
పరుగులు పెట్టాలి
జిల్లాలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
♦ అభివృద్ధి పనులపై సీఎం వ్యాఖ్య
♦ జిల్లా అధికారులతో
♦ ఫాంహౌస్‌లో కేసీఆర్ సమీక్ష
♦ పాల్గొన్న కలెక్టర్ ఇతర అధికారులు
జగదేవ్‌పూర్: జిల్లాలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రోనాల్డ్‌రాస్, ఎస్పీ సుమతి, గఢా ఓఎస్డీ హన్మంతరావు బుధవారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో పదినిమిషాలు పలు అంశాలపై సమీక్షించారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఖరీఫ్‌కు ముందు అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా డ్రిప్పు ఏర్పాటు పనులు ప్రారంభించాలని, రైతులకు పరికరాలు అందించాలని ఆదేశించారు. రోడ్డు, కుంటల, మిషన్‌భగీరథ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కేసీఆర్ కోరారు. గజ్వేల్‌లో నిర్మించనున్న ఎమ్మెల్యే భవనానికి సంబంధించిన స్థలంపై ఆరా తీసినట్టు తెలిసింది. సోమవారం రాత్రి ఫాంహౌస్‌కు వచ్చిన కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు కాన్వాయ్ ద్వారా పాములపర్తి, గౌరారం మీదుగా హైదరాబాద్ వెళ్లారు.