ఆపద్ధర్మ సీఎం కేసీఆర్
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నామినేషన్ల గడువు పూర్తి కాగానే టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఒకరోజు తేడాతో రెండు రోజుల్లో ఆయన జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ నెల 21వ తేదీన దేవరకొండ, నకిరేకల్, భువనగిరి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార బహిరంగ సభకు హాజరవుతారు. ఆ తర్వాత 23వ తేదీన సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో జరిగే సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.
మొత్తం పన్నెండు నియోజకవర్గాలకు గాను ఈ నెలలోనే ఆయన ఐదు నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. డిసెంబర్‌లో మరో విడత ఆయన జిల్లా పర్యటనకు వస్తారని, డిసెంబరు 2వ తేదీని తిరిగి నల్లగొండలో బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. డిసెంబర్ ఏడో తేదీన పోలింగ్ ఉన్న నేపథ్యంలో నలభై ఎనిమిది గంటల ముందు అంటే, ఐదో తేదీకే ప్రచారం ఆఖరు కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఏయే నియోజకవర్గాలకు ప్రచారానికి వస్తారన్న అంశం తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment