శాస్త్రీయంగా బడ్జెట్ రూపకల్పన: ఈటల
సాక్షి, కరీంనగర్ : ‘పెద్దనోట్ల రద్దు తర్వాత ఉత్పన్నమైన పరిస్థితులు, జూలై 1 నుంచి వస్తు, సేవ పన్ను(జీఎస్‌టీ) అమలు నేపథ్యంలో శాస్త్రీయంగా వచ్చే ఏడాది బడ్జెట్‌ను రూపొందించనున్నాం’అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. శనివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రతి పక్షాలు కాళ్లల్లో కట్టెపెట్టే కల్చర్ బంద్ చేసుకోవాలని, చావుకు, పెళ్లికి ఒకే డప్పు కొట్టే సంస్కృతి నుంచి బయటకు రావాలని హితవు పలికారు. ‘కాంగ్రెస్ పాల నలో రైతులు వంచనకు గురయ్యారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వకు గండిపెట్టి చెరువులను నింపిన చరిత్ర మాది. ఏనాడైనా మీరు చెరువులు నింపారా’అని ప్రశ్నించారు. ఏప్రిల్ 1 నుంచి ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేస్తామని పేర్కొన్నారు.