Ganesh Nimajjanam celebrations
-
అనంతపురంలో వినాయక నిమజ్జనం సందడి (ఫొటోలు)
-
గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన పోలీస్ డాన్స్
హైదరాబాద్: భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ వెంబడి గణేశుడి నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. కొద్దిసేపు భారీగా వర్షం కురిసినా కూడా నిమజ్జనాలు కొనసాగాయి. ఇదిలా ఉండగా ఈ సంబరాల్లో ఒక పోలీస్ అధికారి డాన్స్‌తో దుమ్ము రేపారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా విగ్నేశ్వరుడు తొమ్మిది రోజులపాటు మన మధ్య కొలువుతీరి ఘనంగా పూజలు అందుకున్నాడు. నవరాత్రులు ముగిసిన సందర్భంగా గణనాథుడు గంగమ్మ ఒడిలో చేరుతున్న వేళ ట్యాంక్ బండ్ చేరుకున్న భక్తులంతా సంబరాల్లో మునిగితేలారు. మిలాద్-ఉన్-నబీ, గణేష్ నిమజ్జనం ఇకేరోజు రావడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 40000 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. నిమజ్జనాలకు తరలివచ్చిన భక్తుల్లో పిల్ల, పెద్ద, యువత తేడా లేకుండా తీన్మార్ దరువుకు ధూందాం డాన్సులేశారు. ఇదే సంబరాల్లో ఓ పోలీసాయన కూడా తన్మయత్వంతో చిందులేశారు. ప్రొఫెషనల్ డాన్సర్లా ఈయన వేసిన స్టెప్పులకు చుట్టూ ఉన్నవారు కూడా నివ్వెరపోయి చూస్తుండిపోయారు. ఇంకేముంది మిగతా పోలీసులు కూడా కాసేపు సంబరాల్లో పాలుపంచుకుంటూ సరదాగా డాన్సులు చేశారు. ఈ వీడియో టీవీలో కనిపించిన కొద్దిసేపటికే మొబైల్ ఫోన్లలో చేరి వైరలయ్యింది. #Hyderabad police dance during Ganesh Shoba Yatra pic.twitter.com/rcWNY8wwbL — Naveena (@TheNaveena) September 28, 2023 ఇది కూడా చదవండి: నిమజ్జన వేళ.. స్టెప్పులేసిన సీపీ రంగనాథ్ -
హైదరాబాద్ లో వినాయక నిమజ్జన శోభాయాత్ర
-
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. ముగ్గురు యువకులు మృతి
పల్నాడు: వినాయకుని విగ్రహం నిమజ్జనం చేసేందుకు చెరువులోకి దిగిన ముగ్గురు మృత్యువాత పడిన ఘటన గణపవరం గ్రామంలో సోమవారం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం వలస వచ్చి కూలిపని చేసుకుని జీవిస్తున్న మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. గణపవరంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో బేల్దారీ కార్మికుడిగా మహారాష్ట్రకు చెందిన ముఖేష్మోతిరామ్ ఖోటే (39) పనిచేస్తుంటాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామానికి చెందిన భాగ్యం ప్రవీణ్ (18), శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం బొమ్మిడివానిపేటకు చెందిన కోన వసంతకుమార్ (18) తల్లిదండ్రులు కంపెనీ క్వార్టర్లలో నివాసం ఉంటూ అక్కడే కూలీలుగా పనిచేస్తుంటారు. ప్రవీణ్, వసంత్‌కుమార్ ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు. వినాయక చవితి సందర్భంగా ముఖేష్ ఇంట్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు సోమవారం ముఖేష్, ప్రవీణ్, వసంత్ వేలూరు రోడ్డులోని ప్రభువు చెరువుకు సాయంత్రం 6 గంటలకు వెళ్ళారు. 9 గంటలైనా ముగ్గురూ తిరిగి రాకపోయేసరికి ప్రవీణ్, వసంత్ తల్లిదండ్రులు ఆందోళనకు గురై చెరువు వద్దకు వెళ్ళారు. అక్కడ వారి చెప్పులు, బైక్, సైకిల్, సెల్ఫోన్లు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులో గాలించగా రాత్రి 11 గంటల సమయంలో భాగ్యం ప్రవీణ్ మృతదేహం లభించింది. అర్ధరాత్రి ఒంటి గంట వరకూ వెతికినా మిగిలిన వారి జాడ కానరాక పోవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. ఉదయాన్నే మళ్లీ గాలింపు చేపట్టగా ముఖేష్ మోతిరామ్ఖోటే మృతదేహం లభ్యమైంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కోన వసంతకుమార్ మృతదేహం లభ్యమైంది. ముగ్గురి మృతదేహాలను చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రూరల్ ఎస్సై రాజేష్ కేసు నమోదు చేశారు. అడుగు విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్ళి.. వినాయక చవితి సందర్భంగా ముఖేష్ నివాసంలో అడుగు ఎత్తు గల వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసి సోమవారం వరకూ పూజలు జరిపారు. మహారాష్ట్రలో నివాసం ఉండే తల్లి మృతి చెందిందని కబురు రావటంతో పూజలు నిలిపివేసి వినాయకుని నిమజ్జనం చేసేందుకు క్వార్టర్లలో ఉండే ప్రవీణ్, వసంత్ సహాయం కోరాడు ముఖేష్. తాను సైకిల్‌పై, ప్రవీణ్, వసంతకుమార్ ఇద్దరూ బైక్‌పై విగ్రహాన్ని తీసుకుని చెరువు వద్దకు వెళ్ళారు. ముగ్గురూ ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి 9 గంటల సమయంలో కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ చెరువు వద్దకు వెళ్లి అందులో మునిగినట్టు గుర్తించారు. అనాథలుగా ముగ్గురు చిన్నారులు ముఖేష్మోతిరామ్ఖోటే ముగ్గురు పిల్లలతో ఏడాది క్రితం గణపవరం వచ్చి స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ క్వార్టర్లలో ముగ్గరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఈయన భార్య రెండేళ్ల క్రితం వదిలి వెళ్లిపోయింది. ఇద్దరు చిన్నారులు గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. మూడో చిన్నారి రెండేళ్ల పాప కావటంతో ముఖేష్ అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. తండ్రి మృతితో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. ఐటీఐ పాసై ఉద్యోగ వేటలో ఉండగా.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం దమ్మిడివానిపేట గ్రామానికి చెందిన కోన రామారావు పదేళ్లుగా స్థానిక కంపెనీ క్వార్టర్లలో ఉంటూ పనులకు కావలసిన కూలీలను సరఫరా చేసే మేసీ్త్రగా వ్యవహరిస్తున్నాడు. ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు వసంత్‌కుమార్ చిలకలూరిపేటలోని ఏఎంజీలో ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నాడు. అతను ఇప్పుడు మరణించడంతో రామారావుతోపాటు ఆయన భార్య గుండెలవిసేలా రోదిస్తున్నారు. సాయంగా వెళ్లి.. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన భాగ్యం పుల్లయ్య, విజయమ్మ దంపతులు నాలుగేళ్లుగా కంపెనీ క్వార్టర్లలో నివాసం ఉంటూ పనులకు వెళ్తున్నారు. స్వస్థలంలో ఎలాంటి పనులు లేకపోవటంతో నాలుగేళ్ళ క్రితం వలస కార్మికులుగా వచ్చి పనిచేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం కాగా, పెద్దకుమారుడు ఉద్యోగం చేస్తున్నాడు. ప్రవీణ్ చదువు పూర్తి చేసి తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ప్రవీణ్ ముఖేష్‌కు సాయంగా వెళ్లి మృతి చెందడంతో పుల్లయ్య, విజయమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందడి (ఫోటోలు)
-
తీన్మార్ డ్యాన్సులు, స్టెప్పులతో గణేషుడికి వీడ్కోలు
-
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర
-
ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు.. అసోం సీఎంకు తలసాని కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎంజే మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. గణేష్ శోభాయాత్ర సందర్బంగా నగరానికి విచ్చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఎంజే మార్కెట్లో సభా వేదికపై ఆయన ప్రసంగిస్తూ టీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు. దీంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు అసోం సీఎం స్పీచ్‌ను అడ్డుకున్నారు. మైక్ లాక్కున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలను రెచ్చగొట్టడానికే అసోం సీఎంను ఇక్కడికి రప్పించారు. అసోం సీఎం భాష సరిగా లేదు. అందుకే స్థానికులు అడ్డుకున్నారు. ఆయన గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇక్కడికి వచ్చారు. అలాంటప్పుడు గణేషుడి గురించి లేదా శోభాయాత్ర గురించి మాట్లాడాలి కానీ.. రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. బీజేపీ నేతలు హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ మంత్రి తలసాని ప్రశ్నించారు. అనంతరం హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని.. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. -
టీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డ ఈటెల రాజేందర్
-
తలసాని అనుచరులతో ఉత్సవ సమితి సభ్యుల వాగ్వాదం
-
HYD: గణేష్ శోభాయాత్రలో తలసాని ఫ్లెక్సీ వివాదం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా నేడు గణనాథుల శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. అటు భాగ్యనగరంలో సైతం గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ఈ క్రమంలో వివిధ మార్గాల ద్వారా గణనాథులు ట్యాంక్ వైపు కదులుతున్నారు. కాగా, నిమజ్జనం సందర్భంగా నగరంలోని ఎంజే మార్కెట్ వద్ద ఫ్లెక్సీల గొడవ చోటుచేసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరులతో ఉత్సవ సమితి సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రి తలసాని ఫ్లెక్సీని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో, అక్కడి నుంచి ఫ్లెక్సీని తొలగించినట్టు సమాచారం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నట్టు పోలీసు అధికారులు స్పష్టంచేశారు. -
భాగ్యనగరంలో మహాజాతర
-
ఆటంకాలు సృష్టిస్తే ప్రగతిభవన్లోనే నిమజ్జనాలు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్/ఖైరతాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకునేలా వెంటనే ఏర్పాట్లు చేయాలని లేనిపక్షంలో ప్రగతిభవన్ వేదికగా గణేశ్ నిమజ్జనం నిర్వహించాల్సి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. వినాయక నిమజ్జనాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. కోర్టు ఉత్తర్వు లను ఉల్లంఘించే సీఎస్ సోమేశ్‌కుమార్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి నిమజ్జనానికి ఆటంకాలు సృష్టించడం సిగ్గుచేటన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్‌తోపాటు మరికొందరు నేతలతో కలసి సోమవారం ఆయన ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 25 కిలోల లడ్డూ ప్రసాదాన్ని బండి సంజయ్ నెత్తిన పెట్టుకొని కొద్దిదూరం నడిచి వెళ్లి మహాగణపతికి సమర్పించారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఏటా వినాయక నిమజ్జనాలు ఉద్రిక్త వాతావరణంలో జరుపుకునే దుస్థితి టీఆర్ఎస్ పాలనలో ఏర్పడింది. ఈ ఉత్సవాలు జరుపుకునేందుకు అన్ని అనుమతులు తీసుకున్నాక కూడా ప్రభుత్వం నిమజ్జనాలకు ఆటంకాలు సృష్టిస్తోంది. ఏటా గణేశ్ మండపాల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. హిందువుల పండుగలంటేనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశంగా మారుస్తోంది’ అని ఆరోపించారు. కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు సైతం పాతబస్తీలో రంజాన్ సందర్భంగా ముస్లింలు ర్యాలీలు చేపట్టారని.. బాదం, పిస్తాలు పంచినా తాము అడ్డుకోలేదని చెప్పారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోమని.. ట్యాంక్‌బండ్ వద్ద ఎలా నిమజ్జనం చేసుకోవాలో తమకు తెలుసన్నారు. సమాజమంతా బాగుండాలని కోరుకునే వాడే నిజ మైన హిందువని, హిందువులంతా సంఘటితం కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కాగా, ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురైన పలువురు హోంగార్డులు సంజయ్‌ను కలసి వినతిపత్రం ఇచ్చారు. హైకోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలిచ్చినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా రు. ఇందుకు సంజయ్ స్పందిస్తూ కేసీఆర్‌ను సీఎం పదవి నుంచి తొలగిస్తేనే హోంగార్డులతోపాటు ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇదీ చదవండి: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం.. మెట్రో కిటకిట -
ఆదివారం ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఎడిసన్ లో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం
-
దేశవ్యాప్తంగా నిమ‘జ్జన జాతర’
-
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వినాయక చవతి సందర్భంగా హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లను సీపీ అంజనీ కుమార్ పర్యవేక్షించారు. నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా అధికారులు ట్యాంక్ బండ్‌పై ట్రయల్ నిర్వహించారు. ఈ క్రమంలో నేడు ఖాళీ డ్రమ్ పెట్టి ఎక్స్పరిమెంట్ చేశారు.. అలానే థర్మకోల్ పెట్టి మరోకటి చేశారు. (చదవండి: ‘ట్యాంక్‌బండ్ ఎలా ఉందండి.. సిటీ పారిస్ నగరంలా కనిపిస్తోంది’) ఇది కొత్త ప్రోగ్రాం అన్నారు సీపీ అంజనీ కుమార్. నిమజ్జనం కోసం 3 ఏళ్ల క్రితం ఆటోమేటిక్‌గా రిలీజ్ చేసే యంత్రాలు ఉపయోగించారని తెలిపారు. గణేష్ నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ , పీవీఆర్ మార్గ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. -
హుస్సేన్‌సాగర్ వద్ద గణేష్ నిమజ్జనం సందడి
-
వైరల్ : నాగిని డాన్స్ చేస్తూ చనిపోయాడు
సియోని : చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. చనిపోయే వ్యక్తికి కూడా తాను ఇప్పుడు చనిపోబోతున్నాను అనే విషయం తెలియదు. చనిపోవడం అనేది ఇప్పటికీ ఓ మిస్టరీయే. అది ఎప్పుడు ఎవరికి ఎలా ఏ రూపంలో వస్తుందో ఊహించలేం. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. గణపతి నిమజ్జనం సందర్భంగా నాగిని డాన్స్ చేస్తూ ఓ వ్యక్తి అకాస్మాత్తుగా మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన గురుచరణ్ ఠాగూర్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి గణేష్ మండపం వద్ద నాగిని మ్యూజిక్‌కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఏమైందా అని చుట్టూ ఉన్న వాళ్లు దగ్గరికి వెళ్లి చూసేలోపే అతడు మృతిచెందాడు. అతడు డ్యాన్స్ చేస్తూ మృతి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
గణేష్ ఉత్సవాలపై మంత్రి తలసాని సమీక్ష
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల నేపథ్యంలో మంత్రి తలసాని అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగరంలో వినాయక ఉత్సవాల నిర్వహణపై ప్రజా పతినిధులతో చర్చలు జరిపామని తెలిపారు. గణేష్ ఉత్సవ సమితితో పాటు అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాని,హైదరాబాద్‌లో 54 వేల వినాయక ప్రతిమలను పూజలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తారని అన్నారు. గణేష్ ఉత్సవాలను చూడటానికి దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తారని, అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం తరపున హుస్సేన్ సాగర్‌లో గంగ హారతి ఇస్తామని, హారతి ఎప్పుడనే అంశంపై పురోహితులను చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వ్యాఖ్యనించారు. నిమజ్జనం కోసం 26 చోట్ల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సోమవారం ఖైరతాబాద్ గణేష్ పనులను పరిశీలిస్తామని తెలిపారు. సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సర్వ మతాలను గౌరవించే నగరమని, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నిమజ్జనానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించామని అన్నారు. బందోబస్తు విషయంలో రాజీ పడేది లేదన్నారు. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. గతంలో ముంబైలో గణేష్ ఉత్సవాలు గొప్పగా జరిగేవని, అయితే, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. పండుగ విజయవంతంగా జరిగేలా ప్రజలు,భక్తులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. రానున్న గణేష్ ఉత్సవాల పై అన్ని శాఖలతో సమావేశం నిర్వహించామని, మునుపెన్నడూ లేని విధంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని పండుగలను ఆదరిస్తూ చాలా గొప్పగా జరుపుతున్నారని కొనియాడారు. -
గణనాథుడికి ఘనమైన వీడ్కోలు
మంచిర్యాల టౌన్ : మంచిర్యాలలో వినాయక నిమజ్జన ఉత్సవాలను సోమవారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. స్థానిక విశ్వనాథాలయ కాలక్షేప మండపంలోని పట్టణ ఆర్యవైశ్య, వాసవీ ఆర్యవైశ్య యువజన సంఘం గణేశ్ మహల్లో, శ్రీలక్ష్మీనారాయణ(మార్వాడీ) మందిర్‌లోని గణనాథుని మండపాల్లో శోభాయాత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, కమిషనర్ తేజావత్ వెంకన్న, మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు, సీఐ వి.సురేశ్, పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు మంచాల రఘువీర్, అధ్యక్షుడు సిరిపురం రాజేశ్, వాసవీ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాసం సతీశ్, కొండ చంద్రశేఖర్, హిందూ ఉత్సవ సమితి ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు పోటు తిరుపతి రెడ్డి, అధ్యక్షుడు గోలి రాము, ఉపాధ్యక్షులు తోట తిరుపతి, రజనీశ్‌జైన్, మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి పూసాల వెంకన్న, కోశాధికారి చందా కిరణ్, సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మెయిన్ రోడ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన హిందూ ఉత్సవ సమితి వేదికలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, వినాయక నిమజ్జన మహోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని, అంతా ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొనాలని కోరారు. విద్యార్థినుల ప్రదర్శనలు శోభాయాత్రకు మరింత శోభను తెచ్చాయి.