది, తెలంగాణంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ రకమైన ఇళ్లు మనకు కనిపిస్తుంటాయి. ఈ ఇంటి ప్రత్యేకత గాలి, వెలుతురు చాలినంతగా ప్రసరించేలా నిర్మాణం ఉంటుంది. విశాలమైన గదులు అబ్బురపరుస్తాయి. పచ్చని పంటచేలు, కాల్వలతో కళకళలాడే పల్లెలకు ఈ మండువాలోగిళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. ఆ తర్వాత పట్టణాలకు దీటుగా గ్రామాల్లోనూ కాంక్రీటు భవనాల నిర్మాణం పెరిగింది. చదవండి: ఓటు హక్కు లేదా.. ఇలా నమోదు చేసుకోండి.. 70 ఏళ్ల క్రితం నాటిది.. తల్లిదండ్రులు చేసిన ఆస్తుల పంపకాల్లో పెద్ద కుమారుడైన యాదగిరికి తన వాట కింద వారసత్వంగా వచ్చిన పెంకుటిల్లు వచ్చింది. ఆ ఇల్లు అంటే యాదగిరికి చాలా ఇష్టం. అది శిథిలావస్థలో ఉన్నా.. కూల్చడానికి మనసు రాలేదు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదని రూ. 30 లక్షల వెచ్చించి తనకు కావాల్సిన విధంగా తీర్చిదిద్దాడు. ముందుగా ఆ మట్టి గోడలను పూర్తిగా చెక్కి ప్లాస్టింగ్ చేయించాడు. అనంతరం పుట్టి పెట్టించి రంగులు వేయించాడు. మరమ్మత్తులు చేస్తున్న కూలీలు పై కప్పు తొలగించి బెంగుళూర్ పెంకులు వేసి, టేకు కర్రతో అందమైన డిజైన్స్ చేయించాడు. దీనికి తోడు ఇంటి ముందు చూడడానికి అందమైన కళాకృతుల డిజైన్లు, ఆకృతులతో కూడిన తలపులు బిగించారు. లోపల అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు ఉండేలా మరమ్మత్తులు చేయించారు. అది పెంకుటిల్లే అయినా భవనంలో ఉండే అన్ని వసతులున్నాయి. మొదట ఈ మరమ్మత్తులు చూసి చాలా మంది నవ్వినా పూర్తయిన తర్వాత బాగుందని కితాబిచ్చారు. 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ ఇల్లు పెద్దపెద్ద దూలాలతో నాలుగు గదులను నిర్మించారు. ప్రస్తుతం అది పెంకుటిల్లా లేక భవంతా అనే విధంగా చూపరులను ఆకట్టుకుంటుంది. -
విద్యుత్ కాంతుల్లో మండపాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సీఎం కేసీఆర్ సూచనలు, సలహాల మేరకు భక్తులకు ఆహ్లాదం కలిగించేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. రెండు నెలల క్రితం యాదాద్రీశుడిని సందర్శించిన సీఎం కేసీఆర్ మండపాల్లో తామరపువ్వు ఆకృతిలో ఉన్న దీపాలు బాగున్నాయని చెప్పడంతో ఆ మేరకు ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి ఆధ్వర్యంలో దీపాలను ఏర్పాటు చేశారు. ఇటీవల ఆలయ లోపలి, బయటి ప్రాకారాల సీలింగ్‌కు 125 తామర పువ్వు దీపాలను బిగించి గురువారం రాత్రి ట్రయల్ రన్ చేశారు. అద్దాల మండపం ముందు వైపు వేసిన ఈ దీపాలు ఆకట్టుకుంటున్నాయి. దక్షిణ రాజగోపురం వైపు సైతం విద్యుత్ దీపాలను ట్రయల్ రన్ చేశారు. -
ఆలయాల జీర్ణోద్ధరణకు.. టీటీడీ నుంచి ఏటా రూ. 50 కోట్లు
సాక్షి, అమరావతి : పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ.. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ.. ఆదాయంలేక ఆదరణకు నోచుకోని గుడులలో నిత్యం ధూప దీప నైవేద్యాల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇకపై ఏటా రూ.50 కోట్లను దేవదాయ శాఖకు సమకూర్చనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. ప్రతి ఐదేళ్లకోసారి పది శాతం చొప్పున పెంచాలని ఆర్డినెన్స్‌లో పేర్కొంది. ఈ నిధులేవీ ప్రభుత్వ ఖజానాకు చేరవు. దేవదాయ శాఖ నిర్వహించే హిందూ ధార్మిక కార్యక్రమాలకే వీటిని ఖర్చుచేస్తారు. ఇప్పటివరకు ఆయా కార్యక్రమాలకుగాను టీటీడీ ఏటా రూ.2.25 కోట్లను అందజేస్తోంది. అయితే, ఈ కార్యక్రమాలకు శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ దుర్గగుడి, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం, కాణిపాకం దేవస్థానాలు ఒక్కొక్కటీ రూ.10 కోట్లకు పైగా అందజేస్తున్నాయి. 2019–20లో శ్రీశైలం ఆలయం ఒక్కటే రూ.32 కోట్లు సమకూర్చింది. ఈ నేపథ్యంలో.. టీటీడీ ఏటా చెల్లించే మొత్తాన్ని రూ.50 కోట్లకు పెంచుతూ దేవదాయ శాఖ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ఆగస్టులో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో చట్ట సవరణ జరిగే వరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ విడుదల చేసింది. సర్వశ్రేయో నిధికే ఏటా రూ.40 కోట్లు కొత్తగా తీసుకొచ్చిన సవరణ ప్రకారం.. దేవదాయ శాఖ పరిధిలో ఉండే సర్వశ్రేయో నిధి (కామన్ గుడ్ ఫండ్–సీజీఎఫ్)కి టీటీడీ ప్రస్తుతం ఏటా రూ.1.25 కోట్లు అందజేస్తుండగా.. ఆ మొత్తాన్ని ఇప్పుడు రూ.40 కోట్లకు పెంచుతూ కూడా చట్ట సవరణ చేశారు. పాడుబడ్డ ఆలయాల పునర్నిర్మాణం.. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ.. ధూపదీప నైవేద్య స్కీం (డీడీఎన్ఎస్) వంటి కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగిస్తారు. అలాగే.. అర్చకులు, ఇతర ఉద్యగుల సంక్షేమ నిధికి టీటీడీ ఇప్పటిదాకా ఏటా రూ.50 లక్షల చొప్పున అందజేస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.5 కోట్లకు పెంచుతూ చట్ట సవరణ చేశారు. అంతేకాక.. దేవదాయ శాఖ పరిపాలన నిధికి టీటీడీ ఇప్పటివరకు ఏటా రూ.50 లక్షల చొప్పున అందజేస్తుండగా, ఆ మొత్తాన్ని కూడా రూ.5 కోట్లకు పెంచి చట్ట సవరణ చేశారు. -
Jallianwala Bagh: విషాద స్మారకస్థలిని వినోదపర్యాటకంలా మారుస్తారా?
చారిత్రక స్ఫూర్తిని పదికాలాలు కాపాడే పరిరక్షణ, పునరుద్ధరణ వేరు. స్ఫూర్తిని మింగేసి, చరిత్రనే కనుమరుగు చేసేటంత సమూల మార్పుల సుందరీకరణ వేరు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బహుశా అతి ప్రాచీన స్మారకస్థలి జలియన్‌వాలా బాగ్‌లో చేయిపెట్టినప్పుడు ప్రభుత్వం ఈ చిన్న తర్కం మర్చిపోయినట్టుంది. కేంద్రం అక్కడ చేసిన తాజా మార్పులు, కొత్త నిర్మాణాల చేర్పులు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న ఓ విషాద స్మారకస్థలిని ఫక్తు వినోదపర్యాటకంలా మారుస్తున్నారని ప్రతిపక్షాలు, పౌరసమాజం అందరూ ధ్వజమెత్తుతున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జలియన్‌వాలా బాగ్ స్మారకస్థలం ప్రపంచదేశాల స్వాతంత్య్ర చరిత్రలో ప్రత్యేకమైనది. తొలి ప్రపంచ యుద్ధకాలంలోని అణచివేత చర్యలను కొనసాగిస్తున్న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 10 – 12 వేలమంది భారత స్వాతంత్య్ర ప్రియులు 1919 ఏప్రిల్ 13న జలియన్‌వాలా బాగ్‌లో సమావేశమయ్యారు. నిరాయుధులైన ఆ శాంతియుత ఉద్యమకారులు బయటకు వెళ్ళడానికి ఉన్న దారిని మూసేసి మరీ, బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ సారథ్యంలోని బ్రిటీష్ సైన్యం పది నిమిషాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. కాల్పులను తప్పించుకొనే మార్గం లేక పక్కనే ఉన్న బావిలోకి జనం దూకిన విషాద సందర్భం అది. వైశాఖి పర్వదిన వేళ జరిగిన ఆ అమానుష కాల్పుల్లో అధికారిక లెక్కల ప్రకారమే 379 మంది చనిపోయారు. అంతకు మూడురెట్లు గాయపడ్డారు. అసలైతే అమరులు, క్షతగాత్రుల సంఖ్య వేలల్లోనే! అప్పట్లో గాంధీ తదితర జాతీయనేతలు జనం నుంచి విరాళాలు పోగుచేసి, దాన్ని స్మారకోద్యానంగా మార్చారు. ఆ ప్రాంగణం మధ్యలో ఇప్పుడున్న అతి పెద్ద స్తూపాన్ని 1961లో కట్టి, అధికారిక స్మారకస్థలి నిర్మించారు. ఆనాటి అమానుషానికి నేటి బ్రిటీషు వారసులు దాదాపు క్షమాపణ కోరినంత పని చేయడం మరో చరిత్ర. జాతి రక్తం ఉప్పొంగే ఆ చారిత్రక విషాదస్థలిని ఇప్పుడేమో వినోద పర్యాటక స్థలంలా మార్చేశారన్నది విమర్శ. ఏడాదిన్నరగా నవీకరించిన ఆ స్మారకాన్ని ఆగస్టు 28న ప్రధాని మోదీ జాతికి అంకితం జేశారు. ‘చరిత్రను కాపాడుకోవడం బాధ్యత’ అనీ ఆయన సెలవిచ్చారు. మరి చరిత్రను కాపాడాల్సిన సర్కారు తీరా చేసిందేమిటి? నాటి విషాదాన్ని కళ్ళకు కట్టే ఇరుకుదారిని మార్చేసి, అందమైన కుడ్యశిల్పాలు, త్రీడీ ప్రొజెక్షన్లు, లేజర్ అండ్ సౌండ్ షోలు పెట్టింది. 