సాక్షి, నల్లగొండ టౌన్ : జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరడానికి సమయం ఆసన్నమైంది. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు 550 పడకల సామర్థ్యం కలిగిన జిల్లా ప్రభుత్వ వైద్యశాఖలకు అనుబంధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేసిన విషయం విధితమే. అయితే కళాశాల భవన నిర్మాణానికి స్థల సేకరణ తదితర విషయాల్లో కొంత ఆలస్యమైనప్పటికీ భవన నిర్మాణానికి రెండు, మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉండడంతో అధికారులు.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పాత భవనంలో తరగతులను నిర్వహించాలని నిర్ణయించారు. పాత భవనాన్ని ఆధునికీకరించడానికి ప్రభుత్వం నుంచి రూ.7 కోట్ల 77లక్షలు విడుదలయ్యాయి.
ఈ నిధులను ప్రభుత్వం ఆస్పత్రుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వేగవంతంగా ఆధునికీకరణ పనులను పూర్తి చేసేందుకు ఆహర్నిషలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రిలోని గ్రౌండ్ ఫోర్‌లో బయో కెమిస్ట్రీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రం, మెటర్నిటీ వార్డులను ఫిజియాలజీ డిపార్డ్‌మెంట్‌గా ఆధునికీకరించారు. రెండో ఆంతస్తులో సెంట్రల్ లైబ్రరరీ, బాయ్స్ అండ్ గరŠల్స్ కామన్ రూంలుగా మార్చారు. మిగతా అటానమి, లెక్చరర్ గ్యాలరీ విభాగాలను ఆస్పత్రి ఆవరణ లోని ఖాళీ స్థలం లో నిర్మిస్తున్నారు. తాత్కాలి కంగా నూతన భవనం నిర్మాణం జరిగేంత వరకు ఎంబీబీఎస్ తరగతులను ఆధునికీకరించిన పాత భవనంలో నిర్వహించడానికి అవసరమైన అన్ని హంగులతో పనులు కొనసాగుతున్నాయి.
మార్చిలోగా పూర్తి..
మార్చి చివరి నాటికి అన్ని హంగులతో మెడికల్ కళాశాల ఆధునికీకరణ పనులను పూర్తి చేసి కళాశాల ప్రిన్సిపాల్‌కు అప్పగించడానికి ఇంజనీరింగ్ విభాగం కృషి చేస్తోంది. పనులలో ఎక్కడా రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. మార్చి చివరి నాటికి అన్ని పనులను పూర్తి చేసి ప్రిన్సిపాల్‌కు అందించనున్నామని ఈఈ అజీజ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు..
మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచే 150 సీట్లలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించనున్నా రు. ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు ఆయా విభా గా లకు చెందిన హెడ్‌ల ను, అన్ని విభాగా ల కు చెం దిన ప్రొఫెస ర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం నియమించింది.
జిల్లా ప్రజలకు అందనున్న స్ఫెషలైజేషన్ వైద్య సేవలు..
మెడికల్ కళాశాల ప్రారం భం అవుతుండడంతో జిల్లా ప్రజలకు అన్ని రకాల స్పెషలైజేషన్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఏ చిన్న అత్యవసరం వచ్చినా హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు రెఫర్‌చేసే వారు. ఇక నుంచి ఏ అత్యవసర వైద్య సేవలైనా మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జిల్లా ఆస్పత్రిలో అందనున్నాయి.
రూ. 275 కోట్లతో కళాశాల నూతన భవన నిర్మాణం
జిల్లా మెడికల్ కళాశాల నూతన భవనాన్ని రూ.275 కోట్లతో నిర్మించనున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఆవరణలో గల ఖాళీ స్థలంలో భవన నిర్మాణం కోసం అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే స్థల పరిశీల పూర్తి చేశారు. భవన నిర్మాణానికి అవసరమైన టెండర్ ప్రక్రియను ఆస్పత్రుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చేపట్టింది. ఈ సంవత్సరంలోనే నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment