సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీఎస్‌పీఎస్సీపై సమీక్ష చేపట్టారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలన్నారు. యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాలలో పరీక్షల నిర్వహాణపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. టీఎస్‌పీఎస్సీకి కావాలసిన సిబ్బందిని, ఇతర వనరులు వెంటనే సమకూర్చాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.
మూసి అభివృద్ధి పై సమీక్ష:
మూసి నది ప్రారంభం నుంచి చివరి వరకు మొత్తాన్ని ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మూసిని పర్యటన ప్రాంతంగా డెవలప్ చేయాలని తెలిపారు. మూసి నది వెంట బ్రిడ్జీలు, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రైవేటు పార్ట్నర్ షిప్ విధానంతో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసిలో మురుగు నీటి తగ్గించే విధంగా అవసరమైన చోట మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు.
టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహాణపై సమీక్ష:
టెన్త్,ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలోలాగా పేపర్ లీక్‌లు జరగకుండా జాగ్రత్తపడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ,ప్రైవేటు విశ్వ విద్యాలయాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జూనియర్ కాలేజీల అవసరం ఎక్కడ ఉందో వాటి వివరాలు వెంటనే ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment