డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో మూడు నుంచి తొమ్మిది అంతస్థుల వరకు బహుళ అంతస్థుల భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశించారు.
హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో మూడు నుంచి తొమ్మిది అంతస్థుల వరకు బహుళ అంతస్థుల భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. ఇందుకోసం అధునాతన టెక్నాలజిని వాడుకోవాలని ఆదేశించారు.
ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ అవసరమైతేప్రభుత్వ భూములను భవన నిర్మాణాలకు కేటాయిస్తామని, వాటిల్లో నిర్మాణం చేపట్టాలని చెప్పారు.