టీఆర్‌ఎస్ ఖాతాలో ఆరు ఎమ్మెల్సీలు
ఐదు జిల్లాల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్/వరంగల్/కరీంనగర్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. శుక్రవారం నాటికే ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లోని ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న గులాబీ దళం శనివారం కరీంనగర్ జిల్లాలోని రెండు, నిజామాబాద్‌లో ని ఒక స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. కరీంనగర్ బరిలో మిగిలిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు శనివారం నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఇక్కడ్నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
స్వతంత్ర అభ్యర్థులతో నామినేషన్లు విరమింపజేయడంలో మంత్రి ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారంతో ముగిసేసరికి టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన పురాణం సతీష్(ఆదిలాబాద్), రేకులపల్లి భూపతిరెడ్డి(నిజామాబాద్), కొండా మురళి(వరంగల్), భూపాల్‌రెడ్డి(మెదక్), నారదాసు లక్ష్మణరావు, భాను ప్రసాద్‌రావు(కరీంనగర్) ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు.
నల్లగొండ, ఖమ్మంలోనే పోటీ
ఐదు జిల్లాల్లో ఏకగ్రీవం చేసుకున్న టీఆర్‌ఎస్.. మిగిలిన నాలుగు జిల్లాల్లోని ఆరు స్థానాలపై కన్నేసింది. రెండేసి స్థానాలున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎమ్మెల్సీలను సునాయాసంగా కైవసం చేసుకోవచ్చని ఆ పార్టీ భా విస్తోంది. ఈ రెండు చోట్లా పోటీ నామమాత్రమేనని చెబుతోంది. దీంతో ఖమ్మం, న ల్లగొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఖమ్మం లో సీపీఐ అభ్యర్థికి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం మద్దతిస్తున్న నేపథ్యంలో ఇక్కడ పోటీ ఆసక్తిగా మారింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచిన టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధులు 80 శాతానికి పైగా టీఆర్‌ఎస్‌లో చేరారు.
కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్‌ఎస్‌కే అనుకూలం కావడం, తుమ్మల నాగేశ్వర్‌రావు వంటి బలమైన నేత మంత్రిగా ఉండడంతో ఇక్కడ తమ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ విజయం ఖాయమని టీఆర్‌ఎస్ భా విస్తోంది. నల్లగొండలో పార్టీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య పోటీ తీ వ్రంగా ఉండే అవకాశాలున్నాయి. అయి నా స్థానిక నాయకత్వం టీఆర్‌ఎస్ వైపే చూస్తోందని ఆ పార్టీ నాయకత్వం భావి స్తోంది. ఈ 4 స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా, 30న ఫలితాలు వెలువడుతాయి.
కరీంనగర్‌లో 2, నిజామాబాద్‌లో 1...
కరీంగనర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రతిపక్ష పార్టీలేవీ నామినేషన్ల దాఖలు చేయకపోవడం, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడం తో టీఆర్‌ఎస్ అభ్యర్థులు నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్‌రావు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటిం చారు. ఈ ఎన్నికల్లో 2 సీట్లకుగాను మొత్తం 7 నామినేషన్లు దాఖల య్యాయి. ఇందులో ఇద్దరు టీఆర్‌ఎస్ అభ్యర్థులు కాగా, మిగిలిన ఐదుగురు స్వతంత్రులు. ఇక నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి రేకులపల్లి భూపతిరెడ్డి ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు.
శనివారం ఎన్నికల పరిశీలకులు ఎల్.శశిధర్, జిల్లా ఎన్నికల రిట ర్నింగ్ అధికారి ఎ.రవీందర్‌రెడ్డి భూపతిరెడ్డికి ఎమ్మెల్సీ నియామకపత్రాన్ని అందజేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి శుక్రవారమే పోటీ నుంచి తప్పుకోగా.. స్వతం త్ర అభ్యర్థి బత్తిని జగదీశ్ శనివారం నామినేషన్ ఉపసంహరించుకున్నారు. వరంగల్‌లో శనివారం నామినేషన్ల ఉపసంహరణ తర్వాత టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా మురళీధర్‌రావు ఒక్కరే పోటీలో ఉండడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రకటించారు.