samsthan narayanpur
-
రేవ్ పార్టీ: వెలుగులోకి కొత్త విషయాలు
సాక్షి, నల్గొండ: సంస్థాన్ నారాయణ్‌పూర్ ఫాంహౌజ్‌లో రేవ్ పార్టీ వ్యవహారం నేపథ్యంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ పబ్బుల నుంచి శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ గెస్ట్‌హౌజ్‌లు, రిసార్ట్‌లకు మకాం మార్చిన డ్రగ్స్ స్మగ్లర్లు సరికొత్త దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కోసం వేర్వేరు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తూ, విద్యార్థులను డ్రగ్స్ గ్యాంగ్స్ ఆకర్షిస్తున్నాయి. అంతేగాక ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా రేవ్ పార్టీ వివరాలు షేర్ చేస్తూ బరితెగిస్తున్నాయి. ఈ క్రమంలో పబ్స్ నుంచి ఆర్డర్ చేయించుకుని పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సంస్థాన్ నారాయణ్‌పూర్ రేవ్ పార్టీ వివరాలను కూడా గిరీష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పార్టీలో పాల్గొన్న వాళ్లంతా డ్రగ్స్ వాడినట్లు సమాచారం. గంజాయితో పాటు ఇతర డ్రగ్స్, మద్యం సేవించినట్లు తెలుస్తోంది. కాగా ప్రముఖ రియల్టర్ ధన్వంత్ రెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి సంస్థాన్ నారాయణ్‌పూర్‌లో శుక్రవారం రేవ్ పార్టీ ఆర్గనైజ్ చేసినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడికి చేరుకుని సుమారు 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎత్తున బైకులు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. -
పోలీసుల ఎంట్రీ: ఫామ్‌హౌజ్‌లో భారీ రేవ్ పార్టీ భగ్నం
సంస్థాన్ నారాయణపురం/ చౌటుప్పల్: ఓ వ్యవసాయ క్షేత్రంలో యువత రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని గాంధీనగర్ తండా పరిధిలో ఉన్న జక్కిడి ధన్వంత్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గురువారం రాత్రి జరుగుతున్న రేవ్ పార్టీపై ఎస్ఓటీ, భువనగిరి పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. 97 మందిని (88 మంది యువకులు, ఇద్దరు యువతులు, ఏడుగురు నిర్వాహకులు) అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగులు ఉన్నారు. భారీగా మద్యం, డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు చెందిన పేపర్ ప్రొడక్ట్ వ్యాపారి గిరీశ్ దడువాయ్, ఎల్బీనగర్కు చెందిన విద్యార్థి శ్రీకర్‌రెడ్డి (ఫౌంహౌజ్ యజమాని ధన్వంత్‌రెడ్డి కుమారుడు), వనస్థలిపురానికి చెందిన జ్యువెల్లరీ వ్యాపారి చొల్లేటి శ్రీకాంత్, షేక్ ఉమర్ ఫారూఖ్ కలసి రేవ్ పార్టీ ఏర్పాటు చేయాలని భావించారు. శ్రీధర్‌రెడ్డి తండ్రి ధన్వంత్రెడ్డికి నారాయణపురం మండలం గాంధీనగర్ తండాలో ఫామ్‌హౌజ్ ఉండటంతో అక్కడే పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డీజే సౌండ్ సిస్టమ్ నిర్వహణతో పాటు డ్రమ్ వాయిద్యంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఢిల్లీకి చెందిన సయ్యద్ అమ్రాన్ అలీరెజాను సంప్రదించారు. సూర్యాపేట జిల్లా బాలాజీనగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి బాలెంల ప్రవీణ్ నిషేధిత మత్తు పదార్థాలను సమకూర్చాడు. సోషల్‌మీడియా (ఇన్స్టాగ్రామ్) వేదికగా ‘పీఎస్ వై దమ్రూ’ అనే పేజీ క్రియేట్ చేసి ఒక్కొక్కరికి రూ.499 తీసుకొని 90 మందిని ఎంట్రీ చేసుకున్నారు. ‘మహదేవ్ గ్యాదరింగ్ ఎట్ రాచకొండ హిల్స్’ పేరుతోనూ యువతను ఆకర్షించారు. పక్కా సమాచారంతో.. ఈ రేవ్‌పార్టీ విషయం పోలీసులకు సమాచారం అం దింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశం మేరకు ఎస్ఓటీ సిబ్బందితో పాటు స్థానిక పోలీసు బలగాలు గురువారం రాత్రి దాడి చేశారు. పార్టీలో యువత మద్యంతో పాటు డ్రగ్స్, గంజాయి వినియోగించారు. 400 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎల్ఎస్డీ డ్రగ్, 2 గ్రాముల గుర్తు తెలియని డ్రగ్ పోలీసులకు చిక్కింది. 120 మద్యం ఫుల్ బాటిళ్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, 2 కెమెరాలు, 76 సెల్ఫోన్లు, 15 కార్లు, 30 బైక్‌లు, జెనరేటర్, డీజేసౌండ్ సిస్టం, రూ.27,030 నగదు, 21 ఎంట్రీ టికెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, గంజాయిలో వినియోగించే ఓసీఏం పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులను రిమాండ్ కోసం కోర్టుకు తరలించారు. పట్టుబడిన యువతులు, యువకులపై కూడా కేసు నమోదు చేశారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందో.. ఈ కేసును లోతుగా విచారణ చేపడుతున్నామని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. 3 నెలల కింద లక్నవరం సరస్సు వద్ద కూడా ఇలాగే పార్టీ జరిగిందని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో ఈ ఘటనపై విచారణ జరుపుతామన్నారు. నిర్వాహకులకు డ్రగ్స్, గంజాయి సరఫరా ఎక్కడి నుంచి జరిగిందన్న విషయాన్ని తెలుసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో భువనగిరి డీసీపీ కె.నారాయణరెడ్డి, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్‌రెడ్డి, ఏసీపీ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, పోలీసుల అదు పులో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిం చగా ఒకరి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. -
యాదాద్రిలో రేవ్ పార్టీ
-
ప్రముఖ రియల్టర్ ఫాంహౌజ్‌లో రేవ్ పార్టీ!
సాక్షి, యాదాద్రి: సంస్థాన్ నారాయణపూర్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. దాదాపు 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రముఖ రియల్టర్ జక్కిడి ధన్వంతరెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ సత్తయ్య, ఎస్ఐ సుధాకర్ నేతృత్వంలో ఆపరేషన్ చేపట్టారు. ఇరవై కార్లు, 60 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పార్టీలో పాల్గొనడానికి వచ్చిన యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా ధన్వంత్ రెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి రేవ్ పార్టీ ఆర్గనైజ్ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినట్లు తెలుస్తోంది. గిరీష్ అనే వ్యక్తి రేవ్ పార్టీకి కో- ఆర్డినేట్‌గా వ్యవహరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ కంపెనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ఫామ్‌హౌజ్‌కు చేరుకున్నట్లు సమాచారం. చదవండి: 250 కిలోల బంగారం స్మగ్లింగ్: ప్రీత్ అగర్వాల్ అరెస్ట్ -
బాధతో యువరైతు ఆత్మహత్య
నల్లగొండ : కాలం కలిసిరాక వేసిన విత్తనాలు మొలకెత్తక తెచ్చిన అప్పు తీర్చే దారి కనిపించకపోవడంతో.. ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి రాజు (25) తనకు ఉన్న రెండెకరాలలో పత్తి పంట వేశాడు. వర్షాలు లేక గింజలు మొలకెత్తకపోవడంతో.. అప్పులు ఎలా తీర్చాలో అర్ధంకాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. మృతుడు కొత్తపల్లి రాజుకు రెండు నెలల కిందటే వివాహం అయింది.