సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎంజే మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. గణేష్ శోభాయాత్ర సందర్బంగా నగరానికి విచ్చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఎంజే మార్కెట్‌లో సభా వేదికపై ఆయన ప్రసంగిస్తూ టీఆర్‌ఎస్ సర్కార్, కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు. దీంతో స్థానిక టీఆర్‌ఎస్ నేతలు అసోం సీఎం స్పీచ్‌ను అడ్డుకున్నారు. మైక్ లాక్కున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది.
ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తలసాని మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలను రెచ్చగొట్టడానికే అసోం సీఎంను ఇక్కడికి రప్పించారు. అసోం సీఎం భాష సరిగా లేదు. అందుకే స్థానికులు అడ్డుకున్నారు. ఆయన గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇక్కడికి వచ్చారు. అలాంటప్పుడు గణేషుడి గురించి లేదా శోభాయాత్ర గురించి మాట్లాడాలి కానీ.. రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. బీజేపీ నేతలు హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ మంత్రి తలసాని ప్రశ్నించారు. అనంతరం హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని.. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment