
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వంత శర్మ నగరానికి వచ్చారు. ఈ క్రమంలో ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. అసోం సీఎం ప్రసంగాన్ని టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
సీఎం బిశ్వంత శర్మ ప్రసంగిస్తుండగా.. టీఆర్‌ఎస్ నేత నందు బిలాల్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. సీఎం తన ప్రసంగంలో టీఆర్‌ఎస్, కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభా వేదిక మీదకు ఎక్కిన బిలాల్ మైక్ లాక్కున్నాడు. దీంతో టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వెంటనే బిలాల్‌ను పోలీసులు అక్కడి నుంచి తరిలించారు. దీంతో, టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడికి తరలివచ్చారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ నేతలకు సంస్కారం లేదు. అసోం సీఎంను అడ్డుకోవడం సిగ్గుచేటు. ఇది పిరికిపంద చర్య. ఇది పెద్ద సాహసోపేత చర్య కాదు. పోలీసుల కనుసన్నాల్లోనే ఇదంతా జరిగిందని తాను భావిస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment