నల్లగొండ : ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు
సాక్షి, నల్లగొండ : ‘‘నల్లగొండనుంచి మొదట నేనే పోటీ చేద్దామనుకున్నా.. గజ్వేల్ ప్రజలు గెలిపిస్తే వదిలేసి పోతవా అని పట్టుబట్టిండ్రు... అదే సమయంలో భూపాల్‌రెడ్డి వచ్చిండు...టికెట్ ఇచ్చా... ఆయనను గెలిపించండి నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని బంగారు తునక చేస్తా’’ అని ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మర్రిగూడ బైపాస్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘నన్ను మొదట మహబూబ్ నగర్‌లో పోటీ చేయమని అప్పట్లో జయశంకర్‌సార్ చెప్పినప్పుడు పార్టీ నాయకులు అంతా ఆయనను తిట్టారు. కానీ కేసీఆర్ ఎక్కడ చేసినా అక్కడ అభివృద్ధి జరుగుద్ది అని ప్రజలు నమ్మారు. అక్కడినుంచి పోటీ చేసి గెలిచా... పాలమూరును ఎంతో అభివృద్ధి చేశాం... ఈ సారి నల్లగొండనుంచి పోటీ చేయాలని చర్చ జరిగిన మాట వాస్తవమని పేర్కొన్నారు. నల్లగొండ దరిద్రంగా ఉంది. ఇరుకు రోడ్లు, పట్టణం ఏమీ మారలేదు.రింగు రోడ్డుకూడా లేదు.
మీరు మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపిస్తరా.. గల్లీలన్నీ గట్లనే ఉంటయ్...నల్లగొండ కూడా గట్లనే ఉంటది... మీరు మారితే పట్టణం కూడా మారుతది. మీరు కారు గుర్తుకు గుద్దితే... కారు వేగంతో అభివృద్ధి దూసుకుపోతుంది’ అని అనారు.. ‘నేను బంద్ అయి భూపాల్‌రెడ్డిని పెట్టా....ఆయన గెలిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా.. సెక్రటేరి యట్ అధికారులందరినీ నల్లగొండకు తీసుకొస్తా..అవసరమైతే బండ ఇంట్లో పడుకొని అయినా నల్లగొండకు రింగురోడ్డుతోపాటు ప్రజలకు ఏమేమి అవసరమో వాటన్నింటినీ అధికారుల సమక్షంలో చర్చించి అక్కడికక్కడే మంజూరు ప్రొసీడింగ్స్ ఇస్తా...సంవత్సరంలోపే మంజూరు చేసిన పనులన్నింటినీ పూర్తి చేసే బాధ్యత నాది. నేను మీకు మాట ఇస్తున్నా.. ఓటు బాధ్యత మీరు తీసుకోండి.. బరువు బాధ్యత నేను తీసుకుంటా’ అని నని హామీఇచ్చారు. ‘మిమ్మల్ని చూస్తుంటే ఈసారి భూపాల్‌రెడ్డి గెలుస్తాడు, గతం ఏమైందోకానీ ఈ సారి గెలుపు తప్పేటట్టు లేదు’ అని కేసీఆర్ అన్నారు.
‘గుడ్డిగా భూపాల్‌రెడ్డికి ఓటు వేయండి అని అడగడంలేదు. నేను చేసిన అభివృద్ధి నిజమైతేనే ఓటు వేయండి.. లేదంటే డిపాజిట్ కూడా రాకుండా ఓ డగొట్టండి’ అని అన్నారు. కేసీఆర్ బతికినంత కాలం...టీఆర్‌ఎస్ ఉన్నంతకాలం రైతులు బ్యాం కుల్లో రూ.10లక్షలు నిల్వ ఉంచుకునేలా ఎదిగే వరకు రైతు బంధు, బీమాను కొనసాగిస్తామన్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ను దీవించాలని విజ్ఞప్తి చేశారు. సభలో పార్టీ నాయకులు ర్రాష్ట్ర కార్యదర్శి చాడకిషన్‌రెడ్డి, నిరంజన్‌వలి, బాహ్మణపరిషత్ డైరెక్టర్ చకిలం అనిల్‌కుమార్, ఐసీడీసీ కోఆర్డినేటర్ మాలె శరణ్యరెడ్డి, గ్రం థాలయచైర్మెన్ రేకల్‌భద్రాద్రి, కరీంపాషా, బోయపల్లి కృష్ణారెడ్డి. పంకజ్ యాదవ్, కటికం సత్తయ్య గౌడ్, çసుంకరి మల్లేష్‌గౌడ్, పట్టణఅధ్యక్షుడు అబ్బ గోని రమేష్‌గౌడ్, అభిమన్యు శ్రీనివాస్, బకరం వెం కన్న, మైనం శ్రీనివాస్, గోలి అమరేందర్‌రెడ్డి, ని రంజన్‌రెడ్డి, పాశంరాంరెడ్డి, దైద రజిత, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సింగం లక్ష్మి రామ్మోహన్, కంచర్ల రమాదేవి, ఫరీద్, బషీర్, బక్క పిచ్చయ్య, జిల్లా శంకర్,తండు నర్సింహ, లొడంగి గోవర్ధన్, ఐతగోని యాదయ్య, కంచర్ల శ్రవణ్, దుబ్బ అశోక్ సుందర్, అబ్బగోని కవిత, పున్న గణేశ్, కంచర్ల కృష్ణారెడ్డి, దయాకర్, చిలకల గోవర్ధన్, అఫాన్ అలీ, వెంకటేశ్వర్లు, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
వచ్చేది టీఆర్‌ఎస్ సర్కారే : గుత్తా
నల్లగొండ రూరల్ : వచ్చేది టీఆర్‌ఎస్ సర్కారే అని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. జిల్లాలో కేసీఆర్ ప్రభంజనంతో 12 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తారన్నారు. కేసీఆర్ అమలు చేసిన పింఛన్లు, సంక్షేమ పథకాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గొర్రెల పంపిణీ, కేసిఆర్‌కిట్టు, అలాంటి ప«థకాలు ప్రజల హృదయాల్లో చొచ్చుకపోయాయన్నారు. కేసీఆర్ చేపట్టిన పథకాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. జిల్లాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డిలు ఘోర పరాజయం చూడబోతున్నారని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం కారు గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రూ.6500 కోట్లతో డిండి లిఫ్ట్ పనులను జరుగుతున్నాయని. గోదావరి నీటితో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు తాగు నీరు అందబోతుందన్నారు. బీవెల్లంలా ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు అందిస్తామన్నారు. సీఎం కేసిఆర్ చెప్పిన మెడికల్ కాలేజ్ ప్రారంభానికి సిద్ధంగా ఉందని ఎన్నికల కోడ్ వల్ల శంకుస్థాపన చేయలేదన్నారు.
కాంగ్రెస్ ఓటమి ఖాయం : బండా
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ఓటమి ఖాయమని టీఆర్‌ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణే ప్రథమస్థానంలో ఉండేదన్నారు. కేసీఆర్‌తో రైతులకు అండగా ఉండేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు. రుణమాఫీతో పాటు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 4వేల చొప్పున రెండు పంటలకి ఇచ్చామని పేర్కొన్నారు. కనుమరుగైన కుల వృత్తులను ప్రోత్సహించి జీవనోపాధి కప్పించామన్నారు.
సంక్షేమ పథకాలే అండ : తక్కెళ్లపల్లి
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు అండగా ఉంటాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎన్నికల పరిశీలకుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. కేసీఆర్ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు. నల్లగొండ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కోసం మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఎమిటో ఒక్కసారి ఆలోచించాలన్నారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుం బానికి లబ్ధి జరిగిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబం««ధు 5లక్షల ప్రమాద బీమా అందజేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. నల్లగొండ అభివృద్ధికి భూపాల్‌రెడ్డిని గెలిపిచాలని కోరారు.
విద్యారంగ బలోపేతానికి కృషి : పూల
టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి ఎంతో కృషిచేసిందని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం, కార్పొరేట్ తరహాలో గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థినులకు శానిటరి కిట్‌లను అందించారన్నారు. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కార్పొరేట్ స్థాయిలో కళాశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రైతుల కష్టాలు తీరాయి :ఉమామాధవరెడ్డి
సీఎం కేసీఆర్ ద్వారానే రైతుల కష్టాలు తీరాయని మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి అన్నారు. మాధవరెడ్డి ద్వారానే నల్లగొండకు కృష్ణాజలాలు అందా యన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉండేదని, రైతు బతుకులు భరోసా లేకుండా కాలం నెట్టుకొచ్చారని తెలి పారు. కేసిఆర్ వల్ల రైతాంగానికి 24 గంటల విద్యుత్ సరఫరాతో పాటు, ధాన్యం అమ్ముకునేందుకు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. రైతులు చినుకుపడ్డప్పుడు పెట్టుబడిల కోసం ది గులుపడకుండా ముందుగానే రైతుబంధు ద్వారా ఎకరానికి ఎనిమిది వేలు అందించారని తెలిపారు. బోర్లలో నీరు ఉండేందుకు చెరువుల పూడిక తీసి నీటి వనరులను పెంచారని ఆమె పేర్కొన్నారు.
చంపుకుంటామన్న వారు ఒక్కటయ్యారు..!
నల్లగొండ : ‘‘ఒకప్పుడు ఒకరినొకరు చంపుకుం టామని కత్తులు దూసుకున్నోళ్లు.. ఇప్పుడు నన్ను ఎదుర్కొనేందుకు ఒక్కటయ్యారు. అభివృద్ధిని విస్మరించిన వారిని ఎన్నికల్లో తరిమికొట్టండి’’ అని నల్లగొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒకప్పుడు బద్ద శత్రువులు తనను ఓడించేందుకు మిత్రులుగా మారి నల్లగొండను ఆగం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏ ఉద్దేశంతో వారు ఒక్కటయ్యారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండ రౌడీలకు, గుండాలకు, దోపిడీ, కమీషన్‌దారులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. నల్లగొండ నియోజకవర్గంలో 20 ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో నల్లగొండను ఎంతో అభివృద్ధి చేస్తా... ఒక్కసారి అవకాశం ఇవ్వండి నల్లగొండ దిశ, దశను మారుస్తానని.. కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఎకరాకు నీరందిస్తా..
కోదాడ : ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే టీఆర్‌ఎస్ ధ్యేయమని రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం కోదాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో నెత్తిన సాగర్, పక్కన పాలేరు ఉన్నాయని కాని మోతె, నడిగూడెం మండలాలు ఎండి పోతున్నాయని అన్నారు. ఈ రెండు మండలాలలకు కాళేశ్వరం జాలాలు వస్తాయని, అంతకుముందే పాలేరు జలాలను అందిస్తామని తెలిపారు. గతంలో తాను ప్లానింగ్ చేసే పనిలో ఉండడం వల్ల రాష్ట్రంలో ఎక్కువగా తిరగలేకపోయానని ఈసారి గెలిచిన తర్వాత తానే స్వయంగా కోదాడకు వచ్చి ప్రతి ఎకరాకు సాగునీరు అందించే వరకు నిద్రపోనని అన్నారు. అదే విధంగా పాలేరు నదిపై చెక్‌డ్యాంలు కట్టి సాగునీరు అందిస్తామని చెప్పారు. కోదాడ పట్టణానికి 100 పడకల వైద్యశాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
బీసీలకు అవకాశం ఇచ్చా..గెలిపించే బాధ్యత మీదే..
ఇబ్బందులు ఉన్నా కోదాడలో బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చా. బీసీలకు అవకాశం రాదు. వచ్చినపుడు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేసి మల్లయ్యను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి ఎర్నేనిబాబు సారథ్యంలో యువకులైన మల్లయ్య యాదవ్, శశిధర్‌రెడ్డి జోడెడ్ల వలె పనిచేయాలని కోరారు.
శశిధర్‌రెడ్డికి న్యాయం చేస్తా...
కోదాడ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసిన కె.శశీధర్‌రెడ్డికి తగిన న్యాయం చేస్తానని కేసీఆర్ సభాముఖంగా హమీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే స్థాయికి స మానమైన పదవి ఇస్తానని, ఆయన అనుచరులకు కూడా న్యాయం చేస్తానని ఇప్పటి వరకు ఏమైనా విభేదాలు ఉంటే వాటిని మరిచి కలిసి కట్టుగా పని చేసి అభ్యర్ధి విజయానికి కృషి చేయాలని కోరారు. సభలో నియోజకవర్గ ఇన్‌చార్జీ కె.శశీధర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్నేనిబాబు, వంటిపులి అని త, రమణానాయక్, మహబూబ్‌జానీ, బజ్జూరి వెంకటరెడ్డి, బొలిశెట్టి నాగేంధ్రబాబు, మట్టపలి శ్రీనివాస్‌గౌడ్, పుల్లూరి అచ్చయ్య, వక్కంతుల విజయ్‌కుమార్, పబ్బాగీత సత్యవతి రాథోడ్, వేనేపల్లి చందర్‌రావు, పాల్గొన్నారు.
సీఎం అభ్యర్థులంతా మట్టి కరువబోతున్నారు : గుత్తా
జిల్లాలో నలుగురు సీఎం అభ్యర్థులు ఉన్నారని, తెలంగాణ వ్యాప్తంగా 40 మంది కాం గ్రెస్ నాయకులు సీఎం రేసులో ఉన్నారని వారంత టీఆర్‌ఎస్ చేతిలో ఘోరంగా ఓడిపోనున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాలు టీఆర్‌ఎఎస్ 100 స్థానాలను సాధించిపెడతాయని అన్నారు.
ప్రజలను మోసగిస్తున్న ‘ఉత్తమ్’ దంపతులు : బొల్లం
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్‌రెడ్డి, ఆయన భార్య కలిసి కోదాడ ప్రజలను మోసం చేస్తున్నారని టీఆర్‌ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ ఆరోపించారు. వారి వ్యాపార విస్తరణకు రాజకీయాలను వాడకుంటున్నారని అన్నారు. కష్టాలు, కడుపు ఆకలి తెలిసిన తనను గెలిపిస్తే ఎప్పడు అందుబాటులో ఉంటానని హమీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment