special concentration
-
అన్నింటా ‘అనంత’ ముందుండాలి!
– పదో తరగతిపై ప్రత్యేక దృష్టి సారించండి – ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు మరిన్ని పెరగాలి – విద్యాశాఖ అధికారులకు ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి ఆదేశం అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యాభివృద్ధి కార్యక్రమాల అమలులో ‘అనంత’ జిల్లా ముందుండాలని ప్రాథమిక విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ప్రతాప్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ, ఏడీలు మోహన్‌రావు, చంద్రలీల, శ్రీరాములు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్, సూపరింటెండెంట్లు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు, ఇతర సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ అడ్మిషన్లు బాగా జరగాలన్నారు. ఓపెన్ స్కూల్‌పై చాలామందికి అవగాహన లేదని విస్త్రత ప్రచారం నిర్వహించాలని డీఈఓ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్‌కు సూచించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ పెట్టొద్దని ఆదేశించారు. గుర్తింపు లేని పాఠశాలల సమాచారంపై ఆర్జేడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపు లేని పాఠశాల జిల్లాలో ఒక్కటీ లేదంటున్నారని మరి గుడిబండలో సెయింట్ మేరీ స్కూల్ అనుమతులు లేకుండా నడుస్తున్న విషయం తెలీదా? అని ప్రశ్నించారు. వెంటనే ఎంఈఓతో ఆర్జేడీ ఫోన్లో మాట్లాడారు. సెయింట్ మేరీ స్కూల్లో 1–7 తరగతులున్నాయని ప్రభుత్వ గుర్తింపు లేదని ఎంఈఓ స్పష్టం చేశారు. వెంటనే నోటీసులివ్వాలని ఆర్జేడీ ఆదేశాలు ఇచ్చారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చదివితే భవిష్యత్తులో పిల్లలు తీవ్రంగా నష్టపోతారన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీ సమాచారాన్ని అడిగారు. అలాగే బాలికలకు సైకిళ్ల పంపిణీకి సంబంధించి 15,562 మంది పిల్లలకు గాను కేవలం 3,369 మందికి మాత్రమే పంపిణీ చేసినట్లు ఆన్లైన్ లెక్కలు చెప్తున్నాయన్నారు. తక్కిన పిల్లల పరిస్థితి ఏంటని అడిగారు. అందరికీ పంపిణీ చేశామని డీఈఓ వివరించగా...వెంటనే ఆన్లైన్లో వివరాలు పొందుపరిచేలా చూడాలని సూచించారు. కోర్టు కేసులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. -
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి
- డెంగీ, మలేరియాపై అప్రమత్తంగా ఉండండి - జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వీణాకుమారి అనంతపురం మెడికల్ : వర్షాలు పడుతున్నందున మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, సమస్యాత్మక గ్రామాలపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కుటుంబ సంక్షేమశాఖ జేడీ డాక్టర్ వీణాకుమారి ఆదేశించారు. డీఎంహెచ్ఓ ఛాంబర్లో బుధవారం ఆమె ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమల నివారణ చర్యలు, పరిసరాల పరిశుభ్రత పనులను ముమ్మరం చేయాలని సూచించారు. మెరుగైన వైద్యసేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రోగ్రాం ఆఫీసర్లు కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రతిరోజూ క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్లాలన్నారు. ఏడీఎంహెచ్ఓలు పద్మావతి, అనిల్‌కుమార్, డీఐఓ పురుషోత్తం, డీఎంఓ దోసారెడ్డి, పీఓడీటీ సుజాత, ప్రత్యేక సర్వెలెన్స్ అధికారి రితీష్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి కన్నేగంటి భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు. -
‘ పుట్టపర్తి సుందరీకరణపై ప్రత్యేక దృష్టి ’
పుట్టపర్తి టౌన్ : పుట్టపర్తిని సుందరంగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలుపుతామని స్వచ్చాంధ్ర మిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ డాక్టర్ పి.ఎల్.వెంకటరావు తెలిపారు. ఆదివారం ఆయన నగర పంచాయతీ చైర్మన్ గంగన్న, కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డితో కలసి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో శిల్పారామం, థీంపార్క్, చిత్రావతి సుందరీకరణ ఘాట్, ప్రశాంతి గ్రాం, ఎనుములపల్లి, కర్ణాటక నాగేపల్లి సర్కిల్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటకలోని నాగేపల్లి వద్ద డంప్‌యార్డు ఏర్పాటు చేసి పట్టణంలో సేకరించిన చెత్తతో ఎరువుతయారీ చేసే పద్ధతిని అభివృద్ధి చేస్తామన్నారు. çపట్టణంలో పచ్చదనం పెంపునకు, రైల్వేస్టేషన్ నుంచి పుట్టపర్తి వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర బటర్ ఫ్లై లైట్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామం, థీంపార్క్ అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. అనంతరం ప్రశాంతి నిలయంలో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్.జె.రత్నాకర్రాజు, ప్రసాద్‌రావును కలసి రాష్ట్రవ్యాప్తంగా సత్యసాయి సేవాదళ్ సహకారంతో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
మార్కెటింగ్ సమస్యపై ప్రత్యేక దృష్టి
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో పండిస్తున్న ఫల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించి రైతులకు ఆదాయం వచ్చేలా చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవిచౌదరి తెలిపారు. కరువు కాటకాలకు నిలయమైన జిల్లాలో పండ్లతోటల సాగు, మార్కెటింగ్ సమస్యలు, రైతుల స్థితిగతులపై శుక్రవారం 'సాక్షి'లో ప్రచురితమైన కథనాన్ని కమిషనర్ చదవడంతో పాటు సానుకూలంగా స్పందించారు. ఇలాంటి కథనాలు అధికారుల్లో జవాబుదారీతనం పెరిగి రైతులకు ప్రయోజనం కలిగేలా చేయడానికి దోహదపడుతుందన్నారు. వచ్చే ఒకట్రెండు సంవత్సరాల్లో 'అనంత'ను ఉద్యాన హబ్‌గా చేసే క్రమంలో రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు, ప్రోత్సాహం ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు.