
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా నేడు గణనాథుల శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. అటు భాగ్యనగరంలో సైతం గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ఈ క్రమంలో వివిధ మార్గాల ద్వారా గణనాథులు ట్యాంక్ వైపు కదులుతున్నారు.
కాగా, నిమజ్జనం సందర్భంగా నగరంలోని ఎంజే మార్కెట్ వద్ద ఫ్లెక్సీల గొడవ చోటుచేసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరులతో ఉత్సవ సమితి సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రి తలసాని ఫ్లెక్సీని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో, అక్కడి నుంచి ఫ్లెక్సీని తొలగించినట్టు సమాచారం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నట్టు పోలీసు అధికారులు స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment