
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సీఎం కేసీఆర్ సూచనలు, సలహాల మేరకు భక్తులకు ఆహ్లాదం కలిగించేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. రెండు నెలల క్రితం యాదాద్రీశుడిని సందర్శించిన సీఎం కేసీఆర్ మండపాల్లో తామరపువ్వు ఆకృతిలో ఉన్న దీపాలు బాగున్నాయని చెప్పడంతో ఆ మేరకు ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి ఆధ్వర్యంలో దీపాలను ఏర్పాటు చేశారు.
ఇటీవల ఆలయ లోపలి, బయటి ప్రాకారాల సీలింగ్‌కు 125 తామర పువ్వు దీపాలను బిగించి గురువారం రాత్రి ట్రయల్ రన్ చేశారు. అద్దాల మండపం ముందు వైపు వేసిన ఈ దీపాలు ఆకట్టుకుంటున్నాయి. దక్షిణ రాజగోపురం వైపు సైతం విద్యుత్ దీపాలను ట్రయల్ రన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment