కలెక్టర్‌కు చెప్పినా వినిపించుకోలేదు | The collector had to not listen | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు చెప్పినా వినిపించుకోలేదు

Published Tue, Jun 2 2015 2:21 AM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

కలెక్టర్‌కు చెప్పినా వినిపించుకోలేదు - Sakshi

కలెక్టర్‌కు చెప్పినా వినిపించుకోలేదు

నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీనాథ్ యాదవ్ వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని, తాగునీటి సమస్యతో ప్రజలు...

 -ఎమ్మెల్యే రోజా

 నగరి : నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీనాథ్ యాదవ్ వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని, తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారని, జిల్లా కలెక్టర్‌కు చెప్పినా వినిపించుకోలేదని నగరి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ  క మిషనర్ వల్లే నగరి మున్సిపాలిటీలోని 27వ వార్డు ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత పదేళ్లలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని, తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కాల్సిన దుస్థితి కమిషనర్ వల్లే వచ్చిందని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు తన కనుసైగలో పని చేసే కమిషనర్‌ను ఉద్ధేశపూర్వకంగా నియమించుకుని నగరి ప్రజలను ఇబ్బంది పాలుచేస్తున్నారని విమర్శించారు. కమిషనర్ బాధ్యతలు చేపట్టి 5 నెలలైనా ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదన్నారు. టీడీపీ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న వ్యక్తిని కమిషనర్‌గా నియమిస్తే ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మదనపల్లెలో క మిషనర్‌ను సరండ్ చేసినట్లు నగరి కమిషనర్‌ను ఎందుకు సరండ్ చేయలేదని, కలెక్టర్ వెంటనే కమిషనర్‌ను సరండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నగరి మున్సిపల్ అభివృద్ధికి సహకరించే కమిషనర్‌ను నియమించి ప్రజలను న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement