గాల్లో తేలియాడుతున్న కేంద్రం: ఈటల
కరీంనగర్ సిటీ: వాస్తవిక దృక్పథాన్ని వీడి కేంద్ర ప్రభుత్వం గాల్లో తేలియాడుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. కరీంనగర్‌లో జిల్లా ప్రజాపరిషత్ నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజారంజక విభాగాలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు.
అంగన్‌వాడీలకు రూ.8 కోట్లు తగ్గించడం అందులో భాగమేనన్నారు. స్థానిక సంస్థలకు నిధులు కావాలని చాలాసార్లు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. స్థానిక సంస్థలకు నిధుల విషయంలో కేంద్రం పునరాలోచించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇస్తామన్నారు.