
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్‌నిర్మాణంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసే క్యూలైన్ల డిజైన్‌ను సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు ఆర్కిటెక్టు ఆనందసాయి తెలిపారు. దీనికి సంబంధించిన నమూనాను ఆనందసాయి శుక్రవారం యాదాద్రిలో విడుదల చేశారు. లక్నో నుంచి ప్రత్యేకంగా క్యూలైన్లు తయారు చేసే కార్మికులను త్వరలోనే యాదాద్రికి రప్పించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించే ప్రసాదం కౌంటర్ నుంచి బ్రహ్మోత్సవ మండపం మీదుగా తూర్పు రాజగోపురం ముందు నుంచి బంగారు రంగులో మెరిసే క్యూలైన్లు నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment