MJ Market
-
స్టేజ్ ఎక్కి.. మైక్ లాక్కొని.. అస్సాం సీఎంను నిలదీసే యత్నం!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు శుక్రవారం వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టమైంది. మొజంజాహి (ఎంజే) మార్కెట్ వద్ద హిమంత ఉన్న వేదిక పైకి టీఆర్ఎస్ నేత నంద కిషోర్ వ్యాస్ దూసుకువెళ్లారు. ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ప్రసంగిస్తుండగా అడ్డుకుని మైక్ లాగా రు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంజే మార్కెట్ ప్రాంతానికి చేరుకోవడానికి ముందు హిమంత చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి ఎంజే మార్కెట్ వద్దకు చేరుకున్న హిమంత ఉత్సవ సమితి వేదిక పైకి ఎక్కారు. ఆ సమయంలో భగవంతరావు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పుడు వేదిక పైకి దూసుకెళ్లిన నంద కిషోర్.. భగవంతరావు మైకును పక్కకు లాగారు. పక్కనున్న హిమంతను నిలదీసేందుకు ప్రయత్నించారు. వేదికపై ఉన్న సమితి నేతలు అప్రమత్తమై నంద కిషోర్‌ను బలవంతంగా స్టేజ్ కిందకు తీసుకుపోయారు. అక్కడే ఉన్న మహిళా భక్తులు నంద కిషోర్‌పై అసహనం వ్యక్తం చేయడంతోపాటు ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గులాబీ కండువా ధరించిన నంద కిషోర్ ముఖ్యమంత్రి ఉన్న వేదికపైకి వెళ్తున్నా పోలీసులు అడ్డుకోలేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు మార్కెట్ దగ్గర ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. టీఆర్ఎస్ నేతలు, హిమంతకు పోటీగా మంత్రి తలసాని ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఉత్సవ సమితి సభ్యులు, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. బండి సంజయ్, డీకే అరుణ ఖండన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేత మైక్ లాక్కోవడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. హిమంతపై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు పెట్టాలని, ఈ దాడికి పురిగొల్పిన రాష్ట్ర మంత్రులపైనా కేసు నమోదు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్ గురించి గొప్పలు చెప్పుకునే కేసీఆర్, అస్సాం సీఎంకు సరైన భద్రత కల్పించలేక పోవడం సిగ్గుచేటని అరుణ విమర్శించారు. కుటుంబ పార్టీలు దేశం కోసం ఆలోచించవు: హిమంత తెలంగాణలో ఒక్క కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ విమ ర్శించారు. ప్రభుత్వం అనేది ప్రజలందరి కోసం పనిచేయాలి గానీ, ఒక కుటుంబం కోసం కాదన్నారు. కుటుంబ పార్టీలు కొడుకు, కూతురు గురించి తప్ప దేశం కోసం ఆలోచించవని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు మంచి జరగాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని, గణపతిని కోరుకున్నట్లు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజల్ని ఏకం చేయడానికి కేసీఆర్‌కు మరో 50 ఏళ్లు పడుతుందేమోనని ఎద్దేవాచేశారు. రాహుల్‌గాంధీకి నిజంగా దేశ భక్తి ఉంటే 1947లో ఎక్కడైతే విభజన జరిగిందో అక్కడ భారత్ జోడో యాత్ర చేయాలని వ్యాఖ్యానించారు. ఎక్కడైతే జోడించాలో అక్కడ ఆ పనిచేయాలి తప్ప పటిష్టంగా ఉన్న దేశంలో ‘భారత్ జోడోలు’ ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వినాయక శోభాయాత్రను చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు అబిడ్స్: సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదని టీఆర్ఎస్ నాయకుడు నందకిశోర్ వ్యాస్ (నందుబిలాల్) పేర్కొన్నారు. కేసీఆర్‌ను విమర్శించినందుకే తాను మైకు లాక్కున్నానని చెప్పారు. అబిడ్స్ పోలీస్‌స్టేషన్ దగ్గర నందకిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలకు వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఆధ్యాత్మిక భావంతో, దేవుడిపైనే ప్రసంగించాలన్నారు. సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను విమర్శిస్తూ హైదరాబాద్‌లో అలజడి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల! -
‘ఇదేనా మీ రాజకీయం.. అతిథి మర్యాదలు గుర్తుపెట్టుకోండి’
సాక్షి, హైదరాబాద్: నగరంలో గణనాథుడి నిమజ్జనం సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలంగాణకు విచ్చేసిన విషయం తెలిసిందే. కాగా, పర్యటనలో భాగంగా హిమంత బిశ్వ శర్మ ఎంజే మార్కెట్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా అసోం సీఎం.. కేసీఆర్ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణలో బీజేపీదే గెలుపు. ప్రతిపక్షాలు కలిసే ఉన్నాయి. కేసీఆర్ ఏకం చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వం నిజాం పాలనని కొనసాగిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. కుటుంబ పాలన నుండి విముక్తి కలిగాలని భాగ్యలక్ష్మీ అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. దీంతో, టీఆర్ఎస్ కార్యకర్త స్టేజీ మీదకు వచ్చి.. మైక్ లాక్కున్నాడు. దీంతో.. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చేసుకుంది. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలను చూసి టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. ఇతర రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చిన అతిథికి ఇచ్చే మర్యాద ఇదేనా అని ప్రశ్నించారు. అసోం సీఎంను అడ్డుకుని ఏంచేయగలిగారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వరా.. బీజేపీ నేతలకు మంత్రి తలసాని కౌంటర్ -
ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు.. అసోం సీఎంకు తలసాని కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎంజే మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. గణేష్ శోభాయాత్ర సందర్బంగా నగరానికి విచ్చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఎంజే మార్కెట్లో సభా వేదికపై ఆయన ప్రసంగిస్తూ టీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు. దీంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు అసోం సీఎం స్పీచ్‌ను అడ్డుకున్నారు. మైక్ లాక్కున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలను రెచ్చగొట్టడానికే అసోం సీఎంను ఇక్కడికి రప్పించారు. అసోం సీఎం భాష సరిగా లేదు. అందుకే స్థానికులు అడ్డుకున్నారు. ఆయన గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇక్కడికి వచ్చారు. అలాంటప్పుడు గణేషుడి గురించి లేదా శోభాయాత్ర గురించి మాట్లాడాలి కానీ.. రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. బీజేపీ నేతలు హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ మంత్రి తలసాని ప్రశ్నించారు. అనంతరం హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని.. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. -
గణేష్ శోభాయాత్రలో టెన్షన్: ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వంత శర్మ నగరానికి వచ్చారు. ఈ క్రమంలో ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. అసోం సీఎం ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఎం బిశ్వంత శర్మ ప్రసంగిస్తుండగా.. టీఆర్ఎస్ నేత నందు బిలాల్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. సీఎం తన ప్రసంగంలో టీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభా వేదిక మీదకు ఎక్కిన బిలాల్ మైక్ లాక్కున్నాడు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వెంటనే బిలాల్‌ను పోలీసులు అక్కడి నుంచి తరిలించారు. దీంతో, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడికి తరలివచ్చారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలకు సంస్కారం లేదు. అసోం సీఎంను అడ్డుకోవడం సిగ్గుచేటు. ఇది పిరికిపంద చర్య. ఇది పెద్ద సాహసోపేత చర్య కాదు. పోలీసుల కనుసన్నాల్లోనే ఇదంతా జరిగిందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. -
HYD: గణేష్ శోభాయాత్రలో తలసాని ఫ్లెక్సీ వివాదం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా నేడు గణనాథుల శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. అటు భాగ్యనగరంలో సైతం గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ఈ క్రమంలో వివిధ మార్గాల ద్వారా గణనాథులు ట్యాంక్ వైపు కదులుతున్నారు. కాగా, నిమజ్జనం సందర్భంగా నగరంలోని ఎంజే మార్కెట్ వద్ద ఫ్లెక్సీల గొడవ చోటుచేసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరులతో ఉత్సవ సమితి సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రి తలసాని ఫ్లెక్సీని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో, అక్కడి నుంచి ఫ్లెక్సీని తొలగించినట్టు సమాచారం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నట్టు పోలీసు అధికారులు స్పష్టంచేశారు. -
MJ మార్కెట్, పాతబస్తీలో హైఅలర్ట్
-
ఎంజే మార్కెట్ స్లాబ్‌కు రంద్రాలు.. 16 కోట్లు దేనికి
అబిడ్స్: ఎంజే మార్కెట్ ఆధునికీకరణ అధ్వానంగా ఉందని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధా అన్నారు. నాలుగు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఎంజే మార్కెట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.... 85 సంవత్సరాల నాటి ఎంజే మార్కెట్‌ను రూ.16 కోట్లు పెట్టి ఆధునికీకరించినా సమస్యలన్నీ అలాగే ఉన్నాయన్నారు. ఐదు రోజులపాటు కురిసిన వర్షాలకే ఎంజే మార్కెట్ వాన నీటితో నిండిపోవడం దారుణమన్నారు. ఎంజే మార్కెట్లో స్లాబ్‌కు రంద్రాలు పడటం, వర్షపు నీరు నిలిచిపోవడం చూస్తుంటే రూ.16 కోట్లు దేనికి ఖర్చు చేసినట్టు అని ఆయన ప్రశ్నించాడు. ఈ పనులపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ ప్రజలకు సమాధానం చెప్పాలని రాజాసింగ్ లోధా డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ము వృథా చేయడం దారుణమన్నారు. -
వాహ్.. మొజంజాహీ
సాక్షి, సిటీబ్యూరో: గతంలో పెద్ద మార్కెట్‌గా ఎంతో ఘనతకెక్కి, కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన మొజంజాహీ (ఎంజే) మార్కెట్ కొత్త సొబగులు అద్దుకుంది. నిర్వహణలోపంతో మసకబారిన చారిత్రక కట్టడానికి పునర్వైభవం కల్పించేందుకు మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ దత్తత తీసుకున్నారు. రెండు మూడు నెలల్లోపే పనులు పూర్తి చేయవచ్చనుకున్నారు. దాదాపు రూ.3 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ వారసత్వ భవనానికి భంగం వాటిల్లకుండా.. గత నిర్మాణ కౌశలం దెబ్బతినకుండా జాగ్రత్తగా పనులు చేయడంతో సమయమూ, వ్యయమూ పెరిగాయి. అయినా గత చరిత్రను కాపాడుతూ, పునర్వైభవ పనులను పూర్తిచేసి కొంగొత్తగా తీర్చిదిద్దారు. ప్రత్యేక వాస్తుశిల్పంతో, గ్రానైట్‌తో నిర్మించిన ఎంజే మార్కెట్ పైకప్పును జాక్ ఆర్చెస్ పద్ధతిలో నిర్మించారు. నిర్వహణ లోపంతో కాలక్రమేణా దెబ్బతిన్నది. ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతిన్నది. వేలాడే కేబుళ్లు అడ్డగోలు బోర్డులు తదితరాలతో కళ కోల్పోయిన ఎంజే మార్కెట్‌కు రెండేళ్లుగా చేసిన పనులతో నూతన శోభ తెచ్చారు. హైదరాబాద్ నగర చారిత్రక వారసత్వ నిర్మాణ కౌశలానికి ప్రతీకగా ఉన్న దీనిపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపింది. దాదాపు రూ.15 కోట్లు ఖర్చయినట్లు అంచనా. అర్వింద్‌కుమార్ దత్తత తీసుకున్నప్పుడే మంత్రి కేటీఆర్ స్పందిస్తూ పునరుద్ధరణకు ముందు.. తర్వాత ఫొటోలను పోల్చిచూస్తానని పేర్కొన్నారు. అధునాతన సాంకేతికతతో.. వారసత్వ సంపద చెక్కు చెదదరకుండా ఉండేందుకు పునరుద్ధరణ చర్యల్లో భాగంగా నిర్మాణంలోని ప్రతి భాగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఎక్కడ బలహీనపడిందో గుర్తిస్తూ, డాక్యుమెంటేషన్ కూడా చేసినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. భవనం పైకప్పులో పెరిగిన పిచ్చిమొక్కలను వేళ్లతో సహా జాగ్రత్తగా తొలగించి ఏర్పడ్డ ఖాళీని సాంకేతిక పరిజ్ఞానంతో ¿భర్తీచేశారు. వర్షపునీరు కారకుండా ఉండేందుకు వ్యాపారులు పైకప్పు మీద పొరలుపొరలుగా వేసిన తారును మొత్తం తొలగించి, అధునాతనంగా తీర్చిదిద్దారు. జాక్ ఆర్చిలను కొన్నిచోట్ల పూర్తిగా పునర్నిర్మించారు. బాల్కనీలు/గవాక్షాలు వాటికి ఊతంగా అమర్చిన బ్రాకెట్లు విరిగిపోవడంతో పూర్వ రూపానికి తెచ్చేందుకు సున్నం, మోర్టార్ (గచ్చు) మిశ్రమాలను వినియోగించారు. వలయాకారంలో అమర్చిన మెట్లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. గోడలు, గుమ్మటాలపై పిచ్చి రంగులు, పెచ్చులను జాగ్రత్తగా తొలగించారు. గడియారపు స్తంభం సహజ సౌందర్యం కోసం ఎంతో శ్రమించినట్లు అధికారులు పేర్కొన్నారు. మూగబోయిన గడియారపు గంటలు వినపడేలా చేశారు. మినార్లను, వాటి గుమ్మట శిఖరాలను బంగారు పూత మెరుపులతో కుంభాకార కలశాల వంటి వాటితో అలంకరించారు. మొత్తం మార్కెట్ ప్రదేశంలో కాలిబాటలు, వాటికి కంచెగా చిన్న స్తంభాలను, ప్రజలు కూర్చుని సేదదీరడానికి బెంచీలు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక సందర్భాల్లో శోభాయమానంగా కనిపించడానికి వీలుగా ప్రత్యేక లైటింగ్‌కు తగిన ఏర్పాట్లు చేశారు. భూగర్భ డ్రైనేజీ, వర్షపునీరు నిలవకుండా పనులు చేశారు. చరిత్రకారులు, నిర్మాణరంగ ప్రముఖులు, దుకాణాదారులు తదితర వర్గాల వారు అందించిన అమూల్య అభిప్రాయాలు కూడా పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి. 1935 నాటి ఎంజే మార్కెట్ ఇన్నాళ్లకు కొత్త ఠీవితో నిలిచింది. నాటి జ్ఞాపకాలు గుర్తు చేసే విధంగా మార్కెట్‌కు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. జీహెచ్ఎంసీ పర్యవేక్షణలో పునరుద్ధరణ çపనులను దూలం సత్యనారాయణ ఫొటోలు తీశారు. చలనచిత్రంగా రూపొందించారు. ఎంజే మార్కెట్ పునఃప్రారంభం నుంచి మూడు రోజులపాటు ప్రజల సందర్శనార్థం ఒక ఫొటో గ్యాలరీ అందుబాటులో ఉంటుందని జీహెచ్ఎంసీ పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వంద అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
హెరిటేజ్ సిటీ హోదా రావాలి
గన్‌ఫౌండ్రీ: హైదరాబాద్ నగరాన్ని యునెస్కో హెరిటేజ్ సిటీగా గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పునరుద్ధరించిన ఎంజే మార్కెట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తేవాల్సిన అవసరం ఎంతో ఉందని, కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నగర పౌరులపై ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నో సుందర చారిత్రక కట్టడాలకు హైదరాబాద్ నగరం నిలయమని, వారసత్వ సంపదను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఎంజే మార్కెట్‌పై 100 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఏర్పాటు చేశామని, ఈ జెండా ఈ ప్రాంతానికి కొత్త శోభను తెస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ చదువుకునే రోజుల్లో ఎంజే మార్కెట్ పరిసరాల్లోని మయూరా హోటల్ ప్రాంతంలో చాలా ఏళ్లు ఉన్నారని, తాను కూడా చదువుకునే రోజుల్లో ఫేమస్ ఐస్‌క్రీమ్ కోసం ఎంజే మార్కెట్‌కు వస్తుండేవాడినని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. రూ.15 కోట్ల వ్యయంతో ఎంజే మార్కెట్‌కు పూర్వ వైభవం కల్పించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే రూ.1,000 కోట్లతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పున రుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. రెండేళ్లలోనే ఎంజే మార్కెట్‌ను పునరుద్ధరించిన మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను అభినందించారు. ఎంజేమార్కెట్‌పై రూపొందించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. దీంతోపాటు ఎంజే మార్కెట్‌కు పున ర్వైభవం కల్పించడంలో విశిష్ట సేవలందించిన 16 మందికి మెమెంటోలను అందించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, కేకే, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా జాతీయ పతాకం ఎంజే మార్కెట్‌పై 100 అడుగుల భారీ ఎత్తున ఏర్పాటు చేసిన జాతీయ పతాకం ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యాటకులను ఆకర్షించేందుకు మార్కెట్ చుట్టూ రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు లోపల పలు నూతన నిర్మాణాలను చేపట్టారు. -
కరాచీ బేకరీలో చోరీ
సాక్షి, హైదరాబాద్ : ఎంజే మార్కెట్ చౌరస్తాలోని కరాచీ బేకరీలో చోరీ జరిగింది. షాప్ వెనుక ఉన్న షెటర్ తొలిగించి రూ. 10 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కరాచీ బేకరీ యాజమాన్యం బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఎంజే మార్కెట్: ప్రస్తుత పరిస్థితి ఇది
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర వాసులు యథేచ్ఛగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని కొన్ని మీడియా చానళ్లలో వచ్చిన కథనాలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. పాతబస్తీలోని ఎంజే మార్కెట్, జంబాగ్ ప్రాంతాల్లో ప్రజలు విచ్చలవిడిగా రోడ్డు మీదకు వస్తున్నారని కొన్ని వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఈస్ట్ జోన్ డీసీపీ ఎం. రమేశ్ తెలిపారు. ‘లాన్‌డౌన్ ఉల్లంఘన గురించి భయాలు సృష్టిస్తూ ఎంజే మార్కెట్, జంబాగ్ ప్రాంతాలకు చెందిన పాత చిత్రాలు మీడియాలో ప్రసారం చేయబడ్డాయి. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రస్తుత చిత్రాలను చూడమని చెప్పండి. మిమ్మల్ని రక్షించడానికి మేము అక్కడ ఉన్నాము, ఎల్లప్పుడూ ఉంటాము. దయచేసి అబద్దపు ప్రచారాన్ని నమ్మకండి, వ్యాప్తి చేయకండి’ అంటూ ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ ట్వీట్ చేశారు. అక్కడ ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన ఫొటోలను కూడా ఆయన ట్విటర్లో షేర్ చేశారు. (ఐదు రాష్ట్రాల్లో కరోనా లేదు: కేంద్రం) లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలకు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ సంఖ్యలో వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. కరోనా మహమ్మారి కట్టడికి ప్రజలందరూ సహకరించాలని, అనవసరంగా బయటకు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: బయటకు రావాలంటే భయం -
ఎంజే... నిండా వెలుగులే...
సాక్షి, హైదరాబాద్ : నవీకరణ పనుల్లో భాగంగా ఎంజే మార్కెట్ లైటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఫ్లోరింగ్ పనులు మరో వారం రోజుల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు. అలాగే నగరంలో మార్పులు గమనిస్తున్నారా! జంక్షన్లలో జిలుగులు.. సెంట్రల్ డివైడర్లకు రంగులు.. ఐలాండ్లలో వాటర్ ఫౌంటైన్లు.. రోడ్లకు లేన్ మార్కింగ్‌లు.. ఫ్లైఓవర్లు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఎల్ఈడీ వెలుగులు.. పార్కుల్లో ఆకట్టుకునేలా ఫర్నిచర్.. ఇలా ఒకటేమిటి వివిధ ప్రాంతాల్లో మనసుకు ఆహ్లాదంగా, కనువిందుగా సరికొత్త దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. రానున్న ఏడెనిమిది నెలల్లో ఇవి మరింత విస్తృతం కానున్నాయి.. దాదాపు పది నెలల్లో బల్దియా పాలకమండలి ఎన్నికలు జరగనుండటంతో.. ఈలోగా నగర ముఖచిత్రాన్ని మార్చేందుకు, సరికొత్త హైదరాబాద్‌ను ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకనుగుణంగా మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులతో తరచూ సమీక్షలునిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పలు ఆదేశాలుజారీ చేస్తూ, బాగున్న వాటిని మరిన్ని పెంచాల్సిందిగా సూచిస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఖైరతాబాద్ జంక్షన్ సుందరీకరణ, ఇందిరాపార్కులో పంచతత్వ పార్కు, శేరిలింగంపల్లి జోన్‌లోని ప్లాస్టిక్ ఫుట్‌పాత్‌లు తదితరమైనవి అన్ని జోన్లలోనూ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. బాగున్నవాటిని సత్వరం చేయా ల్సిందిగా మంత్రి కేటీఆర్ సూచిస్తున్నారు. అంతేకాదు.. ఇతర నగరాల్లో బాగున్నవి అధ్యయనం చేసి ఇక్కడ ఆచరించాలని పేర్కొనడంతో ఈ వారం ఆరంభంలో పలువురు జోనల్, అడిషనల్ కమిషనర్లు, ఇంజినీర్లు, తదితర అధికారులు పుణెను సందర్శించి వచ్చారు. అంతకుముందు నాగపూర్ తదితర ప్రాంతాలను సందర్శించి వచ్చారు. పుణెలోని పార్కుల మాదిరి ఫర్నిచర్, రహదారుల్లో క్యారేజ్ వే తక్కువున్న విశాలమైన ఫుట్‌పాత్‌లు, రహదారుల మార్గాల్లోని భవనాల సెట్‌బ్యాక్‌ల్లో ఫుట్‌పాత్‌లు, వీలైనన్ని చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు వంటివి నగరంలోనూ అవకాశమున్న ప్రాంతాల్లో ఆచరించేందుకు సిద్ధమవుతున్నారు. రూ.59.86 కోట్లతో జంక్షన్లలో సిగ్నలింగ్.. వీటితోపాటు ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుకూ సిద్ధమయ్యారు. ప్రస్తుతం 221 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ సంస్థ కాంట్రాక్టు ముగియడంతో మరో మూడేళ్ల పాటు వాటి కొనసాగింపు, కొత్తగా 155 జంక్షన్లలో సిగ్నలింగ్ సిస్టమ్, 98 ప్రాంతాల్లో ఫెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఖర్చయ్యే రూ.59.86 కోట్లకు గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. నగరంలో 65 ఫౌంటెన్లకుగాను తొలిదశలో 25 ప్రాంతాల్లో రూ. 25 లక్షలతో ఆధునికీకరణ పనులకు సిద్ధమయ్యారు. వీటితోపాటు రాత్రి ఒంటిగంట వరకు ఆహారం అందించే స్ట్రీట్‌ఫుడ్ వంటి వాటిపైనా దృష్టి సారించారు. సంగీత్, ఎల్బీనగర్, లక్డికాపూల్, నల్లగొండ జంక్షన్లు సహా ఇరవై జంక్షన్లను వివిధ థీమ్‌లతో అభివృద్ధి చేయనున్నారు. ఇటీవలే మెట్టుగూడ సమీపంలోని ఆలుగడ్డ బావి జంక్షన్‌ను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దడం తెలిసిందే. పార్కులను నిర్వహించేందుకు రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నారు. నగరవ్యాప్తంగా మూడువేల పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. ఫ్లైఓవర్ల కింద, రోడ్ల వెంట గోడలకు హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏర్పాటు ఆలోచనలున్నాయి. ప్రత్యేక థీమ్‌లతో మరికొన్ని పార్కులు తీర్చిదిద్దనున్నారు. యోగా శిక్షకులను అందుబాటులో ఉంచనున్నారు. -
ఎం.జే మార్కెట్ వద్ద అగ్ని ప్రమాదం
-
నాంపల్లి ఎం.జే మార్కెట్ వద్ద అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లిలోని యం.జే మార్కెట్ వద్ద తెల్లవారుజామున 5 గంటలకు ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ భవనంలో పివిసికి చెందిన పైపులను నిల్వ ఉంచినట్లు తెలుస్తుంది. -
ఈ నెల 22న బక్రీద్
సాక్షి, హైదరాబాద్: బక్రీద్ పండుగను ఈ నెల 22వ తేదీన జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా ఖుత్తారీ తెలిపారు. సోమవారం మోజంజాహీ మార్కెట్లోని కమిటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడులోని మదురైలో నెలవంక కనబడినట్లు సమాచారం కాస్త ఆలస్యంగా అందినట్లు పేర్కొన్నారు. ఇస్లామియా కేలండర్ ప్రకారం ఏటా జిల్ హజ్ నెలలో నెలవంక దర్శనం ఇచ్చిన పదవ రోజు ముస్లింలు బక్రీద్ పండుగ జరుపుకుంటారని అన్నారు. అలాగే ఈ ఏడాదీ నెలవంక దర్శనమిచ్చిన పదవ రోజైన ఆగస్టు 22న పండుగ జరుపుకోవాలని సూచించారు. -
మొజాంజాహి మార్కెట్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్
-
ఎంజే మార్కెట్‌ను సందర్శించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : చారిత్రక మోజంజాహీ మార్కెట్‌కు పుర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఎంజే మార్కెట్‌ని దత్తత తీసుకున్నారు. జీహెచ్ఎంసీ కూడా ఎంజే మార్కెట్ పునరుద్దరణకు 10కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఎంజే మార్కెట్‌ని సందర్శించారు. మార్కెట్ లోని వ్యాపారులతో ముచ్చటించిన కేటీఆర్.. అక్కడ లభించే ఫేమస్ ఐస్ క్రీమ్ రుచి చూశారు. జీహెచ్ఎంసీ చేపట్టబోయే పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనులను నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కేటీఆర్ వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ అధికారులు ,తదితరులు ఉన్నారు. Visited the famous Mozzam Jahi market along with @arvindkumar_ias Restoration works start tomorrow & would be completed in 4 months Hyderabad is a unique city that has a great blend of both amazing heritage structures & modern contemporary ones pic.twitter.com/hGIpvk0E12 — KTR (@KTRTRS) April 16, 2018 -
గణనాధులతో కిక్కిరిసిన ఎమ్జె మార్కెట్
-
నిమజ్జనం వేడుకల్లో ’సుబ్రమణ్యం ఫర్ సేల్’ టీమ్
-
నిమజ్జనానికి వెళ్తూ బోల్తా పడిన ఆటో
-
నిమజ్జనానికి వెళ్తూ బోల్తా పడిన ఆటో
హైదరాబాద్: వినాయకుడ్ని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి తీసుకువెళ్తున్న ఆటో ట్రాలీ సోమవారం ఎంజే మార్కెట్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు సృహా కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయాపడ్డారు. దాంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనలో వినాయకుడి విగ్రహాం ధ్వంసమైంది. డ్రైవర్ ఆటోను మలుపు తిప్ప బోయారు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. -
‘మెట్రో’పై 25న కీలక భేటీ
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో పనులపై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు మరో పది రోజుల్లో తెరపడే అవకాశాలున్నాయి. చారిత్రక ప్రదేశాల్లో మెట్రో మార్గాన్ని భూగర్భానికి మళ్లించాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈనెల 25న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నగర మెట్రో ప్రాజెక్టు పనుల పురోగతి, ట్రయల్న్ ్రఏర్పాట్లు, భూగర్భ మార్గం సాధ్యాసాధ్యాలు ఇతర ఆర్థిక సంబంధిత అంశాలపై హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుల్తాన్‌బజార్, ఎంజే మార్కెట్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో భూగర్భ మెట్రో మార్గం సాధ్యాసాధ్యాలపై హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఇంజినీర్ల బృందం ఇప్పటికే అధ్యయనం ప్రారంభించినట్టు తెలిసింది. నివేదికను ఈ నెల 25లోగా పూర్తిచేసి ఆర్థికశాఖకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు సమాచారం. భూగర్భ మార్గం సాధ్యాసాధ్యాలను, అలైన్మెంట్ మారిస్తే భూసేకరణ బిల్లు ప్రకారం ఆస్తుల సేకరణ కష్టసాధ్యం కానుందని తెలిపే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రో ప్రాజెక్టు వ్యయం పెరిగితే భరించే స్థితిలో లేమని, ప్రభుత్వ పరంగా ఇతరత్రా రాయితీలిస్తేనే 3 కారిడార్లలో 72 కిలోమీటర్ల ప్రాజెక్టును 2017 జనవరి నాటికి పూర్తిచేయగలమని ఎల్ అండ్ టీ సంస్థ ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ఆర్థికశాఖకు విన్నవించనున్నట్టు తెలిసింది. ఆర్థికశాఖ మార్గదర్శకాలే కీలకం? మెట్రో రైలు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయకుంటే అన్ని రంగాల్లో పీపీపీ ప్రయోగం విఫలమౌతుందన్న సంకేతాలు వెలువడితే దేశవ్యాప్తంగా మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని కేంద్ర ఆర్థికశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గతంలో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), ఒప్పందపత్రం ప్రకారమే ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని పూర్తిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించనున్నట్టు సమాచారం. సుమారు రూ.15 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు నిధి కింద రూ.1458 కోట్లు కేటాయించాల్సి ఉన్నందున ఆర్థికశాఖ మార్గదర్శకాలే రాష్ట్ర ప్రభుత్వానికి శిరోధార్యమయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
మోహంజాహి మార్కెట్‌కు చేరుకోనున్న కాన్వాయ్
-
జడివాననో గణయాత్ర
భక్తుల జయజయధ్వానాల మధ్యగణ..గణమంటూ గణనాథులు నిమజ్జనానికి కదిలారు. జడివానలోనూ భక్తుల ఉత్సాహం హోరెత్తింది. వాన కారణంగా శోభాయాత్రకు ఆటంకం కలిగింది. డప్పుల దరువులు, యువత కేరింతలతో యాత్ర ఆద్యంతం శోభిల్లింది. అటు ట్యాంక్‌బండ్, ఇటు ఎంజే మార్కెట్.. ఎటు చూసినా భక్తజన సందోహపు సందడే. ఇక, లంబోదరుని లడ్డూలు లక్షలు పలికాయి. వేలం పాటలో భక్తులు రికార్డు స్థాయి ధరకు వీటిని దక్కించుకున్నారు. కవాడిగూడ, న్యూస్‌లైన్: భాగ్యనగరం భక్తిభావంతో తడిసిముద్దయ్యింది. గణేష్ నామస్మరణతో పులకించింది. బొజ్జగణపయ్య నిమజ్జనోత్సవం బుధవారం ట్యాంక్‌బండ్‌పై వేలాది భక్తజనుల మధ్య కోలాహలంగా, అత్యంతవైభవంగా జరిగింది. గణేష్ విగ్రహాలను క్రేన్ల సహాయంతో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తుండగా భక్తులు అత్యంత ఆసక్తిగా తిలకించారు. వివిధ ప్రభుత్వ శాఖలు విరివిగా సేవలందించాయి. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనోత్సవ విశేషాలసమాహారం... వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ట్యాంక్‌బండ్ జాతరను తలపించింది. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు నిమజ్జనం చేసేందుకు నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి తరలి వచ్చే విగ్రహాల లెక్కింపు కార్యక్రమంలో పోలీసులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్, రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వాహనాలను, రాణిగంజ్ వైపు వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. విద్యుత్ శాఖ ఇందిరా పార్కు కార్యాలయం ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై విద్యుత్ క్యాంపు ఆఫీసును ఏర్పాటు చేసింది. భక్తుల కోసం జలమండలి ఆధ్వర్యంలో తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిటీ పోలీసు ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఏర్పాటుచేసిన కార్యాలయంలో ప్రభుత్వ వైద్యులు వైద్య శిబిరం నిర్వహించారు. కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తప్పిపోయిన పిల్లల కోసం బాలల పరిరక్షణ విభాగం, హైదరాబాద్ జిల్లా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిస్సింగ్ చిల్డ్రన్స్ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ట్యాంక్‌బండ్ అటు నుంచి ఇటువరకు మొత్తం కలియదిరిగి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షణ చేశారు.