‘ పుట్టపర్తి సుందరీకరణపై ప్రత్యేక దృష్టి ’ | special concentration on puttaparthy | Sakshi
Sakshi News home page

‘ పుట్టపర్తి సుందరీకరణపై ప్రత్యేక దృష్టి ’

Published Sun, Apr 30 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM

special concentration on puttaparthy

పుట్టపర్తి టౌన్‌ : పుట్టపర్తిని సుందరంగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలుపుతామని స్వచ్చాంధ్ర మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ పి.ఎల్‌.వెంకటరావు తెలిపారు. ఆదివారం ఆయన నగర పంచాయతీ చైర్మన్‌ గంగన్న, కమిషనర్‌ విజయభాస్కర్‌రెడ్డితో కలసి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో శిల్పారామం, థీంపార్క్, చిత్రావతి సుందరీకరణ ఘాట్, ప్రశాంతి గ్రాం, ఎనుములపల్లి, కర్ణాటక నాగేపల్లి సర్కిల్‌ తదితర ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటకలోని నాగేపల్లి వద్ద డంప్‌యార్డు ఏర్పాటు చేసి పట్టణంలో సేకరించిన చెత్తతో ఎరువుతయారీ చేసే పద్ధతిని అభివృద్ధి చేస్తామన్నారు. çపట్టణంలో పచ్చదనం పెంపునకు, రైల్వేస్టేషన్‌ నుంచి పుట్టపర్తి వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర బటర్‌ ఫ్లై లైట్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామం, థీంపార్క్‌ అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. అనంతరం ప్రశాంతి నిలయంలో సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులు ఆర్‌.జె.రత్నాకర్‌రాజు, ప్రసాద్‌రావును కలసి రాష్ట్రవ్యాప్తంగా సత్యసాయి సేవాదళ్‌ సహకారంతో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement