ఆహార భద్రతా చట్టం అమలుపై చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జార ్ఖండ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి సూర్యారాయ్ మంగళవారంరాత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆహార భద్రతాచట్టం, లబ్ధిదారుల ఎంపిక, సరుకుల పంపిణీ తదితర అంశాలపై వారు చర్చించుకున్నారు. రాష్ట్రంలో నిజమైన అర్హులకు సరుకులు పంపిణీ జరిగేలా లబ్ధిదారుల ఎంపిక విధానంపైనే ప్రధానంగా చర్చ సాగింది. రేషన్‌కార్డుల డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం తదితర ప్రక్రియలతో రాష్ట్రంలో 21 లక్షల బోగస్ కార్డులను తొలగించామని, దీంతో బియ్యం మిగులు సాధ్యమైందని ఈటల వివరించారు.
సరుకుల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ఈ-పాస్, జీపీఎస్ వ్యవస్థలను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు రిటైర్డు పోలీసు అధికారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం కేవలం 1.92 కోట్ల మందినే పరిగణనలోకి తీసుకోగా తాము 2.82 కోట్లమందికి బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల జార్ఖండ్ మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే తరహా విధానాలను తమ రాష్ట్రంలోనూ అవలంబిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈటలతో జార్ఖండ్ మంత్రి భేటీ
Published Wed, Jan 6 2016 3:59 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM
Advertisement