పాలకొల్లు (పశ్చిమగోదావరి): సుమారు రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆదివారం ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లను ఎంపీ ప్రారంభించారు. ఆమె వెంట పాలకొల్లు ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, ఎమ్మెల్సీ మేక శేషుబాబు ఉన్నారు.