పేదల గురించి మాట్లాడుతుంటే బాబుకు కోపం వస్తుంది: సీఎం జగన్‌ | Cm jagan Serious Comments On Chandrababu At Eluru Meeting | Sakshi
Sakshi News home page

పేదల గురించి మాట్లాడుతుంటే బాబుకు కోపం వస్తుంది: సీఎం జగన్‌

Published Wed, May 1 2024 5:16 PM | Last Updated on Wed, May 1 2024 6:59 PM

Cm jagan Serious Comments On Chandrababu At Eluru Meeting

సాక్షి, ఏలూరు: బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. జగన్‌కు ఓటేస్తే.. సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ఆగిపోతాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్నవి కావు.. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నవని పేర్కొన్నారు. ఇది కులాల మధ్య యుద్దం కాదు.. క్లాస్‌ వార్‌ అని తెలిపారు. ఈ యుద్ధంలో ఓ వైపు పేదలు ఉంటే మరోవైపు పెత్తందార్లు ఉన్నారని అన్నారు.

ఏలూరులో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. సీఎం జగన్‌ ప్రచార సభకు ప్రజాభిమానం పోటెత్తింది. జై జగన్‌ నినాదాలతో ఏలూరు మార్పోగిపోయింది. ఈ సందర్భంగా సభకు హాజరైన జనసమూహాన్ని ఉద్ధేశిస్తూ సీఎం మాట్లాడారు వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు.. అయిదేళ్ల భవిష్యత్త్‌ను నిర్ణయిస్తాయని చెప్పారు.. మంచి చేసిన జగన్‌ పేదల పక్షాన ఉన్నాడని తెలిపారు. పేదల పక్షాన ఉన్న జగన్‌ను చూసి బాబుకు కోపమొస్తుందని దుయ్యబట్టారు. తాను పేదల గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మకు కోపం వస్తుందని మండిపడ్డారు.

సీఎం జగన్‌ ప్రసంగం..

  • మన రాష్ట్రంలో దాదాపు 90 శాతం తెల్ల రేషన్‌కార్డు దారులే.

  • కోటి 44  లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి.

  • వీళ్లందరికీ పథకాలు అందాలంటే మీ జగన్‌కు తోడుగా ఉండాలి.

  • కోటి 5 లక్షల మంది అక్కాచెల్లెమ్మలు పొదుపు సంఘాల్లో ఉన్నారు.

  • పొదుపు సంఘాల మహిళలు పేదలు కాదా, వారికి పథకాలు అందొద్దా?

 

పేదలకు పథకాలు అందాలా లేదా?

  • పిల్లల చదవుుల కోసం అమ్మ ఒడి తీసుకొచ్చి ప్రోత్సహించాం.

  • 93 శాతం మంది పిల్లలకు విద్యాదీవెనచ వసతి దీవెన అందుతోంది.

  • ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం.

  • అక్కాచెల్లెమ్మల కోసం అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ.

  • మహిళల రక్షణ కోసం దిశా యాప్‌ తీసుకొచ్చాం.

  • అక్కాచెల్లెమ్మలకు 50శాతం నామినేటెడ్‌ పదవులిచ్చాం.

  • అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం.

  • పెట్టుబడి సాయంతో రైతన్నకు అండగా నిలబడ్డాం.

  • వాహన మిత్రతో ఆటోడ్రైవర్లకు తోడుగా ఉన్నాం.

వాలంటీర్‌ వ్యవస్థతో పౌరసేవలు

  • గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్తూ గ్రామ, వార్డు సచివాలయాలు.
  • గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తీసుకొచ్చాం.
  • నాడు, నేడుతో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చాం.
  • సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం.
  • పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం.
  • రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం.
  • 59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం.
  • 200 స్థానాల్లో 100 టికెట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం


2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?
 

  • రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
  • పొదుపు సంఘాల రుణాలురద్దు చేస్తానన్నాడు.. చేశాడా?
  • ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు..చేశాడా?
  • ఇంటికోఉద్యోగం అన్నాడు ఇచ్చాడా?
  • ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
  • అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
  • సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?
  • ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?
  • ఇప్పుడు మళ్లీ కొత్త మోసాలతో వస్తున్నాడు.. నమ్ముతారా?
  • కేజీ బంగారం, బెంజ్‌ కారు ఇస్తానంటాడు.. నమ్ముతారా?
  • ఇలాంటి మోసగాళ్లు నమ్మొద్దు.. జాగ్రత్తగా ఉండండి
  • వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయండి.
  • పేదల భవిష్యత్‌ కోసం ఫ్యాన్‌ గుర్తు ఓటేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement