
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం చామన్‌పల్లి నుంచి చొప్పదండి మండలం వెదురుగట్ట వరకు ఆర్‌డీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ, బీటీ రోడ్డు పనులకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమిపూజ చేశారు. రూ.1.73కోట్లతో వంతెన, రూ.3.45కోట్లతో సీసీ, బీటీ రోడ్డుపనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పాటైన అనంతరం గ్రామాలన్నీ పూర్తిస్ధాయిలో అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. చామన్‌పల్లిలో తీన్‌మూర్తిరోడ్డు, ఫకీర్‌పేట గ్రామాల రోడ్డు నిర్మాణం పూర్తయిందని, వెదురుగట్టవరకు చేపట్టనున్న రోడ్డు నిర్మాణానికి రైతులందరూ సహకరించాలని కోరారు.
ఆర్నేళ్లలో వంతెన, రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. మరో రెండునెలల్లో రూ.10కోట్లతో చామన్‌పల్లి నుంచి ఫకీర్‌పేట, ఎలబోతారం, ఇరుకుల్ల, చెర్లభూత్కూర్ గ్రామాలకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రజలకు సేవకుడిగా పనిచేస్తూ.. అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వి.రమేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆర్టీఏ సభ్యుడు రమేశ్, ఆర్‌అండ్‌బీ డీఈ నర్సింహచారీ, ఏఈ లక్ష్మణ్‌రావు, ఏఏంసీ వైస్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, డైరెక్టర్ లక్ష్మయ్య, అయిలయ్య, నరేశ్‌రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాస్, చలమయ్య, అజయ్, పర్షరాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment