
దుర్గమ్మకు పూజలు చేస్తున్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్
రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి సర్కార్ కృషి చేస్తున్నదని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు.
- అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి
మెదక్: రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి సర్కార్ కృషి చేస్తున్నదని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. సోమవారం మెదక్ వచ్చిన సందర్భంగా ఆయన పలు అబివృద్ధి కార్యాక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. నవాబుపేటలోగల ఈద్గవద్ద అభివృద్ధి పనులకు రూ.10 లక్షలు, మున్నూరుకాపు, ముదిరాజ్ భవన నిర్మాణాలకోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు కాగా, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు.
అనంతరం స్థానిక వైస్రాయ్‌గార్డెన్‌లో స్వర్ణకారుల సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నారన్నారు. అలాగే కులవృత్తులకు భరోసా కల్పిస్తున్నారన్నారు. స్వర్ణకారుల బతుకులు దుర్భరంగా మారాయని, వీరి దుస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్వర్ణకారుల అభివృద్ధి కోసం కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్‌చైర్మన్ రాగి అశోక్, ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు లావణ్యరెడ్డి, స్వర్ణకారుల సంఘం నాయకులు శ్రీనివాస్, లక్ష్మణ్ రవి, రమేష్‌చారి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న స్పీకర్
పాపన్నపేట: ఏడుపాయలలోని వనదుర్గామాతను స్పీకర్ మధుసూదనాచారి దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతు తెలంగాణ ప్రజల ఆశయాల కనుగుణంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పరిపాలన అందిస్తున్నారని అన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఏడుపాయల అభివృద్ధికి విశేషంగా కృషి చేయడం అభినందనీయమన్నారు.
ఘనస్వాగతం
స్పీకర్ మధుసుదనాచారి, డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి లకు ఏడుపాయల్లో ఘనస్వాగతం పలికారు.రాజగోపురం వద్ద నుంచి ఈఓ వెంకటకిషన్‌రావు, ఆలయ సిబ్బంది, వేదబ్రాహ్మణులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు.ఆపై శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మెంచు నగేష్, ఎంపీపీ పవిత్ర దుర్గయ్య, జెడ్పీటీసీ స్వప్నబాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.