
సీఎం వైఎస్ జగన్ బుధవారం ఏలూరులో పర్యటించనున్నారు.
సాక్షి, అమరావతి/ఏలూరు(మెట్రో): సీఎం వైఎస్ జగన్ బుధవారం ఏలూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.35 గంటలకు ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంకు హెలికాప్టర్‌లో చేరుకోనున్న సీఎం ఆ తరువాత వీవీ నగర్ బెయిలీ బ్రిడ్జ్ సెంటర్ వద్ద రూ.330 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం శ్రీ సూర్య కన్వెన్షన్ హాలులో ఎస్‌ఎంఆర్ పెదబాబు, నూర్జహాన్‌ల కుమార్తె వివాహానికి హాజరవుతారు. తదనంతరం 11.57 గంటలకు సీఎం వైఎస్ జగన్ ఏలూరు నుంచి బయల్దేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
చదవండి: ఆంధ్రాలో ఓలా ఈ–స్కూటర్ల ప్లాంటు?