102 ఏళ్ళ క్రితం జలియన్‌వాలా బాగ్ దమనకాండలో అమరులైనవారికి ప్రధాని ఒక పక్కన శ్రద్ధాంజలి ఘటిస్తుండగానే, పొరుగున ఆయన పార్టీ ప్రభుత్వమే నడుస్తున్న హర్యానాలో పోలీసు లాఠీలు రైతు ఉద్యమకారులను రక్తమోడేలా బాదడం విరోధాభాస. ప్రశాంతంగా సమావేశమైన స్వాతంత్య్ర సమరవీరుల్ని ‘కాల్చిపారేయ’మన్న ఆనాటి జనరల్ డయ్యర్కూ, రైతుల ‘బుర్రలు బద్దలు కొట్టండి’ అన్న నేటి ప్రభుత్వ ప్రతినిధులకూ తేడా ఏముంది? ఏడాది క్రితం పంజాబ్‌లో మొదలైన రైతు ఆందోళనలు 9 నెలలుగా ఢిల్లీ శివార్లలో సాగుతున్నాయి. రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించిన అప్పటి అమరులదీ, కొత్త సాగుచట్టాలను వ్యతిరేకిస్తున్న ఇప్పటి రైతులదీ – ఇరు వర్గాలదీ శాంతియుత ఉద్యమమే. కానీ, ప్రభువుల ప్రవర్తన మాత్రం నూరేళ్ళు దాటినా మారలేదన్న మాట. జలియన్‌వాలా బాగ్ స్మారకానికి కేంద్రం చేసిన మార్పులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీపీఎం నేత సీతారామ్ ఏచూరి సహా పలువురు విమర్శించారు. ఈ మార్పులు ‘అమరవీరులను అవమానించడమే. బలిదానానికి అర్థం తెలియని వ్యక్తే ఇలా చేయగలర’ని రాహుల్ విరుచుకుపడ్డారు. జరిగిన కథకు ప్రతీక అయిన జలియన్‌వాలా బాగ్ ఇరుకైన దారిని సమూలంగా మార్చేయడం ‘చరిత్రను ధ్వంసం చేయడమే’ అని జనంలో చర్చ రేగింది. డిస్కో లైట్లు – బొమ్మలు పెట్టి, సందర్శకుల నుంచి రుసుము వసూళ్ళతో వినోదాత్మక పర్యాటక ప్రదేశంలా మార్చడం జలియన్‌వాలా బాగ్ విషాదబీభత్సానికి ఒక రకంగా అగౌరవమే. అయితే, అధిష్ఠానం ఆశీస్సులున్న సిద్ధూతో అస్తుబిస్తు అవుతున్న పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మాత్రం తమ అధినేత రాహుల్ అభిప్రాయానికి విరుద్ధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘అక్కడేం తొలగించారో నాకు తెలీదు కానీ, ఆ స్మారకం నాకైతే బాగుంది’ అన్నారాయన. రాష్ట్రంలోని కీలక స్మారకాన్ని కేంద్రం మార్చేస్తుంటే, అమరిందర్ ఎందుకు అడ్డుకోలేదన్నది ఇప్పుడు మరో విమర్శ. కారణాలేమైనా, చారిత్రక ప్రదేశాల్ని పరిరక్షించే బదులు అందంగా చరిత్రని పునర్నిర్మించాలనుకుంటేనే సమస్య. అందంగా లేదని అమ్మనైనా, చరిత్రనైనా మార్చలేం. కానీ, పాలకులు మారినప్పుడల్లా చరిత్రను తమ కళ్ళతోనే అందరూ చూడాలనుకోవడం, ఎవరి రంగులు వాళ్ళు పులమాలనుకోవడం కొన్నేళ్ళుగా జరుగుతున్న తంతు. భారత స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్’ విడుదల చేసిన పోస్టర్లో నవభారత నిర్మాత నెహ్రూ లాంటి వాళ్ళ బొమ్మ లేదని ఇటీవలే వివాదం రేగింది. ఇప్పుడీ స్మారకస్థలి వ్యవహారం వచ్చింది. అన్నిటా పైపై పటాటోపానికి ప్రాధాన్యమిస్తే ఇలానే ఉంటుంది. భావితరాలకు అందించాల్సింది ఆలోచింపజేసే స్ఫూర్తినే తప్ప, అందమైన ఊహల అనుభూతిని కాదు. అలా ప్రతిదీ మార్కెట్ చేసుకొనే యావలో పడ్డ పాలకుల వల్ల చరిత్రకు ప్రమాదమే. చరిత్రకారుడు కిమ్వాగ్నర్ అన్నట్టు ‘జలియన్‌వాలాబాగ్ చరిత్ర ఇప్పుడు చరిత్రలో కలిసిపోయింది’. అవును... ఆత్మ పోయింది. ఆడంబరమే మిగిలింది. స్వాతంత్య్ర సమరంలో అసువులు బాసిన అమరవీరుల స్మారక సాక్షిగా ఇది మరో తీరని విషాదం. -
14వ సారి.. 6 గంటలు కలియదిరిగిన సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని.. వచ్చే మే నెల నుంచే స్వయంభూ నరసింహుడి దర్శనం కల్పించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. త్రిదండి చినజీయర్‌స్వామి ఆశీర్వచనం తీసుకుని, శుభ ముహూర్తంలో భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభిస్తామని తెలిపారు. పనుల్లో వేగం పెంచి, ఈ నెలాఖరుకే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. సుమారు ఆరు గంటల పాటు యాదాద్రిలో గడిపారు. ఆర్కిటెక్ట్, అధికారులకు పలు సూచనలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో యాదాద్రికి రావడం ఇది 14వ సారి కావడం గమనార్హం. పనుల పూర్తిపై సంతృప్తి గురువారం ఉదయం 12.08 గంటలకు హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం.. తర్వాత కాన్వాయ్‌తో కొండపైకి చేరుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. తర్వాత బాలాలయంలో ప్రతిష్టామూర్తులకు ప్రత్యేక పూజలు, సువర్ణ పుష్పార్చన జరిపించారు. ఆలయ ఆచార్యులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు 90 శాతం పూర్తి కావడం పట్ల సీఎం కేసీఆర? సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఏయే పనులు అసంపూర్తిగా ఉన్నాయి, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారన్న అంశాలను ఆర్కిటెక్ట్, అధికారులతో సమీక్షించారు. నర్సింహుడి దర్శనానికి వచ్చే భక్తులకు వైకుంఠ పుణ్యక్షేత్రంలో ఉన్న అనుభూతి కలిగించాలని, దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండేలా చూడాలని సూచించారు. విద్యుత్ దీపాల కాంతిలో దేదీప్యమానంగా వెలగాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో క్యూ కాంప్లెక్సులపై ఆధ్యాత్మిక భావన కల్పించేలా శంకుచక్రనామాలు, నారసింహ రూపాల ఏర్పాటు బాగుందని మెచ్చుకున్నారు. మాడవీధులు, అష్టభుజి ప్రాకారాలు, సాలహారాలు, వేంచేపు మండపం, బ్రహ్మోత్సవ మండపం, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్, శివాలయ నిర్మాణం పురోగతి, స్వామి పుష్కరిణి, భక్తుల స్నాన గుండం, మెట్లదారి నిర్మాణాలను పరిశీలించారు. ప్రహరీకి మరింత శోభ వచ్చేలా ప్రాచీన చిత్ర కళా అలంకృత రూపం (అర్నమెంటల్ లుక్)తో సుందరంగా తయారు చేయాలని సూచించారు. హడావుడి పడకూడదు అద్భుతమైన కళాఖండాన్ని తీర్చిదిద్దుతున్నప్పుడు హడావుడి పడకూడదని సీఎం కేసీఆర్ సూచించారు. ఆలయానికి తుది మెరుగులు దిద్దుతున్న నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆలయాల్లోని శిల్పసంపద ఎలా ఉందో చూసి రావాలని అధికారులకు చెప్పారు. ప్రహ్లాద చరిత్ర సహ నృసింహుడు, పురాణ దేవతల చరిత్రలు అర్థమయ్యేలా శిల్పాలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించాలన్నారు. మూల విరాట్టుకు అభిషేకం జరిగే సమయంలో భక్తులకు స్పష్టంగా కనిపించేలా ప్రధాన ద్వారం వద్ద అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. గర్భగుడి ముందు ధ్వజ స్తంభాన్ని, తంజావూర్ పెయింటింగ్‌లను.. బంగారు తాపడం చేసిన దేవతామూర్తులను పరిశీలించారు. ఉప ఆలయాలతోపాటు ఆండాళ్ అమ్మవారి గుడిని, పరకామణిని పరిశీలించారు. తెలంగాణ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా యాదాద్రికి వస్తారని, వారికి అన్ని వసతులు అందేలా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని కేసీఆర్ చెప్పారు. స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో దేశంలోని ఇతర ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలని, అవసరమైన ఉద్యోగులను నియమించుకోవాలని సూచించారు. చైనాలో పరిశీలించి రండి.. అద్దాల మండపం అద్భుతంగా ప్రత్యేకత చాటుకునేలా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. అవసరమైతే చైనాలో ఏడు కిలోమీటర్ల దూరం లైట్లతో నిర్మించిన మాల్‌ను సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సందర్శించి రావాలని చెప్పారు. హుండీలను, ప్రసాద కౌంటర్లను భక్తులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక యాదాద్రి గెస్ట్‌హౌజ్‌లో లిఫ్టులు పూర్తి కాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒడిశా పూరీ జగన్నాథ్ ఆలయం మాదిరిగా.. రిటైర్డ్ పూజారులు, వేద బ్రాహ్మణ పెద్దలు తమ భుక్తిని వెళ్లదీసుకునేలా భక్తుల నుంచి కానుకలు స్వీకరించేలా మండపం నిర్మించాలన్నారు. ఇందుకోసం పూరీ ఆలయాన్ని సందర్శించాలని సూచించారు. శ్రావ్యమైన సౌండ్‌సిస్టం ఉండాలి గుట్టపై శివాలయాన్ని సందర్శించిన సీఎం.. రుత్విక్కుల కోసం నిర్మించిన మండపం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూ కాంప్లెక్స్‌లో భక్తుల ఆహ్లాదంకోసం భక్తి గీతాలు, శ్లోకాలు శ్రావ్యంగా వినిపించేలా సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని సూచించారు. పుష్కరిణి వద్ద అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పారు. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పూజారులు, ఆలయ సిబ్బంది నివసించేందుకు అనువైన ఇళ్లు నిర్మించాలని ఆదేశించారు. శిల్పులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. తర్వాత ఏసీ ప్లాంట్, గ్యాస్ గోదాం, కొండ దిగువన పచ్చదనం పెంచేందుకు చేపట్టిన పనులను పరిశీలించారు. గుట్ట కింద నిర్మాణాల జాప్యాన్ని నివారించాలి యాదాద్రి చుట్టూ, టెంపుల్ సిటీలో చేపట్టిన రోడ్లు, బస్టాండ్లు, ప్రెసిడెన్సియల్ కాటేజీలు, కల్యాణకట్ట, లక్ష్మి (గండిచెరువు) పుష్కరిణి పనులను కేసీఆర్ పరిశీలించారు. ఇక్కడి పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్న ప్రసాద వితరణ సత్రం పనులపై పలు సూచనలు చేశారు. రింగ్‌రోడ్డు లోపలి ప్రాంతాలను పచ్చదనంతో నింపాలన్నారు. అన్ని రకాల సాయం చేస్తం రింగ్‌రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న వ్యాపారులు, ప్రజలతో గుట్ట కింద సీఎం ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. కోల్పోయిన దానికన్న గొప్పగా వారికి అన్ని వసతులతో షోరూంల తరహాలో విశాలమైన దుకాణాలు కట్టిస్తామని, ఉచితంగా ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో గుట్ట మీద వ్యాపారం చేసుకున్న వారికి టెంపుల్ టౌన్లో పాత పద్ధతిలో దుకాణాలు ఇస్తామని చెప్పారు. స్థానికులకు ఉద్యోగాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పర్యటనలో సీఎం వెంట ఎంపీ సంతోష్, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, అధికారులు ఉన్నారు. కాగా.. హైదరాబాద్ నుంచి యాదాద్రికి వస్తుండగా సీఎం కేసీఆర్ హెలికాప్టర్ నుంచే నృసింహ (బస్వాపురం) రిజర్వాయర్ పనులను పరిశీలించారు. బస్వాపురం శివారులో ఉన్న మెత్తగుట్ట, తేలవాలుగు గుట్ట, ఉంగరాల గుట్ట మీదుగా హెలికాప్టర్ ప్రయాణించింది. తక్కువ ఎత్తులో వెళుతుండటంతో సీఎం బస్వాపురం కట్టపై దిగుతారేమోనని సమీపంలోని పొలాల్లో ఉన్న రైతులు ఆసక్తిగా చూశారు. -
వందేళ్ల నాటి గోడలో.. 66 విస్కీ బాటిల్స్
వాషింగ్టన్: సాధారణంగా వందల ఏళ్ల క్రితం నాటి కట్టడాల పట్ల ఓ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే పూర్వం అక్కడ ఏమైనా విలువైన వస్తువులు, నిధి నిక్షేపాలు వంటివి దాచారేమోననే అనుమానం ఉంటుంది. వాటిని వెలికి తీయడం కోసం చాలా మంది రహస్యంగా తవ్వకాలు జరుపుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథనం కూడా ఇలాంటిదే. అయితే తవ్వకాలు జరిపింది నిషేధిత ప్రాంతంలో కాదు. సొంత ఇంట్లోనే. ఇక గోడలో వెలుగు చూసిన వస్తువులను చూసి ఆ దంపతులు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. తమకు లభించిన వస్తువులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి తెగ వైరలవుతున్నాయి. ఇంతకు వారికి గోడలో ఏం కనిపించాయి అంటే 66 విస్కీ బాటిళ్లు. అవును అది కూడా స్మగుల్డ్ బాటిల్స్. వివరాలు.. న్యూయార్క్‌కు చెందిన దంపతులు నిక్ డ్రమ్మండ్, పాట్రిక్ బక్కర్ పోయిన నేలలో వారి కొత్త ఇంటికి మారారు. అయితే అక్కడ ఇంటి గోడలో తమకు మద్య నిషేద యుగం కాలానికి చెందిన విస్కీ బాటిళ్లు లభ్యమవుతాయని వారు కలలో కూడా ఊహించలేదు. ఈ సంఘటన ఈ ఏడాది అక్టోబర్‌లో చోటు చేసుకుంది. నిక్ డ్రమ్మండ్ దంపతులు ఈ ఇంటిని ఓ నటోరియస్ స్మగ్లర్ దగ్గర నుంచి కొనుగోలు చేశారు. వందేళ్ల నాటి ఇల్లు కావడంతో మరమత్తులు చేపించాలని భావించారు. ఆ క్రమంలో క్షీణించిన ఇంటి గోడలను బాగు చేసేందుకు గాను తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో వారికి వరుసగా విస్కీ బాటిళ్లు దర్శనమిచ్చాయి. వీటిని చూసిన వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని తమకు దక్కిన అదృష్టాన్ని తలచుకుని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి తెగ వైరలవుతున్నాయి. (చదవండి: 10 లాటరీలు ఒకేసారి తగిలాయా, ఏంటి? ) View this post on Instagram A post shared by Nick Drummond (@bootleggerbungalow) ‘మా ఇంటిని మద్యంతో నిర్మించారు’ అనే క్యాప్షన్‌తో ఫోటోలని ఫేర్ చేశాడు నిక్. ఇక విస్కీ బాటిళ్లు మధ్యనిషేధం నడిచిన 1920 కాలానికి చెందినవి. వాటి మీద తయారీ తేదీ అక్టోబర్ 23, 1923గా ఉంది. ఇక మొత్తం 66 బాటిళ్లలో 13 ఫుల్‌గా ఉండగా.. 9 మంచి పరిస్థితిలో ఉన్నాయి.. నాలుగు పూర్తిగా క్షీణించాయి. ఇక కొన్నింటిలో విస్కీ సగమే ఉంది. ఇన్నేళ్లు గోడలోపల ఉండటంతో ఆవిరి అయి ఉండవచ్చు అన్నాడు నిక్. ఈ ఫోటోలు చేసిన నెటిజనులు ‘మీరు ఆ విస్కీని ట్రై చేశారా’.. ‘వేలం వేసే ఆలోచన ఉంటే చెప్పండి.. నేను కొంటాను’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన మద్యం ప్రియులు మాత్రం ‘అదృష్టం అంటే నీదే పో’ అంటూ ఈర్షపడుతున్నారు. -
పాపన్న కోటను పునరుద్ధరించాలి
సాక్షి, రఘునాథపల్లి(జనగామ): శతాబ్దాల చరిత్ర కలిగిన సర్ధార్ సర్వాయి పాపన్న కోటలోని కొంత భాగం నేలకొరగడం విచారకరమని సినీ హీరో పంజాల జైహింద్‌గౌడ్ అన్నారు. బహుజనుల రాజ్యాన్ని స్థాపించి వీరోచిత పోరాటంతో మొగలుల ఆగడాలను ఎదిరించిన వీరుడైన పాపన్న కోటను పునరుద్ధరించి భావితరాలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్‌లో సర్వాయి పాపన్న కోటలోని ఓ వైపు రాతి గోడ కుప్పకూలిన నేపథ్యంలో మంగళవారం ఆయన గౌడ సంఘం నేతలతో కలిసి కోటను పరిశీలించారు. ఈ సందర్భంగా జైహింద్‌గౌడ్ మాట్లాడుతూ కోట పునర్నిర్మాణానికి సర్వాయి పాపన్న ట్రస్ట్ తరపున రూ.కోటి విరాళం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కోట పునరుద్ధరణ కోసం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ప్రభుత్వ అధికారులతో చర్చించి త్వరగా పనులు జరిగేలా చూస్తామని తెలిపారు. అలాగే, గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని పాపన్న కోటలో నిర్మిస్తామని తెలిపారు. కోట రాతి గోడ కూలడంతో ఇళ్లు కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు కుమార్‌గౌడ్‌తో పాటు పరీదుల శ్రీను, మర్కాల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
యాదాద్రి వైకుంఠ ద్వారం కూల్చివేత
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల చరిత్ర కలిగిన మరో కట్టడాన్ని తొలగించారు. యాదగిరికొండపైకి మెట్ల మార్గం మొదలయ్యే ప్రాంతంలో ఉన్న వైకుంఠ ద్వారాన్ని శుక్రవారం రాత్రి కూల్చివేశారు. 1947లో రామ్‌దయాళ్ సీతారామయ్య శాస్త్రి, నరసింహారెడ్డి, కొండల్‌రెడ్డి, గాదె కిష్టయ్య తదితరులు ఆస్థాన కమిటీగా ఏర్పడి ఈ వైకుంఠ ద్వారాన్ని నిర్మించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో యాదవనగర్ వరకు రోడ్డు విస్తరణ చేస్తుండడంతో ప్రస్తుతం వైకుంఠ ద్వారాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో చరిత్ర కలిగిన ఈ వైకుంఠ ద్వారానికి సంబంధించి ఇక జ్ఞాపకాలే మిగిలిపోనున్నాయి. తుది దశకు చేరుకున్న నూతన వైకుంఠ ద్వారం నిర్మాణంలో నూతన వైకుంఠ ద్వారం ప్రస్తుతం ఉన్న వైకుంఠ ద్వారాన్ని కూల్చివేసే ప్రణాళికను ముందస్తుగా నిర్ణయించడంతో దాని వెనుక భాగంలో ఇప్పటికే కొత్తగా మరో వైకుంఠ ద్వారాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నూతన వైకుంఠ ద్వారం పనులు సైతం తుది దశకు చేరుకున్నాయి. -
తమ్మిలేరుపై ఆధునికీకరుణ
మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన తమ్మిలేరు ఆధునికీకరణ వైపు అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ జలాశయం పనులపై ఇప్పుడు అధికారులు దృష్టిసారించారు. నవంబర్‌లో పనులు చేపట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. సాక్షి, పశ్చిమగోదావరి(చింతలపూడి) : తమ్మిలేరు ప్రాజెక్టు ఆధునికీరణ నిమిత్తం జపాన్ ఆర్థిక బ్యాంక్ నుంచి గత ఏడాది రూ.16.91 కోట్ల రుణం మంజూరైంది. అయితే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు మొదలు కాలేదు. ఇప్పుడు అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి కమిషనరేట్ ఆఫ్ టెండర్స్(సీఓటీ)కి పంపించారు. వీటిని ఉన్నతాధికారులు పరిశీలించి ఖరారు చేస్తారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టెండర్ల ప్రక్రియలో స్వల్ప జాప్యం జరిగే ఆస్కారం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 329 అడుగుల మేర నీరు చేరింది. వర్షాలు కొనసాగితే నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. టెండర్లు ఖరారు అయితే నవంబర్, డిసెంబర్ నుంచి పనులు చేపట్టే అవకాశం ఉంది. మంజూరు అయిన నిధులతో జలాశయ ఆనకట్ట, ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలతోపాటు ప్రధాన పంట కాల్వలు, ఇరిగేషన్ కార్యాలయాలనూ నిర్మించనున్నారు. మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు చేపడతారు. వాటిలో మన జిల్లాలోని తమ్మిలేరు ప్రాజెక్టుతోపాటు దీనికింద ఉన్న కొన్ని చెరువుల ఆధునికీకరణ పనులూ చేపడతారు. 30వేల ఎకరాలకు లాభం పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 30 వేల ఎకరాలకుపైగా సాగునీరు అందిస్తున్న తమ్మిలేరు ప్రాజెక్టు ప్రస్తుతం మెరక తేలి ఉంది. దీంతో 3 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో ఇప్పుడు రెండు టీఎంసీల నీరూ నిల్వ ఉండని దుస్థితి నెలకొంది. చింతలపూడి ఎత్తిపోతల పధకం నీరు ప్రాజెక్టులోకి మళ్లించే నాటికన్నా జలాశయంలో ఆక్రమణలు తొలగించి, పూడిక తీసి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్ళు దాటిపోయినా ఇంత వరకూ పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టలేదు. 1996లో వచ్చిన పెను తుపానుకు ప్రాజెక్టు గట్టు రివిట్మెంట్ పూర్తిగా ధ్వంసమైంది. అప్పట్లో రూ.1.55 కోట్లతో మరమ్మతులు చేశారు. గట్టు బలహీనం ప్రస్తుతం జలాశయం గట్టు బలహీనంగా ఉంది. గట్టుపైకి చేరుకునే మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. సాగునీరు అందించే పంట కాలువలూ దెబ్బతిన్నాయి. రిజర్వాయర్ కుడి కాలువ 6.508 కిలోమీటర్లు, ఎడమకాలువ 10.185 కిలోమీటర్లు, మంకొల్లు కాలువ పొడవు 3.38 కిలోమీటర్లు. వీటిని ఆధునికీకరించనున్నారు. ఈ జలాశయం వద్ద కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ 6.4 కిలోమీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు,74 మీటర్ల ఎత్తులో మట్టికట్టను నిర్మించారు. మట్టికట్టనూ పటిష్టపరచడానికి చర్యలు తీసుకుంటున్నారు. 2006లోనే ప్రతిపాదనలు ఇరిగేషన్ అధికారులు తమ్మిలేరు అభివృద్ధికి 2006లో రూ.23 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ తరువాత జపాన్‌కు చెందిన ఇంటర్నేషనల్ కో–ఆపరేటివ్ ఎయిడ్ (జేఐసీఏ) అనే సంస్థ నిధులతో తమ్మిలేరు ఆధునికీకరణకు అన్ని అనుమతులు వచ్చాక నిధుల విడుదలకు నిర్దేశించిన సమయం పూర్తి కావడంతో మరమ్మతులు ప్రారంభం కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీనికి కేంద్ర జలసంఘం అనుమతులు లభించి నిధులు మంజూరు కోసం ఎదురు చూస్తున్న సమయంలో రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, రాష్ట్ర విభజన జరగడంతో ఈ నిధులపై మళ్ళీ నీళ్ళు వదులు కోవలసిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం తమ్మిలేరు ప్రాజెక్టును అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా గుర్తించింది. అనంతరం అంతర్రాష్ట్ర కోటాలో తమ్మిలేరు అభివృద్ధికి నిధులు కేటాయించాలని 2015లో మరోసారి కేంద్ర జలసంఘం అనుమతి కోసం జిల్లా ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. జపాన్ బృందం ప్రాజెక్టు సందర్శన ఈ నేపథ్యంలోనే 2016 ఫిబ్రవరిలో జపాన్ ఆర్థిక బ్యాంకు బృందం ప్రాజెక్టును పరిశీలించి వెళ్లింది. తమ్మిలేరుతో పాటు జిల్లాలోని 20 మైనర్ ఇరిగేషన్ చెరువులనూ పరిశీలించింది. ఆ తర్వాత జపాన్ బ్యాంకు రుణం మంజూరు చేసింది. ఉద్యోగుల క్వార్టర్లు శిథిలం తమ్మిలేరు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇక్కడ ఇరిగేషన్ డీఈ కార్యాలయంతోపాటు, ఒక గెస్ట్‌హౌస్, అధికారులు, సిబ్బంది కోసం భవనాలు నిర్మించారు. సుమారు ఏడు కార్యాలయాలను వేర్వేరుగా నిర్మించారు. ప్రాజెక్టు పర్యవేక్షణకు వచ్చే ఉన్నతాధికారులు ఇక్కడున్న గెస్ట్‌హౌస్‌లోనే విశ్రాంతి తీసుకునేవారు. ఇక్కడ ఇరిగేషన్ శాఖకు చాలా ఎకరాల మేర సొంత స్ధలం కూడా ఉంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత నీటిపారుదల శాఖకు చెందిన ఉద్యోగులతో పాటు, సెక్షన్ కార్యాలయాన్ని ఏలూరుకు తరలించడంతో అంతవరకూ ఉద్యోగులు నివాసం ఉన్న భవనాలు ఖాళీ అయ్యాయి. ఆ తరువాత సంబంధిత అధికారులెవరూ ఈ భవనాలను గురించి పట్టించుకో లేదు. దీంతో అవి శిథిలమయ్యాయి. వీటిల్లోని కలప దొంగలపరమైంది. కబ్జాలో స్థలాలు ప్రస్తుతం కొన్ని భవనాల్లో రిటైర్డ్ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు నివాసం ఉంటున్నారు. ఇరిగేషన్ శాఖ విలువైన స్థలాలు కబ్జాకు గురయ్యాయి. నిజానికి వరదలు, తుపాన్లు సంభవించినప్పుడు అత్యవసర సమయాల్లో ప్రాజెక్టును అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి. అందుకోసం ఇక్కడ అధికార యంత్రాంగం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. సెక్షన్ కార్యాలయం ఏలూరు తరలించడంతో తమ్మిలేరులో ఆక్రమణలు పెరిగాయి. ప్రస్తుతం మంజూరైన నిధులతోపాటు ప్రభుత్వం మరికొన్ని నిధులు జోడించి ఈ క్వార్టర్లను ఆధునికీకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు. టెండర్లు ఖరారు కావాల్సి ఉంది జపాన్ బ్యాంకు నుంచి నిధులు మంజూరయ్యాయి. ఉన్నతాధికారులు టెండర్లు ఖరారు చేయాలి. నవంబర్ నాటికి పనులు మొదలయ్యే అవకాశం ఉంది. – ఎం.అప్పారావు, ఇరిగేషన్ డీఈ, తమ్మిలేరు పనులు ప్రారంభించాలి తమ్మిలేరు అభివృద్ధి పనులను త్వరగా ప్రారంభించాలి. ప్రాజెక్టు మరమ్మతు పనులు చేపట్టి చాలా ఏళ్లయింది. తమ్మిలేరుకు శాశ్వత సాగునీటి జలాలను తరలించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి తమ్మిలేరుకు సాగు నీరు అందించాలి. – జంగా మురళీధర్‌రెడ్డి, తమ్మిలేరు సాగునీటి సంఘం చైర్మన్ -
అదరహో కేజీఠీవీ !
