బొమ్మలరామారం : నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు తెలంగాణ రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం శంకుస్థాపన చేయనున్నట్టు టీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి బాల నరసింహ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుడి బావి చౌరస్తా నుండి బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వరకు రెండు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్ధాపన చేయనున్నారని వివరించారు. మంత్రితో పాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.