స్టేడియం అభివృద్ధి పనులపై సమీక్ష
స్టేడియం అభివృద్ధి పనులపై సమీక్ష
Published Fri, Aug 12 2016 12:12 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(బృందావనం): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు ఏపీఎంఐడీసీ అధికారులతో గురువారం సమీక్షించారు. ఆగస్టు నెలాఖరులోగా అభివృద్ధి పనులను పూర్తిచేయాలన్నారు. వాకింగ్‌ట్రాక్, అథ్లెటిక్స్‌ట్రాక్, ఎంట్రన్స్‌గేట్, ఇండోర్‌స్టేడియం, ఫ్లోరింగ్, ఇండోర్‌స్టేడియం డార్మెట్రీ, కాన్ఫరెన్స్‌హాల్ పనులను 40 రోజుల్లోగా పూర్తిచేయాలన్నారు. క్రీడాప్రాంగణంలో డ్రైనేజీ సిస్టమ్, మరుగుదొడ్లు, పెవిలియన్‌భవనం ఆధునీకరణ పనులు 80శాతం పూర్తి అయినట్లు అధికారులు వివరించారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తే కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందించి మరిన్ని క్రీడామౌలిక సదుపాయాలు పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో ఏపీఎంఐడీసీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రవిశంకర్‌బాబు, డీఈఈ సీవీ రమణ, ఏఈ ఎం పుల్లయ్య, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీవీ రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.
Advertisement