సాక్షి, శ్రీకాకుళం : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు (కేజీబీవీ) మంచి రోజులు రానున్నాయి. ప్రస్తుతం కేజీబీవీల్లో ప్రవేశాలకు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు ఇంటర్మీడియెట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో కేజీబీవీలను జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడేషన్ చేస్తున్నారు. మొత్తం 32 కేజీబీవీల్లో గత ఏడాది 2 అప్‌గ్రేడ్ కాగా, ఈ ఏడాది మరో 19 అప్‌గ్రేడ్ అవుతున్నాయి. దీంతో జిల్లాలో మొత్తం జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడ్ అయిన కేజీబీవీల సంఖ్య 21కు చేరుకుంది. వసతి సమస్య లేకుండా ఉంటే.. భవిష్యత్‌లో అన్ని కేజీబీవీల్లోను ఇంటర్మీడియెట్ కోర్సులు తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బాలికలకు విద్య చేరువ.. గ్రామీణ ప్రాంతాల్లోని నిస్సహాయ బాలికలకు విద్యను చేరువ చేసేందుకు 2004లో అప్పటి కేంద్రప్రభుత్వం కేజీబీవీలను తీసుకువచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తూ, వసతి, భోజనం కూడా కల్పించి వారిని తీర్చిదిద్దాలని భావించింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు 32 కేజీబీవీలను కేటాయించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పరిమితం చేస్తూ.. క్లాసుకు గరిష్టంగా 40 మంది చొప్పున విద్యార్థినులతో నిర్వహించారు. తొలిరోజుల్లో భవనాలు లేక కొన్ని అద్దె భవనాల్లో నడిపించారు. మరికొన్నింటిని ఆయా ప్రాంతాల్లోని గురుకుల పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహణను కొనసాగించారు. 2010 నుంచి ఆర్వీఎంలోకి.. కేజీబీవీ పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం జరిగిన తర్వా త 2010లో అప్పటి రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) పరిధికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కేజీబీవీల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఉత్తీర్ణత శాతంతోను రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో నిలుస్తూ వస్తున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా ప్రస్తుతం సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిర్వహణలో కేజీబీవీలు నడుస్తున్నాయి. జిల్లాలో 32 కేజీబీవీల్లో ప్రస్తుతం 6600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. జూనియర్ కళాశాలలుగా ఉన్నతి.. కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ విద్యను గతంలో ప్రవేశపెట్టారు. జిల్లాలో కేవలం కోటబొమ్మాళి, జి.సిగడాం కేజీబీ వీలను జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడ్ చేశారు. జిల్లాకు చెందిన గత మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకటరావులు చెరో కళాశాలను పంచుకున్నారు. కేజీబీవీల్లో నియామకాలు సైతం ఈ మాజీ మంత్రుల సిఫారసుల మేరకే జరిగాయన్న విమర్శలు లేకపోలేదు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో రాష్ట్రవ్యాప్తంగా 140 కేజీబీవీలను జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జాబితాలో శ్రీకాకుళం జిల్లా నుంచి 19 కేజీబీవీలు ఉన్నాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు అప్‌గ్రేడ్ జరిగిన కేజీబీవీల సంఖ్య 21కు చేరింది. కొటబొమ్మాళి, గత ఏడాది అప్‌గ్రేడ్ అయిన జి.సిగడాంలలో ఎంపీసీ, బైపీపీ రెండేసి గ్రూపులను కేటాయింపు చేయగా.. ప్రస్తుతం కేటాయింపు చేసిన 19 కళాశాలలకు మాత్రం కేవలం ఒక గ్రూపును మాత్రమే మంజూరు చేసింది. ఆ ప్రాంతాల్లో ఆదరణ ఉన్న గ్రూపులకు అవకాశం కల్పించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, పలు ఒకేషనల్ కోర్సులను మంజూరుచేశారు. తరగతులు, వసతి ఇతర సదుపాయాలను ఉచితంగా కల్పిస్తూ.. కోర్సుకు గరిష్టంగా 40 మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. దీంతో 19 కేజీబీవీ కళాశాలలకు 40 మంది చొప్పున 760 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. వీటిల్లో విద్యార్థుకు పాఠాలు బోధించేందుకు పార్ట్‌టైమ్ లెక్చరర్ల నియామకాలకు సైతం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితాల్లోనూ అగ్రస్థానమే.. కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులు సైతం ఉన్నతమైన ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2019 మే నెలలో వెలువడిన టెన్త్‌క్లాస్ ఫలితాల్లో 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులు 35 మంది ఉండటం గమనార్హం. రాష్ట్రంలో కేజీబీవీల్లో అత్యధికంగా 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించడంలో 38 మంది విద్యార్థినులతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. శ్రీకాకుళం 35 మందితో రెండోస్థానంలో నిలవడం విశేషం. గత ఐదేళ్లుగా జిల్లాలో కేజీబీవీలు టెన్త్‌లో సగటున 95 శాతానికిపైగా ఉత్తర్ణత సాధిస్తున్నాయి. -
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పునరుద్ధరణ..
-
యాదాద్రి పునరుద్ధరణ పూర్తయ్యాక.. మహాయాగం
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయ పునరుద్ధరణ పనులు జరగాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా ఈసారి బడ్జెట్లో కూడా తగినన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత సహస్రాష్టక మహాకుండయాగం (1008 యాగ కుండాలతో) 11 రోజుల పాటు నిర్వహిస్తామని, ఈ యాగానికి భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఆహ్వానిస్తామని ఆయన వెల్లడించారు. వందల ఏళ్ల పాటు నిలిచిపోయే దేవా లయ సన్నిధిలో ప్రతీ అంగుళం నిర్మాణంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, వైభవోపేతంగా నిర్మాణం జరగాలని సీఎం సూచించారు. అత్యాధునికంగా, ఆధ్మాత్మిక శోభ కనిపించేలా నిర్మించిన వెల్లూరు, తంజావూరు, అక్షర్ధామ్ లాంటి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి నిర్మాణాలను అధ్యయనం చేయాలని ఆయన అధికారులను కోరారు. భారతీయులు తమ జీవితంలో ఒకసారైనా యాదాద్రిని సందర్శించాలనే ఆసక్తి కలిగేలా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. పునరుద్ధరణ తర్వాత యాదాద్రికి భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతుందని.. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శివరాత్రి ఉత్సవాలు, తెప్పోత్సవం నిర్వహించడానికి, నిరంతరం వ్రతాలు చేసుకోవడానికి, తలనీలాల సమర్పణకు, మండల దీక్ష భక్తులు ప్రత్యేక పూజలు చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన చేయాలన్నారు. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా నిర్మాణ పనులన్నీ సమాంతరంగా సాగాలని, దీనికోసం ఏ పనికి ఆ పనిగా ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేయాలని కేసీఆర్ చెప్పారు. యాదాద్రి పునరుద్ధరణ పనులను ఆదివారం సందర్శించి వచ్చిన సీఎం.. సోమవారం ప్రగతిభవన్‌లో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్అండ్బీ ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, ఈఈ వసంత్ నాయక్, ఎస్ఈ లింగారెడ్డి, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఈవో గీత, ఆలయ నిర్మాణ నిపుణుడు ఆనంద్ సాయి, స్ట్రక్చర్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఆర్కిటెక్ట్ మధుసూదన్, వాసుకి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా ప్రధాన ఆలయమున్న గుట్టపై ఎలాంటి నిర్మాణాలు రావాలి? గుట్ట కింద భాగంలో ఎలాంటి నిర్మాణాలు రావాలి? టెంపుల్ సిటీపై ఎలాంటి నిర్మాణాలు రావాలి? మొత్తంగా యాదాద్రి ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చించి సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నారు. మాడవీధులు, ప్రాకారాలు కలుపుకుని 4.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం నిర్మించాలని, మొత్తం 302 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ ప్రాంగణం ఉంటుందని సీఎం వెల్లడించారు. బస్వాపూర్ చెరువు టు గండిచెరువు లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉండే గుట్ట పైభాగంలో ప్రధాన దేవాలయంతో పాటు గోపురాలు, ప్రాకారాలు, మాడ వీధులు, శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, ఈవో కార్యాలయం, వీవీఐపీ గెస్ట్‌హౌజ్ (ప్రెసిడెన్షియల్ సూట్), అర్చక నిలయం, నైవేద్య వంటశాల, ప్రసాద మంటపం, రథశాల, వ్రత మంటపం, స్వామి పుష్కరిణి, క్యూ కాంప్లెక్స్, మెట్ల దారి, బస్టాప్, పోలీస్ ఔట్ పోస్టు, హెల్త్ సెంటర్లుండాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఏ నిర్మాణం ఎక్కడ రావాలనే దానిపై తుది నిర్ణయం తీసుకున్న ఆయన దీని ప్రకారం నిర్మాణాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. గుట్ట కింది భాగంలో గండి చెరువును తెప్పోత్సవం నిర్వహించడానికి అనువుగా సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి నిత్యం ఈ చెరువుకు నీటి సరఫరా చేస్తామని వెల్లడించారు. గండి చెరువుకు అనుబంధంగా కోనేరు, కళ్యాణకట్ట నిర్మించాలని చెప్పారు. గుట్ట కింద భాగంలోనే ఆలయ బస్టాండ్ నిర్మించాలని, అక్కడి నుంచి భక్తులను దేవాలయ వాహనాల ద్వారా గుట్టపైకి తీసుకు రావాలని చెప్పారు. గుట్టపైకి వెళ్లి, రావడానికి వేర్వేరు దారులు ఉపయోగించాలని, గుట్ట కింద మండల దీక్ష చేపట్టిన భక్తుల కోసం ఆశ్రమం నిర్మించాలని నిర్ణయించారు. యాదాద్రి ఆలయం చుట్టూ రింగు రోడ్డు నిర్మించాలని, దానికి అనుబంధంగా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, యాదాద్రి నుంచి తుర్కపల్లికి ఫోర్‌లేన్ రోడ్డు వేయాలని ఆదేశించారు. నిర్మాణ పనులన్నీ అత్యంత పటిష్టంగా జరగాలని, నాణ్యత విషయంలో రాజీపడవద్దని సీఎం స్పష్టం చేశారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత పరిపూర్ణ ఉపాసకులతో అతిపెద్ద యాగం నిర్వహిస్తామని, దీనికి దేశ విదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తామని వెల్లడించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ యాగం కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయడానికి ఓ కమిటీని నియమించనున్నట్టు చెప్పారు. భక్తుల బస కోసం టెంపుల్‌సిటీలో 340 క్వార్టర్ల నిర్మాణ పనులు వేగంగా జరగాలని, టెంపుల్ సిటీలో రోడ్లు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజి లాంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. యాదాద్రిలోని ప్రతీ బ్లాకుకు దేవుళ్లు, దేవతల పేర్లు పెడతామని చెప్పిన సీఎం యాదాద్రి టెంపుల్ సిటీ అంతా ప్రకృతి రమణీయత గోచరించేలా, ఆహ్లాదం వెల్లివిరిసేలా ఉద్యానవనాలు, ఫౌంటేన్లు నిర్మించాలని సూచించారు. -
అంగరంగ వైభవంగా యాదాద్రి ప్రతిష్ఠ కార్యక్రమం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ ప్రతిష్ఠ ఆషామాషీగా ఉండదని.. దేశంలోనే మునుపెన్నడూ లేనివిధంగా అంగరంగ వైభవంగా, శాస్త్రోక్తంగా జరిపిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ప్రతిష్ఠ ఎప్పుడనేది తానే వెల్లడిస్తానన్నారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయన మందిర నిర్మాణ పనులను సమీక్షించారు. ‘ప్రతిష్ఠ ఆషామాషీగా ఉండదు. నెలకో, రెన్నెల్లకో జరగదు. ఇంత గొప్ప క్రతువు ఎట్లా జరగాలో.. అట్లాగే జరగాలి. తొందరలో జరిగే కార్యక్రమం కాదిది. పరిగెత్తి కట్టం. వేల సంవత్సరాలు ఉండే ఆలయం. కాబట్టి పవిత్రమైన ఆలయ ప్రతిష్ఠ రోజున 1008 హోమ గుండాలతో యాగం నిర్వహిస్తాం. దేశంలోనే ఎక్కడా జర గని విధంగా ఆలయ ప్రతిష్ఠ ఉంటుంది. శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగు తుంది. సహస్రకుండాత్మక సుదర్శన నారసింహ మహాయాగంతో ఆలయాన్ని ప్రతిష్ఠిస్తాం. ఈ మహా క్రతువులో నేనూ ఒక కార్యకర్తగా పని చేస్తా’అని ఆయన పేర్కొన్నారు. సుమారు 6 గంటలకు పైగా యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు, టెంపుల్ సిటీ, ప్రెసిడెన్షియల్ సూట్లతో పాటు వివిధ నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా టెంపుల్ సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఆలయ ప్రతిష్ఠాపనకు బద్రీనాథ్‌తోపాటు దేశ, విదేశాల నుంచి వైష్ణవాధిపతులు హాజరవుతారన్నారు. ఐదారున్న వేల మంది రుత్వికులు, రెండున్నర వేల మంది సహరుత్వికులు, 1008 హోమ గుండాల్లో హోమాలు నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. ఆలయ ప్రతిష్ఠ ఆషామాషీగా గ్రామ దేవతల ఆలయాల ప్రారంభోత్సవం మాదిరిగా జరగదని.. దేశంలో మునుప్పెన్నడూ లేని విధంగా ఉంటుందన్నారు. ఆదివారం హెలికాప్టర్ నుంచి యాదాద్రి నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్ సమైక్య పాలనలో నిర్లక్ష్యం సమైక్య పాలనలో యాదాద్రి క్షేత్రం నిర్లక్ష్యానికి గురైందని కేసీఆర్ విమర్శించారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ శక్తిపీఠం తెలంగాణలో ఉన్నా సమైక్య పాలనలో సరైన ప్రాధాన్యత కల్పించలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక జరిగిన కృష్ణా పుష్కరాల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసి, తొలి స్నానం అక్కడే చేశానని వెల్లడించారు. ‘నేను ఎవరికీ భయపడను, ఏ విషయం దాచుకోను. ఈ విషయాన్ని ఉద్యమంలో మాట్లాడాను’అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో జోగులాంబ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. అష్టాదశ శక్తి పీఠాల్లో మొదటిది శ్రీలంకలో ఉందని, అంతటి విశిష్టత కలిగిన మరోశక్తి పీఠం మన తెలంగాణ జోగులాంబలోనే ఉందన్నారు. విశిష్టమైన పూజలు ఇక్కడ జరుగుతాయని, సమైక్య పాలనలో ఈ క్షేత్రాన్ని వెలుగులోకి రాకుండా చేశారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా యాదాద్రిపై పటిష్టమైన బందోబస్తు ‘యాదాద్రి క్షేత్రం గొప్పగా రూపుదిద్దుకుంటోంది. శని, ఆదివారాల్లో ఇప్పుడే 50వేల నుంచి 70వేల మంది వస్తున్నారు. ఇంతటి పవిత్రత కలిగిన ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడం గొప్ప విషయం. 1,100 ఎకరాల్లో టెంపుల్ సిటీ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం 832ఎకరాల భూమి ఉంది. మిగిలిన 250ఎకరాలు సేకరిస్తున్నాం’అని సీఎం వెల్లడించారు. 250 ఎకరాల్లో లేఔట్ పూర్తయిందని, ఇందులో 354 లగ్జరీ సూట్లు నిర్మిస్తామని తెలిపారు. ఇందులో రూ.2కోట్లు, రూ. కోటి, రూ.50లక్షలు, రూ.25లక్షలతో దాతల సహకారంతో సూట్లు నిర్మిస్తామన్నారు. ఇందుకోసం ఒక్కో సూట్‌కు రూ.2కోట్లు ఇచ్చేందుకు 48మంది దాతలు ముందుకొచ్చారన్నారు. తిరుపతి, ఇతర దివ్య క్షేత్రాల్లో నిర్మించిన విధంగా స్వామి వారి నామాలతో బ్లాక్‌లు ఉంటాయన్నారు. లక్ష్మీనరసింహస్వామి బ్లాక్, ఆండాళమ్మ బ్లాక్, ప్రహ్లాద బ్లాక్‌ల పేర్లతో ఉంటాయని, మరోసారి సమావేశం నిర్వహించి పద్ధతిగా నిర్మాణాలు జరిగే విధంగా పనులు ప్రారంభిస్తామన్నారు. కేసీఆర్‌కు వేదపండితుల ఆశీర్వచనం. చిత్రంలో ఎంపీలు సంతోష్ కుమార్, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే గొంగిడి సునీత తదితరులు జీయర్ స్వామితో వస్తా! 15 రోజుల తరువాత శ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి మళ్లీ యాదాద్రి క్షేత్రానికి వస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. జీయర్‌స్వామి సూచన మేరకు చిన్నచిన్న మార్పులు ఉంటాయన్నారు. ప్రధానంగా పశ్చిమ భాగంలో కొన్ని మార్పులు చేయనున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే యాదాద్రి పుణ్యక్షేత్రం ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంతరించుకోనుందని ఆయన పేర్కొన్నారు. శిల్పాలతో ఏడంతస్తుల గోపురం నిర్మించామని, ఇవి వేల ఏళ్ల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయన్నారు. నిర్మాణాలు మొత్తం రాతితో జరిగాయని, శిల్ప కళాకృతులు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయని చెప్పారు. యాదాద్రి క్షేత్రం భావి తరాలకు సాంస్కృతిక వారధిగా నిలుస్తుందన్నారు. ఆలయ పనులు బాగా జరుగుతున్నాయని కితాబిచ్చిన సీఎం.. పనుల్లో మరింత వేగం పెరగాలని అధికారులకు సూచించారు. ప్రధాన ఆలయ నిర్మాణం బాగా వచ్చిందని.. శివాలయం గొప్పగా తయారవుతోందన్నారు. యాదాద్రి ఆలయం ఉత్తరంలోని కొండ కింద భాగంలో స్థల సేకరణకు రూ.70కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే 143 ఎకరాల భూమి సేకరించామని, మరో 30 ఎకరాలు గండి చెరువులో తెప్పోత్సవం కోసం కేటాయించామని, ఇందుకోసం రూ.70కోట్లు వెంటనే విడుదల చేశామని వెల్లడించారు. జూన్ తర్వాత కాళేశ్వరం నీళ్లు వస్తాయని, గండి చెరువులో స్వచ్ఛమైన గోధావరి నీటితో తెప్పోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. తిరుమల తరహాలో.. తిరుపతిలో నిత్యాన్నదాన సత్రం నిర్మించిన రాజు వెగేస్నా నిర్వాహకులు రూ.10కోట్లు నిత్యాన్నదాన సత్రం కోసం విరాళంగా ఇచ్చారన్నారు. అలాగే అన్ని వసతులతో బస్టేషన్, క్యూ కాంప్లెక్స్, కారు పార్కింగ్ సెంటర్, వ్యాపార సముదాయాలు, 50–60 ఎకరాల్లో ప్రవచన మంటపం, బ్రహ్మోత్సవ మంటపాలు నిర్మిస్తామని వివరించారు. ఒకటి నుంచి రెండు లక్షల మంది భక్తులు వచ్చినా కొండ కింద కల్యాణోత్సవం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. యాదాద్రి పవిత్రత దెబ్బతినకుండా, జీవ హింసకు తావులేకుండా భక్తులకు వసతులు కల్పించడానికి బస్వాపూర్ రిజర్వాయర్ పరిసరాల్లో 261 ఎకరాలు ఉందని, 250 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్లు వస్తాయని సీఎం చెప్పారు. దీంతో పాటు రిజర్వాయర్‌లో బోటింగ్, వివిధ రకాల విద్యుత్ దీపాలు, పార్క్‌లు వస్తాయన్నారు. ఆలయం చుట్టూ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం అవుతాయన్నారు. ప్రెసిడెన్షియల్ సూట్ పనులు సెప్టెంబర్‌లోగా పూర్తవుతాయన్నారు. ఆలయ ప్రతిష్ఠకు హాజరయ్యే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు బస చేయడానికి ప్రెసిడెన్షియల్ సూట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఆలయానికి అనుబంధంగా కొలనుపాకలోని సోమేశ్వర ఆలయం, జైన మందిరం, భువనగిరి ఖిలాను అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎంపీలు జే.సంతోష్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాధరి కిశోర్‌కుమార్, మర్రి జనార్దన్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి, వైటీడీఏ వైస్–చైర్మన్ కిషన్‌రావు, కలెక్టర్ అనితా రామంచంద్రన్, ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాల ముస్తాబు
సాక్షి, నల్లగొండ టౌన్ : జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరడానికి సమయం ఆసన్నమైంది. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు 550 పడకల సామర్థ్యం కలిగిన జిల్లా ప్రభుత్వ వైద్యశాఖలకు అనుబంధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేసిన విషయం విధితమే. అయితే కళాశాల భవన నిర్మాణానికి స్థల సేకరణ తదితర విషయాల్లో కొంత ఆలస్యమైనప్పటికీ భవన నిర్మాణానికి రెండు, మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉండడంతో అధికారులు.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పాత భవనంలో తరగతులను నిర్వహించాలని నిర్ణయించారు. పాత భవనాన్ని ఆధునికీకరించడానికి ప్రభుత్వం నుంచి రూ.7 కోట్ల 77లక్షలు విడుదలయ్యాయి. ఈ నిధులను ప్రభుత్వం ఆస్పత్రుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వేగవంతంగా ఆధునికీకరణ పనులను పూర్తి చేసేందుకు ఆహర్నిషలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రిలోని గ్రౌండ్ ఫోర్లో బయో కెమిస్ట్రీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రం, మెటర్నిటీ వార్డులను ఫిజియాలజీ డిపార్డ్మెంట్గా ఆధునికీకరించారు. రెండో ఆంతస్తులో సెంట్రల్ లైబ్రరరీ, బాయ్స్ అండ్ గరŠల్స్ కామన్ రూంలుగా మార్చారు. మిగతా అటానమి, లెక్చరర్ గ్యాలరీ విభాగాలను ఆస్పత్రి ఆవరణ లోని ఖాళీ స్థలం లో నిర్మిస్తున్నారు. తాత్కాలి కంగా నూతన భవనం నిర్మాణం జరిగేంత వరకు ఎంబీబీఎస్ తరగతులను ఆధునికీకరించిన పాత భవనంలో నిర్వహించడానికి అవసరమైన అన్ని హంగులతో పనులు కొనసాగుతున్నాయి. మార్చిలోగా పూర్తి.. మార్చి చివరి నాటికి అన్ని హంగులతో మెడికల్ కళాశాల ఆధునికీకరణ పనులను పూర్తి చేసి కళాశాల ప్రిన్సిపాల్‌కు అప్పగించడానికి ఇంజనీరింగ్ విభాగం కృషి చేస్తోంది. పనులలో ఎక్కడా రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. మార్చి చివరి నాటికి అన్ని పనులను పూర్తి చేసి ప్రిన్సిపాల్‌కు అందించనున్నామని ఈఈ అజీజ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు.. మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచే 150 సీట్లలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించనున్నా రు. ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు ఆయా విభా గా లకు చెందిన హెడ్ల ను, అన్ని విభాగా ల కు చెం దిన ప్రొఫెస ర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం నియమించింది. జిల్లా ప్రజలకు అందనున్న స్ఫెషలైజేషన్ వైద్య సేవలు.. మెడికల్ కళాశాల ప్రారం భం అవుతుండడంతో జిల్లా ప్రజలకు అన్ని రకాల స్పెషలైజేషన్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఏ చిన్న అత్యవసరం వచ్చినా హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు రెఫర్చేసే వారు. ఇక నుంచి ఏ అత్యవసర వైద్య సేవలైనా మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జిల్లా ఆస్పత్రిలో అందనున్నాయి. రూ. 275 కోట్లతో కళాశాల నూతన భవన నిర్మాణం జిల్లా మెడికల్ కళాశాల నూతన భవనాన్ని రూ.275 కోట్లతో నిర్మించనున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఆవరణలో గల ఖాళీ స్థలంలో భవన నిర్మాణం కోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే స్థల పరిశీల పూర్తి చేశారు. భవన నిర్మాణానికి అవసరమైన టెండర్ ప్రక్రియను ఆస్పత్రుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చేపట్టింది. ఈ సంవత్సరంలోనే నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశం ఉంది. -
రాహుల్ ‘మిషన్ టెంపుల్’
సాక్షి, న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోష్ మీదున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నారు. ఆలయ సందర్శనలు, హిందుత్వ పట్ల అనుసరిస్తున్న మెతక వైఖరి ఆయా ఎన్నికల్లో సానుకూల ఫలితాలు ఇవ్వడంతో ఇదే ఒరవడి కొనసాగించాలని రాహుల్ భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ హిందూ ఓటు బ్యాంక్‌ను ఆకర్షించేందుకు మిషన్ టెంపుల్ వ్యూహానికి పదునుపెడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కీలక రాష్ట్రమైన యూపీ నుంచే ఈ కసరత్తును ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. ఎంపీ నిధుల నుంచి అమేథి నియోజకవర్గంలోని ఆలయాల పునర్నిర్మాణం, మరమ్మత్తులను చేపట్టాలని రాహుల్ నిర్ణయించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలోని 13 ఆలయాల్లో హైమాస్ట్ సోలార్ లైట్లను అమర్చాలని పార్టీ చీఫ్ నిర్ణయించారని కాంగ్రెస్ నేత అనిల్ సింగ్ తెలిపారు. అమేథి సంగ్రామ్‌పూర్‌లోని కాళీ దేవి, గౌరీ గంజ్‌లోని దుర్గా ఆలయం, సహఘర్‌లోని భవానీ ఆలయాలు వంటి పురాతన ఆలయాలూ ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా ఆలయాల సుందరీకరణతో పాటు వాటిలో హార్మోనియం, డోలు, మజీర వంటి పరికరాలను అందుబాటులో ఉంచుతారు. ఆయా దేవాలయాల్లో తాగునీటి వసతినీ కల్పించనున్నట్టు స్ధానిక కాంగ్రెస్ నేత చంద్రకాంత్ దూబే వెల్లడించారు. కాగా రాహుల్ తన నియోజకవర్గంలోని ఆలయాలపై దృష్టిసారించడం పట్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉమాశంకర్ పాండే స్పందించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోరుతూ దేశవ్యాప్తంగా ధర్మ సభలు జరుగుతుండటంతో రాహుల్ కంగారు పడుతున్నారని, అందుకే అమేథిలో ఆలయాల మరమ్మత్తులపై ఆయన దృష్టిపెట్టారని వ్యాఖ్యానించారు. రాహుల్ నిర్ణయం మంచిదే అయినా రాజకీయ ప్రయోజనం పొందడమే ఆయన ఉద్దేశమని ఆరోపించారు. కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌పై పోటీ చేసిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సైతం రాహుల్ కోటలో బీజేపీని బలోపేతం చేసేందుకు తరచూ అమేథిని సందర్శిస్తున్నారు. -
‘డిసెంబర్లో పూర్తి.. మార్చిలో దర్శనాలు’
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న ప్రధానాలయం పునర్నిర్మాణం పనులు ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి కానున్నాయని వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు తెలిపారు. దర్శనాలు మాత్రం మార్చిలోనే ప్రారంభమవుతాయన్నారు. యాదా ద్రి ఆలయ పనులను అధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, స్వయం భూ మూర్తులున్న గర్భాలయ నిర్మాణాలన్నీ చిన్న జీయర్‌స్వామి ఆదేశాల మేరకు స్థపతి సుందర్రాజన్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయన్నారు. 54 వ్యాలీ పిల్లర్లు నిర్మాణమయ్యాయన్నారు. భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకునేలా ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు. ఆంజనేయ స్వామి, గండ భేరుండ నారసింహులకు ప్రదక్షిణలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆలయ ప్రారంభం నాటికి భద్రత, సీసీ కెమెరాలు, క్యూలైన్లు వంటి ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఆల యానికి 3 ప్రాకారాలు రానున్నాయని ఆర్కి టెక్టు ఆనందసాయి తెలిపారు. ధ్వజస్తంభం ఎత్తు ముఖ మండపాని కంటే, గర్భాలయం పై కప్పు కంటే తక్కువగా రానుందని స్థపతి సుందరరాజన్ పేర్కొన్నారు. సమావేశంలో దేవస్థానం ఈఓ గీతారెడ్డి, స్థపతి వేలు, ఆర్కిటెక్టు మధు, ఈఈ వసంత నాయక్ పాల్గొన్నారు. -
హిందూ ఆలయంపై పాక్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : దాయాది దేశం పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం అక్కడి హిందువులను షాక్‌తో పాటు, ఒకింత ఆనందానికి గురిచేసింది. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం రావల్పిండిలోని శ్రీకృష్ణుడి ఆలయ అభివృద్ధికి దాదాపు 20 మిలియన్ల రూపాయలు కేటాయించి అందరిని ఆశ్చర్యపరిచింది. రావల్పిండి, ఇస్లామాబాద్ జంటనగరాల్లో మనుగడలో ఉన్న పురాతన శ్రీకృష్ణుడి ఆలయం ఇది ఒక్కటే. ప్రావిన్స్ అసెంబ్లీలో హిందూ సభ్యుడి సిఫార్సు మేరకు ఈ నిధులు మంజూరు చేసినట్లు అదనపు పరిపాలనాధికారి మహ్మద్ ఆసిఫ్ తెలిపారు. నూతన ఆలయ నిర్మాణం పూర్తైయ్యంత వరకూ విగ్రహాలను భద్రపరుస్తామని ఆసిఫ్ పేర్కొన్నారు. 1897లో కంజీమాల్, రామ్ రచ్‌పాల్ అనే ఇద్దరు ఈ గుడిని నిర్మించారు. 1970లో పాక్ ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ట్రస్టు ప్రాపర్టీ బోర్డు పరిధిలోకి ఈ ఆలయం వెళ్లింది. ఇక్కడ ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయి. ఈ గుడికి సంబంధించిన ప్రాంత పరిధిని పెంచాలని స్థానిక హిందువులు గత కొంత కాలంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న నేపథ్యంలో పాక్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ అభివృద్ధికి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుడి కనీసం 100 మంది భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉందని, దాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నిధులతో మరమ్మత్తులు చేయించాక.. వివిధ పండగలప్పుడు మరింతమంది హిందువులు వచ్చి పూజలు చేసుకొనేందుకు పాక్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. -
మొజాంజాహి మార్కెట్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్
-
ఎంజే మార్కెట్‌ను సందర్శించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : చారిత్రక మోజంజాహీ మార్కెట్‌కు పుర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఎంజే మార్కెట్‌ని దత్తత తీసుకున్నారు. జీహెచ్ఎంసీ కూడా ఎంజే మార్కెట్ పునరుద్దరణకు 10కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఎంజే మార్కెట్‌ని సందర్శించారు. మార్కెట్ లోని వ్యాపారులతో ముచ్చటించిన కేటీఆర్.. అక్కడ లభించే ఫేమస్ ఐస్ క్రీమ్ రుచి చూశారు. జీహెచ్ఎంసీ చేపట్టబోయే పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనులను నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కేటీఆర్ వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ అధికారులు ,తదితరులు ఉన్నారు. Visited the famous Mozzam Jahi market along with @arvindkumar_ias Restoration works start tomorrow & would be completed in 4 months Hyderabad is a unique city that has a great blend of both amazing heritage structures & modern contemporary ones pic.twitter.com/hGIpvk0E12 — KTR (@KTRTRS) April 16, 2018 -
'జైళ్ల ఆధునీకరణకు చర్యలు '
-
జైళ్ల ఆధునీకరణకు చర్యలు : జైళ్ల శాఖ డీజి
సాక్షి, హైదరాబాద్ : జైళ్ల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం కొత్త సంస్కరణలు ప్రవేశపెడతామని తెలంగాణ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ వినయ్‌కుమార్ సింగ్ తెలిపారు. బుధవారం ఆయన చర్లపల్లి జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో యాచకులకు ఏర్పాటుచేసిన ఆనంద ఆశ్రమాన్ని పరిశీలించారు. బాత్రూములు,మరుగుదొడ్లు, గదులను తనిఖీచేశారు. ఆశ్రమంలో మొత్తం 65 మంది యాచకులు ఉన్నారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. చంచల్‌గూడ జైలులో పురుష యాచకులకు సన్న బియ్యంతో అన్నం వండుతుంటే చర్లపల్లి జైలులో మాత్రం దొడ్డుబియ్యం అన్న వండుతున్నారని మహిళా యాచకులు ఫిర్యాదుచేశారు. ఈ సందర్బంగా సింగ్ మాట్లాడుతూ జనవరి 26న ఖైదీల క్షమాబిక్ష ఉండదని చెప్పారు. ఈ విషయం ప్రభుత్వ పరిధిలో ఉందన్నారు. యాచకురాలిని కాదు... డైరెక్టర్ జనరల్ వెళ్ళిపోయిన తర్వాత మహిళా యాచకురాలు సాయమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. తాను యాచకురాలు కాదని, కూరగాయల కోసం రోడ్డుపైకి వస్తే తనను బలవంతంగా అరెస్టుచేసి చర్లపల్లి జైలులో ఉంచారని వాపోయింది. తనలాగే చాలామంది ఆశ్రమంలో మగ్గుతున్నారని పేర్కొంది. -
కోటలు పిలుస్తున్నాయి!
- రూ.100 కోట్లతో ముస్తాబుకు రంగం సిద్ధం - జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు లక్ష్యంగా భారీ ప్రాజెక్టు సాక్షి, హైదరాబాద్: ఐదొందల అడుగుల ఎత్తు న్న గుట్ట.. మెట్ల దారిలో ముందుకు సాగితే 20 అడుగుల ఎత్తుతో సింహద్వారం, ఇరువైపులా జూలు విదిల్చి గంభీరంగా ఉన్న సింహాల విగ్రహాలు.. దాటి ముందుకెళితే గజద్వారం.. ఘీంకరిస్తున్న ఏనుగుల ఆకృతిలోని ప్రతి మలు.. ఏడు దర్వాజాలు.. 16 అడుగుల పొడ వున్న భారీ ఫిరంగి.. ఇదంతా మెదక్ కోట రాజఠీవి. సాధారణంగా కోట అనగానే మనకు హైదరాబాద్‌లోని గోల్కొండ కోట గుర్తుకు వస్తుంది. కానీ.. రాష్ట్రంలో మరో 30 వరకు కోటలున్న సంగతి తక్కువ మందికే తెలుసు. భువనగిరి కోట ఇప్పుడవన్నీ పర్యాటక కళను సంతరించుకో నున్నాయి. రాష్ట్రంలో పర్యాటకానికి కొత్త రూపుదిద్దే చర్యల్లో భాగంగా రూ.100 కోట్లతో భారీ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపగా.. కేంద్రం సూత్ర ప్రాయం గా అంగీకరించినట్లు సమాచారం. కేంద్రం గతేడాది సోమశిల బ్యాక్ వాటర్ ఆధారంగా కొల్లాపూర్‌లో ప్రకృతి అందాలను అభివృద్ధి చేసేందుకు రూ.98 కోట్లు.. ట్రైబల్ సర్క్యూట్ కింద గోదావరి తీరంలో ఆదిలా బాద్ నుంచి ఖమ్మం వరకు ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి మరో రూ.98 కోట్లు కేటాయించింది. రోప్ వేలు.. లైట్ షోలు.. సాహసక్రీడలు భువనగిరి ఖిలా, ఎలగందుల కోట, మెదక్ దుర్గం, జఫర్గడ్, దేవరకొండ కోట, రాచకొండ ఖిలా ఇలా తరచి చూస్తే జిల్లాకు ఒకటి రెండు కోటలు కనిపిస్తాయి. ఒక్కో కోటది ఒక్కో చరిత్ర.. విభిన్న నిర్మాణ కౌశలం.. కొన్ని ఆలనా పాలనా లేక ముళ్లపొదలతో నిండిపోయి, కూలిపోయి కాలగతిలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని మాత్రం మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి కోటలను గుర్తించి అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. దేవర కొండ కోట కొన్ని ప్రధాన కోటలను ఓ సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. కోటల వద్ద దిగువ నుంచి పై వరకు, అక్కడి నుంచి సమీపంలో ప్రకృతి శోభ ఉండే ప్రాంతం వరకు రోప్ వే ఏర్పాటు చేస్తారు. ప్రధాన రహదారుల నుంచి కోట వరకు చేరుకోవటానికి రెండు వరసల రోడ్లు నిర్మిస్తారు. కోట వద్ద రెస్టారెంట్లు, కాటేజీలు, దుకాణాలు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు. భువనగిరి కోట లాంటి ఎత్తయిన ప్రాంతాల్లో సాహస క్రీడలకు వీలుగా వసతులు కల్పిస్తారు. క్లైంబింగ్, ట్రెక్కింగ్, మినీ బంగీ జంపింగ్, స్విమ్మింగ్ పూల్స్, కోట చరిత్రను తెలిపే ఏర్పాట్లు, సౌండ్ అండ్ లైట్‌షోలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టుతో పర్యాటకానికి ఊతం ‘‘రాష్ట్రంలో అద్భుత కోటలున్నాయి. గోల్కొండ తప్ప మిగతా వాటికి ప్రాచుర్యం లేదు. వాటిని అభివృద్ధి చేసి, వసతులు కల్పిస్తే ఆయా ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షించడం ఖాయం. ఈ సంవత్సరం కోటల అభివృద్ధితో కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నాం. దాదాపు రూ.100 కోట్లు వస్తాయని ఆశిస్తున్నాం. ఇది విదేశీ పర్యాటకులను బాగా ఆకట్టుకునే ప్రాజెక్టు అవుతుంది..’’ – పేర్వారం రాములు, రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ ఎలగందుల కోట -
బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు
ఆర్టీసీ సీటీఎం సత్యనారాయణ నాయుడుపేటటౌన్: నాయుడుపేట ఆర్టీసీ రూరల్ బస్టాండ్‌ను ఆధునీకరించేలా నిధులు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఆర్టీసీ జిల్లా చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.సత్యనారాయణ తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండులో మంగళవారం ఆయన తనిఖీలు చేపట్టారు. బస్టాండు కంట్రోల్ పాయింట్ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి బస్సుల రాకపోకల వివరాలను తెలుసుకున్నారు. అలాగే బస్టాండు ఆవరణంలో ఖాళీగా ఉన్న దుకాణాలు, నిరుపయోగంగా ఉన్నవాటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాయుడుపేట రూరల్ బస్టాండుకు ప్రత్యేక నిధులు కేటాయించి ఆధునికీకరణ పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం, కంట్రోలర్లు టీఎస్ బాబు, ఎంసీ బాబులు ఉన్నారు. -
‘కేసీఆర్' కమిటీతో అభివృద్ధి
ప్రైవేట్, పాలకవర్గాల భాగస్వామ్యం - నిష్ణాతులైన 12 మందితో కమిటీ - వీధి వ్యాపారులకు ప్రత్యేక స్థలాలు - ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ సిటీ రెనోవేషన్ (కేసీఆర్) పేరున నగరాన్ని అభివృద్ధి చేసేందుకు పాలకులు, ప్రైవేటు భాగస్వామ్యంతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. నగరంలోని మీసేవ కార్యాలయంలో ఆదివారం మేయర్ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు, పాలకవర్గం సభ్యులతో కలిపి ‘కేసీఆర్' కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నగరంలో ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్‌తోపాటు డాక్టర్, న్యాయవాది, ప్రెస్, ఎన్జీవోల నుంచి ఒక్కొక్కరిని కమిటీ సభ్యులుగా తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రజలు, ప్రైవేటు సంస్థల నుంచి వచ్చే ప్రతి పైసాను కమిషనర్ పేరుపై ఖాతా తీస్తామన్నారు. నాలుగు విభాగాలుగా నగరం కరీంనగర్‌ను నాలుగు విభాగాలుగా విభజించి నగరాభివృద్ధికి పార్టీలక తీతంగా కమిటీ పనిచేస్తుందన్నారు. ప్రతి విభాగంలో ఐదుగురు మున్సిపల్ లేబర్లు, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటారని తెలిపారు. ప్లాంటేషన్‌కు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత శానిటేషన్‌పై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. వర్షాకాలంలో ఇంటింటికో చెత్తబుట్ట ఇవ్వనున్నట్లు చెప్పారు. చెత్త బయట వేస్తే రూ.30 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అవినీతి లేని అభివృద్ధి అవినీతికి తావులేకుండా అభివృద్ధి పనులు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరినీ చందాలు అడిగేది లేదని, ఎంతిచ్చినా తీసుకుంటామని పేర్కొన్నారు. రంజాన్ తర్వాత ఆక్రమణలు తొలగించి పార్కింగ్‌లకు ప్రత్యేక స్థలా లు కేటాయిస్తామన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేకంగా డీఎస్పీ, మరో సీఐ నగరానికి వస్తున్నట్లు తెలిపారు. 14న పాలకవర్గం ఢిల్లీ టూర్ ఈనెల 14న నగరపాలకవర్గంతో ఢిల్లీ టూర్‌కు వెళ్తున్నట్లు గంగుల తెలిపారు. 15న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును కలిసి నగరాభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరనున్నట్లు తెలిపారు. కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, నలువాల రవీందర్, కంసాల శ్రీనివాస్, ఆరిఫ్, ఏవీ రమణ, బండారి వేణు, బోనాల శ్రీకాంత్, కర్రె లింగయ్య, గంట కళ్యాణి, నాయకులు చల్ల హరిశంకర్, ఎడ్ల అశోక్, నేతికుంట యాదయ్య, సాదవేని శ్రీనివాస్, ఒంటెల సత్యనారాయణరెడ్డి, దిండిగాల మహేశ్, గూడూరి మురళి తదితరులు పాల్గొన్నారు. నగరాభివృద్ధికి రూ. లక్ష విరాళం కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగర అభివృద్ధిలో ప్రజలు, ప్రైవేటు సంస్థలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందని వస్తోంది. పుల్లెల ఆసుపత్రికి చెందిన వైద్యులు పుల్లెల పవన్‌కుమార్ ఆదివారం రూ. లక్ష చెక్కును విరాళంగా అందజేశారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా మేయర్‌కు ఇచ్చారు. కమిషనర్ పేరుమీద ఇచ్చిన చెక్కును అకౌంట్లో జమచేస్తామని మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.