మార్కెటింగ్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి | special concentration on marketing | Sakshi
Sakshi News home page

మార్కెటింగ్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి

Published Fri, Nov 4 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

మార్కెటింగ్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి

మార్కెటింగ్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాలో పండిస్తున్న ఫల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించి రైతులకు ఆదాయం వచ్చేలా చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవిచౌదరి తెలిపారు. కరువు కాటకాలకు నిలయమైన జిల్లాలో పండ్లతోటల సాగు, మార్కెటింగ్‌ సమస్యలు, రైతుల స్థితిగతులపై శుక్రవారం 'సాక్షి'లో ప్రచురితమైన కథనాన్ని కమిషనర్‌ చదవడంతో పాటు సానుకూలంగా స్పందించారు.

ఇలాంటి కథనాలు అధికారుల్లో జవాబుదారీతనం పెరిగి రైతులకు ప్రయోజనం కలిగేలా చేయడానికి దోహదపడుతుందన్నారు. వచ్చే ఒకట్రెండు సంవత్సరాల్లో 'అనంత'ను ఉద్యాన హబ్‌గా చేసే క్రమంలో రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు, ప్రోత్సాహం ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement