స్టేడియంలో పనులను సకాలంలో పూర్తి చేయాలి
స్టేడియంలో పనులను సకాలంలో పూర్తి చేయాలి
Published Wed, Oct 26 2016 1:49 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(బృందావనం): ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న పునర్నిర్మాణ అభివృద్ధి పనులను వేగవంతం చేసి నెల్లోపు క్రీడామైదానాలను సిద్ధం చేయాలని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాప్) డైరెక్టర్ రవీంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ నిధులతో జరుగుతున్న పనులపై శాప్ డైరెక్టర్ కార్యాలయంలో ఏపీఎంఐడీసీ ఇంజినీరింగ్ , జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారులు, కాంట్రాక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యతలో ఎలాంటి విమర్శలకు తావులేకుండా, ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులను కోరారు. ఇప్పటి వరకు పూర్తయిన పనుల వివరాలను కలెక్టర్ ద్వారా రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థకు తెలియజేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలపై అవసరమైతే క్వాలిటీ కంట్రోల్ అధికారుల నివేదిక కోరతామని స్పష్టం చేశారు. ఇండోర్ స్టేడియంలో ఆధునిక వసతి సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మల్టీపర్పస్ ఫ్లోరింగ్‌తో తీర్చిదిద్దనున్నామని వెల్లడించారు. క్రీడా అకాడమీలు ఏర్పాటైతే 20 మంది క్రీడాకారులు శిక్షణ పొందనున్నారన్నారు. ఏపీఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవిశంకర్‌బాబు, ఏఈఈ పుల్లయ్య, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రమణయ్య, స్టేడియం సూపరింటెండెంట్ విజయకుమార్, కాంట్రాక్టర్ శ్రీహరిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement