
అభివృద్ధి కోసం ఆమరణదీక్షకైనా సిద్ధమే
నెల్లూరు సిటీ: కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాలు, శివారు కాలనీల్లో వారం రోజుల్లో అభివృద్ధి పనులు చేపట్టకపోతే ఆమరణ దీక్ష చేపడుతానని వైఎస్సార్‌సీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి పనుల కోసం 42గంటల పాటు ఇచ్చిన గడువు ముగియడంతో నగర పాలక సం స్థ కార్యాలయంలో సోమవారం కోటంరెడ్డి నిరవధిక నిరసన చేపట్టారు. ఉద యం 11 గంటలకు కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కమిషనర్ చాంబర్ వద్దకు వెళ్లారు. కమిషనర్ ఢిల్లీరావు లేకపోవడంతో చాంబర్ బయట బైటాయిం చారు.
సాయంత్రం 5 గంటలకు కార్యాలయానికి చేరుకున్న కమిషనర్ బయట నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేను లోనికి పిలిపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విలీన గ్రామాలు, శివారు కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని రెండేళ్లుగా కార్పొరేషన్ చుట్టూ తిరిగి పనులకు టెండర్లు పిలిపిస్తే, చిన్నపాటి సమస్యలను అడ్డుగా చూపి కొర్రీ పెట్ట డం సమంజసం కాదన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టే పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. స్పందించిన కమి షనర్ కొత్తగా వచ్చానని, తనకు వారం రోజులు సమయం ఇస్తే టెండర్లు పిలిచి అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమవారం నాటికి దళిత వాడల్లో సబ్‌ప్లాన్ పనులు ప్రారంభించకపోతే ఆమరణ దీక్ష చేపడుతామన్నారు.
శావారు ప్రాంతాలపై భారం
విలీనగ్రామాలు, శివారుకాలనీలకు భూ గర్భడ్రైనేజీ, తాగునీటి పథకాలు మం జూరు కాలేదని, ఎటువంటి లబ్ధిపొం దని కాలనీవాసులపై వెయ్యికోట్లు భా రం మోపడం ఎంత వరకు సబబని ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి ఎద్దడి నివారణకు రూ.4.50కోట్లు కేటాయించి 10రోజులకు పైగా గడుస్తున్నా ఎందుకు ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. జీఓ 94 ప్రకా రం టెండర్లు పూర్తిచేసిన 90 రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉన్నా, 2016 అక్టోబర్ 13న టెండర్లు పూర్తిచేసిన పను లను ఇంత వరకు ప్రారంభించకపోడం దారుణమన్నారు.
పనులు చేయించడం చేతకాకపోతే తాను చేయిస్తానన్నారు. నిధులు కేటాయిస్తే 60రోజుల్లో నా ణ్యమైన పనులు చేసి చూపిస్తానన్నారు. అలా చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.సీపీఎం కార్పొరేటర్ పద్మజ దంపతులు ఎమ్మెల్యేకు మద్దతు తెలిపారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాసులుయాదవ్, కార్పొరేటర్లు లేబూరు పరమేశ్వరరెడ్డి, లక్ష్మీసునంద, నాయకులు కమల్‌రాజ్, డాక్టర్ సత్తార్, తాటి వెంకటేశ్వరరావు, బిడుదువోలు శ్రీకాంత్‌రెడ్డి, పుల్లారెడ్డి పాల్గొన్నారు.