సాక్షి, యాదాద్రి: సంస్థాన్ నారాయణపూర్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. దాదాపు 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రముఖ రియల్టర్ జక్కిడి ధన్వంతరెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ సత్తయ్య, ఎస్‌ఐ సుధాకర్ నేతృత్వంలో ఆపరేషన్ చేపట్టారు. ఇరవై కార్లు, 60 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పార్టీలో పాల్గొనడానికి వచ్చిన యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
కాగా ధన్వంత్ రెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి రేవ్ పార్టీ ఆర్గనైజ్ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినట్లు తెలుస్తోంది. గిరీష్ అనే వ్యక్తి రేవ్ పార్టీకి కో- ఆర్డినేట్‌గా వ్యవహరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ కంపెనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ఫామ్‌హౌజ్‌కు చేరుకున్నట్లు సమాచారం.
చదవండి: 250 కిలోల బంగారం స్మగ్లింగ్: ప్రీత్ అగర్వాల్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment