నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: వచ్చే ఫిబ్రవరి రెండో వారంలో జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయిస్తానని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. నల్లగొండ పట్టణంలోని గాంధీనగర్‌లో రూ 18 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అం తకు ముందు స్థానిక గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ తనకు పదవులు ఆవసరం లేదని, ప్రజల సంక్షేమం, అభివృద్ధే ముఖ్యమని స్పష్టం చేశారు. తాను ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాతో పాటు నియోజకవర్గంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయించడమే తన లక్ష్యమన్నారు. ప్రజలకు సేవ చేయడానికే తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. గాంధీనగర్‌లోని నిరుపేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇప్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాదయాత్రతో, మోటర్‌బైక్‌పై ప్రయాణించి వార్డులో నెలకొన్న సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, నాయకులు చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, వంగూరు లక్ష్మయ్య, గుమ్ముల మోహన్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాతంగి సత్యనారాయణ, అబ్బగోని రమేష్, వేణు, శ్రీనివాస్, కాసరాజు వాసు, మార్త యాదగిరిరెడ్డి, మెరుగు గోపి, అంబర్ల సత్యనారాయణ పాల్గొన్నారు.
రాగ్యానాయక్ సేవలు మరువలేనివి
మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ చేసిన సేవలు మరవలేనివని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొనియాడారు. రాగ్యానాయక్ 13వ వర్ధంతి సందర్భంగా నల్లగొండలోని గడియారం సెంటర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగాా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల పెన్నిధిగా పేరుగాంచిన రాగ్యానాయక్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దేవరకొండలో ఏర్పాటు చేయనున్న రాగ్యానాయక్ విగ్రహానికి తనవంతుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
మెడికల్ కళాశాల నిర్మాణానికి ఫిబ్రవరిలో శంకుస్థాపన
Published Mon, Dec 30 2013 2:48 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement