Sri Laxmi Narasimha swamy temple
-
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
-
కనుల పండువగా లక్ష్మీ నరసింహుడి వివాహ మహోత్సవం (ఫొటోలు)
-
యాదాద్రి సమాచారం: ఆలయ వేళల్లో మార్పులు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి నిత్య కైంకర్యాల సమయాల్లో మార్పులు చేసినట్లు ఈవో గీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్పులను భక్తులు గమనించాలని సూచించారు. ►సర్వదర్శన వేళలు: ఉదయం 6 నుంచి 7.30 వరకు, తిరిగి 10 నుంచి 11.45 వరకు, మళ్లీ మధ్యాహ్నం 12.30 నుంచి 3 వరకు, సాయంత్రం 5 నుంచి 7 వరకు, రాత్రి 8.15 నుంచి 9 వరకు.. ►బ్రేక్ దర్శనాలు: ఉదయం 9 నుంచి 10 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు.. ►విశేష పూజలు: తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతసేవ. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాజభోగం (ఆరగింపు). మధ్యాహ్నం 3 – 4 గంటల మధ్య ఆలయం మూసివేత. రాత్రి 7 నుంచి 7.45 వరకు తిరువారాధన. రాత్రి 7.45 నుంచి 8.15 వరకు సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన. రాత్రి 9 నుంచి 9.30 వరకు రాత్రి నివేదన. 9.30–9.45 శయనోత్సవం, ద్వార బంధనం. ►ఆండాళ్ అమ్మవారి సేవ: ప్రధానాలయంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు. స్వర్ణ తాపడానికి రూ.18.71 కోట్ల విరాళాలు సాక్షి, యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడానికి భక్తుల నుంచి వచ్చిన విరాళాలను దేవస్థానం అధికారులు గురువారం ప్రకటించారు. బుధవారం సాయంత్రం వరకు భక్తుల నుంచి రూ.18,71,11,346 దేవస్థానం ఖాతాలో జమయ్యాయని తెలిపారు. దివ్య విమాన గోపురానికి 125 కిలోలతో స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు రూ.65 కోట్లు ఖర్చవుతాయని అంచనా. -
నేత్రదర్శనం.. యాదాద్రి దివ్యక్షేత్రం
యాదగిరి నరసింహుని దివ్యదర్శనం ఆరేళ్ల తర్వాత భక్తులకు లభించనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణం జరిపించింది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిభక్తునిగా రేపు పూజలు జరిపించిన తర్వాత భక్తులకు నరసింహుని దర్శనం లభించనుంది. యాదాద్రి దివ్యక్షేత్రం పునఃప్రారంభమవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక కథనం... యాదాద్రిలో వెలసిన పంచ నారసింహక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. జ్వాలా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, యోగ నారసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీనరసింహుడు స్వయంభువులుగా వెలసిన ఈ దివ్యక్షేత్రాన్ని దేశంలోని ఇతర దివ్యక్షేత్రాల్లోని మరే ఆలయానికీ తీసిపోని రీతిలో వివిధ శిల్పకళా శైలుల వైభవం ఒకేచోట భక్తులకు కనువిందు చేసేలా అత్యంత అపురూపంగా, అనన్యసామాన్యంగా నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ నిర్మాణంలో శ్రేష్ఠమైన కృష్ణశిలదే సింహభాగం. ఆలయ పునర్నిర్మాణం కోసం ఏకంగా 9.5 లక్షల ఘనపు మీటర్ల (2.5 లక్షల టన్నులు) కృష్ణశిలను వినియోగించారు. ఆధారశిల నుంచి శిఖరం వరకు పూర్తిగా కృష్ణశిలను వినియోగించారు. ఆధునికకాలంలో ఇలా పూర్తిగా కృష్ణశిలతో ఆలయ నిర్మాణం చేపట్టడం విశేషం. విమాన గోపురాన్ని ద్రవిడ శిల్పకళారీతిలోను, అష్టభుజి మండపంలోని గోపురాలను పల్లవ శైలిలోను రూపొందించారు. కాకతీయ వైభవాన్ని తలపిస్తూ ముఖమంటపాలను కాకతీయ శైలిలో నిర్మించారు. పదిమంది స్థపతులు, ఎనిమిదివందల మంది శిల్పులు ఆలయ మండపాలు, గోపురాలపై 541 దేవతారూపాలను, 58 యాలీ పిల్లర్లను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారు. ఆలయ నిర్మాణం, శిల్పాల రూపకల్పనలో రఘునాథ పాత్రో, ముత్తయ్య స్థపతి, సౌందరరాజన్, డాక్టర్ ఆనందాచారి వేలు వంటి నిష్ణాతులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన కృష్ణశిల ఏళ్లు గడిచేకొద్ది మరింత నునుపుదేలి, నాణ్యతను సంతరించుకుంటుంది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆలయ పునర్నిర్మాణం కోసం భారీస్థాయిలో కృష్ణశిల అవసరం కావడంతో రాష్ట్ర గనులశాఖ అధికారులు, ఇతర నిపుణులు దేశమంతటా పర్యటించి, నాణ్యమైన కృష్ణశిలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా గురుజపల్లిలో నాణ్యమైన కృష్ణశిల లభించడంతో, ఆలయ నిర్మాణానికి అవసరమైన మొత్తం శిలను ఆ గ్రామంలోని ఒకే క్వారీ నుంచి సేకరించారు. రాళ్ల నాణ్యతను ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్’ సంస్థ, వాటితో చెక్కిన శిల్పాల నాణ్యతను ‘మెస్సెర్స్ సివిల్స్ ఇంజినీర్స్’ సంస్థలు పరిశీలించి, ధ్రువీకరించాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇలాంటి పరీక్షలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. యాదాద్రి ఆలయాన్ని శ్రీవైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. శ్రీవైష్ణవ భక్తిసంప్రదాయాన్ని ప్రచారం చేసిన పన్నెండు మంది ఆళ్వార్ల విగ్రహాలను, రెండో అంతస్తులో కాకతీయ స్తంభాలు, అష్టభుజి మండపాలు, మాడవీథులు, పురవీథుల ప్రాకారాలు, త్రితల, పంచతల, సప్తతల, మహారాజ గోపురాలు, విమాన గోపురాలు– ఇలా ఆలయంలోని ప్రతి నిర్మాణంలోనూ అణువణువునా విష్ణుతత్త్వం ప్రతిఫలించేలా రూపొందించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం దేశంలోని అనేక శిల్పకళారీతులను స్వయంగా అధ్యయనం చేశారు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, ఇతర అధికారులు దేశవ్యాప్తంగా సంచరించి, వివిధ ఆలయ శిల్పరీతులను పరిశీలించి వచ్చారు. చెన్నై, మహాబలిపురం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల నుంచి దాదాపు రెండువేల మంది శిల్పులు యాదాద్రి పునర్నిర్మాణంలో అహరహం శ్రమించారు. గుట్టకు మరో గుట్ట జోడింపు ఇదివరకు యాదాద్రి చుట్టూ కలిపి 14 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు దీనికి ఇంకో గుట్టను జోడించి, మరో మూడెకరాలను కలిపారు. ఉపరితలం నుంచి ఎనభై అడుగుల ఎత్తువరకు ఉన్న కొండను కాంక్రీటుతో నింపకుండా, సహజసిద్ధంగా ఉండేలా మట్టితో ఎనభై అడుగుల ఎత్తు వరకు నింపి, మూడెకరాలను విస్తరించారు. మహాయజ్ఞంలా సాగిన ఈ ప్రక్రియకు ఏడాదిన్నర పట్టింది. కొండ కోసం తరలించిన మట్టి, రాళ్లు కూలిపోకుండా పటిష్ఠంగా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. కొత్తగా విస్తరించిన కొండభాగం పటిష్ఠతను, నాణ్యతను జేఎన్టీయూ, ‘నిట్’ నిపుణులు పరీక్షించారు. చలికాలంలో, ఎండాకాలంలోనే కాకుండా భారీగా వర్షాలు కురిసినప్పుడు కొత్తగా జోడించిన కొండ ఎలా ఉంటుందనే దానిపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. రెండు సీజన్లలో భారీ వర్షాలు పడినప్పటికీ, కొత్తగా జోడించిన కొండ ఏమాత్రం చెక్కుచెదరలేదు. భారీ వాహనాలు, క్రేన్లు వంటి వాటితో కూడా పరీక్షలు జరిపినా ఎలాంటి సమస్యలూ తలెత్తకపోవడంతో, కొన్ని వందల ఏళ్ల వరకు కొండ మనుగడకు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు తేల్చారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి సీఎం కేసీఆర్ దాదాపు 2,400 డ్రాయింగ్లను పరిశీలించి, ప్రస్తుత రూపాన్ని ఆమోదించారు. మొత్తం ఆలయ నిర్మాణమంతా యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) ఆధ్వర్యంలో జరిగింది. వైటీడీఏ చైర్మన్‌గా సీఎం వ్యవహరిస్తుండగా, విశ్రాంత ఐఏఎస్ అధికారి కిషన్‌రావు వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని రూ.1800 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టగా, వ్యయం రూ.1200 కోట్లకు పరిమితమైంది. ఇందులో భూసేకరణ కోసమే ప్రధాన వ్యయం జరిగింది. దాదాపు రెండువేల ఎకరాల భూమిని సేకరించారు. ప్రధాన ఆలయ పునర్నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చు చేశారు. రోడ్లు, కాటేజీల నిర్మాణం, ల్యాండ్‌స్కేపింగ్ వంటి వాటికి భారీగా ఖర్చు చేశారు. రోజుకు నలభైవేల మంది భక్తులు వచ్చినా, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 15 వీవీఐపీ కాటేజీలను నిర్మించారు. దాతల సహకారంతో 252 వీఐపీ కాటేజీలను నిర్మించనున్నారు. గానుగ సున్నంతోనే నిర్మాణం ఆధునిక నిర్మాణాల్లో రాళ్లు, ఇటుకలను జోడించి, వాటిని దృఢంగా నిలపడానికి సిమెంటు వాడటం మామూలే! అయితే, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఎక్కడా సిమెంటు వాడలేదు. పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమంతో తయారు చేసిన గానుగ సున్నాన్నే ఉపయోగించారు. ఈ గానుగ సున్నం మిశ్రమం నాణ్యతను బెంగళూరులోని ‘బ్యూరో వెర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ పరీక్షించి, ధ్రువీకరించింది. పెద్దపెద్ద జాయింట్ల వద్ద కొన్నిచోట్ల సీసాన్ని కూడా వాడారు. ఆలయంలోని తలుపులకు వాడిన కలపకు సైతం క్షుణ్ణంగా నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే వాటిని అమర్చారు. బెంగళూరుకు చెందిన ‘ఇండియన్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’ (ఐపీఐఆర్టీఐ) సంస్థ ఆధ్వర్యంలో కలప నాణ్యతపై పరీక్షలు నిర్వహించారు. కలప రకం, మందం, దారుఢ్యం, తేమను తట్టుకునే శక్తి వంటి లక్షణాలన్నింటినీ పరీక్షించి, ఉత్తమమైన కలపనే తలుపుల నిర్మాణం కోసం ఎంపిక చేశారు. యాదాద్రికి ఆనుకుని టెంపుల్ సిటీ ఇప్పుడున్న యాదాద్రికి తోడుగా మరో 850 ఎకరాలలో టెంపుల్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల వసతి సౌకర్యాల కోసం దాదాపు వెయ్యికి పైగా వసతి గృహాలను అక్కడ నిర్మించనున్నారు. తొలిదశలో 252 వీఐపీ కాటేజీలను ఒక్కొక్కటి రూ.1.50 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు. వీటి దాతలు ఏడాదిలో ముప్పయి రోజులు ఈ వసతిగృహాల్లో ఉండవచ్చు. వీటికి తోడు 13.5 ఎకరాల్లో ప్రత్యేకంగా వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియల్ సూట్ల పేరిట 15 కాటేజీలను నిర్మించారు. వీటి నిర్మాణానికి ఒక్కోదానికి ఏడు కోట్లు ఖర్చు చేశారు. ఇక గుట్ట కింద తులసి కాటేజీలో అదనంగా 120 గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవి కాకుండా, ఇంకా ఫైవ్‌స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పెండ్లి మండపాలు, ఆస్పత్రి, పాఠశాల వంటి వాటిని కూడా నిర్మించనున్నారు. వీటి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొండపైన విష్ణుపుష్కరిణి, కొండ దిగువన లక్ష్మీ పుష్కరిణి, స్వామివారి తెప్పోత్సవం కోసం గండిచెరువు, కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం, నిత్యాన్నదాన సత్రం, సత్యనారాయణస్వామి వ్రతమండపం, ఆర్టీసీ, దేవస్థానం బస్టాండులు, గుట్ట చుట్టూ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. భక్తుల రాకపోకలకు వీలుగా ఐదువందల బస్సులు తిరిగేందుకు అనువుగా బస్ టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. యాదాద్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ అనుసంధానిస్తూ ఆరులేన్ల రహదారిని నిర్మించారు. ఈ రహదారికి ఇరువైపులా అందమైన పూల మొక్కలను పెంచడంతో, ఈ మార్గం పూలవనాన్ని తలపిస్తుంది. ఈ మార్గంలో నాలుగుచోట్ల ఏర్పాటు చేసిన కూడళ్లలోనూ పూలమొక్కలను ఏర్పాటు చేశారు. గిరిప్రదక్షిణ చేయదలచుకున్న భక్తుల కోసం పన్నెండు అడుగుల వెడల్పుతో ప్రత్యేకమైన రోడ్డును నిర్మిస్తున్నారు. దాదాపు ఇరవైవేల మంది భక్తులు సులువుగా నడిచేందుకు వీలుగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తయారుచేసిన అల్యూమినియం, ఇత్తడి క్యూలైన్లను ఏర్పాటు చేశారు. సప్తగోపురాలు యాదాద్రి ప్రధాన ఆలయానికి సప్తగోపురాలను సర్వాంగ సుందరంగా మలచారు. ద్వితీయ ప్రాకారంలో నాలుగు దిక్కులా నాలుగు గోపురాలను, మూడు పంచతల గోపురాలను, ఒక సప్తతల మహారాజ గోపురాన్ని నిర్మించారు. పశ్చిమదిశలో మహారాజ గోపురాన్ని 85 అడుగుల ఎత్తున, ఒక్కో పంచతల గోపురాన్నీ 57 అడుగుల ఎత్తున, తూర్పు గోపురం నుంచి ముఖమండపానికి వెళ్లే దారిలో 30.8 అడుగుల ఎత్తున త్రితల గోపురాన్ని, గర్భాలయంపైన విమాన గోపురాన్ని నిర్మించారు. విమానగోపురానికి భక్తుల విరాళాలతో 125 కిలోల బంగారు తాపడం చేయిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసే నాటికి భక్తుల నుంచి రూ.17.59 కోట్ల నగదు, ఐదు కిలోల బంగారం వచ్చింది. దర్శన మార్గం గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు పశ్చిమ గోపురం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. సరిగ్గా గర్భాలయంపైన విమాన గోపురం ఉంటుంది. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే మొదటగా క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి, గండభేరుండ నారసింహుడు దర్శనమిస్తారు. గర్భాలయానికి ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం, గరుత్మంతుని విగ్రహం, స్వామివారి ఎదుట భారీ దర్పణం, గర్భగుడికి పక్కన ఆండాళ్ అమ్మవారు, శయన మండపం, మెట్ల వెంబడి గరుత్మంతుని విగ్రహాలు, ఆలయంలో వెలుగులు విరజిమ్మే షాండ్లియర్లు, రాజస్థానీ పద్మాలు భక్తులకు కనువిందు చేస్తాయి. స్వామివారి ప్రధాన ఆలయం రెండో అంతర ప్రాకారాల వద్ద నాలుగు వైపులా నాలుగు మండపాలను నిర్మించారు. ఆగ్నేయంలో స్వామివారి కైంకర్యాల కోసం ఏర్పాటు చేసిన రామానుజకూటం మండపం ఉంటుంది. ఈశాన్యంలో నిత్యకల్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. రెండో బాహ్య ప్రాకారం వద్ద నాలుగు దిక్కుల్లో అష్టభుజి మండపాలను నిర్మించారు. స్వామివారి గర్భగుడి ఎదురుగా ఉండే ముఖమండపాన్ని 150 మందికిపైగా కూర్చునేందుకు అనువైన వేదికగా ఏర్పాటు చేశారు. ప్రధానాలయంలోకి అడుగుపెడుతూనే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యేలా లోపలి వాతావరణాన్ని తీర్చిదిద్దారు. గర్భగుడి గోడలపై స్వామివారి శంఖుచక్రనామాలు, పంచనారసింహ రూపాలు, ప్రహ్లాద చరిత్ర శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జయవిజయుల విగ్రహాలు భక్తులకు స్వాగతం పలుకుతాయి. మూడు ఉపాలయాలు, శయన మండపం, బలిపీఠం, బంగారు తాపడంతో ధ్వజస్తంభం, దర్పణం భక్తులకు కనువిందు చేస్తాయి. చరిత్రలో యాదాద్రి చరిత్రను తరచి చూసుకుంటే, కాకతీయ రాజుల నుంచి నిజాం నవాబుల వరకు ఎందరో యాదగిరిగుట్ట ఆలయాన్ని దర్శించుకుని, ఆలయ అభివృద్ధికి బాటలు వేశారు. కాకతీయులు పదమూడో శతాబ్దిలో ఒక ఆయుర్వేద వైద్యునికి ఈ స్థలాన్ని దానంగా ఇచ్చినట్లు ప్రచారంలో ఉన్నా, అందుకు తగిన ఆధారాలు లేవు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం వద్ద లభించిన శాసనాల్లో కాకతీయులు ఈ ఆలయ అభివృద్ధి కోసం చేసిన పనులు వెలుగులోకి వచ్చాయి. పదిహేనో శతాబ్దిలో శ్రీకృష్ణదేవరాయలు యాదాద్రిలో స్వామివారిని దర్శించుకున్నట్లు కొలనుపాకలో దొరికిన శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో దొరికిన ఆరువందల సంవత్సరాల నాటి శాసనాలను ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు భద్రపరచారు. ఆకట్టుకునేలా ఆళ్వార్ల మండపం శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లకు ప్రత్యేక స్థానం ఉంది. వైష్ణవ భక్తిమార్గ ప్రచారకులుగా, స్వామివారి ప్రియభక్తులుగా ప్రఖ్యాతి పొందిన పన్నెండుమంది ఆళ్వార్లను వైష్ణవభక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించుకుంటారు. అందుకే యాదాద్రి ప్రధాన ఆలయంలో ఆళ్వార్ల మండపాన్ని ఆకట్టుకునే రీతిలో ఏర్పాటు చేశారు. ఆళ్వార్ల మండపానికిపైన కాకతీయుల స్తంభాలను నిర్మించారు. ఒక్కో ఆళ్వార్ విగ్రహం, ఒక్కో కాకతీయ స్తంభం ఎత్తు 32 అడుగులు ఉంటాయి. పొయ్‌గయాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, పెరియాళ్వార్, తిరుమళిశైయాళ్వార్, కులశేఖరాళ్వార్, తిరుప్పొణాళ్వార్, తొండరడిప్పొడియాళ్వార్, తిరుమంగయాళ్వార్, మధురకవి ఆళ్వార్, ఆండాళ్, నమ్మాళ్వార్ విగ్రహాలను, తెలంగాణ శిల్పులు వెంకటకృష్ణ, పోతలూరు చారి, రాము తమ బృందంతో కలసి అద్భుతంగా తీర్చిదిద్దారు. పడమటి రాజగోపురం ముందుభాగంలో వేంచేపు మండపాన్ని నిర్మించారు. ప్రత్యేక ఉత్సవాల్లో ఊరేగింపు చేసేటప్పుడు స్వామివారిని భక్తుల సందర్శనార్థం ఇక్కడ కొద్దిసేపు అధిష్ఠింపజేస్తారు. తూర్పు రాజగోపురం ముందుభాగంలో బ్రహ్మోత్సవ మండపాన్ని నిర్మించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. ఉత్సవమూర్తులను బ్రహ్మోత్సవ మండపంలో అధిష్ఠింపజేసి, ఉత్సవ పర్వాలను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు మాత్రమే కాకుండా సహస్ర దీపాలంకరణ కోసం కూడా ఈ మండపాన్ని వినియోగించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అరుదుగా అతికొద్ది ఆలయాల్లో మాత్రమే కనిపించే అష్టభుజి ప్రాకార మండపాన్ని యాదాద్రిలోనూ నిర్మించారు. అష్టభుజి ప్రాకార మండపం పైభాగంలో సాలహారాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కేశవమూర్తులు, నవ నారసింహులు, ఆళ్వార్లు, అష్టదిక్పాలకులు, అష్టలక్షు్మలు, దశావతారాల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అష్టభుజి మండప శిఖరాలపై రాగి కలశాలను బిగించారు. వైకుంఠద్వారం యాదాద్రి ఆలయానికి మెట్లమార్గం మొదలయ్యే ప్రాంతంలో ఉంటుంది ఈ వైకుంఠద్వారం. పూర్వం వాహన సౌకర్యం లేని కాలంలో ఆనాటి భక్తులు కొందరు కొండపైకి వెళ్లేందుకు వీలుగా రాళ్లతో మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి వెళ్లి, మొక్కులు తీర్చుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. చాలాకాలం వరకు ఇక్కడ మెట్లు ఉన్నాయనే విషయమే జనాలకు తెలిసేది కాదు. రామదయాళ్ సీతారామయ్య శాస్త్రి, నరసింహారెడ్డి, కొండల్‌రెడ్డి, గాదె కిష్టయ్య తదితర భక్తులు 1947లో ఆస్థాన కమిటీగా ఏర్పడి, భక్తుల కోసం ఈ వైకుంఠద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైకుంఠద్వారం నుంచి కొండపైకి వెళ్లేందుకు 350 మెట్లు ఉండేవి. వీటికి ప్రతిరోజూ పసుపు కుంకుమలు పెట్టి భక్తులు పూజించేవారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా వైటీడీఏ, ఆర్ అండ్ బీ అధికారులు 2019 నవంబరు 15న ఈ వైకుంఠద్వారాన్ని కూల్చివేసి, యాలీ పిల్లర్లపై భారీ వైకుంఠద్వారాన్ని కొత్తగా నిర్మించారు. ప్రస్తుతం ఈ వైకుంఠద్వారం నుంచే భక్తులు మెట్లమార్గంలో స్వామివారి దర్శనానికి వెళుతున్నారు. ఇదివరకు స్వామివారి పాదాల వద్ద ఉన్న మెట్లదారిని తొలగించిన అధికారులు, కొత్తగా నిర్మించిన వైకుంఠద్వారం నుంచే మెట్లదారిని ఏర్పాటు చేశారు. ప్రసాదం తయారీకి ఆధునిక యంత్రాలు ప్రసాదం తయారీ కోసం యాదాద్రి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. పెద్దసంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా ప్రసాదం తయారీ కోసం ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు లక్ష లడ్డూలను, రెండువేల కిలోల పులిహోర తయారు చేసేందుకు వీలుగా యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ‘అక్షయపాత్ర’ సంస్థవారు ప్రసాదం తయారు చేస్తున్నారు. రానున్న రోజుల్లో దేవస్థానంవారే ప్రసాదం తయారు చేసేలా ‘అక్షయపాత్ర’ సంస్థవారు శిక్షణ ఇస్తున్నారు. బంగారు ధగధగలు యాదాద్రి ఆలయాన్ని స్వర్ణకాంతులతో ధగధగలాడేలా తీర్చిదిద్దారు. పంచనారసింహులు కొలువై ఉన్న గర్భాలయ ద్వారాలకు బంగారుతాపడం చేసిన కవచాలను బిగించారు. ఆళ్వార్ మండపంలో 35 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి సైతం ఇటీవల బంగారు తొడుగులు వేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాల ద్వారాలకు వెండితొడుగులను బిగించనున్నారు. ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లోని ద్వారాలకు ఇత్తడి తొడుగులు వేశారు. త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలకు బంగారు కలశాలను బిగించారు. అష్టభుజి ప్రాకార మండప శిఖరాలపై రాగి కలశాలను బిగించారు. ఆలయంలో అమర్చిన బంగారు తొడుగుల పనులన్నీ చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థలో చేయించారు. ఉగాది తర్వాత శివాలయం ఉద్ఘాటన యాదాద్రిని హరిహర క్షేత్రంగా చెబుతారు. కొండపైనే అనుబంధ ఆలయంగా కొలువై ఉన్న పర్వతవర్ధని రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శివాలయంలో ప్రధాన ఆలయం, ముఖ మండపం, ప్రాకార మండపం, త్రితల రాజగోపురం నిర్మించారు. ప్రధాన ఆలయంలోని మండపాల్లో నాలుగువైపులా కృష్ణశిలతో స్టోన్ ఫ్లోరింగ్ పనులు చేశారు. ప్రధాన ఆలయం ముందు భారీ నందీశ్వరుని విగ్రహాన్ని కొలువుతీర్చారు. ఆలయానికి ఉత్తరాన స్వామివారి కల్యాణ మండపం, ఆ పక్కనే రథశాల నిర్మించారు. ఉగాది తర్వాత జరగనున్న ఆలయ ఉద్ఘాటన నాటికి ఆలయంలో స్ఫటిక లింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆలయ మండపాల్లోని ప్రాకారాల్లోని సాలహారాల్లో అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, శివుని అవతారాలు, భైరవులు, పార్వతి అమ్మవారి విగ్రహాలను నెలకొల్పారు. ముఖమండపంలో దక్షిణామూర్తి, బ్రహ్మ, భైరవులతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలను అమర్చారు. ఈ శివాలయ ప్రాంగణంలో అన్నివైపులా భక్తులను ఆకట్టుకునే రీతిలో ఉపాలయాలను నిర్మించారు. నైరుతిలో ఏకతల విమానగోపురంతో గణపతి, వాయువ్యంలో ఏకతల విమాన గోపురంతో పర్వతవర్ధని అమ్మవారు, ఈశాన్యంలో ఆంజనేయస్వామి ఆలయాలు, నవగ్రహ మండపం, ఆగ్నేయంలో యాగశాలలను నిర్మించారు. శివాలయానికి ఎదురుగా సుమారు 26 అడుగుల ఎత్తున ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం భూపాలపల్లి అడవుల నుంచి ఎల్తైన నారవేప చెట్టు నుంచి సేకరించిన కలపదుంగను తీసుకువచ్చారు. యంబ నర్సింహులు, కల్లెం సంపత్‌కుమార్ ఫొటోలు: కొల్లోజు శివకుమార్ యాదాద్రి పరిసర క్షేత్రాలు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందనుంది. పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ఈ ప్రాంతంలోని పురాతన చారిత్రక కట్టడాలు, ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. భువనగిరి మండలం వడాయిగూడెంలోని సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సకల దేవతల ఆలయాలకు నెలవుగా ఇప్పటికే పర్యాటకులను ఆకట్టుకుంటోంది. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు స్వామివారి దర్శనం తర్వాత సురేంద్రపురికే వెళుతుంటారు. యాదగిరిగుట్ట నుంచి సురేంద్రపురికి బస్సు, ఆటో సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి జట్కాబళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. యాదగిరిగుట్ట నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని బస్వాపూర్ గ్రామంలో కాళేశ్వరం జలాలతో సింహసాగర్ రిజర్వాయర్‌ను నిర్మించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇక్కడ బెంగళూరులోని బృందావన్ గార్డెన్ తరహా ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యాదగిరిగుట్టకు 12 కిలోమీటర్ల దూరంలోని భువనగిరి కోటను కూడా తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా కోట పైకి రోప్‌వే ఏర్పాటు చేయనున్నారు. యాదాద్రి క్షేత్రానికి అతి సమీపంలోని వడాయిగూడెం, రాయగిరి రైల్వేస్టేషన్ సమీపంలోని గుట్టలను భక్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. రాయగిరి వద్ద ఆంజనేయ అభయారణ్యం, వడాయిగూడెం సమీపంలో నృసింహ అభయారణ్యం ఏర్పాటు చేశారు. భక్తులకు ఆహ్లాదభరితమైన వాతావరణం కల్పించేందుకు ఇక్కడ వివిధ రూపాల్లో గొడుగులు, వంతెనలు ఏర్పాటు చేశారు. రాయగిరి చెరువుకట్టపై రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో మినీ శిల్పారామాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాయగిరి కమాన్ నుంచి కట్టమైసమ్మ ఆలయం వరకు పూలమొక్కలను ఏర్పాటు చేశారు. అలాగే, ఇక్కడ ఒకటిన్నర ఎకరాల స్థలంలో బోటింగ్ జరిపేందుకు వీలుగా పనులు చేస్తున్నారు. పర్యాటకుల కోసం ఇక్కడ రెండు ఫుడ్‌కోర్ట్స్, ఆరు స్టాల్స్, ఒక చేనేత వస్త్రశాల ఏర్పాటు చేసేందుకు పనులు సాగిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ఒడిశా నుంచి తెప్పించిన భారీ ఇసుకరాతి శిల్పాలను ఇక్కడకు తీసుకొచ్చారు. యాదాద్రికి 20 కిలోమీటర్ల దూరంలోని కొలనుపాక గ్రామంలో సోమేశ్వర ఆలయం, మహాలక్ష్మీ వీరనారాయణస్వామి ఆలయాల పునరుద్ధరణ కోసం వైటీడీఏ ఇటీవల రూ.1.79 కోట్లు కేటాయించింది. ఇక్కడ ఒక జైన ఆలయం, పద్దెనిమిది మఠాలు కూడా ఉన్నాయి. యాదాద్రికి 22 కిలోమీటర్ల దూరంలోని రాజపేట సంస్థానం కోట, మల్లాపురం, సైదాపురం, మైలార్గూడెంలలో మినీ ట్యాంక్‌బండ్‌లను అభివృద్ధి చేయనున్నారు. రేపు ఉ. 11.55 గంటలకు దర్శనం యాదాద్రి ఆలయంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి స్వయంభూ మూర్తుల దర్శనం మార్చి 28వ తేదీ ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణతో మొదలవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆలయ పునఃప్రారంభం కోసం మార్చి 21 నుంచి 28 వరకు ప్రతిరోజూ ఉదయం, రాత్రి హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమల తరహాలోనే ప్రధానాలయంలో భక్తుల దర్శనాలకు వీలుగా ఏర్పాట్లు చేశారు. భక్తుల వసతుల కోసం ఇప్పటికే తొలిదశ పనులు పూర్తయ్యాయి. భక్తుల కోసం మిషన్ భగీరథతో పాటు యాదాద్రి జలప్రసాదాన్ని తీసుకు వస్తున్నారు. గండిచెరువు వద్దనున్న దీక్షాపరుల మండపంలో తాత్కాలికంగా భక్తులకు అన్నప్రసాదం కోసం ఏర్పాట్లు చేశారు. బాలాలయంలో మార్చి 28వ తేదీ నుంచి దర్శనాలను నిలిపివేసి, బాలాలయాన్ని తొలగించనున్నారు. ప్రస్తుతం బాలాలయం ఉన్న ప్రదేశంలో సంగీత మండపాన్ని ఏర్పాటు చేయనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
యాదాద్రీశుడికి పట్టువస్త్రాలు
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణానికి సీఎం కేసీఆర్ సతీసమేతంగా శుక్రవారం హాజరుకానున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు బాలాలయంలో నిర్వహించే తిరు కల్యాణోత్సవానికి స్వామివారికి ప్రభుత్వం తరఫున కేసీఆర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్లో యాదాద్రికి చేరుకోనున్నారు. 2016లో బాలాలయంలో జరిగిన తిరు కల్యాణోత్సవానికి సీఎం దంపతులు తొలిసారి హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. 28 నుంచి స్వయంభూల దర్శనం ప్రధానాలయం ఉద్ఘాటన ఉత్సవాలు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. 28న ప్రధానాలయం ప్రారంభించి భక్తులకు స్వయంభూల దర్శనం కల్పించనున్నారు. ప్రధానాలయం పనులు దాదాపు పూర్తయ్యాయి. దివ్యవిమానం బంగారు తాపడం పనులు ప్రారంభించాల్సి ఉంది. ఉద్ఘాటన ఉత్సవాలతోపాటు ఇంకా జరగాల్సిన పనులపై సీఎం అధికారులతో సమీక్షించనున్నారు. 21 నుంచి మహాకుంభసంప్రోక్షణ కార్యక్రమ నిర్వహణపై అధికారులతో చర్చించనున్నారు. అలాగే కొండపై ఆర్చీ, బస్బే, కమాండ్ కంట్రోల్ రూమ్, బాలాలయం చుట్టుపక్కలా చదును చేయడం, సుందరీకరణ పనులు, ఘాట్ రోడ్డు వెడల్పు పనులు పర్యవేక్షించనున్నారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కూడా రానున్నారు. కాగా, కొండ కింద భక్తులకు వసతులు కల్పించే పనులను వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే సీఎంవో కార్య దర్శి భూపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచతల రాజగోపురానికి పసిడి కలశాలు యాదాద్రి ప్రధానాలయ రాజగోపురాలు పసిడి కలశాలతో ధగధగలాడనున్నాయి. ప్రధానాలయ ఉద్ఘాటన సమయానికి సప్త, పంచ, త్రితల రాజగోపురాలకు పసిడి కలశాలను బిగించే ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం పంచతల రాజగోపురంపై తొమ్మిది బంగారు కలశాలను ప్రత్యేక శిల్పులు బిగించారు. ఇప్పటికే ఆలయ అష్టభుజి శిఖర మండపాలపై రాగి కలశాలను బిగించారు. పంచతల రాజగోపురానికి బిగించిన పసిడి కలశాలు సిద్ధమవుతున్న స్వర్ణ రథం బాలాలయంలో స్వర్ణ రథం సిద్ధమవుతోంది. దాతల సహకారంతో చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్‌లో బంగారు తాపడం పూర్తి చేయించి, విడి భాగాలను ఇటీవల క్షేత్రానికి తెచ్చారు. వీటికి అధికారులు, ఆచార్యులు పూజలు నిర్వహించారు. రాత్రి నుంచి రథానికి బంగారు కవచాలు తొడిగే పనులను ప్రారంభించారు. -
యాదాద్రి ప్రసాదానికి యంత్రాంగం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని సందర్శిం చే భక్తులందరికీ దేశంలోనే తొలిసారిగా ఆధునిక యంత్రాలతో మానవప్రమేయం లేకుండా తయారు చేసే లడ్డూ, పులిహోర ప్రసాదం అందనుంది. మార్చి 28న లక్ష్మీనరసింహసింహ స్వామి దర్శనమివ్వనున్న నేపథ్యంలో ప్రసాదం తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాల బిగింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రోజుకు 70వేలకు పైగా లడ్డూలు, రోజుకు నాలుగుసార్లు ఒకేసారి 1,000 కిలోల పులిహోర తయారు చేసేలా రూ.13.08 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక యంత్రాలను బిగించారు.పులిహోరను ప్యాకింగ్ చేసేందుకు సుమారు రూ.5కోట్ల వ్యయంతో ఆధునిక యంత్రాలను తీసుకువచ్చారు. ప్రత్యేక మెషీన్లు..: ప్రసాదం కాంప్లెక్స్‌లో మూడు అంతస్తుల్లో మిషన్ల ద్వారానే ప్రసాదం తయారు చేసి లిఫ్టులు, మెషీన్ ద్వారానే కౌంటర్ల దగ్గరకు తీసుకొచ్చే విధంగా పనులు పూర్తిచేస్తున్నారు. ప్రసాదం తీసుకువచ్చే ట్రేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా భారీ మెషీన్‌ను బిగించారు. అక్కడి నుంచి ప్రసాదాన్ని ట్రేలలో వేసుకుని కౌంటర్ల వద్దకు తీసుకెళ్లేందుకు ఎస్కలేటర్ మాదిరిగా 12 మోటర్లతో బెల్ట్‌ను బిగించారు. ట్రేలలో ప్రసాదం అయిపోయిన వెంటనే తిరిగి ట్రేలను శుభ్రం చేసే మెషీన్ వద్దకు తీసుకువెళ్లేందుకు బెల్ట్‌ను బిగించారు. భక్తులకు ప్రసాదం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తకుండా 13 కౌంటర్లను ఏర్పాట్లు చేశారు. యాదాద్రీశుడి ప్రసాదాన్ని అధికారులు హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులకు అప్పగించగా..గతేడాది సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ప్రసాదం నాణ్యత,రుచిని పరిశీలించారు. మంగళవారం మూడోసారి ట్రయల్ రన్ చేశారు. ప్రస్తుతం దేవస్థానానికి చెందిన ఉద్యోగులకు ప్రసాదం తయారీలో శిక్షణనిస్తున్నారు. -
విద్యుత్ కాంతుల్లో మండపాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సీఎం కేసీఆర్ సూచనలు, సలహాల మేరకు భక్తులకు ఆహ్లాదం కలిగించేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. రెండు నెలల క్రితం యాదాద్రీశుడిని సందర్శించిన సీఎం కేసీఆర్ మండపాల్లో తామరపువ్వు ఆకృతిలో ఉన్న దీపాలు బాగున్నాయని చెప్పడంతో ఆ మేరకు ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి ఆధ్వర్యంలో దీపాలను ఏర్పాటు చేశారు. ఇటీవల ఆలయ లోపలి, బయటి ప్రాకారాల సీలింగ్‌కు 125 తామర పువ్వు దీపాలను బిగించి గురువారం రాత్రి ట్రయల్ రన్ చేశారు. అద్దాల మండపం ముందు వైపు వేసిన ఈ దీపాలు ఆకట్టుకుంటున్నాయి. దక్షిణ రాజగోపురం వైపు సైతం విద్యుత్ దీపాలను ట్రయల్ రన్ చేశారు. -
ప్రారంభోత్సవానికి సిద్ధం!
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే ఉద్ఘాటనకు రావాలని సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోదీని కలిసి కోరిన నేపథ్యంలో పనుల్లో వేగం పెరిగింది. సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈనెల 20 తేదీ వరకు తుది దశ పనుల పర్యవేక్షణకు యాదాద్రికి మరోసారి రానున్నారు. మహా సుదర్శనయాగం నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలను సీఎం పర్యవేక్షించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ముందు శాస్త్రోక్త కార్యక్రమాలకు సుమారు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. నూతన ఆలయంలో స్వయంభూ శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి దర్శనం భక్తులకు కల్పించే ముందు శాస్త్రోక్తంగా ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల దిశానిర్దేశం కోసం దేవస్థానం ఈవో గీతారెడ్డి, ఉప ప్రధానాచార్యులు త్రిదండి చినజీయర్‌స్వామిని కలిశారు. ఆయన పనుల ఒత్తిడిలో ఉండటంతో రెండు రోజుల తర్వాత మరోసారి రావాలని కోరారు. దీంతో మరోసారి జీయర్ స్వామిని కలిసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. -
సింహాచలం భూముల గోల్మాల్.. పన్నాగం ‘పెద్ద’లదే!
సాక్షి, అమరావతి: విశాఖపట్నం నగరం చుట్టుపక్కల పది వేల కోట్లకుపైగా విలువ చేసే 748 ఎకరాల సింహాచలం ఆలయ భూములను 2016లో దేవదాయ శాఖ ఆస్తుల జాబితా నుంచి తొలగించడం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ ఆదివారం సంచికలో ‘అప్పన్నకే శఠ గోపం’ శీర్షికతో సంచలనాత్మక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో.. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మరికొన్ని పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భూబాగోతానికి సంబంధించి నాటి ప్రభుత్వ ‘ముఖ్య’నేత కనుసన్నల్లో భారీ కుంభకోణానికి రెండేళ్లకు పైగా పకడ్బందీ స్కెచ్ నడిచినట్లు దేవదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా సింహాచలం ఆలయ భూములను కబ్జా చేసినట్లు తెలిసింది. అలాగే, 2016 డిసెంబరు 14న సింహాచల ఆలయ ఆస్తుల పట్టిక నుంచి 748 ఎకరాలను తొలగించిన జాబితాలో.. టీడీపీ నేతలు చేసిన కబ్జా భూములు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవుడి భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచే నాటి ప్రభుత్వమే తనంతట తానుగా తొలగించడంతో టీడీపీ నేతలు ముందస్తు వ్యూహంతోనే దురాక్రమించుకున్నారని.. ఆ తర్వాత ఆ భూములన్నింటికీ వారే నిజమైన యజమానులుగా చలామణీలోకి వచ్చారన్నది ఒక బలమైన వాదన. నిషేధ జాబితాకు ఎక్కకుండా జాగ్రత్తలు 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రమంతటా వ్యవసాయ భూములను అన్లైన్లో నమోదు చేసేందుకు ‘మీ ఇంటికి మీ భూమి’ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో దేవదాయ శాఖ కూడా రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్న భూములన్నింటినీ అన్లైన్లో నమోదుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించి ఆ మండల పరిధిలో దేవుడి భూములను అన్లైన్లో నమోదు చేయించే బాధ్యతను ఆయనకు అప్పగించింది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల వారీగా భూముల వివరాలను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు కూడా పంపి ఆయా భూములకు భవిష్యత్‌లో కొత్తగా రిజిస్ట్రేషన్ల జరగకుండా దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయాల భూములన్నింటినీ ప్రత్యేకంగా 22 (ఏ) (1) (సీ) అన్లైన్లో నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ సమయంలోనూ అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో టీడీపీ నేతలు ఆ 748 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ శాఖ 22(ఏ)(1)(సీ) జాబితా దాకా వెళ్లకుండా పక్కా వ్యూహంతో వ్యవహరించారు. సింహాచలం ఆలయ భూములపైనే ప్రత్యేక నివేదిక ఇదిలా ఉంటే.. ఆలయాల వారీగా 22(ఏ)(1)(సీ) జాబితాలో చేరాల్సిన భూముల వివరాలను జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ద్వారా ఆయా జిల్లాల పరిధిలోని అన్ని ఆలయాల వివరాలను ఒక నివేదిక రూపంలో కమిషనర్ కార్యాలయానికి తెప్పించుకుంది. అనంతరం ఇదే నివేదికను కమిషనర్ కార్యాలయం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు పంపింది. అయితే, విశాఖ జిల్లాలో అన్ని ఆలయాల వివరాలు కమిషనర్ కార్యాలయానికి చేరగా.. సింహాచలం ఆలయ నాటి ఈఓ మాత్రం దేవస్థానం పరిధిలోని ఆస్తుల వివరాలను పంపలేదు. అప్పటి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఇలా జరిగిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాక.. ఆస్తుల వివరాలను అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ ఈఓను సమాచారం కోరినప్పటికీ నాటి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. నాలుగు నెలల తర్వాత సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూముల నివేదికను విడిగా పంపినట్లు సమాచారం. రికార్డుల తారుమారు? సింహాచలం దేవస్థానం ఆస్తులకు సంబంధించిన 22(ఏ)(1)(సీ) జాబితాను రిజిస్ట్రార్ శాఖకు పంపే ముందు ఆలయ ఆస్తుల రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలున్నాయి. ఆలయ ఆస్తుల జాబితా నుంచి 748 ఎకరాలను తొలగించాలన్న నిర్ణయం బయటకు పొక్కకుండా ఉండేందుకు సింహాచల ఆలయ ఆస్తులకు సంబంధించి 22(ఏ (1)(సీ) జాబితా వివరాలు మొదట ఆలయ ఈఓ ద్వారానే స్థానికంగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపి గుట్టుచప్పుడు కాకుండా కార్యక్రమాన్ని ముగించాలన్న ప్రయత్నం జరిగింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా నాటి ఈఓ నేరుగా పంపిన నివేదికను పరిగణనలోకి తీసుకోవడానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు సాహసించలేదు. దీంతో నెలల విరామం అనంతరం ఈఓ కమిషనర్ కార్యాలయం ద్వారానే రిజిస్ట్రేషన్ శాఖకు పంపారని రెండు వేర్వేరు కథనాలు వినిపిస్తున్నాయి. ఆ అధికారికి అందలం కాగా.. 2016లో సింహాచలం ఆలయ ఆస్తుల జాబితా నుంచి 748 ఎకరాల దేవుడి భూమి తొలగించినప్పుడు ఆలయ ఈఓగా పనిచేసిన అధికారే ఇప్పుడు దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ తర్వాత స్థాయి ర్యాంకులో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో సదరు ఈఓకు అదనపు కమిషనర్‌గా పదోన్నతి ఇవ్వగా, ఆప్పటి నుంచే ఆయన కమిషనర్ కార్యాలయంలో ఆ హోదాలో పనిచేస్తున్నారు. ఆస్తుల గోల్‌మాల్‌పై విచారణ సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి 2016లో ఒకేసారి 748.07 ఎకరాల తొలగింపు వ్యవహరంపై దేవదాయశాఖ విచారణకు ఆదేశించింది. ఆదివారం ‘సాక్షి’లో ఈ బాగోతంపై వచ్చిన కథనం మీద ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్పందించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రత్యేక కమిషనర్ అర్జునరావును కోరారు. దీంతో దేవదాయ శాఖ విశాఖపట్నం ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్‌తో సమగ్ర విచారణకు అర్జునరావు ఆదేశించారు. -
Simhachalam Temple: అప్పన్నకే శఠగోపం
సాక్షి, అమరావతి: సెంటు స్థలం అటు ఇటు అయితే గొడవలు పడటం.. కోర్టులకు వెళ్తుండటం చూస్తున్నాం. అలాంటిది ఒక ఎకరా కాదు.. రెండెకరాలు కాదు.. ఏకంగా రూ.10 వేల కోట్లకు పైబడి విలువ చేసే 748 ఎకరాల భూములు మావి కాదంటూ దేవదాయ శాఖ పరులకు వదిలేసింది. ఇవి విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములు. స్వామి వారి భూములను జాగ్రత్తగా కాపాడాల్సింది పోయి.. ఎవరూ అడక్కపోయినా, ఇవి మావి కావంటూ ఇతరులకు ధారాదత్తం చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో ఈ బాగోతం చోటుచేసుకుంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు తెర వెనుక వ్యవహారం నడపడంతో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన దేవాలయ భూముల, ఆస్తుల పరిరక్షణలో భాగంగా దేవుడి భూములకు జియో ఫెన్సింగ్ (ఆన్లైన్ మ్యాప్‌లో సరిహద్దుల గుర్తింపు) చర్యలకు ఉపక్రమించిన క్రమంలో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక్క రోజులో ఒక్క కలం పోటుతో.. సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పేరిట 11,282.26 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను అప్పటి విజయనగరం మహారాజులు రాసిచ్చారు. ప్రస్తుత విశాఖపట్నం నగరానికి సమీపంలో ఉండే అడవి వరం, వెంకటాపురం, వేపగుంట, చీమాలపల్లి, పురుషోత్తపురం గ్రామాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. 1967–68లో ఈ భూముల వ్యవహారంలో ఎస్టేట్ ఎబాలిష్ యాక్ట్ వివాదం కొనసాగినప్పటికీ, 1977, 78లో అప్పటి ఇనామ్ తహాసీల్దార్ ఈ భూములన్నీ స్వామి వారికే చెందుతాయని డిక్లరేషన్ జారీ చేశారు. ఎస్టేట్ ఎబాలిష్ యాక్ట్ ప్రకారం అందులో కొంత భూమిని మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 9,069.22 ఎకరాలకు రెవిన్యూ అధికారులు దేవుడి పేరుతో రైతు వారీ పట్టా జారీ చేశారు. ఈ క్రమంలో 2016లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దల చూపు ఈ భూములపై పడింది. ఎలాగైనా సరే కొంత భూమిని అయిన వాళ్లకు కట్టబెట్టాలని తెరవెనుక మంత్రాంగం నడిపారు. ఇందుకు దేవదాయ శాఖను పావుగా వినియోగించుకున్నారు. ఏ ఒక్కరి నుంచి వినతి కానీ, ఫిర్యాదు కానీ లేకుండానే విశాఖపట్నం నగరానికి అనుకొని ఉండే 748.07 ఎకరాల దేవుడి భూములను ఒకే రోజు దేవదాయ శాఖ ఆస్తుల జాబితాల నుంచి తొలగించేశారు. ఈ భూములు స్వామి వారివి కావని, వేరే ఎవరివోనంటూ ప్రభుత్వం 2016 డిసెంబరు 14వ తేదీన అధికారికంగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. 2016లో సింహాచలం ఆలయ ఆస్తుల జాబితా నుంచి పలు భూములను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వు ఎవరూ అడగక్క పోయినా.. అడవివరం, వేపగంట్ల, చీమాలపల్లి రెవిన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 291 సర్వే నంబర్లకు సంబంధించి కొన్నింటిలో మొత్తం భూమిని, మరికొన్నింటిలో కొంత భాగం భూమిని స్వామి వారి ఆస్తుల జాబితాల నుంచి గత తెలుగుదేశం ప్రభుత్వం తొలగించింది. ఇందులో 306 ఎకరాల భూమికి సంబంధించి కుంభకోణం జరిగిందని ఇప్పటికే అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు తెలిసింది. లోతైన విచారణ జరిగితే పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి రాష్ట్రంలో పలు చోట్ల సామాన్య ప్రజల వ్యవసాయ భూములు తప్పుగా నమోదు కావడంతో క్రయవిక్రయాలకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ తరహా బాధిత రైతులు అధికారులకు అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటూ ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండేది కాదు. అలాంటిది సింహాచలం శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల విషయంలో బాధితులమంటూ ఎవరూ స్వయంగా ప్రభుత్వానికి ఎలాంటి వినతులు పెట్టుకోలేదు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం తనంతట తానుగా ఆ భూములను ఆలయ రికార్డుల నుంచి తొలగించేసింది. ఈ పరిణామంతో కుంభకోణం చోటుచేసుకుందని ప్రత్యేకించి చెప్పక్కరలేదని స్థానికులు అంటున్నారు. ఏకపక్ష నిర్ణయం.. నిబంధనలు బేఖాతరు ఒకే విడత ఇంత పెద్ద మొత్తంలో భూములను ఆలయ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ జరిగిన సమయంలో విశాఖపట్నం జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులో ఉన్న ముగ్గురు అధికారులు ఒక్క ఏడాదిలోనే వెంట వెంటనే బదిలీ అవ్వడం గమనార్హం. తద్వారా ఈ తతంగం మొత్తంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత పుష్పవర్ధన్‌ను బదిలీ చేశారు. ఆ తర్వాత ఎన్వీఎస్ఎన్ మూర్తిని నియమించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయనను కూడా బదిలీ చేసి సుజాత అనే మరో అధికారిని జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించారు. ఓ ఆలయ ఆస్తుల జాబితా నుంచి నిర్ణీత కారణాలతో ఏవైనా భూములను తొలగించాలంటే దేవదాయ శాఖ చట్టంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఆలయ ఆస్తుల జాబితాలో పేర్కొన్న భూములపై ఎవరన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతిపత్రం పెట్టుకుంటే ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) మొదట ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్(ఏసీ)కు పంపాల్సి ఉంటుంది. ఆ ప్రతిపాదనలపై ఏసీ సంతృప్తి చెందిన పక్షంలో ఆ వివరాలతో పబ్లిక్ నోటీసు జారీ చేస్తారు. సంబంధిత ఆలయ ప్రాగంణం, సంబంధిత భూముల గ్రామ కార్యాలయం, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం సహా మొత్తం ఐదు బహిరంగ ప్రదేశాల్లో ఆ పబ్లిక్ నోటీసును ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. 15 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు అవకాశమివ్వాలి. ఆ తర్వాత అంతా సక్రమంగా ఉందని నిర్ధారించుకుని ఆ భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించాలి. ఆస్తుల జాబితా రిజస్టర్‌లో తొలగించిన భూముల వివరాల వద్ద సంబంధిత జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. 2010 ఆస్తుల రిజిస్టర్‌ను సాకుగా చూపి.. ఆలయ ఆస్తుల జాబితా నుంచి భూముల తొలగింపునకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చూపిన కారణం ఏమిటంటే.. ఆ భూములను తప్పుగా నమోదు చేశారని చెప్పారు. సర్వే నంబర్ల వారీగా ‘ఇనాం బి. రిజిస్టర్ నందు పట్టా నెం.2లో ఇతర ఇనాం భూమిగా నమోదు చేయబడి దేవస్థానం టైటిల్‌డీడ్ నంబరు 3145 నందు నమోదు కాలేదు’ అని పేర్కొన్నారు. మరికొన్ని భూములను గతంలో వేరే వారికి కేటాయించారని, విక్రయించారని చూపుతూ ఈ 748 ఎకరాలను జాబితా నుంచి తొలగించారు. 2004కు ముందు వివిధ ప్రభుత్వ, ప్రజా అవసరాలకు విశాఖపట్నం జిల్లాలో సింహాచలం శ్రీవరహా లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ భూములను చాలా సందర్భాలలో అప్పటి ప్రభుత్వాలు కేటాయింపులు చేశాయి. మధ్య తరగతి ప్రజల ఇళ్ల కోసం ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుకు కొంత భూమిని నిర్ణీత ధరకు బదలాయించారు. ప్రస్తుత ఎల్జీ పాలిమర్స్ వంటి సంస్థలు రావడానికి పూర్వమే భూములను కేటాయించారు. 2000–03 మధ్యలో ఆలయ భూములను అక్రమించుకున్న వారికి నిర్ణీత ధర ప్రకారం అక్రమణల క్రమబద్దీకరణ చేసి ఎల్‌ఆర్‌సీ సర్టిఫికెట్లను జారీ చేశారు. అవన్నీ 2004కు ముందు జరిగిన పరిణామాలు. ఆలయ భూములపై హైకోర్టు తీర్పు తర్వాత ఆ భూముల అమ్మకం, కేటాయింపులపై ఆంక్షలు అమలులో ఉన్నాయి. కాగా, 2010లో సింహాచలం ఆలయ ఆస్తుల రిజస్టర్‌లో అప్పటి వరకు ఆలయానికి ఉండే ఆస్తులను నమోదు చేసి, మిగిలినవి తొలగిస్తూ మార్పులు చేర్పులు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 2016లో టీడీపీ ప్రభుత్వం ఆలయ ఆస్తుల జాబితా నుంచి 748 ఎకరాలను తొలగిస్తున్నట్టు రికార్డులో పేర్కొంది. ఆలయ ఆస్తుల కోసం ప్రత్యేక రిజిస్టర్ ప్రతి ఆలయానికి ఆ ఆలయం పేరిట ఉన్న భూములు, స్వామి వారి నగలు, నగదు రూపంలో బ్యాంకులో ఉండే డిపాజిట్ వంటి వివరాలతో ప్రత్యేక రిజిస్టర్ ఉంటుంది. 1966 దేవదాయ శాఖ చట్టం ప్రకారం దీనిని 25వ నంబరు రిజస్టర్గా పిలిచేవారు. 1966–88 మధ్య ఈ రిజస్టర్‌ను 38వ నంబరుగా మార్చారు. 1987 తర్వాత 43వ నంబరు రిజస్టర్గా పిలుస్తున్నారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి స్వామి వారి ఆస్తుల వివరాల్లో చోటు చేసుకునే మార్పు చేర్పులను ఆ రిజస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. సమగ్రంగా విచారణ సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ ఆస్తుల జాబితా నుంచి 2016లో ఒకేసారి 748 ఎకరాలు తొలగించిన విషయం మా పరిశీలనకు కూడా వచ్చింది. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ అంశంపై శాఖ కార్యదర్శి వాణీమోహన్ ఆధ్వర్యంలో కమిషనర్ కార్యాలయంలో ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాం. సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించేందుకు తగిన చర్యలు చేపట్టాం. – అర్జునరావు, దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్. -
కరోనా వేళ.. శిల్పుల పనులు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ పనులు తుది దశకు చేరాయి. కరోనా విపత్తులోనూ శిల్పులు, కూలీలు ఆలయ పనుల్లో నిమగ్నమై పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సుమారు రూ.15 కోట్ల వ్యయంతో ఎకరం స్థలంలో కృష్ణశిలతో ఈ శివాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధానాలయం, ముఖమండపం, ప్రాకార మండపం, రాజగోపురం పనులు పూర్తయ్యాయి. ఇక ప్రధానాలయం పక్కనే ఉప ఆలయాలైన గణపతి, పర్వతవర్ధిని అమ్మవారి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాన్ని పూర్తి చేశారు. అంతే కాకుండా నవగ్రహ మండపం, యాగశాలను సైతం ఇటీవలనే శిల్పులు పూర్తి చేశారు. ప్రధానాలయంలోని మండపాలు, నాలుగు దిశల్లో కృష్ణ శిలలతో ఫ్లోరింగ్ పనులు చేశారు. ప్రధానాలయం ముందుభాగంలో బలిపీఠం, ధ్వజస్తంభం ఏర్పాటు చేసేందుకు దిమ్మెలు పూర్తి చేశారు. ఆలయంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా పూర్తయ్యాయి. ఆలయ పునఃప్రారంభం సమయానికల్లా స్పటికలింగాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటీవల వైటీడీఏ అధికారులు మార్కింగ్ చేశారు. సాలహారాల్లో విగ్రహాలు.. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి, ఈఓ గీతారెడ్డి పర్యవేక్షణలో శిల్పాల పనులు పూర్తయ్యాయి. ప్రధానాలయ మండపాల ప్రకారాల్లోని సాలహారాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు, శివుడి అవతారాలు, పార్వతి అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇక ముఖ మండపంలో దక్షణామూర్తి, బ్రహ్మ, భైరవులతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలను అమర్చేందుకు ఆలయ శిల్పులు సన్నాహాలు చేస్తున్నారు. జరగాల్సిన పనులు ఇవే.. రామలింగేశ్వరస్వామి ఆలయంలో కల్యాణమండపం, రథశాలను ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. ఆలయంలోని ఉత్తర దిశలో కల్యాణ మండపాన్ని, రథశాలను ఏర్పాటు చేసేందుకు ఇటీవల మార్కింగ్ చేశారు. ఈ పనులను త్వరలోనే చేపట్టనున్నారు. అంతే కాకుండా దక్షిణ భాగంలో ఇంకా మిగిలి ఉన్న ప్రాంతంలో కృష్ణ శిలలతో స్టోన్ ఫ్లోరింగ్ పనులు చేస్తున్నారు. ఇక ప్రాకారాలపై అందంగా కనిపించే విధంగా నంది విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆలయంలో విద్యుదీకరణ పనులు చేయాల్సి ఉంది. -
యాదాద్రి క్యూలైన్ల డిజైన్ ఖరారు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసే క్యూలైన్ల డిజైన్‌ను సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు ఆర్కిటెక్టు ఆనందసాయి తెలిపారు. దీనికి సంబంధించిన నమూనాను ఆనందసాయి శుక్రవారం యాదాద్రిలో విడుదల చేశారు. లక్నో నుంచి ప్రత్యేకంగా క్యూలైన్లు తయారు చేసే కార్మికులను త్వరలోనే యాదాద్రికి రప్పించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించే ప్రసాదం కౌంటర్ నుంచి బ్రహ్మోత్సవ మండపం మీదుగా తూర్పు రాజగోపురం ముందు నుంచి బంగారు రంగులో మెరిసే క్యూలైన్లు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. -
వివాదాలు చెరిపినారు
యాదగరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ నిర్మాణంలో అష్టభుజి ప్రాకారం రాతి స్తంభాలపై ఏర్పాటు చేసిన వివాదాస్పద చిత్రాలను ఆదివారం తొలగించారు. రాతి స్తంభాలపై చెక్కిన సీఎం కేసీఆర్, చార్మినార్, కేసీఆర్ కిట్ వంటి తదితర చిత్రాలపై పలు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని తొలగించింది. వాటి స్థానంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే చిత్రాలను చెక్కుతున్నారు. శనివారం చిత్రాలను తొలగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అక్కడి శిల్పులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. అలాగే యాదాద్రిలో రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. -
యాదాద్రిలో ఎమ్మెల్యే పర్యటన
-
తెలంగాణ సర్కార్‌కు రాజాసింగ్ వార్నింగ్
సాక్షి, యాదాద్రి: ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలను చెక్కడం వివాదంగా మారుతోంది. ఆలయ స్తంభానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, మరో పిల్లర్‌కు సీఎం కేసీఆర్ చిత్రాలు, దక్షిణ రాజగోపురం వైపు అష్టభుజి ప్రాకార మండపంలో కారుగుర్తు, కేసీఆర్ కిట్టు, తెలంగాణ లోగోలో చార్మినార్‌ను అమర్చినట్లు చెక్కారు. వీటిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్థానిక బీజేపీ నేతలతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి స్తంభాలపై చెక్కిన కేసీఆర్, కారు బొమ్మలను తొలగించడానికి ప్రభుత్వానికి వారం రోజులు టైం ఇస్తున్నామని హెచ్చరించారు. వారంలోపు తొలగించకపోతే దేశంలో ఉన్న హిందూవాదులందరితో కలిసి ఆందోళనకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ యాదాద్రిని ప్రపంచస్థాయి క్షేత్రంగా చేయడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ ఆయన బొమ్మలను వేయడం సరికాదన్నారు. రాష్ట్ర నాయకత్వంతో చర్చించి త్వరలోనే యాదాద్రిపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. భావితరాలకు తెలియజేయడానికి నాయకుల బొమ్మలను చెక్కితే, వారు చేసిన అవినీతిని కూడా చెక్కుతారా.? అని నిలదీశారు. కాగా రాజాసింగ్ రాక సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. మరోవైపు యాదాద్రి కొండపైన సీఎం కేసీఆర్, కారుగుర్తు, కేసీఆర్ కిట్టు, హరితహారం వంటి చిత్రాలను ఆలయంలో పిల్లర్లపై చెక్కడంతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ భజరంగ్‌దళ్, హిందుపరిరక్షణ సమితి, విశ్వహిందు పరిషత్, హిందుత్వ వాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికితోడు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
మండపాల్లో కేసీఆర్ బొమ్మ చెక్కడంపై నిరసన
సాక్షి, యాదగిరిగుట్ట: ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదగిరికొండపై శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాలు. ఆలయ అభివృద్ధిలో భాగంగా పునర్నిర్మాణ మవుతున్న తూర్పు రాజగోపురం పక్కనే ఉన్న అష్టభుజి ప్రాకార మండపంలో మొదటి స్తంభానికి తెలంగాణ సంక్షేమ పథకాల్లో భాగమైన హరితహారం, పక్కనే ఉన్న పిల్లర్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, మరో పిల్లర్‌కు సీఎం కేసీఆర్ చిత్రాలు, దక్షిణ రాజగోపురం వైపు అష్టభుజి ప్రాకార మండపంలో కారుగుర్తు, కేసీఆర్ కిట్టు, తెలంగాణ లోగోలో చార్మినార్‌ను అమర్చినట్లు చెక్కారు. వీటిని బీజేపీ రాష్ట్ర నాయకురాలు బండ్రు శోభారాణి నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన సుమారు 30మంది నాయకులు, కాంగ్రెస్ జిల్లా నాయకులు బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన 15మంది నాయకులు వేర్వేరుగా వాటిని పరిశీలించారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. దీంతో సీఐ నర్సింహారావు పోలీసులతో అక్కడికి చేరుకొని ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించరాదని ఆదేశించి వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అగ్రహానికి లోనైనా బండ్రు శోభారాణి, బీర్ల అయిలయ్యలు కొండపైన ఆలయాన్ని సందర్శించే హక్కు మాకు లేదా.. ఇక్కడ ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టవద్దు.. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడానికి వస్తే ఏమీ కాదుకానీ.. మేము మాట్లాడితే తప్పెంటి అంటూ వాగ్వాదానికి దిగారు. అయినా సీఐ వినిపించుకోకుండా అలానే ప్రవర్తించడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రమా.. కేసీఆర్ ఆదేశామా..? యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతున్నాయని ఆచార్యులు పదేపదే చెబుతున్నారని, ఇక్కడి పనులు చూస్తే సీఎం కేసీఆర్ ఆదేశానుసారంగా, ఆయన చెబుతున్న సొంత శాస్త్రంగానే జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకురాలు బండ్రు శోభారాణి, కాంగ్రెస్ జిల్లా నాయకులు బీర్ల అయిలయ్య ఆరోపించారు. ఆలయాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణతో పాటు ఆంధ్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో గొప్పగా ఆలయాలు నిర్మించిన ఎంతో మంది ప్రముఖులు ఎక్కడా వారి చిత్రాలు, పార్టీ గుర్తులు , ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల బొమ్మలను చెక్కించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణి, రాచరిక పాలనతో యాదాద్రి ఆలయ నిర్మాణం పేరుతో తన చిత్రం, పార్టీ గుర్తు, సంక్షేమ పథకాలను గీయించుకున్నాడని మండిపడ్డారు. ఆలయాన్ని సందర్శించే భక్తులు దేవుడిని చూడాలా లేక కేసీఆర్‌తో పాటు ఆయన ప్రవేశపెట్టిన పథకాలను చూడాల అని ప్రశ్నించారు. వారి వెంట బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాఘవుల నరేందర్, రచ్చ శ్రీనివాస్, గుండ్లపల్లి భరత్‌గౌడ్, ఎరుకల చైతన్య, శేఖర్, భాస్కర్‌రెడ్డి, బొమ్మగాని రాజమణి, రాయగిరి రాజు, బెలిదె అశోక్, నవీన్ఠాగూర్, బెలిదే నవీన్ తదితరులు ఉన్నారు. హిందుత్వ వాదుల ఆందోళన యాదాద్రి కొండపైన సీఎం కేసీఆర్, కారుగుర్తు, కేసీఆర్ కిట్టు, హరితహారం వంటి చిత్రాలను ఆలయంలో పిల్లర్లపై చెక్కడంతో హిందువుల మనోభా వాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ భజరంగ్‌దళ్, హిం దుపరిరక్షణ సమితి, విశ్వహిందు పరిషత్, హిం దుత్వ వాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు హిందుత్వ వాదులను నిర్మాణం అవుతున్న ఆలయంలో చెక్కిన బొమ్మలవద్దకు పంపించకపోవడంతో వారు గోపురం ఎక్కేందుకు ప్రయత్నిం చారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని కిందికి దించారు. ఈ క్రమంలో తూరు రాజగోపురం వైపు పరుగులు తీస్తున్న క్రమంలో డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ మనోహర్‌రెడ్డిలు అడ్డుకున్నారు. వారిని సముదాయించి, నచ్చచెప్పి వెనక్కి పంపారు. కొద్ది సేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో అనంతరం భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్‌చందర్, విశ్వహిందు పరిషత్ ప్రచార కన్వీనర్ బాలస్వామి, మఠం మందిర్ రాష్ట్ర ప్రముఖ్ అరవింద్‌రెడ్డి, భజరంగ్‌దళ్ స్టేట్ కన్వీనర్ శివరాములు, వీహెచ్‌పీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి తోట భానుప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి కర్రె ప్రవీన్, ఈశ్వర్, కోకల సందీప్, బోయిని క్రాంతి, గురుగుల క్రాంతి, శివకుమార్ తదితరులున్నారు. -
యాదాద్రి ప్రాకారాలకు 28 రాజగోపురాలు
సాక్షి, యాదాద్రి/యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా నూతన ప్రధానాలయం ప్రాకారాలకు మొత్తం 28 చిన్న రాజగోపురాలు రానున్నాయి. 24 గోపురాలను అష్టభుజి మండపాలపై 8 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించనున్నారు. అదే విధంగా నాలుగు మూలల్లోని మండపాలపై మరో నాలుగు రాజగోపురాలు రానున్నాయి. ఇవి సుమారు 13 అడుగుల ఎత్తుతో ఉంటాయి. వీటి నిర్మాణం పూర్తయితే ఆలయం ఇంకా అందంగా కనిపించనుంది. నాలుగు మండపాలపై రానున్న గోపురాలను ఆలయంలోనికి వెళ్లాక కనిపించేలా నిర్మాణం చేస్తున్నారు. అష్టభుజి మండపాలపై వచ్చే గోపురాలు మాత్రం బయటికి స్పష్టంగా కనిపించనున్నాయి. వీటికి సంబంధించిన ప్లాన్లు సైతం రూపొందించారు. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. సుదర్శన విమాన రాజగోపురం పూర్తి యాదాద్రి ప్రధానాలయ సప్తగోపుర నిర్మాణాల్లో అత్యంత ప్రధానమైన సుదర్శన విమాన రాజగోపుర నిర్మాణం పూర్తయింది. ఆలయ విస్తరణలో భాగంగా గర్భాలయంపై సుదర్శన విమాన రాజగోపురాన్ని నిర్మించారు. ఐదంతస్తుల్లో 50 వేల టన్నుల కృష్ణశిలలతో ఈ రాజగోపురాన్ని నిర్మించారు. దీనిపై సుదర్శన చక్రం ఏర్పాటు చేసిన అనంతరం పెద్ద ఎత్తున కుంభాభిషేకం చేపడుతారు. దీంతో స్వామి, అమ్మవార్లు కొలువైన గర్భాలయంపైన గల సుదర్శన రాజగోపురం భక్తుల మొక్కులను అందుకోనుంది. ఆలయ విస్తరణలో ఏడు రాజగోపురాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో ఏడంతస్తుల మహారాజగోపురం చివరి దశ పనులు మినహా మిగతా ఆరుగోపురాల పనులు పూర్తయ్యాయి. గర్భాలయంపైన గల సుదర్శన విమాన రాజగోపురంపై దేవతా విగ్రహాల ఏర్పాటు పూర్తయింది. 10 ద్వారపాలకుల విగ్రహాలు, ప్రతి అంతస్తులో రెండు చొప్పున ఏర్పాటు చేశారు. మొత్తం 10 విగ్రహాల ఏర్పాటు పూర్తి కావడంతో శిల్పులు తమ పనులను ముగించుకున్నారు. అయితే ప్రధానాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వయంభువుల ప్రతిష్ఠ తర్వాత రాజగోపురంపై కలశాలను, సుదర్శన చక్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ పనులన్నీ జీయర్లు, ఆచార్యులు, వేదపండితుల ఆధ్వర్యంలో జరుగుతాయి. ప్రస్తుతం పూర్తయిన రాజగోపురాలు యాదాద్రికి వచ్చే భక్తులను కనువిందు చేస్తున్నాయి. అలాగే తిరుమాడ వీధులు, ముఖ మండపం, ఆలయంలో ఫ్లోరింగ్ పనులు చేపట్టడానికి వైటీడీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్త గోపురాలు రానున్న ఆలయ ప్రాకారం -
‘యాదాద్రి’కి బంగారు, వెండి సొబగులు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బంగారు, వెండి సొబగులు అద్దనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా చిన జీయర్‌స్వామి ఆదేశాల మేరకు ఆగమ శాస్త్రానుసారంగా స్వయంభూమూర్తుల గర్భాలయంపై ఉన్న విమాన రాజగోపురం, గర్భాలయంలోని ధ్వజస్తంభానికి బంగారం, ద్వారాలు, బలిపీఠానికి వెండి తొడుగులు వేయనున్నారు. ధ్వజస్తంభానికి ముందు భాగంలో బలిపీఠం ఉంటుంది. అష్టదిక్పాలకులకు అవసరమైన ఆహారం ఉం చేందుకు ఏర్పాటు చేసేదే బలిపీఠం. బంగారు తాపడం చేసే ధ్వజస్తంభ వేదిక, బలిపీఠం ఈ బృహత్తర ప్రణాళికకు రూ.50 కోట్లు వెచ్చించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఇందులో విమాన రాజగోపురం, ధ్వజస్తంభానికి రూ.35 కోట్లు, ద్వారాలు, బలిపీఠానికి రూ.15 కోట్లు వెచ్చించనున్నారు. త్వరలోనే ఈ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం వీటికి రాగి తొడుగులను అమర్చే పనులు కొనసాగుతున్నాయి. యాదాద్రి దేవస్థానంలో ప్రస్తుతం సుమారు 10 కిలోల బంగారం, సుమారు 1,600 కేజీల వెండి ఉంది. కాగా, విమాన రాజగోపురానికి సుమారు 30 కేజీల బంగారం, ధ్వజస్తంభానికి సుమారు 10 కేజీల బంగారం, ఆలయ ద్వారాలు, బలిపీఠానికి తొడుగులకోసం సుమారు 2 వేల కేజీల వెండి అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతపెద్ద మొత్తం బంగారం, వెండి దేవస్థానంలో అందుబాటులో లేదని అధికారులు గతంలోనే ప్రభుత్వానికి తెలియజేశారు. కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న బంగారాన్ని, వెండిని వైటీడీఏకు అప్పగించి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రణాళికలను అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ పనులన్నీ అత్యంత కట్టుదిట్టుమైన భద్రత మధ్య చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అధికారులు ముందుగా విమాన రాజగోపురం సహా అన్ని రాజగోపురాల పనులను పూర్తి చేసి ప్రతిష్ఠ నాటికి ఈ కార్యక్రమాలను చేయాలని ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉండగా దర్శనానికి వచ్చే భక్తులను కట్టడి చేస్తూ పనులను ఎలా చేయాలన్నదానిపై అధికారులు మీమాంసలో ఉన్నారు. ఎలాగైనా తిరుమల తరహాలో విమాన రాజగోపురం, గర్భాలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు, వెండిరేకులను తాపడం చేసి, స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు.. ఆధ్యాత్మిక ఆనందం, కనువిందు కలిగించాలని వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం త్వరలో చినజీయర్‌స్వామి, సీఎం కేసీఆర్‌ను కలసి ప్రణాళికలు వివరించాలని సమాలోచనలు చేస్తున్నారు. -
యాదాద్రికి ఎల్ఈడీ వెలుగులు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అత్యాధునిక హంగులతో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. ఎల్ఈడీ లైట్లతోపాటు ఏసీ చిల్లర్స్, అగ్నిమాపక యంత్రాలు, సీసీ కెమెరాలు, సీసీ టీవీలను అమర్చనున్నారు. యాదాద్రిని తిరుమల తరహాలో తీర్చిదిద్దాలన్న ప్రణాళికలో భాగంగా ఒక్కో హంగును సమకూరుస్తున్నారు. అవసరమైన విద్యుత్ పరికరాలను వివిధ దేశాలనుంచి ప్రత్యేక సంస్థల ద్వారా దిగుమతి చేసుకునే పనుల్లో వైటీడీఏ అధికారులు నిమగ్నమయ్యారు. కొండపై ప్రత్యేకంగా రెండు సబ్స్టేషన్లు నిర్మించనున్నారు. మెట్లదారిలో సుమారు రూ.15 కోట్ల ఖర్చుతో 1600 కేవీ సబ్‌స్టేషన్, అలాగే 1000 కేవీ కెపాసిటీ గల మరో సబ్‌స్టేషన్ గోశాలవద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వాటి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రధానాలయంలో సౌండ్ సిస్టం, కేబుల్, విద్యుత్ దీపాలు, ఏసీల అమరికను ప్రత్యేకం గా చేపడుతున్నారు. గర్భాలయం, ముఖ మండపం, గిరి ప్రదక్షిణం, సత్యనారాయణవ్రత మండపం, ఆలయ తిరుమాడ వీధులు, దక్షిణ ప్రాకార మండపం వంటి ప్రాంతాలలో విద్యుత్లైట్లకు సంబంధించిన కేబుళ్లను పూర్తిగా భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నారు. గర్భాలయంలో 600 టీఆర్ సామర్థ్యం గల ఏసీలను అమర్చుతున్నారు. ఆలయంలో అమర్చే లైట్లన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. ఆలయ తిరుమాడ వీధులు, శివాలయం, సత్యనారాయణవ్రత మండపం వంటి ప్రదేశాలలో హైమాస్ట్ లైట్లతో వెలుగులు నింపే విధంగా ఎల్ఈడీలను ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రికి మూడో కన్నుగా కెమెరాలు దేవస్థానంలో ఏ మూలాన ఏమి జరిగినా తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను అమర్చనున్నారు. ప్రధానాలయంలో మొత్తంగా 65 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. సుమారు కోటిన్నర రూపాయలతో జర్మనీనుంచి సీసీ కెమెరాలను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కెమెరాలను 10 టీవీలకు అనుసంధానించనున్నారు. భద్రతకు సంబంధించిన పరికరాలన్నీ జర్మనీ, జపాన్, స్వీడన్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. యాదాద్రి రాజగోపురాలు ఎంత దూరం నుంచి చూసినా లైట్ల వెలుతురులో అందంగా కనపడే విధంగా ప్రత్యేక షేడింగ్ లైట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆధునిక ఏసీల ఏర్పాటు గర్భాలయంలో అత్యాధుక ఏసీ చిల్లర్స్‌ను అమర్చనున్నారు. ఈ ఏసీ చిల్లర్స్కు కొండపైన గల పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసి అందులో ఈ మిషన్ నుంచి గర్భాలయంలోకి పైపుల ద్వారా శీతలగాలిని వదులుతారు. గర్భాలయం మొత్తం చల్లగా మారుతుంది. గంటపాటు నిర్విరామంగా ఏసీని వదులుతే మూడు గంటలపాటు చల్లదనం ఉంటుందని చెబుతున్నారు. ఈ మిషన్లన్నీ కూడా జర్మనీ నుంచి తెప్పిస్తున్నారు. సంవత్సరం తర్వాత యాదాద్రి దేవస్థానం అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తారు. అలాగే ఆధునిక అగ్నిమాపక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. -
‘ముక్కోటి’కి గుట్ట ముస్తాబు
యాదగిరికొండ: వైకుంఠ(ముక్కోటి) ఏకాదశికి యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం ముస్తాబైంది. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపల తూర్పు ద్వారం ద్వారా దర్శనం ఇవ్వనున్న స్వామి అమ్మవారి సేవకు క్యూలైన్లు ఏర్పా టు చేశారు. భక్తుల కోసం సుమారు 85 వేల లడ్డూలు, 85 వేల పులిహోర ప్యాకెట్లు తయారు చేశారు. కొండ కింద నుంచి వచ్చేవాహనాలను తులసీ కాటేజీలోనే నిలిపివేసేలా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. నేడు వైకుంఠ ద్వార దర్శనం దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసే నారసింహుడు వైకుంఠం వదిలి భూలోక భక్తుల చెంతకు చేరే సందర్భం రానే వచ్చింది. గురువారం తెల్లవారుజామున 6.45 గంట లకు స్వామి అమ్మవారు అలంకార ప్రియులై గరుడవాహన సేవపై భక్తులకు దర్శనమిచ్చి, తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. అంతకుముందు ధనుర్మాసోత్సవాలలో భాగంగా తిరుప్పావై పఠనం చేస్తారు. సామాన్య భక్తులకు దర్శనం సులభతరం ఈ ముక్కోటి ఏకాదశికి వచ్చే భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకునే అవకాశాన్ని సులభతరం చేశారు. ఇందుకోసం వీఐపీలకు బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటల నుంచి 9గంటలవరకు, 11గంటల నుంచి 12గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు వీఐపీలు దర్శనం చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ ముక్కోటి ఏకాదశికి 1500 మంది భక్తులకు దేవస్థానం ఉచిత అన్నదానం ఏర్పాటు చేసింది. నేటి నుంచి అధ్యయనోత్సవాలు గుట్ట దేవస్థానంలో గురువారం నుంచి ఐదు రోజులపాటు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారి గజ, గరుడ, అశ్వ, శేష, ఆంజనేయ తదితర వాహనాలకు తిరుమంజనం చేశారు.