nadipelli diwakar rao
-
మంచిర్యాలలో మావోల లేఖ.. ఎమ్మేల్యేకు హెచ్చరిక
సాక్షి, ఆదిలాబాద్ : మంచిర్యాల నియోజక వర్గంలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, అతని తనయుడు భూదందాలు, కబ్జాలు ఆపాలని హెచ్చరిస్తూ... మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరుతో లేఖ విడుదల చేశారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి భూముల సెటిల్మెంట్ల పేరిట అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటామని లేఖలో తెలిపారు. గుడిపేటలో 2004లో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నిర్మాణం చేపట్టారని తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిసిన ఈ ఎమ్మెల్యే ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని హామీఇచ్చి... ఇప్పటికీ వారి సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపించారు.ఎమ్మెల్యే ముంపు గ్రామాల్లో ఉన్న తన అనుచరులు, అధికారులతో కుమ్మక్కై కోట్ల రూపాయాలు కాజేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని అక్కడి నాయకులతో కోర్టులో కేసులు వేయించి... గెలిసిన తర్వాత బాధితుల నుంచి మళ్లీ కమీషన్లు తీసుకున్నారని అన్నారు. గుడిపేటలో ఓ సర్పంచి ఇసుక అక్రమంగా దందా చేస్తున్నారని, వీరి పద్ధతి మార్చుకోకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. చదవండి: నవ్యా రెడ్డి హత్య: వెనీలా ఆత్మహత్య చదవండి: నగ్న ఫొటోలు పంపాలని ఇన్‌స్టాలో వేధింపులు -
టీఆర్ఎస్ శక్తివంతమైన పార్టీ
దండేపల్లి: టీఆర్ఎస్ శక్తివంతమైన పార్టీ, అందరి చూపు టీఆర్ఎస్ వైపే ఉందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మండలంలోని లింగాపూర్‌లో సర్పంచ్ అజ్మేర సుగుణ, పలువురు, తాళ్లపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండు వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ చేప డుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రైతు సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, వైస్ ఎంపీపీ రాజేందర్, మండల అధ్యక్ష, కార్యదర్శులు మల్లేష్, శ్రీనివాస్, నాయకులు లింగ య్య, అంజయ్య, తిరుపతి, దేవయ్య, రవి, తదిత రులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ను గెలిపించాలి.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్నేతను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కోరారు. ఆదివారం పట్టణంలోని 26, 27 వార్డులలో పాత మంచిర్యాల, రంగంపేట్‌లలో ఎన్నికల ప్రచారా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం 7, 8, 9, 10 వార్డులలో ఇంటింటాæ ప్ర చారం నిర్వహించారు. 32 వార్డులో నడిపెల్లి విజిత్‌కుమార్ ప్రచారం చేశారు. మున్సిపల్ వైస్ చై ర్మన్ నల్ల శంకర్, టీఆర్ఎస్ నాయకులు గోగుల రవీదర్‌రెడ్డి, కౌన్సిలర్ దబ్బెటి శ్రీనివాస్, కౌన్సిలర్ బగ్గని రవి, జగన్మోహన్ పాల్గొన్నారు. -
గిరిజనుల అభివృద్ధికి కృషి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గిరిజనుల అభివృద్ధికి కృషి చేశానని తాజా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. సోమవారం గఢ్‌పూర్, ర్యాలీ, నాగారం, చిన్నగోపాల్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే గిరిజన గ్రామాలను మరింత∙అభివృద్ధి చేస్తానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రైతాంగానికి సాగునీరు అందిచామని వివరించారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెటామన్నారు. టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొమ్మాటి సత్తయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి వెంకటేశ్వర్రావు, నాయకులు దొమ్మాటి లచ్చన్న, కోవ రాజు, శ్రీనివాసరావు, రఫీ, గిరిజనులు పాల్గొన్నారు. నస్పూర్‌లో విజిత్‌రావు ప్రచారం.. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు తనయుడు విజిత్‌రావు నస్పూర్ మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తీగల్‌పహడ్ పరిధిలోని రాంనగర్, సీసీసీ కార్నర్‌తో పాటు శ్రీరాంపూర్‌లో టీఆర్ఎస్ను మరోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తేలేటి కిష్టయ్య, మల్లెత్తుల రాజేంద్రపాణి, కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, డీకొండ అన్నయ్య, వేల్పుల రవీందర్, ముత్తె రాజేశం, ముక్కెర వెంకటేశ్, నొముల నరేందర్‌రెడ్డి, జాడీ బానుచందర్, కిరణ్ పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి.. అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నడిపెల్లి దివాకర్‌రావును గెలిపించాలని మంచిర్యాల మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర అన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్కు ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్టు చైర్మన్ నడిపెల్లి విజిత్‌కుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్, పెండ్లి అంజయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్ కారుకూరి చంద్రమౌళి, గడప రాకేశ్, పల్లె భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. గఢ్‌పూర్‌లో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్న స్థానికులు -
అర్హులందరికీ పింఛన్ అందేలా చూస్తా..
మంచిర్యాల టౌన్ : ‘దాదాపు పదేళ్లుగా నివాసం ఉంటున్నం. మా కాలనీల్లో ఇంకా సమస్యలు ఉన్నాయి. రాత్రివేళ దోమల బాధ తీవ్రమై నిద్ర కూడా పట్టడం లేదు. శివారు కాలనీల్లో మురికి కాలువల నిర్మాణాలు లేక.. మురికి గుంతల నుంచి వెలువడే దుర్వాసన భరించలేకపోతున్నం. మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలి, ఇళ్లస్థలాలు ఇప్పించాలి. మరుగుదొడ్ల నిర్మాణాలు, బిల్లులు మంజూరు చేయించాలె..’ అంటూ మంచిర్యాల మున్సిపాల్టీ పరిధిలోని తిలక్‌నగర్, వికలాంగుల కాలనీ ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పట్టణ ప్రజలసమస్యలు తెలుసుకోవడం కోసం ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆయా కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. కొన్ని సమస్యలపై హామీలిస్తూ.. మరికొన్నింటిపై అప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి పరిష్కారానికి సూచనలు చేశారు. అర్హులందరికీ పింఛన్ అందేలా చూస్తానని, కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు. నడిపెల్లి దివాకర్‌రావు : అందరికీ నమస్కారాలు.. అందరూ బాగున్నారా.. ప్రజలు : బాగున్నాం సారూ.. మీరు బాగున్నారా.. దివాకర్‌రావు : మీరు బాగుంటే.. మేమూ బాగున్నట్టే.. దివాకర్‌రావు : ఏంటి..? లక్ష్మి బాగున్నావా.. చెన్నూరి లక్ష్మి : బాగున్నా సారూ.. దివాకర్‌రావు : ఏమిటీ నీరసంగా ఉన్నావు.. పింఛన్ వచ్చిందా..? చెన్నూరి లక్ష్మి : ఏమి లేదు సారూ, బాగానే ఉన్నా. రెండు నెలల పింఛన్ రూ.2 వేలు అచ్చింది. దివాకర్‌రావు : మరీ బట్టలు కొన్నావా లేదా..? చెన్నూరి లక్ష్మి : బట్టలు కొంటే తిండి ఎట్లా సారూ. దివాకర్‌రావు : వాడ ఎట్టుంది. ఏం సమస్యలు ఉన్నాయి.. చెన్నూరి లక్ష్మి : వాడ బాగుంది సారూ... కానీ ఇంకా రోడ్లు కావాలి అలాగే లాట్రీన్‌లు కావాలి. దివాకర్‌రావు : మరుగుదొడ్ల సమస్య త్వరలోనే తీరుతుంది. గతంలో ఎలా ఉండే ఇప్పడు అభివృద్ధి ఎలా ఉంది. చెన్నూరి లక్ష్మి : అన్ని సమస్యలు తీరుస్తున్నారు. గతంలో కంటే ఇప్పడు బాగానే ఉంది. దివాకర్‌రావు : మీరు చెప్పండి పింఛన్లు అందరికీ వస్తున్నాయా.. ఎర్రోజు చంద్రమౌళి : నా భార్యకు వత్తలేదు.. నాకు మొన్నటిదాకా అచ్చింది. ఇప్పడేమో ఆపిండ్రు. ఏడేళ్ల పట్టి తీసుకుంటున్న, అయినా ఇప్పడు ఎందుకు ఆపారో తెలుత్తలేదు సారూ.. దివాకర్‌రావు : (పత్రాలు అన్నీ పరిశీలించి) పర్వాలేదు... పింఛన్‌కు అర్హుడివే, పింఛన్ వచ్చేలా చూస్తాను. ఆసంపల్లి వెంకటేశ్ : సార్... మాకు పట్టాలు కావాలి, నల్లాలు కావాలి(అంధ వికలాంగుడు) దివాకర్‌రావు : వెంకటేశ్ బాగున్నావా... నీ భార్య చంద్రకళ(కాళ్లు లేవు) ఎలాగుంది.. ఇప్పుడేం చేస్తున్నారు, మీ ఇద్దరికీ పింఛన్ వచ్చిందా..? ఆసంపల్లి వెంకటేశ్ : కూరగాయలు అమ్ముకుంటున్నాం సారూ... పింఛన్ కూడా ఇద్దరికీ కలిపి రూ.మూడు వేలు వచ్చింది. దివాకర్‌రావు : మరీ కాలనీలో క్వార్టర్ ఉందా..? ఆసంపల్లి వెంకటేశ్ : క్వార్టర్ ఇచ్చిండ్రు, కానీ పట్టాలు ఉంటే నల్లా కనక్షన్ ఇస్తారంటూ.. అప్పు చేసి మరుగుదొడ్డి కట్టుకున్నం. డబ్బులు రాలేదు. దివాకర్‌రావు : అధికారులతో మాట్లాడి పట్టాలు అందించే ఏర్పాటు చేస్తా. పట్టా అందగానే ఇదిగో ఈ మీ చైర్మనమ్మ(చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధరను చూపిస్తూ) నల్లా కనెక్షన్ ఇప్పిస్తది, బిల్లులు కూడా వస్తాయి...(అంతా నవ్వులతో చప్పట్లు) పసునూటి భీమక్క : సారూ.. తిలక్‌నగర్‌లో కిరాయికి ఉంటున్నం. అయితే రాజీవ్‌నగర్‌లో స్థలం ఇచ్చారు. కానీ హౌసింగ్ సారు బిల్లు రాదంటున్నరు. ఏం చేయాలి..? దివాకర్‌రావు : (కౌన్సిలర్ దెబ్బట శ్రీనివాస్‌తో మాట్లాడి...) ఆన్లైన్లో పేరు నమోదు కాలేదంటా. అధికారులతో మా ట్లాడి వివరాలు తెలుసుకుని పట్టాలు ఇప్పించి, నిర్మాణాని కి సంబంధించి బిల్లులు కూడా ఇప్పించేలా ఏర్పాటు చేస్తా. దివాకర్‌రావు : ఏమ్మా... పెన్షన్ వస్తుందా..? తాహెరాబేగం : లేదు సారూ... పింఛన్ వస్తలేదు. ఇక్కడ నాన్న దగ్గర ఉంటున్నా. రెండు సార్లు దరఖాస్తు చేసిన పేరు లేదంటున్నరు. దివాకర్‌రావు : ఇంతకు ముందు తీసుకున్నావా..? తాహెరాబేగం : లేదు, కొత్తగా దరఖాస్తు చేశా. దివాకర్‌రావు : (కౌన్సిలర్‌తో మాట్లాడి...) పెన్షన్ వచ్చేలా చూస్తానమ్మా... దివాకర్‌రావు : ఏం... సత్తయ్య బాగున్నావా..? తిలక్‌నగర్ వార్డు ఎలా ఉంది..? ఆకుల సత్తయ్య : బాగున్నా సార్.. పదేళ్లకు పైగా ఉన్న సమస్యలు తీరుతున్నాయి సార్. దివాకర్‌రావు : ఇంకా ఇక్కడ ఏం సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి..? ఆకుల సత్తయ్య : మరుగుదొడ్లు, శ్మశాన వాటిక సమస్యలు ఉన్నాయి సర్.. దివాకర్‌రావు : మరుగుదొడ్ల బిల్లుల సమస్య అధికారుల దృష్టికి తీసుకువెళ్లుతా... శ్మశాన వాటికలో బోరు వేయించా కదా సత్తయ్య... ఆకుల సత్తయ్య : బోర్ ఉన్నా కానీ మోటర్ కావాలి, శ్మశాన వాటిక స్థలానికి చుట్టూ కంచె వేయాలి. దివాకర్‌రావు : (మున్సిపల్ అధికారులతో మాట్లాడి చెబుతాననే లోపు) చైర్మనమ్మ ఇక్కడే ఉంది. సమస్య తీరేలా మాట్లాడి కంచే ఏర్పాటుకు కృషి చేస్తాం. దివాకర్‌రావు : ఏం సంగతులమ్మా ఏంటీ అంతా బాగున్నారా..? జరీనా : అంతా బాగున్నాం సారూ... దివాకర్‌రావు : నన్ను చూసి అంతా బాగున్నామని అంటున్నారా (అనగానే అంతా నవ్వులు)..! జరీనా : పింఛన్లు అందరికీ అత్తున్నాయ్ సారూ... మీరు అచ్చినాకా అందరికి అన్నీ అందుతున్నాయి సారూ.. పింఛన్లు రానోళ్లు దరఖాస్తు చేసిండ్రు జర వాళ్లకి అచ్చేలా చూడాలి సారూ.. దివాకర్‌రావు : అర్హులైన అందరికీ ఆసరా పెన్షన్లు అందుతాయి. ఒకటికి రెండు సార్లు పరిశీలించి అందరికీ వచ్చేలా చూస్తామమ్మా.. ముడుసు లక్ష్మణ్ : సార్.. 1999లో వికలాంగుల కాలనీలో ఇళ్లు పంపిణీ చేశారు. అప్పటి నుంచి మరుగుదొడ్లు, నీటి కుళాయి కనెక్షన్లు, రోడ్లు, కాలువలు ఇలా అన్ని సమస్యలపై కలెక్టర్, ఆర్డీవో, ప్రజాప్రతినిధులు వస్తున్నారు. చూస్తున్నారు కానీ ఇంకా సమస్యలు తీరడం లేదు. దివాకర్‌రావు : రోడ్లు, కాలువలు పూర్తయ్యాయి కదా... ముడుసు లక్ష్మణ్ : మరుగుదొడ్ల బిల్లులు రాక వికలాంగులు అవస్థలు పడుతున్నారు. ఇక పట్టాలు ఉంటేనే నల్లా కనెక్షన్లు ఇస్తామంటున్నారు. అందరికీ పట్టాలు రాలేదు. ఏం చేయాలి..? దివాకర్‌రావు : పట్టాల కోసం తహశీల్దార్‌తో మాట్లాడి వెంటనే ఆ సమస్య తీరేలా చూస్తాను. దివాకర్‌రావు : అందరూ బాగున్నారా..? పనికి పోతున్నారా..? ప్రజలు : బాగున్నాం సారూ... అంతా పత్తి ఏరడానికి, కూలీ పనికి పోతున్నాం సారూ.. మహిళలు : మొగుళ్ల పంపాదన గుడుంబా పాలవుతంది.. మా సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోతన్నయి. దివాకర్‌రావు : గుడుంబా అమ్మకాలను వెంటనే ఆపేలా ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తా. మహిళలు : అవును సారూ.. గుడుంబా అమ్మకుండా చూడండి.. మీ రుణం తీర్చుకుంటం సారూ.. దివాకర్‌రావు : డ్వాక్రా రుణాలు వస్తున్నాయా..? మహిళలు : వస్తున్నాయి సార్... వడ్డీ లేని రుణం ఇప్పించేలా చూడండి సార్ దివాకర్‌రావు : ఇది వరకే వచ్చిన రుణాలతో ఏం చేస్తున్నారు..? మహిళలు : దుకాణాలు నడిపిస్తున్నాం, కుట్టు మిషన్లు కొన్నాం.. సార్.. వాటితోనే కుటుంబం గడుపుతున్నాం. గిప్పుడు రూ.పది లక్షల రుణం కోసం ఎదురు చూస్తాన్నాం సార్.. దివాకర్‌రావు : రుణం పొంది డబ్బులు వృథా చేయకుండా వ్యాపారం నిర్వహించి ఆర్థికంగా ఎదగాలి. -
గణనాథుడికి ఘనమైన వీడ్కోలు
మంచిర్యాల టౌన్ : మంచిర్యాలలో వినాయక నిమజ్జన ఉత్సవాలను సోమవారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. స్థానిక విశ్వనాథాలయ కాలక్షేప మండపంలోని పట్టణ ఆర్యవైశ్య, వాసవీ ఆర్యవైశ్య యువజన సంఘం గణేశ్ మహల్లో, శ్రీలక్ష్మీనారాయణ(మార్వాడీ) మందిర్‌లోని గణనాథుని మండపాల్లో శోభాయాత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, కమిషనర్ తేజావత్ వెంకన్న, మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు, సీఐ వి.సురేశ్, పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు మంచాల రఘువీర్, అధ్యక్షుడు సిరిపురం రాజేశ్, వాసవీ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాసం సతీశ్, కొండ చంద్రశేఖర్, హిందూ ఉత్సవ సమితి ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు పోటు తిరుపతి రెడ్డి, అధ్యక్షుడు గోలి రాము, ఉపాధ్యక్షులు తోట తిరుపతి, రజనీశ్‌జైన్, మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి పూసాల వెంకన్న, కోశాధికారి చందా కిరణ్, సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మెయిన్ రోడ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన హిందూ ఉత్సవ సమితి వేదికలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, వినాయక నిమజ్జన మహోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని, అంతా ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొనాలని కోరారు. విద్యార్థినుల ప్రదర్శనలు శోభాయాత్రకు మరింత శోభను తెచ్చాయి. -
వన జాతర
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : తూర్పు ప్రాంతంలో బుధవారం వన దేవతల జాతర కన్నుల పండువగా ప్రారంభమైంది. మంచిర్యాల, చెన్నూర్, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, గోలేటి, రెబ్బెన, బెజ్జూర్‌లో సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం నేత్రపర్వంగా జరిగింది. సారలమ్మ దర్శనంతో భక్తులు పులకించారు. అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. రెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. పులకించిన గోదారి సరిహద్దు.. మంచిర్యాలలోని గోదావరి తీరంలో సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తజనం పోటెత్తింది. గోదావరి తీరాన కరీంనగర్ జిల్లా గోలివాడ, మంచిర్యాల రెండు వైపుల జాతర జరుగుతుండడంతో భక్తులతో గోదావరి కిటకిటలాడింది. జిల్లా తూర్పు ప్రాంతంలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, వాంకిడి, కౌటాల, బెజ్జూర్ మండలాల నుంచే కాకుండా సరిహద్దున ఉన్న మహా రాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు గోదావరి దారులు కిక్కిరిశాయి. పిల్లాపాపలు,సామగ్రితో భక్తులు జాతరకు చేరుకున్నా రు. ఎడ్లబండ్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు, కారు, కాలినడకన వచ్చారు. మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న గోదావరి తీరం వరకు భక్తులు బారులు తీరారు. కొలువుదీరిన సారలమ్మ తొలి రోజు కూతురు సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. మేడారం నుంచి వచ్చిన పూజారులు లక్ష్మయ్య, అనసూర్య, రాధ, సమ్మయ్య సారలమ్మకు పూజలు చేసి భక్తుల జయజయ ధ్వానాలు, బాజా భజంత్రీల మధ్య గద్దెల వరకు తీసుకొచ్చారు. సాయంత్రం ఐదు గంటలకు సారలమ్మ గద్దెపై కొలువుదీరగానే భక్తులు భక్తి పారవశ్యంతో ఊగిపోయారు. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో శివసత్తులు పూనకంతో పరవశించి పోయారు. మహిళలను అమ్మవారు ఆవహించగా.. గద్దెపై కొలువుదీరిన అనంతరం శివసత్తులు మామూలు స్థితికి వచ్చారు. నేడు సమ్మక్క రాక తొలిరోజు కూతురు సారలమ్మ గద్దెపైకి చేరుకోగా గురువారం సమ్మక్క గద్దెపై కొలువుదీరనుంది. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడానికి గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తె అవకాశాలు ఉన్నాయి. తొలిరోజు సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు పవిత్రమైన గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వన దేవతలను దర్శనం చేసుకునే ముందు గోదావరి నదిలో స్నానాలు చేస్తే పునీతలవుతారని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు నేరుగా గోదావదికి వెళ్లి పిల్లాపాపలతో స్నానాలు చేశారు. అనంతరం సారలమ్మను దర్శనం చేసుకోవడానికి బారులుతీరారు. నిలువెత్తు బంగారం(బెల్లం), తలనీలాలు సమర్పించారు. కోళ్లు, మేకలు బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ప్రముఖుల పూజలు సారలమ్మ గద్దెపై కొలువుదీరగానే అధికారులు, రాజకీయ నాయకులు తొలి దర్శనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్‌రావు, మాజీ ైచె ర్మన్ పెంట రాజయ్య, తహశీల్దార్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈలు సంతోశ్, మసూద్‌అలీ, ఇన్చార్జి సీఐ కరుణాకర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, రమేశ్, ఆలయ ఈవో వామన్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దయానంద్, మాజీ కౌన్సిలర్ కిషన్ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. భక్తులకు ఏర్పాట్లు భక్తుల తాకిడిని ముందుగానే అంచనా వేసిన అధికారులు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసి నల్లాల ద్వారా భక్తులకు తాగునీరు, స్నానాలకు నల్లాలు, మహిళలు దుస్తులు మార్పుకోవడానికి ప్రత్యేక గదులు, తక్షణ వైద్య సహాయం కోసం ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పురపాలక సంఘం సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లారు. విద్యుత్ దీపాలను అమర్చారు. పోలీసులు శాంతి భద్రతలు పర్యవేక్షించారు. మార్కెట్ కమిటీ కార్యాలయం సమీపంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రాంనగర్ నుంచి వన్‌వే ఏర్పాటు చేసి వాహనాలను మళ్లించారు. దుకాణాలు వెలి శాయి. ఈసారి మద్యం అమ్మకాలకు అనుమతి లభిం చకపోవడంతో మందుబాబులు ఇబ్బందులు పడ్డారు. వ్యాపారులు ధరలను అమాంతం పెంచారు.