గణనాథుడికి ఘనమైన వీడ్కోలు | rousing farewell to vinayaka | Sakshi
Sakshi News home page

గణనాథుడికి ఘనమైన వీడ్కోలు

Published Tue, Sep 9 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

గణనాథుడికి ఘనమైన వీడ్కోలు

గణనాథుడికి ఘనమైన వీడ్కోలు

 మంచిర్యాల టౌన్ : మంచిర్యాలలో వినాయక నిమజ్జన ఉత్సవాలను సోమవారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. స్థానిక విశ్వనాథాలయ కాలక్షేప మండపంలోని పట్టణ ఆర్యవైశ్య, వాసవీ ఆర్యవైశ్య యువజన సంఘం గణేశ్ మహల్‌లో, శ్రీలక్ష్మీనారాయణ(మార్వాడీ) మందిర్‌లోని గణనాథుని మండపాల్లో శోభాయాత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి.

ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, కమిషనర్ తేజావత్ వెంకన్న, మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు, సీఐ వి.సురేశ్, పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు మంచాల రఘువీర్, అధ్యక్షుడు సిరిపురం రాజేశ్, వాసవీ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాసం సతీశ్, కొండ చంద్రశేఖర్, హిందూ ఉత్సవ సమితి ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు పోటు తిరుపతి రెడ్డి, అధ్యక్షుడు గోలి రాము, ఉపాధ్యక్షులు తోట తిరుపతి, రజనీశ్‌జైన్, మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి పూసాల వెంకన్న, కోశాధికారి చందా కిరణ్, సభ్యులు పాల్గొన్నారు.

అనంతరం మెయిన్ రోడ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన హిందూ ఉత్సవ సమితి వేదికలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, వినాయక నిమజ్జన మహోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని, అంతా ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొనాలని కోరారు. విద్యార్థినుల ప్రదర్శనలు శోభాయాత్రకు మరింత శోభను తెచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement