
మెడికల్ కళాశాల పనుల్లో మీనమేషాలా
అధికారులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫైర్
నెల్లూరు (విద్యుత్) : మెడికల్ కళాశాల అభివృద్ధి పనుల నిర్వహణలో మీనమే షాలు లెక్కిస్తే సహించబోనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాల ప్రాంగణంలోని వివిధ విభాగాల నిర్మాణ పనులను బుధవారం ఆయన తనిఖీ చేశారు. పనుల పురోగతిపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేంద్రనాథ్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఇంట ర్నల్ రోడ్ల నిర్మాణం ఇంకా ఎందుకు చేపట్టలేదని కోటంరెడ్డి ఈఈని ప్రశ్నించారు.
టెండర్లు పిలిచి నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు పనులెందుకు మొదలుపెట్టలేదని నిలదీశారు. టెండర్లు పిలి చిన 90 రోజుల్లో ఆయా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాల్సి ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఆ టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవాలన్నారు. ఈ ప్రక్రియలో ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహ రించడంపై మండిపడ్డారు.
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతుంటే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. వర్షాకాలం.. రోడ్లు గుంతలమయంగా ఉంటే నిర్మాణం పనులెలా సాగుతాయని ప్రశ్నించారు. మెడికల్ కళాశాలకు సంబంధించి మొత్తం రూ.197 కోట్ల మేర పనులు జరుగుతుంటే అందులో కేవలం రూ.7 కోట్లతో నిర్మించాల్సిన ఇంటర్నల్ రోడ్ల పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని ఈఈని మందలించారు. గంటల వ్యవధిలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ, చీఫ్ ఇంజనీర్లు స్పందించకపోతే నిర్మాణం పనులను అడ్డుకుంటానని ఆయన అధికారులను హెచ్చరించారు.
దీనికి ఉన్నతాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పారు. కళాశాలలో పూర్తిస్థాయిలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఇంజనీరింగ్ అధికారులు స్పందించా లన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నెల్లూరు మదన్‌మోహన్‌రెడ్డి, బత్తిన శోభన్‌రెడ్డి, మనుబోలు సికిందర్‌రెడ్డి, జి.నగేష్, భీమినేని మురహరి పాల్గొన్నారు.