
కొత్తపల్లి (కరీంనగర్): సమైక్య పాలనలో రూ.10 లక్షల నిధులకు పది వేలు ఖర్చు చేసి చెప్పులరిగేలా తిరిగామని..ఆనాడు నిధుల కోసం కాంగ్రెస్ మంత్రుల వద్ద ప్రాధేయపడ్డా ఫలితం లేదని.. అదే తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పద్మనగర్ నుంచి ఒడ్యారం వరకు 14 కిలోమీటర్లు 4 లైన్ల రహదారి విస్తరణకు ఆర్రోజుల్లోనే రూ.88 కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఆదివారం ఎలగందుల వై జంక్షన్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు.
పద్మనగర్– ఒడ్యారం వరకు ఉన్న రహదారిని మరో రూ.70 కోట్లు మంజూరు చేసి సిరిసిల్ల వరకు 4 లైన్లు విస్తరిస్తామని వెల్లడించారు. రూ.500 కోట్లతో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్, రూ.60 కోట్లతో మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన పూర్తయితే ఎలగందులకు కొత్త కళ వస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment