కాటారం/ముత్తారం :పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతాం.. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృడసంకల్పంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కాటారం మండలంలోని గంగారం మోడల్ పాఠశాలలో నిర్మించిన కళాశాల భవనం, బాలికల వసతి గృహం, ముత్తారం మండలం కేశనపల్లి పంచాయతీ పరిధి దరియాపూర్ శివారులో మోడల్‌స్కూల్, బాలికల హాస్టల్ భవనా లను ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా రంగాలకు వచ్చే నిధులు కొంతమేర నిలిపివేసినా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.
రాష్ట్రంలో మోడల్ పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలకు గతంలో కేంద్ర సాయం అందేదని, ఇప్పుడు పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యారంగానికి కేటారుుంచిన నిధులతో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు తాగునీరు, ఇతర సదుపాయూలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నిరుపేదలు తమకాళ్లమీద తాము నిలబడాలనేదే ప్రభుత్వ ధ్యేయమని, కట్టెల పొయ్యి అనేది లేకుండా జిల్లాకు లక్ష గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయూలని, విద్యార్థులు సైతం కష్టపడి చది ఉన్నత స్థారుుకి ఎదగాలని సూచించారు. ఎమ్మెల్యే మధు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి అభివృద్ధికి పాటుపడుతున్నామని వివరించారు.
కార్యక్రమంలో కలెక్టర్ నీతూప్రసాద్, ఎంపీపీ తైనేని స్వప్న, కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ చల్ల నారాయణరెడ్డి, జెడ్పీటీసీలు గోనె శ్రీనివాస్‌రావు, మందల రాజిరెడ్డి, సర్పంచ్ తెప్పెల దేవేందర్‌రెడ్డి, ఎంపీటీసీ బండం విజయలక్ష్మి, ఆర్డీఓ బాల శ్రీనివాస్, టీఆర్‌ఎస్, యూత్ నాయకులు తోట జనార్ధన్, తాజోద్దిన్, నాయిని శ్రీనివాస్, తైనేని సతీశ్, బండం వసంతరెడ్డి, గంగిరెడ్డి లచ్చిరెడ్డి, చల్ల వెంకన్న, పంతకాని సడ్వలి, కుడుదుల రాజబాబు, సమ్మయ్య, బొల్లం రజిత తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం
Published Fri, Aug 21 2015 2:12 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement