వైఎస్సార్ జిల్లా రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.1272 కోట్లతో జీఎన్‌ఎస్‌ఎస్ మెయిన్ కెనాల్ నుంచి కాలేటివాగు రిజర్వాయర్, అక్కడి నుంచి చక్రాయపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల చెరువులకు నీరందించి తద్వారా ఆయకట్టును స్థిరీకరించేందుకు ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రూ. 340.60 కోట్లతో రాయచోటిలో చేపట్టే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, పట్టణాభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.