సీఎం హామీతో సిద్దిపేట మున్సిపల్‌కు నిధుల వరద | CM KCR Sanctioned Rs 25 Crore For Development Of Siddipet Town | Sakshi
Sakshi News home page

సీఎం హామీతో సిద్దిపేట మున్సిపల్‌కు నిధుల వరద

Published Sat, Jul 27 2019 8:59 AM | Last Updated on Sat, Jul 27 2019 8:59 AM

CM KCR Sanctioned Rs 25 Crore For Development Of Siddipet Town - Sakshi

సిద్దిపేట మున్సిపాలిటీ

సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని ఏకైక  స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపల్‌ సిద్దిపేట పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ప్రేమను నిధుల రూపంలో వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు అభివృద్ధి, ప్రయోగాత్మక ప్రక్రియలతో రాష్ట్ర, దేశ స్థాయిలో గుర్తింపు పొందిన సిద్దిపేట బల్దియాకు సీఎం కేసీఆర్‌ నిధుల వరదను పారించారు.  

చింతమడక సందర్శనలో ప్రకటన.. 
చింతమడక ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా సిద్దిపేట పట్టణానికి నిధులను కేటాయించాలన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించి రూ.25కోట్లను ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం పాఠకులకు విధితమే. సీఎం ప్రకటన పరోక్షంగా మున్సిపల్‌కు ఊరటగానే చెప్పాలి. ఇప్పటికే అనేక ప్రజాపయోగ కార్యక్రమాలను నిర్వహించడానికి బల్దియాకు నిధుల సమీకరణ కొంత ఇబ్బందిగా మారుతుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా రూ. 25కోట్లను మంజూరి చేయడంతో నిధుల కోరతను తాత్కాలికంగా గట్టెక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతీ నెల విద్యుత్‌ బిల్లుల చెల్లింపు రూపంలో రూ. 25లక్షలు, జీత భత్యాల రూపంలో మరో రూ.55లక్షలు మొత్తంగా రూ. 70లక్షల వ్యయం మున్సిపల్‌కు భారంగా మారుతున్న క్రమంలో ప్రత్యేక నిధుల కేటాయింపు కొంత ఊరటగానే చెప్పాలి.  

విలీన వార్డుల్లో అభివృద్ధికి దోహదం.. 
జిల్లాలో స్పేషల్‌ గ్రేడ్‌ మున్సిపల్‌ సిద్దిపేట పరిధిలో 34 వార్డులు ఉన్నాయి. గత కొన్నేళ్ల క్రితం సిద్దిపేట మున్సిపల్‌లో సమీపంలోని రంగదాంపల్లి, గాడిచెర్లపల్లి, ఇమామ్‌బాద్, ప్రశాంత్‌నగర్, నర్సాపూర్, హనుమాన్‌నగర్‌లను వీలినం చేశారు. ఇదేసమయంలో ఇటీవల లింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీని కూడా కలిపారు. గతంలో ఉన్న 28వార్డుల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఉన్న కొద్దిపాటి మున్సిపల్‌ నిధులతో సమకూర్చారు. మరోవైపు విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన బల్దియాకు భారంగా మారింది. ముఖ్యంగా ఆరు విలీన గ్రామాల వార్డుల్లో మురికికాలువలు, రోడ్లు, భవనాల నిర్మాణం, నిధుల సమీకరణ అడ్డంగా మారింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉండడంతో వివిధ పథకాల కింద సిద్దిపేటకు ప్రత్యేకంగా నిధులను కేటాయింపజేసి దశల వారిగా విలీన వార్డుల్లో అభివృద్ధి పరుగులు జరిగేలా చొరవ చూపారు.  

ప్రతీ నెల రూ.కోటికి పైగా వ్యయం 
స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపల్‌లో ప్రతీ నెల సుమారు కోటిరూపాయల వివిధ పద్దుల కింద బల్దియా వెచ్చించాల్సి ఉంటుంది. ప్రధానంగా సిద్దిపేట పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా కోసం ఎల్‌ఎండీ నుంచి మానేరు నీటిని తరలించడంతో పాటు వివిధ పంప్‌హౌజుల్లో విద్యుత్‌ వినియోగం కోసం ప్రతీ నెల రూ. 25లక్షలను వెచ్చించడం మున్సిపల్‌కు గుదిబండగా మారుతుంది. అదే విధంగా జీతభత్యాల రూపంలో రూ. 55లక్షల వ్యయం మున్సిపల్‌కు భారంగా ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రత్యేక చోరవ చూపి బల్దియా విద్యుత్‌ బిల్లులను స్వతహాగా నియోజకవర్గ నిధుల నుంచి వెచ్చించి తాత్కాలికంగా మున్సిపల్‌ను విద్యుత్‌బిల్లుల భారం నుంచి గట్టెక్కించారు. మరికొతకాలం ప్రత్యేకంగా ప్రభుత్వంలో మాట్లాడి కొన్ని నెలల పాటు ప్రభుత్వమే విద్యుత్‌ బిల్లుల భారం భరించేలా చొరవ∙చూపారు. మరోవైపు గతంలో జీతభత్యాల చెల్లింపు సిద్దిపేట మున్సిపల్‌కు ప్రధాన సమస్యగా మారేది. కోన్ని నెలల పాటు కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో గతంలో సిద్దిపేట మున్సిపల్‌ ఉండేది ఇదే సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, అధికారంలోకి టీఆర్‌ఎస్‌ప్రభుత్వం రావడంతో పాటు మంత్రివర్గంలో కీలక శాఖలో ఉన్న ఎమ్మెల్యే హరీశ్‌రావు వివిధ పథకాల ద్వారా సిద్దిపేట మున్సిపల్‌ కోట్లాధి నిధులను సమీకరించి సిద్దిపేటను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడంలో కృషి చేశారు.  

మరోసారి సీఎం కేసీఆర్‌ చేయూత 
జిల్లా ఆవిర్భావం అనంతరం స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు విజ్ఞప్తి మేరకు రూ. 100కోట్ల ప్రత్యేక నిధులను ప్రకటించారు. అప్పట్లోనే సీఎం మంజూరు చేసిన వందకోట్లలో సుమారు 20కోట్ల రూపాయలు ప్రత్యేకంగా సిద్దిపేట మున్సిపల్‌ అభివృద్ధి కోసం విడుదల చేశారు. ప్రధానంగా మున్సిపల్‌ పరిధిలో మురికికాలువల నిర్మాణం, రోడ్లు, వివిధ కమ్యూనిటీ భవనాల నిర్మాణం లాంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వాటిని వెచ్చించారు. దీనికి తోడు సిద్దిపేటలో ప్రత్యేకంగా వైకుంఠధామాల నిర్మాణం, కోమటిచెరువు సుందరీకరణ, వివిధ రకాల భవనాల నిర్మాణంతో పాటు రహదారుల మరమ్మతు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి వ్యవస్థ, లాంటి అనేక అభివృద్ధి్ద పనుల కోసం పెద్ద ఎత్తున బల్దియాలో నిధుల వినియోగం చేయాల్సి వచ్చింది. జిల్లా కేంద్రం కావడంతో పట్టణీకరణ జోరుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మౌళిక వసతుల కల్పనతో పా టు వివిధ ప్రజా ఉపయోగ పనుల నిమిత్తం మరి న్ని నిధులు అవశ్యకతగా మారాయి.దీనిని పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే హరీశ్‌రావు చింతమడకలో సీఎం దృష్టికి నిధులను మంజూరి చేయాల ని విజ్ఞప్తి చేయడం స్పందించిన సీఎం తక్షణం రూ. 25కోట్లను మంజూరుతో అభిృద్ధికి నిధుల సమీకరణకు కొంత ఊరటగానే భావించాలి. 

సిద్దిపేటపై సీఎంకు అమితమైన ప్రేమ
తాను పెరిగిన సిద్దిపేట గడ్డపై సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరిక మేరకు వెంటనే రూ. 25కోట్లు మంజూరి చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. సిద్దిపేట పట్టణ అభివృద్ధి కోసం తాపత్రయ పడుతున్న హరీశ్‌రావు ఆశయానికి అనుగుణంగా సీఎం నిధులను కేటాయించారు. గతంలో కూడా 20కోట్లు మంజూరి చేశారు. ఇప్పుడు మరొక 25కోట్లు ప్రత్యేకంగా మంజూరు చేశారు. సిద్దిపేట ప్రజల, పాలకవర్గం పక్షాన నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, కృషి చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుకు కృతజ్ఞతలు. 
– రాజనర్సు, మున్సిపల్‌ చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement