Minister Rajinder itala
-
సొంత రాష్ట్రంలో కోట్లతో అభివృద్ధి
కొత్తపల్లి (కరీంనగర్): సమైక్య పాలనలో రూ.10 లక్షల నిధులకు పది వేలు ఖర్చు చేసి చెప్పులరిగేలా తిరిగామని..ఆనాడు నిధుల కోసం కాంగ్రెస్ మంత్రుల వద్ద ప్రాధేయపడ్డా ఫలితం లేదని.. అదే తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పద్మనగర్ నుంచి ఒడ్యారం వరకు 14 కిలోమీటర్లు 4 లైన్ల రహదారి విస్తరణకు ఆర్రోజుల్లోనే రూ.88 కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఆదివారం ఎలగందుల వై జంక్షన్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. పద్మనగర్– ఒడ్యారం వరకు ఉన్న రహదారిని మరో రూ.70 కోట్లు మంజూరు చేసి సిరిసిల్ల వరకు 4 లైన్లు విస్తరిస్తామని వెల్లడించారు. రూ.500 కోట్లతో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్, రూ.60 కోట్లతో మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన పూర్తయితే ఎలగందులకు కొత్త కళ వస్తుందన్నారు. -
అభివృద్ధికి నూతన ఒరవడి
∙ స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ∙ అన్ని వర్గాల సంక్షేమమే సర్కారు ధ్యేయం ∙ రైతు సంక్షేమానికి పెద్దపీట ∙ అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం ∙ వచ్చే ఏడాది నుంచి పెట్టుబడి రాయితీ ∙ కులవృత్తిదారులకు ఆర్థిక తోడ్పాటు ∙ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం ∙ జిల్లాకు త్వరలోనే సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ∙ హరితహారం లక్ష్యాన్ని చేరుకుంటాం ‘అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నూతన ఒరవడితో అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం.. వ్యవసాయంలో రక్తాన్ని చెమటగా మార్చి రాష్ట్ర సౌభాగ్యం కోసం అన్నం పెట్టే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం.. మానవతా కోణంలో రైతులకు వచ్చే ఏడాది నుంచి 2 పంటలకు 8 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని తప్పకుండా అమలు చేస్తాం.. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం.. పాలకులు, అధికార యంత్రాంగంపై పూర్తి విశ్వాసం కలిగేలా ప్రజల మన్ననలు పొందేందుకు కృషి చేస్తాం’ అని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం కరీంనగర్ పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. – సాక్షి, కరీంనగర్ కరీంనగర్: పోలీసుల గౌరవవందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి.. స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,79, 581 కుటుంబాలకు గాను 1,76,083 కుటుంబాలకు రూ.48 కోట్లతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో, దేశంలో 20వ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 98 శాతం కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకుని వాడుకుంటున్నాయని.. వచ్చే గాంధీ జయంతి నాటికి మిగితా 2 శాతం మరుగుదొడ్లు నిర్మించుకొని సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా మార్చాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జిల్లాలోనే ప్రారంభించి పిలుపునివ్వడంతో ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటివరకు 1.10 కోట్లకు గాను 35 లక్షలు నాటినట్లు తెలిపారు. వర్షాభావంతో మందగించినా లక్ష్యం మేరకు మొక్కలు నాటుతామని తెలిపారు. నాటిన మొక్కలను రక్షించడానికి అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది రైతులకు పెట్టుబడి.. అన్నం పెట్టే రైతులకు మానవీయ కోణంతో వచ్చే ఏడాది నుంచి రెండు పంటలకు గాను రూ.8 వేల పెట్టుబడి నగదు సహాయాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైస్బోల్ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఆహార ఉత్పత్తిలోనూ అగ్రగామిగా ఉందని, ఇదే స్ఫూర్తిని రైతులు కొనసాగించాలని కోరారు. వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిపే దృఢసంకల్పం తో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని ప్రాథమిక సహకార సంఘాలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 2017–18 ఖరీఫ్ సీజన్‌కు రూ.763.67 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసి రైతులను అప్పుల ఊబి నుంచి తొలగించామన్నారు. రైతులు తక్కువ నీరు ఎక్కువ సాగు, అధిక దిగుబడులు వచ్చే బిందు తుంపర సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత.. ప్రభుత్వం సాగు, తాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. గోదావరి జలాలను మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని అన్నారు. కోటి ఎకరాలకు నీరందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్‌కు శ్రీకారం చుట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీని నీటిలో నింపేందుకు రూ.వెయ్యి కోట్లతో పోచంపాడు వద్ద ఇటీవల ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి శంకుస్థాపన చేశారని, దీంతో ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. మధ్య మానేరు ప్రాజెక్టులో ఈ ఏడాది 10 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నామన్నారు. ఉచిత విద్యుత్తు.. జిల్లాలో 1,02,696 వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. గత జూలై 18 నుంచి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.91 కోట్ల 66 లక్షల సబ్సిడీ భరిస్తోందని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో వ్యవసాయబావులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు 16, 33/11 కేవీ సబ్స్టేషన్లు కావాల్సి ఉండగా 5 సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, మిగిలినవి కూడా త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నివాస గృహాలపై ఉన్న ప్రమాదకరమైన హైటెన్షన్ విద్యుత్ లైన్లు తొలగిస్తున్నామన్నారు. కరీంనగర్ సిటీ ఆధునికీకరణ కార్యక్రమంలో భాగంగా రూ.28.50 కోట్లతో 580 విద్యుత్ టవర్లను ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్‌లోగా ఇంటింటికీ నీరు.. తాగునీటికి మహిళలు పడుతున్న ఇబ్బందులను దూరం చేయడానికి ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి ఇంటికీ నల్లాకనెక్షన్ ద్వారా డిసెంబర్‌లోగా తాగునీటిని అందించనున్నామని తెలిపారు. జిల్లాలో రూ.1,492 కోట్లతో 2 సెగ్మెంట్లలో పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. మిషన్‌కాకతీయ పథకం ద్వారా మొదటిదశలో రూ.88 కోట్లతో 223 చెరువులు మంజూరు చేసినట్లు తెలిపారు. 215 చెరువులలో పనులు పూర్తయ్యాయని, రెండో దశలో రూ.122.54 కోట్లతో 290 చెరువుల పనులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అందులో 153 చెరువు పనులు పూర్తి చేశామని, మిగిలినవి ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. మూడో దశలో 299 చెరువులలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. నాణ్యమైన విద్య, వైద్యం.. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటుకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 6 మైనార్టీ గురుకుల, 5 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభించామన్నారు. మూడేళ్లలో 504 గురుకుల పాఠశాలలు ప్రభుత్వం మంజూరు చేసి ప్రారంభించిందని పేర్కొన్నారు. ప్రతి పేద విద్యార్థిపై సంవత్సరానికి రూ.1.05 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. అన్ని పాఠశాలలకు రూ.50 కోట్లతో ప్రహరీల నిర్మాణం, గేట్లు అమర్చేందుకు తదితర మౌలిక వసతులు కల్పించామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి ఉత్తమ వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రూ.20 కోట్లతో నిర్మించిన 150 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి సేవలందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇంతవరకు 768 మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఆడపిల్లల తల్లులకు రూ.13 వేలు, మగబిడ్డ తల్లులకు రూ.12 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు.. అన్ని వర్గాల సంక్షేమం.. ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన 5,284 డబుల్బెడ్రూం ఇళ్లలో 279 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలినవి అగ్రిమెంట్ దశలో, టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ఆడపిల్లల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలలో భాగంగా పేదకుటుంబాలకు రూ.75,116 చొప్పున ఆర్థిక సాయమందిస్తోందన్నారు. గొల్ల కుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తూ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నామన్నారు. జిల్లాలో 2,347 యూనిట్లు లక్ష్యం కాగా.. రూ.14 ,69 కోట్లతో 1,323 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశామని తెలిపారు. మత్స్యకారుల కోసం చేపల పెంపకానికయ్యే పెట్టుబడిని ప్రభుత్వమే భరించి, లాభాలను బెస్త, ముదిరాజ్ తదితర మత్స్యకారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చేనేత కార్మికులకు అవసరమయ్యే నూలు, రసాయనాలను 50 శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తోందన్నారు. నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. నవీన క్షౌ రశాలలు పెట్టుకునేందుకు నాయీ బ్రాహ్మణులకు రూ.లక్ష ఆర్థిక సహకారమందిస్తుందన్నారు. రజకులకు అధునాతన యంత్రాలనందించనుందన్నారు. విశ్వబ్రాహ్మణులకు ఆర్థిక తోడ్పాడునందించనుందన్నారు. ఏ ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసరా పథకంలో 1.15,160 మందికి జిల్లాలో పింఛన్లు అందుతున్నాయన్నారు. ∙ బ్యాంకు లింకేజీ కింద స్వశక్తి సంఘాలకు 2017–18 సంవత్సరంలో రూ.246 కోట్ల బ్యాంకు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించి ఇంత వరకు రూ.50 కోట్ల రుణాలిప్పించామన్నారు. స్త్రీనిధి బ్యాంకు ద్వారా 2016–17 సంవత్సరంలో 80 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా ఇంతవరకు రూ.19 కోట్లు పంపిణీ చేశారని తెలిపారు. ∙ ఆర్అండ్బీ ద్వారా జిల్లాలో అన్ని రకాల రోడ్లను అభివృద్ధి చేసేందుకు, లింకు రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతుకు ప్రభుత్వం జిల్లాకు రూ.218 కోట్లు మంజూరు చేయగా పనులన్నీ ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. ∙ స్మార్ట్‌సిటీగా ఎంపికైన కరీంనగర్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఎల్ఎండీ దిగువన మానేరు రివర్‌ఫ్రంట్‌ను ఉత్తర తెలంగాణ మణిమకుటంగా సుందరంగా నిర్మించనున్నామని తెలిపారు. ఉజ్వలపార్కు వద్ద హరిత హోటల్‌ను నిర్మిస్తామని తెలిపారు. ∙ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు యంత్రాంగం కృషిని అభినందించారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించలేదని, ఉక్కుపాదం మోపడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బొడిగె శోభ, వొడితెల సతీష్‌బాబు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, నగరపాలక కమిషనర్ శశాంక, జేసీ బద్రి శ్రీనివాస్, ఆర్డీవో రాజాగౌడ్, ›ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రీయంగా బడ్జెట్ రూపకల్పన: ఈటల
సాక్షి, కరీంనగర్ : ‘పెద్దనోట్ల రద్దు తర్వాత ఉత్పన్నమైన పరిస్థితులు, జూలై 1 నుంచి వస్తు, సేవ పన్ను(జీఎస్టీ) అమలు నేపథ్యంలో శాస్త్రీయంగా వచ్చే ఏడాది బడ్జెట్‌ను రూపొందించనున్నాం’అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. శనివారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి పక్షాలు కాళ్లల్లో కట్టెపెట్టే కల్చర్ బంద్ చేసుకోవాలని, చావుకు, పెళ్లికి ఒకే డప్పు కొట్టే సంస్కృతి నుంచి బయటకు రావాలని హితవు పలికారు. ‘కాంగ్రెస్ పాల నలో రైతులు వంచనకు గురయ్యారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వకు గండిపెట్టి చెరువులను నింపిన చరిత్ర మాది. ఏనాడైనా మీరు చెరువులు నింపారా’అని ప్రశ్నించారు. ఏప్రిల్ 1 నుంచి ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేస్తామని పేర్కొన్నారు. -
సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయం
- నేను ఏ జిల్లాకు బాధ్యుడ్ని అవుతానో తెలియదు - మంత్రి ఈటల రాజేందర్ హన్మకొండ: తన ప్రాంతం వరంగల్ జిల్లాలో కలిసినా.. తాను ఈ ప్రాంతానికి వస్తానని... కాదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం హన్మకొండలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఏ జిల్లాకు ప్రాతినిధ్యం వహించాలో సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారన్నారు. 17 మంది మంత్రులుంటే 27 జిల్లాలు అవుతున్నాయని, ఈ క్రమంలో ఎవరికి ఏయే జిల్లాలు కేటాయిస్తారో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు. ప్రజల అభీష్టం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయన్నారు. -
అనర్హులను గుర్తించండి
రుణమాఫీపై బ్యాంకర్లకు మంత్రి ఈటల పిలుపు హైదరాబాద్: నకిలీ పాసు పుస్తకాలతో రుణమాఫీ పొందిన రైతులను గుర్తించడంలో ప్రభుత్వానికి బ్యాంకులు సహకరించాలని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. మొదటి, రెండో విడత రుణమాఫీ సొమ్ము అనేక మంది అనర్హులకు చేరిందని తమకు నివేదికలు వచ్చాయన్నారు. వచ్చే విడత రుణమాఫీ సొమ్ము అనర్హులైన రైతులకు చేరకుండా చూడాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ తమ సొమ్ము కాదని నకిలీ పాసు పుస్తకాల ద్వారా రుణమాఫీ పొందే వారి పట్ల బ్యాంకులు చూసీచూడనట్లుగా వ్యవహరించొద్దన్నారు. పేద పిల్లలు చదువుకోవడానికి విద్యా రుణాలు విరివిగా ఇవ్వాలన్నారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... ఇప్పటికీ కొన్ని బ్యాంకులు రైతుల నుంచి రుణంపై వడ్డీ వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. వడ్డీల చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. రైతుల నుంచి వసూలు చేసిన పంటల బీమా ప్రీమియాన్ని కూడా చాలా బ్యాంకులు పూర్తిస్థాయిలో బీమా కంపెనీలకు పంపలేదని పేర్కొన్నారు. దీనివల్ల అనేక మంది రైతులు బీమా సొమ్ము రాక నష్టపోయారన్నారు. పత్తి పంట ప్రీమియం చెల్లింపునకు గడువును జూన్ 14గా కేంద్రం నిర్ణయించిందని, ఈ విషయంలో బ్యాంకులు వ్యవసాయశాఖకు సహకరించాలన్నారు. ఎస్బీహెచ్ ఎండీ సంతాను ముఖర్జీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
గాల్లో తేలియాడుతున్న కేంద్రం: ఈటల
కరీంనగర్ సిటీ: వాస్తవిక దృక్పథాన్ని వీడి కేంద్ర ప్రభుత్వం గాల్లో తేలియాడుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. కరీంనగర్లో జిల్లా ప్రజాపరిషత్ నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజారంజక విభాగాలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. అంగన్వాడీలకు రూ.8 కోట్లు తగ్గించడం అందులో భాగమేనన్నారు. స్థానిక సంస్థలకు నిధులు కావాలని చాలాసార్లు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. స్థానిక సంస్థలకు నిధుల విషయంలో కేంద్రం పునరాలోచించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇస్తామన్నారు. -
ధరల పెరుగుదల వాస్తవమే
రెండేళ్లలో దిగి వస్తాయి: మంత్రి ఈటల ♦ ఉల్లి, కందిపప్పును సబ్సిడీపై విక్రయించాం ♦ రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేస్తాం ♦ గతేడాదితో పోలిస్తే ధరలు మరింత పెరిగాయి: కాంగ్రెస్, ఎంఐఎం ♦ హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీలో అక్రమాలు ♦ రేషన్ బియ్యాన్ని డబుల్ పాలిష్ చేసి సన్నబియ్యంగా మారుస్తున్నారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన మాట వాస్తవమేనని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ప్రతి నెలా సమావేశమై ధరలపై సమీక్ష నిర్వహిస్తోందన్నారు. దిగుబడి పెంపు, బ్లాక్‌మార్కెటింగ్ నియంత్రణ వంటి చర్యలతో రెండేళ్లలో ధరలు దిగివస్తాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలపై శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. కిలో ఉల్లి రూ.60కి చేరినప్పుడు రూ.20కి, కంది పప్పు రూ.190-210కి చేరినప్పుడు రూ.135 కిలో చొప్పున రైతు బజార్లలో విక్రయించామన్నారు. ఈ ఏడాది బియ్యం ధరలు పెరగలేదన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో సత్వర ఉపశమన చర్యల కింద.. ప్రతి వ్యక్తికి 5 కిలోల గోధుమలను కిలో రూ.2 చొప్పున సరఫరా చేస్తున్నామన్నారు. వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం వడ్డించాలని, వసతి గృహాలను నడిపించాలని ఆదేశించామన్నారు. 2015తో పోల్చితే 2016లో బ్లాక్ మార్కెట్ నిర్వాహకులపై దాడులు, కేసులు, అరెస్టులు తీవ్రం చేశామన్నారు. పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనలో భాగంగా తొలుత హైదరాబాద్‌లో చౌక ధరల దుకాణాల కంప్యూటరీకరణ చేపట్టామని, దీన్ని తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తామన్నారు. బోగస్ ఏరివేతకు రేషన్‌కార్డులను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తామని వెల్లడించారు. స్టేజ్-1, 2 సరుకు రవాణా వాహనాలకు జీపీఎస్ అమరుస్తామన్నారు. ‘‘ఒకేసారి అవినీతిని అరికట్టలేకపోయినా క్రమంగా తగ్గిస్తున్నాం. కొన్ని రేషన్ దుకాణాలు, వంటగ్యాస్ ఏజెన్సీల పరిధిలోని వినియోగదారుల సం ఖ్యలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నాయి. వాటిని హేతుబద్ధీకరిస్తాం. రాష్ట్రంలో కోరిన ప్రతి ఒక్కరికీ రూ.1,600 సబ్సిడీపై దీపం గ్యాస్ కనెక్షన్ ఇస్తాం. ఇప్పటికే 20 లక్షల కనెక్షన్లు మంజూరు చేశాం’’ అని ఈటల వివరించారు. ఈ ఏడాది ధరలు మరింత పెరిగాయి: కాంగ్రెస్, ఎంఐఎం మంత్రి ఈటల సభ ముందు ఉంచిన నిత్యావసర ధరల పట్టిక వాస్తవ విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. 2015తో పోల్చితే 2016లో ధరలు మరింత పెరిగినా.. ధరల పట్టికలో మాత్రం పెరగనట్టుగా చూపారన్నారు. వసతి గృహాలకు సన్నబియ్యం పంపిణీలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని మల్లుభట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రూపాయికే కిలో చొప్పున సరఫరా చేస్తున్న దొడ్డు బియ్యాన్ని మిల్లర్లు రీసైక్లింగ్ చేస్తున్నారని, డబుల్ పాలిష్ ద్వారా సన్న బియ్యంగా మార్చి తిరిగి హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ల పంపిణీలో గ్యాస్ కంపెనీల డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేపీ వివేకానంద్ డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం మాత్రమే లభిస్తోందని, చక్కెర, గోధుమలు, కిరోసిన్, పామాయిల్ ఇతర నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయని ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ పేర్కొన్నారు. రేషన్ దుకాణాలపై నిఘా పెంచాల న్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 20-30 శాతం ధరలు పెరిగాయని, మధ్యతరగతి ప్రజలకు సైతం సబ్సిడీపై నిత్యావసరాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దిగువ కోర్టు జడ్జిల విభజన షురూ ఏపీ, తెలంగాణలోని దిగువ కోర్టుల న్యాయమూర్తుల విభజన ప్రక్రియను హైకోర్టు ప్రారంభించిందని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. న్యాయమూర్తుల నుంచి ఆప్షన్లు కోరిందన్నారు. హైకోర్టు విభజనపై సభ్యులు ఎ.జీవన్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, అజ్మీరా రేఖల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. హైకోర్టు విభజన జరపాలని గత రెండేళ్లుగా ఒత్తిడి చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌లో ఏపీ హైకోర్టు ఏర్పాటు కోసం తాత్కాలిక భవనం, మౌలిక వసతులను కల్పించేందుకు సానుకూలంగా ఉన్నామన్నారు. -
కొలువులపై అసెంబ్లీలో రగడ
అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ♦ పోస్టుల భర్తీపై మాటతప్పుతున్నారన్న విపక్షాలు ♦ సంఖ్య తగ్గించాల్సిన అవసరం లేదు: ఈటల ♦ స్వల్పకాలిక చర్చకు సిద్ధమని మంత్రి హరీశ్ ప్రకటన సాక్షి,హైదరాబాద్: ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం శనివారం శాసనసభలో వాడివేడి చర్చకు దారితీసింది. విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వ తీరును తప్పుపడుతూ మూకుమ్మడిగా దాడికి దిగాయి. దీన్ని సమర్థంగా తిప్పికొడుతూ ఆర్థికమంత్రి.. ప్రతి విమర్శలకు దిగటంతో ప్రశ్నోత్తరాల సమయం కాస్తా ఆరోపణలు ప్రత్యారోపణలకు వేదికగా మారింది. పరిస్థితి చేయిదాటిపోయేలా కనిపించడంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుని ఈ అంశంపై స్వల్ప వ్యవధి చర్చకు సిద్ధమని ప్రకటించటంతో గొడవ సద్దుమణిగింది. ఫలితంగా పది ప్రశ్నలతో సాగాల్సిన ప్రశ్నోత్తరాల సమయం మూడు ప్రశ్నలతోనే ముగిసిపోయింది. ఇది మాట తప్పటమే.. రాష్ట్రంలో లక్ష కంటే ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భ ర్తీ ఎందుకు జరగటం లేదంటూ కాంగ్రెస్ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ సభ్యులు ఆర్.కృష్ణయ్య, సండ్ర వెంకట వీరయ్య ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. మొత్తం 56,150 ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదికలు అందాయని, అందులో 18,423 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆర్థికమంత్రి బదులిచ్చారు. అవసరాన్ని బట్టి ఖజానాపై పడే భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. దీన్ని విపక్షాలు తీవ్రంగా తప్పు పట్టాయి. ఖాళీ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవటం లేదని మండిపడ్డాయి. తెలంగాణ వస్తే ఖాళీలు ఏర్పడతాయని, వాటిని స్థానికులతో భర్తీ చేస్తారని అంతా ఆశించారని, కానీ ఇప్పుడు ఆ నమ్మకం సడలుతోందని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. లక్షకుపైగా ఖాళీలుంటే 18 వేల పోస్టుల భర్తీ మాత్రమే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. డీఎస్సీ కోసం 5 లక్షల మంది ఎదురుచూస్తున్నా... ప్రభుత్వం ఇదుగోఅదుగో అంటూ కాలయాపన చేస్తోందని, అందులో ఏమైనా ఇబ్బంది ఉంటే యూపీ తరహాలో టెట్ లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. మరో సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ... రెండు లక్షలకుపైగా ఖాళీలు ఉన్నట్టు అధికారులు చెబుతుంటే 18 వేల పోస్టుల భర్తీ అనటం సరికాదన్నారు. నిరుద్యోగుల ఆవేదన ఆవేశంగా మారి కట్టలు తెంచుకుంటే ప్రభుత్వానికి మంచిది కాదని సంపత్ హెచ్చరించారు. రెండో విడత సమావేశాల్లో మంత్రి ఈటల చెప్పిన లెక్కలకు ఇప్పుడు చెప్పే లెక్కల్లో భారీ తేడా ఉందని, ఖాళీల సంఖ్యను తగ్గించి ఎలా చూపుతారని, ఇది సిగ్గుచేటని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్కలు సరిగ్గా చూసుకోండి.. ఖాళీలను తగ్గించి చూపే అవసరం తమకు లేదని, విపక్ష సభ్యులే లెక్కలు సరిగ్గా చూసుకోవాలంటూ మంత్రి ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను చెప్పిన సంఖ్యనే ఇప్పుడు సభలో ఉంచానని, తెలంగాణ వచ్చిన తర్వాత 16 వేల పైచిలుకు పోస్టులు సృష్టించిన విషయాన్ని మరవొద్దన్నారు. ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, హోమ్‌గార్డులు, అంగన్వాడీ వర్కర్లు.. ఇలా అన్నీ కలుపుకొని 4,35,948 మంది ఉద్యోగులున్నారని, 1,07,744 ఖాళీలున్నట్టు తేలిందని చెప్పారు. 56,150 ఖాళీల భర్తీ అవసరమని ఆయా విభాగాల నుంచి ప్రతిపాదనలు అందాయని, వాటిని భర్తీ చేసే క్రమంలో 18,423 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. కమల్‌నాథన్ కమిటీ అధీనంలో ఉన్న గ్రూప్-1 పోస్టుల భర్తీ సమస్య మార్చినెలాఖరుతో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్టు వివరించారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్, టీడీపీ సభ్యులు.. పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌తో వాదనకు దిగారు. దీంతో మంత్రి హరీశ్ జోక్యం చేసుకుని.. మిగతా ప్రశ్నలకు అవకాశం లేకుండా ఒకే ప్రశ్నపై ఇంత సమయం వృథా చేయటం మిగతా సభ్యుల హక్కులను హరించడమేనన్నారు. సంపూర్ణ సమాధానం ఇవ్వకుండా ప్రశ్నను వదిలేయటం సరికాదని విపక్షాలు పేర్కొనటంతో స్వల్పకాలిక వ్యవధి చర్చకు సిద్ధమని హరీశ్ ప్రకటించడంతో సభ్యులు శాంతించారు. ఎమ్మెల్యే సీటు ఖాళీ అయితే ఆరు నెలల్లోపు మళ్లీ ఎన్నికలునిర్వహి స్తున్నాం. అదే ఉద్యోగాల ఖాళీలుంటే ఏళ్లుగా ఎందుకు భర్తీ చేయటం లేదు? వాటినీ ఎమ్మెల్యే సీటు తరహాలో నిర్ణీత కాలపరిమితితో భర్తీ చేయాలి. ఆ దిశగా చట్టం రావాలి. మన ఉద్యోగాలు మనకే అన్న నినాదంతోనే యువత ఉద్యమంలో పాల్గొన్నది. ఉద్యోగాలిస్తామని ఎన్నికల్లో టీఆర్ఎస్ చెప్పింది. నామమాత్రపు భర్తీతో సరిపెట్టాలని చూడడం వారిని మోసం చేయటమే. - అసెంబ్లీలో విపక్షాల నిలదీత మోసం చేసిందెవరు? మేం అధికారంలోకి రావటానికి ముందు పాలన వెలగబెట్టింది మీరు కాదా? అప్పుడెందుకు ఖాళీలు భర్తీ చేయలేదు. నిద్రపోతున్న వారిని లేపొచ్చు.. కానీ నటిస్తున్న వారిని లేపలేం. మీ ప్రేమ నిరుద్యోగ యువత సంక్షేమంపై కాదు. రాజకీయం, సీట్లు పెంచుకోవాలనే తాపత్రయం మాత్రమే. మేం చెప్పిందే చేస్తున్నాం.. ఎట్టి పరిస్థితిలోనూ ఖాళీలు భర్తీ చేస్తాం - ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ జవాబు -
రాష్ట్రాల హక్కులు హరించవద్దు
జీఎస్టీ సాధికారత కమిటీ సమావేశంలో ఈటల సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీని అమలు చేసే నేపథ్యంలో రాష్ట్రాల హక్కులు హరించరాదని కేంద్రానికి సూచించినట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ సాధికారత కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మద్యం, పెట్రోల్, వ్యవసాయ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావద్దని కేంద్రాన్ని కోరినట్టు వివరించారు. రూ. 700 కోట్ల సీఎస్టీ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని సడలించాలని కేంద్రాన్ని కోరగా, వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని వెల్లడించారు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొంది తప్పకుండా అమలవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని సడలించాలని కోరినట్లు తెలిపారు. ఆర్థికమంత్రులతో కూడిన జీఎస్టీ కమిటీ చైర్మన్‌గా అమిత్ మిత్రా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)పై ఏర్పాటైన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ నూతన చైర్మన్‌గా పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా శుక్రవారం ఎంపికయ్యారు. దీని చైర్మన్‌గా ఉన్న కేరళ ఆర్థిక మంత్రి కేఎం మణి అవినీతి ఆరోపణల నేపథ్యంలో గత నవంబర్‌లో పదవి నుంచి తప్పుకోవడం తెలిసిందే. మిత్రా ఆర్థికవేత్తగా సుపరిచితులు. ఫిక్కీ సెక్రటరీ జనరల్‌గా కూడా పనిచేశారు. 2011లో రాజకీయాల్లో చేరిన ఆయన అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. శుక్రవారం జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆయన జీఎస్టీ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. దీనికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా హాజరయ్యారు. దేశంలో జీఎస్టీ వ్యవస్థ అమలుకోసం నిబంధనలను రూపొందించడం లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుంది. -
కొత్త బేరం!
సుమారు లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ 6.5 లక్షల టన్నుల బియ్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా సేకరించాల్సిన పరిస్థి మిల్లర్ల తీరుపై పౌరసరఫరాల శాఖ గుర్రు వంద శాతం సీఎమ్మార్ రైస్ అందజేసిన మిల్లుల నుంచే బియ్యాన్ని సేకరించేందుకు సిద్ధం పభుత్వ నిర్ణయంతో మింగుడుపడని రైస్‌మిల్లర్లు బియ్యం కొనాలంటూ లాబీయింగ్ చేస్తున్న జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం నేత కరీంనగర్ : సర్కారు సొమ్మును మిల్లర్లు సోకు చేసుకోవడమంటే ఇదేనేమో! రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి నిర్దేశిత సమయంలో బియ్యం సరఫరా చేయాల్సిన రైస్‌మిల్లర్లు నిబంధనలను తోసిరాజేసి తమ వ్యాపారాలకు వాడుకుంటూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో సుమారు లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా నేటికీ రైస్‌మిల్లర్లే వద్దే ఉండిపోయింది. మిల్లర్ల నుంచి బియ్యం రాకపోవడంతో రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని మళ్లీ కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. తద్వారా ఈ ఏడాది ప్రభుత్వంపై రూ.2వేల కోట్లకుపైగా అదనపు భారం పడబోతోంది. మిల్లర్ల తీరుపై గుర్రుగా ఉన్న పౌరసరఫరాల శాఖ వంద శాతం కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని అందజేసిన మిల్లర్ల నుంచే బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఇది మింగుడు పడని జిల్లాకు చెందిన రైస్‌మిల్లర్ల సంఘం నేత హైదరాబాద్‌లో మకాం వేసి తనుకున్న పలుకుబడితో ఆ జీవోను సడలించేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తూ ప్రభుత్వానికి నష్టం చేకూర్చే పనిలో పడ్డారు. అందుకోసం మంత్రితో తనకున్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని పౌరసరఫరాల శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి 2.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యాన్ని మర ఆడించి బియ్యంగా ఇవ్వాలని రైస్‌మిల్లర్లకు అప్పగించారు. నిబంధనల ప్రకారం 15 నుంచి 45 రోజుల్లోగా కస్టమ్ మిల్లింగ్ చేసి ఇవ్వాల్సి ఉంది. మిల్లింగ్ చేసినందుకు క్వింటాలు దొడ్డు బియ్యానికి రూ.30, ఉప్పుడు బియ్యానికి రూ.50 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. కస్టమ్ మిల్లింగ్ గడువు ముగిసినప్పటికీ నేటికీ పూర్తి స్థాయిలో బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించలేదు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 65 శాతం బియ్యం మాత్రమే పౌరసరఫరాల శాఖకు అప్పగించారు. మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మిల్లర్ల వద్దే ఉంచుకుంటూ వందల కోట్ల రూపాయల వ్యాపారం నడిపిస్తున్నారు. అధికారులు సీరియస్... నిర్దేశిత గడువులోగా మిల్లింగ్ రైస్ పంపాలంటూ పౌరసరఫరాల శాఖ మొత్తుకున్నా మిల్లర్లు పట్టించుకోకపోవడం లేదు. రైస్‌మిల్లర్ల నిర్వాకంవల్ల పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం నిల్వలు పౌరసరఫరాల శాఖ వద్ద లేకపోవడంతో మళ్లీ కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అందులో భాగంగా ఈ సీజన్లో 6లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్‌మిలర్ల నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. కిలో బియ్యం 24 రూపాయల చొప్పున కొనుగోలు చేసి పేదలకు రూపాయికే కిలో బియ్యం చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రైస్‌మిల్లర్ల నుంచి సకాలంలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం రాకపోవడంవల్లే మళ్లీ బియ్యాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా ప్రభుత్వానికి రూ.2040 కోట్లు వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడింది. మిల్లర్ల తీరుతో విసిగిపోయిన పౌరసరఫరాల శాఖ అధికారులు వందశాతం కస్టమ్ మిల్లింగ్ చేసిన మిల్లుల నుంచి మాత్రమే బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. అడ్డుకుంటున్న జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం నేత సరిగ్గా ఇదే సమయంలో జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం నేత రంగప్రవేశం చేశారు. మంత్రికి సన్నిహితుడనని చెప్పుకునే సదరు నేత ఇతర జిల్లాలకు చెందిన మిల్లర్ల సంఘం నేతలను కూడగట్టి హైదరాబాద్‌లో మకాం వేశారు. ఆ జీవోను సవరించేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. అందుకోసం ఉన్నతస్థాయిలో పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉందంటూ రైస్‌మిల్లుల యజమానుల నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేసినట్లు తెలిసింది. ఒకవైపు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులపైన, మరోవైపు మంత్రి పేషీపైన ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మంత్రి ఈటల రాజేందర్ మాత్రం ఈ విషయంలో మిల్లర్ల ఒత్తిడికి తలొగ్గకుండా వందశాతం కస్టమ్ మిల్లింగ్ చేసిన మిల్లర్ల నుంచే బియ్యాన్ని కొనుగోలు చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
‘ప్రైవేటు’లోనూ రిజర్వేషన్లు అవసరం
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయు హైదరాబాద్: ప్రైవేటు రంగంలోనూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అవసరమని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 85 శాతం మంది దళితులకు ఏ రకమైన భూమి లేదు. ఎన్నో ఏళ్లుగా వీరంతా అసమానతకు గురవుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు చేయూతనిచ్చేందుకు, వారిని పారిశ్రామికంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నాం.’ అని అన్నారు. న్యాయ వ్యవస్థలోనే రిజర్వేషన్లు అమలు కావడం లేదని, కుల ధ్రువీకరణ పత్రాల కోసం అవస్థలు పడాల్సి వస్తోందని సొసైటీ అధ్యక్షుడు మురళీధర్‌రావు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లో సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచిస్తామన్నారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు, ఎస్సీలకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు వంటివి చేపడుతున్నామని చెప్పారు. సెమినార్లో టీఆర్ఎస్ చీఫ్‌విప్ కొప్పు ల ఈశ్వర్, మాజీ మంత్రి గీతారెడ్డి, ప్రజాగాయకుడు గద్దర్, వేములపల్లి వెంకట్రామయ్య, ఎం.జానయ్య పాల్గొన్నారు. -
ఈటలతో జార్ఖండ్ మంత్రి భేటీ
ఆహార భద్రతా చట్టం అమలుపై చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జార ్ఖండ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి సూర్యారాయ్ మంగళవారంరాత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆహార భద్రతాచట్టం, లబ్ధిదారుల ఎంపిక, సరుకుల పంపిణీ తదితర అంశాలపై వారు చర్చించుకున్నారు. రాష్ట్రంలో నిజమైన అర్హులకు సరుకులు పంపిణీ జరిగేలా లబ్ధిదారుల ఎంపిక విధానంపైనే ప్రధానంగా చర్చ సాగింది. రేషన్‌కార్డుల డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం తదితర ప్రక్రియలతో రాష్ట్రంలో 21 లక్షల బోగస్ కార్డులను తొలగించామని, దీంతో బియ్యం మిగులు సాధ్యమైందని ఈటల వివరించారు. సరుకుల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ఈ-పాస్, జీపీఎస్ వ్యవస్థలను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు రిటైర్డు పోలీసు అధికారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం కేవలం 1.92 కోట్ల మందినే పరిగణనలోకి తీసుకోగా తాము 2.82 కోట్లమందికి బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల జార్ఖండ్ మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే తరహా విధానాలను తమ రాష్ట్రంలోనూ అవలంబిస్తామని ఆయన పేర్కొన్నారు. -
అట్టడుగున సీఎం జిల్లా!
♦ మానవాభివృద్ధి సూచీలో మెదక్‌కు చివరిస్థానం ♦ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో హైదరాబాద్, రంగారెడ్డి ♦ మానవాభివృద్ధి సూచీ అంచనాలు విడుదల చేసిన ప్రణాళికా విభాగం, సెస్ సాక్షి, హైదరాబాద్: ప్రజల నాణ్యమైన జీవన పరిస్థితులకు అద్దంపట్టే మానవాభివృద్ధి సూచికలో ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్ రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో నిలిచింది. వృద్ధి రేటులో ఈ జిల్లా కొంత ముందున్నా.. ఇతర జిల్లాలతో పోలిస్తే వెనుకబడిపోతోంది. సాధారణంగానే ఎన్నో అనుకూలతలు ఉన్న హైదరాబాద్ ఈ సూచీలో తొలి స్థానంలో నిలిచింది. అయితే పదేళ్ల కిందటి గణాంకాలతో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ మానవాభివృద్ధి సూచీ గణనీయంగా పెరిగింది. ప్రణాళికా విభాగం, ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్)’ సంయుక్తంగా రూపొందించిన ‘హ్యుమన్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్: డిస్ట్రిక్ట్ ప్రొఫైల్స్’ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ 98వ వార్షికోత్సవం ముగింపు కార్యక్రమంలో ఈ నివేదికను విడుదల చేశారు. తొలి ప్రతిని ఆర్థిక రంగ నిపుణుడు సీహెచ్ హనుమంతరావుకు అందజేశారు. గతంలో తయారు చేసిన మానవాభివృద్ధి సూచీలకు భిన్నంగా ఈసారి జిల్లాల వారీగా వివరాలను కూడా పొందుపరిచారు. ‘‘దేశంలో తెలంగాణ 29వ రాష్ట్రం గా ఆవిర్భవించింది. ఉద్యమ సందర్భంగా ప్రజలు ఆర్థికాభివృద్ధిలో వికేంద్రీకరణ నమూనాను ఆకాం క్షించారు. జీవన ప్రమాణాల పెంపు, అక్షరాస్యత, అసమానతల తొలగింపునకు అది దోహదపడుతుందని భావించారు. ఆరోగ్యంగా ఉండడంతోపాటు దీర్ఘకాలం, సృజనాత్మకంగా జీవించడమే మానవాభివృద్ధి. ఆరోగ్యకరజీవితం, అక్షరాస్యత, మెరుగైన జీవన ప్రమాణాలపైనే మానవాభివృద్ధి సూచిక తయారవుతుంది. ఈ మూడింటినే ప్రమాణాలుగా తీసుకుని యుఎన్‌డీపీ (యునెటైడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టు) అనుసరించిన పద్ధతిలోనే ఈ నివేదిక తయారైంది.’’ అని సెస్ వెల్లడిం చింది. ఈ నివేదికను బట్టి సమగ్రంగా తెలంగాణ మానవాభివృద్ధి సూచికను రూపొందిస్తారు. ఇందుకు మూడు నెలలు పట్టే అవకాశముంది. కార్యక్రమంలో ‘మిలీని యం డెవలప్మెంట్ గోల్స్ ఇన్ తెలంగాణ’ నివేదిక ను కూడా ఈటల ఆవిష్కరించి తొలి ప్రతిని ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్యకు అందజేశారు. సగటు వృద్ధి 8.3 శాతం రాష్ట్రంలోని పది జిల్లాలను విశ్లేషిస్తే 2004-05 నుంచి 2011-12 వరకు అభివృద్ధి సూచీ ఏటా సగటున 8.3 శాతం వృద్ధి సాధించింది. జిల్లాలవారీగా చూస్తే నిజామాబాద్, ఖమ్మంలలో అత్యధికంగా.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లలో తక్కువగా వృద్ధి రేటు నమోదైంది. గతంలోని వృద్ధి రేటు ఆధారంగా 2015-16 సంవత్సరానికి మానవ అభివృద్ధి సూచీ విలువలను ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్’ అంచనా వేసింది. తలసరి ఆదాయం, ఆయుర్దాయం, అక్షరాస్యత, సామాజిక భద్రత, పేదరికం, అసమానతలను ప్రామాణికాలుగా తీసుకుని మానవాభివృద్ధి సూచీని లెక్కిస్తారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఈ సూచీలో తొలి స్థానంలో నిలిచింది. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో భారీ పరిశ్రమలకు నెలవైన మెదక్ జిల్లా ఈ సూచీలో చివరి స్థానంలో ఉండటం విస్మయకర అంశం. మారిన ర్యాంకులు 2015-16లో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు తొలి ఐదు స్థానాల్లో ఉండగా... ఈసారి మధ్యలో ఉన్న జిల్లాల స్థానాలు మారిపోయాయి. ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు కొంత ముందడగు వేశాయి. వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలు వెనుకబడ్డాయి. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలు తొలి ఐదు స్థానాల్లో ఉండడం చెప్పుకోదగ్గ పరిణామం. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ రెండు జిల్లాల్లో 28 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు. ఇక 1993-94లో 44.2 శాతంగా ఉన్న పేదరికస్థాయి 2011-12 నాటికి 8.8 శాతానికి తగ్గడం గమనార్హం. ఐక్యరాజ్యసమితి సూచించిన సుస్థిరాభివృద్ధికి సంబంధించిన 17 లక్ష్యాలు, మరో 169 సాధారణ లక్ష్యాలను వాతావరణంతోపాటు సామాజిక, ఆర్థిక రంగాల్లో సాధించేందుకు కనీసం 15 ఏళ్లు పడుతుందని నివేదికల్లో పేర్కొన్నారు. లక్ష్య ఛేదనలో ముందడుగు ‘‘తెలంగాణ రాష్ట్రం సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల ఛేదనలో గణనీయ పురోగతి సాధించింది. అభివృద్ధి విషయంలో జిల్లాల మధ్య, జాతి సమూహాల మధ్య అం తరాలు ఇంకా కనుమరుగు కాలేదు. నిస్సహాయ సమూహాలపై ప్రత్యేకదృష్టి సారించాల్సి ఉంది..’’ అని ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)’ స్పష్టం చేసింది. ఈ సహస్రాబ్దిలో తెలంగాణ సాధించాల్సిన 8 లక్ష్యాలను నివేదికలో నిర్దేశించింది. పేదరికం, ఆకలి నిర్మూలన: పేదరికాన్ని తగ్గించడం లో ప్రభుత్వం విజయవంతమైంది. 1993-94లో 44.2 శాతం ఉన్న పేదరికం 2011-12 నాటికి 8.8 శాతానికి తగ్గింది. వినియోగంలో అసమానతలు తగ్గడంతో.. కొన్నేళ్లుగా పేదరిక అంతరాల నిష్పత్తిలో తగ్గుదల నమోదైంది. చిన్న నగరాల్లో సవాలుగా మారిన పోషకాహారలోపాన్ని అధిగమించాల్సి ఉంది. ప్రాథమిక విద్య సార్వజనీకరణ: రాష్ట్రం ప్రాథమిక విద్యలో 100 శాతం విద్యార్థుల నమోదును సాధిం చేందుకు రెండేళ్ల సమయం పట్టే అవకాశముంది. సెకండరీ విద్యను సైతం సార్వజనీకరించాల్సి ఉంది. లింగ సమానత్వం, మహిళా సాధికారతకు ప్రోత్సాహం: ప్రాథమిక స్థాయిలో లింగ సమానత్వం కనిపిస్తున్నా, సామాజికంగా బలహీన సమూహాల్లో అంతరాలు అలాగే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. శిశు మరణాల నిర్మూలన: రోగ నిరోధక టీకాలను అందించడంలో విశేష కృషి జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేయడం 2015 తర్వాత మన ముందు ఉండే పెద్ద సవాలు. శిశు మరణాల రేటు, ఐదేళ్లలోపు బాలల మరణాల రేటును తగ్గించడంపై దృష్టి పెట్టాలి. గర్భిణుల ఆరోగ్యం: ప్రసూతి మరణాల రేటు తగ్గింపులో రాష్ట్రం మరో 5 నుంచి 8 ఏళ్లలో ఆశించిన ఫలితాలను సాధించగలదు. 2015 తర్వాత రాష్ట్రం సాధించాల్సిన పెద్ద సవాళ్లలో ఇదీ ఒకటి. హెచ్ఐవీ/ఎయిడ్స్, మలేరియా, ఇతర రోగాలపై యుద్ధం: హెచ్ఐవీ/ఎయిడ్స్ నిర్మూలనకు రాష్ట్రం విశేష కృషి చేసింది. 2015 తర్వాత ఎయిడ్స్, టీబీల నుంచి ప్రజలను రక్షించే చర్యలు తీసుకోవాలి. పర్యావరణ సుస్థిరత: జనాభాలో సగం మందికి సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్య సేవలు అందడం లేదు. అడవుల అభివృద్ధి, జీవ వైవిధ్యం, పారిశుద్ధ్యం, మురికివాడల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉంది. అభివృద్ధి కోసం విశ్వ భాగస్వామ్యం: ప్రజలకు టెలిఫోన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రం గణనీయ ప్రగతిని సాధించింది. విశ్వ భాగస్వామ్యంతో కమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి. -
బడ్జెట్‌పై ఆర్థిక శాఖ కసరత్తు
నేటి నుంచి 19 వరకు వివిధ శాఖలతో భేటీ ముఖ్య కార్యదర్శుల స్థాయిలో ప్రాథమిక సమీక్ష సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తయారీలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ సోమవారం నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం.. సోమవారం నుంచి 19వ తేదీ వరకు వివిధ శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ భేటీ కావాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తాను హాజరు కావాల్సిన సమావేశాలను కొద్ది రోజులు వాయిదా వేయాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. ఈలోగా అధికారుల స్థాయిలోనే సమీక్షలు జరపాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, కార్యదర్శులు రామకృష్ణారావు, శివశంకర్ వరుసగా అన్ని శాఖల కార్యదర్శులతో భేటీ కానున్నారు. 14వ తేదీన విద్య, వైద్యం, ఆరోగ్యం, సాధారణ పరిపాలన, 15న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పురపాలక పట్టణాభివృద్ధి, 16న ఎస్సీల అభివృద్ధి, బీసీలు, ఎస్టీలు, మహిళా శిశు సంక్షేమం, వికలాంగులు, మైనారిటీ సంక్షేమం, 17న వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధకం, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, రోడ్లు భవనాలు, రెవెన్యూ, హోం, 18న పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, కార్మిక ఉపాధి కల్పన, యువజన సర్వీసులు, పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రణాళికలు, 19న గృహ నిర్మాణం, పర్యావరణం, అటవీ, విద్యుత్, సమాచారం, సాంకేతిక, న్యాయ, శాసనసభా వ్యవహారాల శాఖలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు వివరిస్తారు. శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన సమస్యలు, సవాళ్లు, నిధుల అవసరం తదితర అంశాలను ప్రధానంగా ఈ సమీక్షల్లో చర్చిస్తారు. ఈ ప్రతి పాదనల ఆధారంగానే ఏయే పథకానికి ఎంత నిధులు కేటాయించే అవకాశముందో ఆర్థిక శాఖ అధికారులు అంచనాకు వచ్చే అవకాశముంది. ముఖ్య కార్యదర్శుల స్థాయిలో జరిగే ఈ సమీక్ష సమావేశాల అనంతరం మంత్రి ఈటల స్వయంగా రంగంలోకి దిగుతారు. వారం పాటు ఆయన మంత్రులతో భేటీ అవుతారు. అధికారుల స్థాయిలో వచ్చిన ప్రతిపాదనలపై ఆయా శాఖలకు ప్రాతినిధ్యం వహించే మంత్రులతో విడివిడిగా చర్చలు జరుపుతారు. ఈ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల ఆధారంగానే బడ్జెట్ ముసాయిదాను తయారు చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. -
టీఆర్ఎస్ ఖాతాలో ఆరు ఎమ్మెల్సీలు
ఐదు జిల్లాల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవం సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్/వరంగల్/కరీంనగర్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. శుక్రవారం నాటికే ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లోని ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న గులాబీ దళం శనివారం కరీంనగర్ జిల్లాలోని రెండు, నిజామాబాద్‌లో ని ఒక స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. కరీంనగర్ బరిలో మిగిలిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు శనివారం నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఇక్కడ్నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థులతో నామినేషన్లు విరమింపజేయడంలో మంత్రి ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారంతో ముగిసేసరికి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పురాణం సతీష్(ఆదిలాబాద్), రేకులపల్లి భూపతిరెడ్డి(నిజామాబాద్), కొండా మురళి(వరంగల్), భూపాల్‌రెడ్డి(మెదక్), నారదాసు లక్ష్మణరావు, భాను ప్రసాద్‌రావు(కరీంనగర్) ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. నల్లగొండ, ఖమ్మంలోనే పోటీ ఐదు జిల్లాల్లో ఏకగ్రీవం చేసుకున్న టీఆర్ఎస్.. మిగిలిన నాలుగు జిల్లాల్లోని ఆరు స్థానాలపై కన్నేసింది. రెండేసి స్థానాలున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎమ్మెల్సీలను సునాయాసంగా కైవసం చేసుకోవచ్చని ఆ పార్టీ భా విస్తోంది. ఈ రెండు చోట్లా పోటీ నామమాత్రమేనని చెబుతోంది. దీంతో ఖమ్మం, న ల్లగొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఖమ్మం లో సీపీఐ అభ్యర్థికి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం మద్దతిస్తున్న నేపథ్యంలో ఇక్కడ పోటీ ఆసక్తిగా మారింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచిన టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధులు 80 శాతానికి పైగా టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్కే అనుకూలం కావడం, తుమ్మల నాగేశ్వర్రావు వంటి బలమైన నేత మంత్రిగా ఉండడంతో ఇక్కడ తమ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ విజయం ఖాయమని టీఆర్ఎస్ భా విస్తోంది. నల్లగొండలో పార్టీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య పోటీ తీ వ్రంగా ఉండే అవకాశాలున్నాయి. అయి నా స్థానిక నాయకత్వం టీఆర్ఎస్ వైపే చూస్తోందని ఆ పార్టీ నాయకత్వం భావి స్తోంది. ఈ 4 స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా, 30న ఫలితాలు వెలువడుతాయి. కరీంనగర్లో 2, నిజామాబాద్‌లో 1... కరీంగనర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రతిపక్ష పార్టీలేవీ నామినేషన్ల దాఖలు చేయకపోవడం, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడం తో టీఆర్ఎస్ అభ్యర్థులు నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్‌రావు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటిం చారు. ఈ ఎన్నికల్లో 2 సీట్లకుగాను మొత్తం 7 నామినేషన్లు దాఖల య్యాయి. ఇందులో ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులు కాగా, మిగిలిన ఐదుగురు స్వతంత్రులు. ఇక నిజామాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రేకులపల్లి భూపతిరెడ్డి ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. శనివారం ఎన్నికల పరిశీలకులు ఎల్.శశిధర్, జిల్లా ఎన్నికల రిట ర్నింగ్ అధికారి ఎ.రవీందర్‌రెడ్డి భూపతిరెడ్డికి ఎమ్మెల్సీ నియామకపత్రాన్ని అందజేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి శుక్రవారమే పోటీ నుంచి తప్పుకోగా.. స్వతం త్ర అభ్యర్థి బత్తిని జగదీశ్ శనివారం నామినేషన్ ఉపసంహరించుకున్నారు. వరంగల్‌లో శనివారం నామినేషన్ల ఉపసంహరణ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి కొండా మురళీధర్‌రావు ఒక్కరే పోటీలో ఉండడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రకటించారు. -
యుద్ధ ప్రాతిపదికన పత్తి కొనండి
సాక్షి, హైదరాబాద్: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలను తక్షణమే అన్ని చోట్లా ప్రారంభించి, యుద్ధ ప్రాతి పదికన పత్తిని కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి ఆయన సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లపై కరీంనగర్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్, పౌర సరఫరాలు, సీసీఐ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. మొత్తం 84 కేంద్రాలకు గాను సీసీఐ ఇప్పటి వరకు 62 కేంద్రాలు ఏర్పాటు చేసి 24 చోట్ల మాత్రమే పత్తి కొనుగోలు చేస్తోందన్నారు. వెంటనే అన్ని కేంద్రాల్లో సిబ్బందిని నియమించడతో పాటు, ఉదయం ఆరు గంటల నుంచే సీసీఐ సిబ్బంది కొనుగోలు ప్రారంభించాలన్నారు. వారంలో ఐదు రోజుల పాటు సీసీఐ, రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలన్నారు. సీసీఐ విజ్ఞప్తి మేరకు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు, కొనుగోలు కేంద్రాల వద్ద తూకం యంత్రాలను ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అయితే పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ నుంచి తగినంత సహకారం అందడం లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై సీసీఐ సీఎండీ బీకే మిశ్రాతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. కాగా, మిల్లర్ల నుంచి ధాన్యం కొనుగోలు, మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలుపై మంత్రులు హరీశ్, ఈటల సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్‌శాఖ డెరైక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
తెలంగాణలో వనరులకు కొదవలేదు
మంత్రి ఈటల రాజేందర్ క్వాలిటీ టీమ్ కాన్సెప్ట్‌కు అవార్డుల ప్రదానం సనత్‌నగర్ : ఏరంగంలో రాణించాలన్నా సమర్థతే ప్రధానమని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపే వనరులకు ఇక్కడ కొదవ లేదని స్పష్టం చేశారు. క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్ఐ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే 29వ చాప్టర్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్ సోమవారం బేగంపేట్‌లోని మ్యారీ గోల్డ్ హోటల్లో ప్రారంభమైంది. దీనికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచంలో ప్రజలకు అవసరమయ్యే కొత్త ఉత్పత్తుల తయారీకి సృజనే ఆధారమని పేర్కొన్నారు. నేడు ప్రపంచదేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నారని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మానవ సంపద, కరెంటు సరఫరాతో పాటు సేఫ్ జోన్‌గా భావిస్తున్నాయన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా- ఎ విజన్ థ్రూ క్వాలిటీ కాన్సెప్ట్స్’ అంశంపై క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సీహెచ్. బాలకృష్ణారావు అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఇందులో ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ వైస్ చైర్మన్ కె.మనోహర్ హెగ్డె, గౌరవ కార్యదర్శి విశాల్ కరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా క్వాలిటీ టీమ్ కాన్సెప్ట్‌లో ప్రతిభ కనబరిచిన పలు సంస్థలకు క్యూసీఎఫ్ఐ అవార్డులను ప్రదానం చేశారు. బీహెచ్ఈఎల్, ఎన్ఎండీసీ, ఎన్టీపీసీ (రామగుండం), ఉషా ఇంటర్నేషనల్, అమరరాజా బ్యాటరీస్, రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్, టీఎస్ ఆర్టీసీ సంస్థల ప్రతినిధులు అవార్డులను అందుకున్నారు. -
రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం
కాటారం/ముత్తారం :పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతాం.. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృడసంకల్పంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కాటారం మండలంలోని గంగారం మోడల్ పాఠశాలలో నిర్మించిన కళాశాల భవనం, బాలికల వసతి గృహం, ముత్తారం మండలం కేశనపల్లి పంచాయతీ పరిధి దరియాపూర్ శివారులో మోడల్‌స్కూల్, బాలికల హాస్టల్ భవనా లను ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా రంగాలకు వచ్చే నిధులు కొంతమేర నిలిపివేసినా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో మోడల్ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలకు గతంలో కేంద్ర సాయం అందేదని, ఇప్పుడు పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యారంగానికి కేటారుుంచిన నిధులతో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు తాగునీరు, ఇతర సదుపాయూలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నిరుపేదలు తమకాళ్లమీద తాము నిలబడాలనేదే ప్రభుత్వ ధ్యేయమని, కట్టెల పొయ్యి అనేది లేకుండా జిల్లాకు లక్ష గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయూలని, విద్యార్థులు సైతం కష్టపడి చది ఉన్నత స్థారుుకి ఎదగాలని సూచించారు. ఎమ్మెల్యే మధు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి అభివృద్ధికి పాటుపడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ నీతూప్రసాద్, ఎంపీపీ తైనేని స్వప్న, కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ చల్ల నారాయణరెడ్డి, జెడ్పీటీసీలు గోనె శ్రీనివాస్‌రావు, మందల రాజిరెడ్డి, సర్పంచ్ తెప్పెల దేవేందర్‌రెడ్డి, ఎంపీటీసీ బండం విజయలక్ష్మి, ఆర్డీఓ బాల శ్రీనివాస్, టీఆర్ఎస్, యూత్ నాయకులు తోట జనార్ధన్, తాజోద్దిన్, నాయిని శ్రీనివాస్, తైనేని సతీశ్, బండం వసంతరెడ్డి, గంగిరెడ్డి లచ్చిరెడ్డి, చల్ల వెంకన్న, పంతకాని సడ్వలి, కుడుదుల రాజబాబు, సమ్మయ్య, బొల్లం రజిత తదితరులు పాల్గొన్నారు. -
అనాథలంతా సర్కారు బిడ్డలే: ఈటల
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో తల్లిదండ్రుల్లేని అనాథ పిల్లలందరికీ ఇకపై ప్రభుత్వమే అమ్మనాన్నగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. 69వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ ‘‘అనాథలకు ప్రభుత్వమే అమ్మనాన్నలా కొనసాగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉప సంఘం లోతుగా అధ్యయనం చేసి నివేదికను కూడా అందజేసింది. ఇకపై అనాథ పిల్లలకు ప్రభుత్వమే అమ్మనాన్న. 18 ఏళ్ల వరకు వారి ఆలనాపాలనా ప్రభుత్వానిదే. చదువు చెప్పించడంతోపాటు పెళ్లి చేసి ఆ కుటుంబాలకు అన్నిరకాలుగా సాయం చేసే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. రేపో మాపో ఈ గొప్ప నిర్ణయం వెలువడబోతోంది’’ అని పేర్కొన్నారు. -
రోజూ 10 లక్షల మందికి అన్నదానం
కనీవినీ ఎరుగని రీతిలో పుష్కరాలు - ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తాం - ధర్మపురిలో సీఎం కేసీఆర్ పుష్కర స్నానం - వర్తక, వాణిజ్య సంఘాలు ముందుకు రావాలి - ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల ముకరంపుర : గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, రైస్‌మిల్లర్స్‌తో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ నీతూప్రసాద్ పాల్గొన్నారు. గోదావరిలో నీటి కొరత దృష్ట్యా ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 5కోట్ల మంది జిల్లాలో పుష్కరస్నానాలకు వచ్చే అవకాశముందన్నారు. పుష్కర భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా రాష్ట్రంలో రూ.600 కోట్లతో పలు ఏర్పాట్లు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల 13న ధర్మపురి చేరుకుని రాత్రి బస చేస్తారని, 14న ఉదయం 6.26 గంటలకు ధర్మపురిలో పుష్కరస్నానం ఆచరిస్తారని పుష్కరాలను ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. సేవలందించేందుకు ముందుకు రావాలి పుష్కరాల్లో రోజుకు 10లక్షల మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం దాతలు, స్వచ్చంద సంఘాలు, వర్తక, వాణిజ్య, వ్యాపార సంఘాలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నర్సింగరావుతో పాటు బాధ్యులు ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల వద్ద ఉద్యోగులకు, ఇతర భక్తులకు రోజుకు 2-4 వేల మందికి అన్నదానం చేసేందుకు సహకరిస్తామన్నారు. జువెల్లరీ అసోసియేషన్ బాధ్యులు రమేష్ మినరల్ వాటర్ అందిస్తామన్నారు. కంకర క్రషర్ సంఘం ప్రతినిధి అంజయ్య రూ.2లక్షలు విరాళం అందిస్తామన్నారు. ఐఎంఏ బాధ్యులు అవసరమైన వైద్యసిబ్బందితో క్యాంపులు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. ప్రైవేట్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ బాధ్యులు జిల్లా వైద్యశాఖ సూచనల మేరకు అన్నివిధాలా సహకరిస్తామన్నారు. వెల్గటూర్ కంకర ప్రెషర్ యాజమాన్య బాధ్యులు చక్రవర్తి కోటిలింగాల వద్ద 500 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తామని, పుష్కరఘాట్లకు ప్రెషర్ డస్ట్‌ను పంపిస్తామని అన్నారు. దాతలు అందించే సేవా కార్యక్రమాలను డీఆర్వో వీరబ్రహ్మయ్య, సీపీవో సుబ్బారావు పర్యవేక్షిస్తారని కలెక్టర్ నీతూప్రసాద్ చెప్పారు. -
చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి
మంత్రులు ఈటల, జగదీశ్‌రెడ్డిల డిమాండ్ హైదరాబాద్: ‘నూటికి నూరు శాతం ఈ తతంగాన్ని నడిపింది చంద్రబాబే. ఆయనే ప్రధాన కుట్రదారుడు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్లో సైతం మాట్లాడారు. కుట్రదారుడు చంద్రబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నోటుకు ఓటు కుంభకోణంపై సోమవారం ఆయన సచివాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. ప్రజలు తిరస్కరించడంతో పదేళ్లు విపక్షంలో ఉన్న చంద్రబాబుకు ఇంకా జ్ఞానోదయం కాలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించిన రేవంత్‌రెడ్డి ఒక్క నిమిషం కూడా ఎమ్మెల్యేగా కొనసాగడానికి వీలులేదని, ఆయనను తక్షణమే డిస్మిస్ చేయాలని అన్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి రావడమే తెలుగు ప్రజల దురదృష్టమని ఈ ఘటన ద్వారా స్పష్టమైందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో అవినీతి రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేనన్నారు. రాజకీయాల్లో బేరాసారాలు చేయడం, డబ్బుతో కొనుగోలు చేయడం, మనుషులను జంతువులుగా పరిగణించడం చంద్రబాబు ద్వారానే దేశ రాజకీయాలకు అబ్బిందన్నారు.