
సాక్షి, హైదరాబాద్ : చారిత్రక మోజంజాహీ మార్కెట్‌కు పుర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఎంజే మార్కెట్‌ని దత్తత తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ కూడా ఎంజే మార్కెట్ పునరుద్దరణకు 10కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఎంజే మార్కెట్‌ని సందర్శించారు. మార్కెట్ లోని వ్యాపారులతో ముచ్చటించిన కేటీఆర్.. అక్కడ లభించే ఫేమస్ ఐస్ క్రీమ్ రుచి చూశారు. జీహెచ్‌ఎంసీ చేపట్టబోయే పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనులను నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కేటీఆర్ వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ అధికారులు ,తదితరులు ఉన్నారు.
Visited the famous Mozzam Jahi market along with @arvindkumar_ias
— KTR (@KTRTRS) April 16, 2018
Restoration works start tomorrow & would be completed in 4 months
Hyderabad is a unique city that has a great blend of both amazing heritage structures & modern contemporary ones pic.twitter.com/hGIpvk0E12
Comments
Please login to add a commentAdd a comment