యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నట్లు యాదాద్రి ఆలయ అభివృద్ధి అథారిటీ (వైటీడీఏ) వైఎస్ చైర్మన్ కిషన్‌రావు తెలిపారు.
యాదగిరిగుట్ట (నల్లగొండ) : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నట్లు యాదాద్రి ఆలయ అభివృద్ధి అథారిటీ (వైటీడీఏ) వైఎస్ చైర్మన్ కిషన్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన వైటీడీఏ బృందంతో కలసి ఆలయ పరిసరాలను పూర్తిగా పరిశీలించారు. కొండపైన గల 14 ఎకరాలలో ఆలయం, విష్ణు పుష్కరిణి, సుమారు 1 లక్ష మంది పట్టే విధంగా ఓపెన్ కల్యాణ మండపం ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధ్దం చేస్తున్నట్లు వివరించారు.
అలాగే కొండపైన రధశాలను ఏర్పాటు చేసి, రధం భక్తులకు కనిపించేలా గ్లాస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొండపైన 150 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండో ఘాట్ రోడ్డును నిర్మించటంతోపాటు వన్‌వేను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.