- డెంగీ, మలేరియాపై అప్రమత్తంగా ఉండండి
- జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వీణాకుమారి
అనంతపురం మెడికల్ : వర్షాలు పడుతున్నందున మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, సమస్యాత్మక గ్రామాలపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కుటుంబ సంక్షేమశాఖ జేడీ డాక్టర్ వీణాకుమారి ఆదేశించారు. డీఎంహెచ్‌ఓ ఛాంబర్లో బుధవారం ఆమె ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమల నివారణ చర్యలు, పరిసరాల పరిశుభ్రత పనులను ముమ్మరం చేయాలని సూచించారు.
మెరుగైన వైద్యసేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రోగ్రాం ఆఫీసర్లు కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రతిరోజూ క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్లాలన్నారు. ఏడీఎంహెచ్‌ఓలు పద్మావతి, అనిల్‌కుమార్, డీఐఓ పురుషోత్తం, డీఎంఓ దోసారెడ్డి, పీఓడీటీ సుజాత, ప్రత్యేక సర్వెలెన్స్ అధికారి రితీష్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి కన్నేగంటి భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి
Published Wed, Jun 21 2017 10:35 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM
Advertisement