ప్రచారంలో నరేంద్ర మోడీ రికార్డు | Narendra Modi travelled over 3 lakh kms during his campaign | Sakshi
Sakshi News home page

ప్రచారంలో నరేంద్ర మోడీ రికార్డు

Published Sun, May 11 2014 2:00 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

ప్రచారంలో నరేంద్ర మోడీ రికార్డు - Sakshi

ప్రచారంలో నరేంద్ర మోడీ రికార్డు

న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించిన మోడీ దాదాపు మూడు లక్షల కిలో మీటర్ల దూరం ప్రయాణించారు. 5827 బహిరంగ సభల్లో పాల్గొన్నట్టు బీజేపీ నేతలు తెలిపారు.

భారత ఎన్నికల చరిత్రలో సుధీర్ఘ ప్రయాణం చేసిన వారిలో మోడీ ఒకరని బీజేపీ నేతలు చెప్పారు. గత సెప్టెంబర్ నుంచి 25 రాష్ట్రాల్లో పర్యటించిన మోడీ 437 బహిరంగ సభలు, 1350 త్రీ డీ ర్యాలీల్లో ప్రసంగించారు. మరో 4000 'చాయ్ పే చర్చా' కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లు కూడా నిర్వహించారు. ఇక మోడీ పోటీచేస్తున్న వడోదర, వారణాశిలలో భారీ రోడ్డు షోలు నిర్వహించారు. మోడీ సభలకు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement