అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ను గెలిపించండి | Congress looks at the development of vote for congress | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ను గెలిపించండి

Published Tue, May 6 2014 3:48 AM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM

మాట్లాడుతున్న చిరంజీవి - Sakshi

మాట్లాడుతున్న చిరంజీవి

ఆత్మకూరురూరల్, న్యూస్‌లైన్: ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి కోరారు. ఆత్మకూరులో ఆయన సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డికి మద్దతుగా సోమవారం ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ బస్టాండ్ సెంటర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రం రెండుగా విడిపోయిందన్నారు.

ప్రజలు డీలా చెందక పట్టుదలతో ఎన్నో వనరులు ఉన్న సీమాంధ్ర అభివృద్ధికి కృషి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. మతతత్వ పార్టీ బీజేపీ, టీడీపీని ఓడించాలన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తాను చేసిన అభివృద్ధిని పరిశీలించాలని, మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎన్‌డీసీసీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, మాదాసు గంగాధరం, డాక్టర్ ఆదిశేషయ్య, చల్లా రవికుమార్ రెడ్డి, పులిమి శైలజ, నలిశెట్టి శీనయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement